
అనుమానాస్పద స్థితిలో మహిళా హాస్టల్ వార్డెన్ మృతి
● పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద
బంధువుల ఆందోళన
పెద్దాపురం: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంంంంజినీరింగ్ కళాశాలలో మహిళా హాస్టల్ వార్డెన్ నిండుకుండల నాగమల్లి (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రౌతులపూడి మండలం మెరక సోమవారనికి చెందిన ఈమె ఏడాదిగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లితండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి యాజమాన్యం తప్పిందం వల్లే ఈ ఘటన జరిగిందని ఆత్మహత్య కాదు హత్యేనంటూ నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయలంటూ డిమాండ్ చేస్తూ మెరక సోమవరం గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అక్కడకు చేరుకుని పూర్తిన్యాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మనస్థాపంతోనే యువతి ఆత్మహత్య
గండేపల్లి: మనస్థాపంతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆమె తన గ్రామానికి చెందిన శెట్టిబత్తుల శివ దుర్గను ప్రేమించిందన్నారు. శివ దుర్గ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో మనస్థాపాం చెంది ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలి తల్లి దేవుడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళా హాస్టల్ వార్డెన్ మృతి