
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాళ్లరేవు: యానాం–ద్రాక్షారామ రహదారిలో సుంకరపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడికి సత్యనారాయణ(69) మృతిచెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మడికి సత్యపారాయణ రహదారి చెంతన ఉన్న కుళాయి వద్దకు నీరు పట్టుకునేందుకు రాగా ఆ సమయంలో ద్రాక్షారామ నుంచి యానాం వేగంగా వెళుతున్న వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.