
పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సీపీఓ త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.తెలుసుకోవచ్చన్నారు.