కడియం: స్థానిక కాలువగట్టున ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. వారి కథనం మేరకు నర్శిపూడి గ్రామానికి చెందిన వెంకటరమణ కాలువలో గేలంతో చేపలు పట్టి అమ్ముతుంటాడు. శనివారం మధ్యాహ్నం కడియం కాలువగట్టుకు చేపలు పట్టడానికి వెళ్లాడు.
ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులు వెంకటరమణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆరా తీశారు. వెంకటరమణకు తరుచూ ఫిట్స్ వస్తుంటాయని, అలా శనివారం ఫిట్స్ వచ్చి కాలువగట్టున పడిపోయి ఉండి ఉంటాడని, ఎవరూ గమనించకపోవడంతో మృతిచెంది ఉంటాడని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల బాబు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల రామస్వామి (బాబు)ను, డీసీఎంఎస్ చైర్మన్‌గా పెచ్చెట్టి చంద్రమౌళిని నియమించారు. గత కొన్ని రోజులుగా డీసీసీబీ చైర్మన్ పదవులకు పలువురి పేర్లు వినిపించినా చివరికి రామస్వామిని నియమించారు.