
చల్లగా చూడు స్వామీ!
పిఠాపురం: పట్టణంలో వేంచేసియున్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారు శనివారం విసనకర్రల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్రరూపం చూపిస్తున్న వేసవిలో అందరినీ చల్లగా చూడాలని కోరుతూ స్వామివారికి తాటాకు విసనకర్రలతో అలంకారం చేశామని అర్చకుడు విజయ జనార్దనాచార్యులు తెలిపారు.
వ్యాయామోపాధ్యాయ
సంఘ అధ్యక్షుడిగా శ్రీనివాస్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా పెద్దిశెట్టి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్ష ఎన్నికలు రామ్‌కుమార్ వ్యాయామోపాధ్యాయ సంఘ భవన్‌లో ఎన్నికల అధికారి వి.రవిరాజు ఆధ్వర్యాన శనివారం జరిగాయి. మొత్తం 191 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న శ్రీనివాస్‌కు 139 మంది, రవి సుందర్ కౌర్‌కు 51 మంది ఓట్లు వేశారు. దీంతో నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికై నట్లు ప్రకటించారు.

చల్లగా చూడు స్వామీ!