జల్‌జీవన్ మిషన్ పనుల్లో చిన్నారులు
రామచంద్రపురం రూరల్: తోటపేట గ్రామంలో రూ. 79 లక్షల నిధులతో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా జరుగుతున్న పైపులైన్ పనుల్లో సుమారు 10, 12 సంవత్సరాల చిన్నారులు పనులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చిన్నారులను ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనుల్లో ఉపయోగించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఎస్.రాహుల్ వివరణ కోరగా వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.


