నమ్మండి ఇది రైల్వే ప్లాట్‌ఫామ్
తుప్పలు, ముళ్లపొదలు మొలిచిన ఇది రైల్వే ట్రాక్, రైల్వే ప్లాట్‌ఫామ్ అంటే నమ్మడం కష్టమే అయినా ఇది నిజం. కాకినాడ – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పరిధిలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ గతంలో నిర్మించిన రైల్వే ట్రాక్ పరిస్థితి ఇది. ట్రాక్ మీద, ప్లాట్‌ఫామ్ మీద పిచ్చి మొక్కలు మొలిచాయి. రామచంద్రపురంలో ఉన్న రైల్వే స్టేషన్ ధ్వంసమైంది. గతంలో ఇక్కడ నుంచి రైలు మీద కాకినాడకు, కోటిపల్లికి ప్రయాణికులు వెళ్లేవారు. రూ.కోట్ల విలువైన బియ్యం ఎగుమతి జరిగేది. ఈ స్టేషన్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉండేది. ఇప్పుడు రైల్వే రాకపోకలు లేక స్టేషన్ ఇలా శిథిలావస్థకు చేరింది.


