
మన్నికై నవే ఎన్నుకోండి
● ఆటలు ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త
● రక్షణ కవచాలు లేకుంటే గాయాల పాలే..
● నాసికరం కొన్నారంటే...మూన్నాళ్లే!
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటలు అంటే అందరికీ ఇష్టమే. ఆరేళ్ల వయస్సు నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వివిధ రకాలైన ఆటలు ఆడడానికి ఉత్సాహం చూపుతారు. ఆసక్తి, అభిరుచి ఉన్న ఆటల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలలు కంటారు. వేసవి సెలవులు ఇవ్వడంతో జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల వేసవి శిక్షణ శిబిరాల్లో చేరేందుకు బాల బాలికలు ఆసక్తి కనపరుస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఆడేటప్పుడు లేదా శిక్షణ పొందే సమయంలో క్రీడాపరికరాలు, దుస్తులు, బూట్లు వినియోగించకపోతే గాయాలపాలై ఒక్కోసారి క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రకాల క్రీడల్లో వినియోగించే వస్తువులు, క్రీడాపరికరాలు, వాటి ధరలపై కథనం
బాస్కెట్‌బాల్
టీ షర్ట్, షాట్, షూ వినియోగిస్తారు. బాస్కెట్‌బాల్స్ రూ.750 నుంచి రూ.2,500 వరకు, డ్రస్ రూ.900 నుంచి రూ.3,000, షూ రూ.1,500 నుంచి రూ.8,000, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు ఉన్నాయి.
హాకీ
రూ.650 నుంచి రూ.5,000 వరకు, నెట్ రూ. 25,000, గోల్‌కీపర్ కిట్ రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉన్నాయి. ఇందులో హెల్మెట్, చెస్ట్‌ప్యాడ్, బాడీ ప్రొటెక్షన్, గ్లౌజ్, ప్యాడ్, నీగార్డ్స్, ఎల్‌బోగార్డ్స్‌ను వినియోగిస్తారు.
బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్‌లో రిస్ట్‌బ్యాన్ ్డ్స, నీక్యాప్స్, షూ, టీ షర్ట్, షార్ట్స్ వినియోగిస్తారు. ఫెదర్ కాక్స్ కొరత కారణంగా ఎక్కువ కాలం మన్నిక కోసం నైలాన్ కాక్స్ ఉపయోగిస్తున్నారు. బ్యాట్స్ రూ.650 నుంచి రూ.15,000 వరకు, నెట్స్ రూ.350 నుంచి రూ.3,000 వరకు, కాక్స్ బ్యారర్ రూ.300 నుంచి రూ.4,000 వరకు అమ్ముతున్నారు.
హ్యాండ్‌బాల్
హ్యాండ్‌బాల్‌లో టీషర్ట్, షార్ట్, షూ వినియోగిస్తారు. బాల్స్ రూ.700 నుంచి రూ.5,000 వరకు, నెట్స్ రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి.
త్రోబాల్
బాల్స్ రూ.700 నుంచి రూ.1,500 వరకు, నెట్ రూ.600 నుంచి రూ.2,500 వరకు ఉన్నాయి. ఈ ఆటలో షార్ట్, టీ షర్ట్, షూ వినియోగిస్తారు.
స్కేటింగ్
స్కేట్స్, హెడ్‌గార్డ్, ఎల్‌బో గార్డ్, నీగార్ట్స్, షూ, స్కేటింగ్ డ్రస్ వినియోగిస్తారు. స్కేటింగ్ షూ రూ.400 నుంచి రూ.10,000, డ్రస్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, ప్రొటెక్షన్ కిట్ రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉన్నాయి.
టెన్నిస్
ర్యాకెట్‌లు రూ.1,500 నుంచి రూ.15,000 వరకు, బాల్స్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి.
తైక్వాండో..
తైక్వాండో డ్రస్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి.
బాల్ బ్యాడ్మింటన్
బ్యాట్స్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.60 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు.
షాట్‌పుట్
