నేడు వైఎస్సార్‌ సీపీ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ సమావేశం

May 16 2025 12:33 AM | Updated on May 16 2025 12:33 AM

నేడు వైఎస్సార్‌ సీపీ సమావేశం

నేడు వైఎస్సార్‌ సీపీ సమావేశం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్‌లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు.

రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement