
మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు
నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్‌లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు.
– పి.లక్ష్మణరావు, బాక్సింగ్ కోచ్, పిఠాపురం
●