8ఎల్‌బీ, 16ఎల్‌బీ, 12ఎల్‌బీబీ రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి.
స్విమ్మింగ్
క్యాప్స్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ డ్రస్ వినియోగిస్తారు. స్విమ్ సూట్స్ రూ.100 నుంచి రూ.2,000 వరకు, గాగుల్స్ రూ.150 నుంచి రూ.5,000 వరకు, షాట్స్ రూ.250 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి.
స్పోర్ట్స్ షూ
స్పోర్ట్స్ షూ రూ.600 నుంచి రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
క్రీడా పరికరాల కొనుగోలులో
తీసుకోవల్సిన జాగ్రత్తలు
క్రీడాపరికరాలు ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలి. నాసిరకం కంపెనీలు, డూప్లికేట్ కంపెనీ వస్తువుల పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. క్రీడాపరికరాలు తయారు చేసి ఎక్కువ సంవత్సరాలు కానివి కొనుగోలు చేయాలి. క్రికెట్, షటిల్, టెన్నిస్ బ్యాట్స్ కొనుగోలులో హ్యాండిల్స్, పగుళ్లు, ఫ్రేమ్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. నెట్ నాణ్యత కలిగినది కొనుగోలు చేయాలి. తక్కువకు వస్తున్నాయని డూప్లికేట్ కంపెనీలు కొనుగోలు చేస్తే మూన్నాళ్లకే మూలకు చేరడం ఖాయం.
చెస్
చెస్ బోర్డ్స్ రూ.200 నుంచి రూ.2,000 వరకు, పాన్స్ రూ.100 నుంచి రూ.1,000 వరకు, టైమర్ రూ.2,000 నుంచి రూ.10,000, చెస్ మ్యాట్ రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి.
చెస్ బోర్డు, పాన్స్
క్యారమ్స్
క్యారమ్ బోర్డులు చిన్నవి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు, పెద్దవి రూ.1,200 నుంచి రూ.15వేల వరకు, క్వాయిన్స్ రూ.100 నుంచి రూ.500 వరకు, స్టైగర్స్ రూ.50 నుంచి రూ.500 వరకు, స్టాండ్ రూ.2,000, పౌడర్ రూ.40 నుంచి అందుబాటులో ఉన్నాయి.
టేబుల్ టెన్నిస్
టీటీ బ్యాట్స్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.30 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. టీటీ బోర్డ్స్ రూ.25,000 నుంచి రూ.80,000 వేలు వరకు దొరుకుతున్నాయి.
క్రికెట్
క్రికెట్‌లో హెల్మెట్, గ్లౌజ్, ప్యాడ్స్, ఆర్మ్‌గార్డ్, థైగార్డ్, క్రికెట్ బ్యాట్స్ వినియోగిస్తారు. క్యాస్ట్ బ్యాట్ రూ.1,800 నుంచి రూ.3,500, ఇంగ్లిష్ బ్యాట్ రూ.3,500 నుంచి రూ.60 వేల వరకు, బాల్స్ రూ.200 నుంచి రూ.250 వరకు, మ్యాచ్ బాల్స్ రూ.450 నుంచి రూ.900 వరకు, డ్రస్ రూ.650 నుంచి రూ.3 వేల వరకు, వికెట్స్, ప్యాడ్స్ రూ.1,200 నుంచి రూ.1,500 వరకు, కిట్ బ్యాగ్ రూ.800 నుంచి రూ.15 వేల వరకు, హెల్మెట్ రూ.1,100 నుంచి రూ.9 వేల వరకు ఉన్నాయి.
ఫుట్‌బాల్
ఫుట్‌బాల్‌లో చిన్‌గార్డ్స్ వినియోగిస్తారు. బాల్స్ రూ.800 నుంచి రూ.2,500 వరకు, నెట్స్ రూ.500 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. డ్రస్ రూ.800 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉంది.
వాలీబాల్
బాల్స్ రూ.600 నుంచి రూ.1,800 వరకు, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, డ్రస్ రూ.800 నుంచి రూ.8,000 వరకు ఉన్నాయి.

మన్నికై నవే ఎన్నుకోండి

మన్నికై నవే ఎన్నుకోండి

మన్నికై నవే ఎన్నుకోండి

మన్నికై నవే ఎన్నుకోండి

మన్నికై నవే ఎన్నుకోండి

మన్నికై నవే ఎన్నుకోండి