
కంప్యూటర్లు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
శంఖవరం: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 18న రూ.15 వేలు విలువైన కంప్యూటర్లు, సీపీయూలు, ప్రింటర్లు చోరీకి గురైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.భాస్కరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లిపూడి – బెండపూడి రోడ్డు మధ్యలో శంఖవరానికి చెందిన గామాల అశోక్, బోడపాటి చిన్నోడు ఆటోలో కంప్యూటర్లను వేరే చోటుకు తరలిస్తుండగా అరెస్టు చేశారు.