
ఫలిస్తున్న పంచ్‌తంత్రం!
పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్‌లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్‌న్‌షిప్‌లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్‌లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్‌లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు.
రింగ్‌లోకి దిగితే పతకం రావాల్సిందే
సత్తా చాటుతున్న
పిఠాపురం మహిళా బాక్సర్లు

ఫలిస్తున్న పంచ్‌తంత్రం!