
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఫ పూర్తయిన ఏర్పాట్లు
ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజనీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జేఎన్‌టీయూ–కాకినాడ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచి ఆన్‌లైన్ టెస్ట్ పూర్తి చేయడంలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను ఇన్విజిలేటర్లు వివరిస్తారు. ఈఏపీ సెట్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్ (బీటెక్), బయో టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ (అగ్రికల్చర్), హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్జెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీ.ఫార్మసీ, ఫార్మ్.డి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
ఫ హాల్ టికెట్, ఐడీ కార్డు, పెన్సిల్ మినహా ఇతర ఎటువంటి వస్తువులనూ తమ వెంట తీసుకురాకూడదు.
ఫ సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
ఫ పరీక్ష కేంద్రానికి బయలుదేరే ముందు హాల్ టికెట్లపై పరీక్ష వివరాలు, కేంద్రం పేరు, సమయం, తేదీ, ఇతర వివరాలను అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించుకోలి.
ఫ హాల్ టికెట్టుతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకుని వెళ్లాలి.
ఫ ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల విద్యార్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన కుల ధ్రువీకరణ పత్రం కాపీ వెంట తీసుకుని వెళ్లాలి.
ఫ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటవుట్ కాపీ దిగువన ఫొటో అతికించి, కళాశాల ప్రిన్సిపాల్, గెజిటెడ్ అధికారి నుంచి సంతకం తీసుకోవాలి.
ఫ హాల్ టికెట్‌పై ఎటువంటి రాతలు రాసినా, పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు.
ఫ పరీక్ష కేంద్రంలో విద్యార్థి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలి ముద్రను ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో వేయాలి.
ఏర్పాట్లు పూర్తి
పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖల సమన్వయంతో వైద్య సేవలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
– డాక్టర్ వీవీ సుబ్బారావు, సెట్ కన్వీనర్
పరీక్షల తేదీలు
అగ్రికల్చర్, ఫార్మసీ : నేడు, రేపు
ఇంజినీరింగ్ : 21 నుంచి 27వ తేదీ వరకూ
సమయం : ఉదయం 9.00 – 12.00, మధ్యాహ్నం 2.00 – 5.00
ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు : 5
కాకినాడ సాఫ్ట్ టెక్నాలజీ (రాయుడుపాలెం), ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల (సూరంపాలెం), ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 3 కేంద్రాలు (సూరంపాలెం)
హెల్ప్‌లైన్ నంబర్లు : 0884–2342499, 2359599
జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ వివరాలు
ఇంజినీరింగ్ ఎంట్రన్స్ దరఖాస్తుదారులు : 8,961
అగ్రికల్చరల్, ఫార్మసీ : 3,671
రెండు విభాగాలు : 10

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్