
భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు
అమలాపురం రూరల్: మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని మిక్చర్ కాలనీకి చెందిన పూజారి రాజు అనే యువకుడు ఇటీవల జై పాకిస్థాన్ అంటూ ఫేస్‌బుక్ పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ అదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్‌బాబు అధ్వర్యంలో పోలీసులు రాజు ఇంటికి చేరుకుని తనిఖీ చేశారు. అతడు ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో ఉన్నట్లు అతని తండ్రి ఏసుబాబు పోలీసులకు తెలిపారు. తెలియక ఈ పోస్టు పెట్టినట్లు రాజు చెప్పినట్లు ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు. ఈ కుటుంబం గతంలో మిక్చర్ కాలనీలో ఉండే వారని, సోఫా పనుల కోసం వెళ్లి కుటుంబ మొత్తం విజయనగరం జిల్లా సాలూరులో నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు.
● యువకుడి కోసం పోలీసుల గాలింపు