Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kalvakuntla Kavitha letter to KCR1
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్‌కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు. పాజిటీవ్‌,నెగిటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్‌ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్‌ ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తుపై సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో క్లారిటీ ఇవ్వలేదు. వక్ఫ్‌ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేది. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. పాత ఇన్‌ఛార్జ్‌లకే బీ ఫారమ్‌ ఇస్తారా?. బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డా. బీజేపీని టార్గెట్‌ చేసి ఉంటే బాగుండేది’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్‌ఎస్‌ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Ys Jagan Comments On Chandrababu Government2
‘చంద్రబాబు సర్కార్‌’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్‌ఆర్‌ అంజనేయులు, డీజే ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిలాల్‌ రాణా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Arshdeep Singh Set To Make Test Debut For India In England Series: Report3
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త జ‌ట్టులోకి స్టార్ ప్లేయ‌ర్‌! ఎవరంటే?

టీమిండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ త్వ‌ర‌లోనే టెస్టు అరంగేట్రం చేయ‌నున్నాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌టన‌కు 26 ఏళ్ల అర్ష్‌దీప్‌ ఎంపిక చేయాల‌ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాల‌ని ఈ పంజాబ్ పేస‌ర్‌కు సెల‌క్ట‌ర్లు సూచించిన‌ట్లు స‌మాచారం.అర్ష్‌దీప్ రాక‌తో భార‌త టెస్టు జ‌ట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ లేని లోటు తీర‌నుంది. కాగా వ‌న్డే, టీ20ల్లో భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయ‌లేదు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో రెగ్యూల‌ర్‌గా ఆడుతున్న‌ప్ప‌టికి టీమిండియా త‌రపున టెస్టుల్లో ఆడే అవ‌కాశం మాత్రం సింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ టూర్‌తో అత‌డు మూడు ఫార్మాట్ల‌లోనూ అరంగేట్రం చేయ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభ‌వం ఉంది. అక్క‌డి ప‌రిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ఇంగ్లండ్‌కు పంపాల‌ని అగ‌ర్కాక‌ర్ అండ్ కో భావిస్తున్న‌ట్లు వినికిడి.త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 21 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ మే 23న ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు విడ్కోలు ప‌ల‌క‌డంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానుంది. భార‌త టెస్టు జ‌ట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక దాదాపు ఖార‌రైన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సైతం టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అత‌డి స్ధానాన్ని ఎవ‌రి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు(అంచ‌నా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్‌, వైభవ్‌ సూర్యవంశీకి చోటు

Heart Breaking Washington Israeli Embassy Couple staffers Incident4
ఉంగరంతో ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు, ఈలోపే..

చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్‌, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్‌, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేయాలని యారోన్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచెయిల్‌ లెయిటర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్‌ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్‌

YS Jagan Declared June 4th As Vennupotu Day5
జూన్‌ 4న వెన్నుపోటు దినం: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

US Court Says  Google And Character AI Company Must Face Lawsuit Filed By Mother Over Her Death Of Son6
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'

టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్‌బాట్‌ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Parameshwara gave a wedding gift to Ranya Rao, says DK Shivakumar7
‘రన్యారావుకు హోంమంత్రి పెళ్లి గిప్ట్‌ ఇచ్చారు’.. ఈడీ రైడ్స్‌పై డిప్యూటీ సీఎం డీకే

సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్‌.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్‌ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్‌ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్‌ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు.

Anakapalle: Police Identify Huge Cyber Den Centered In Atchutapuram8
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్‌ డెన్‌ గుట్టురట్టు

సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్‌ డెన్‌ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్‌మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్‌మెంట్‌ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.

Tdp Mla Bandaru Satyanarayana Murthy Sensational Comments9
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు

సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

Bengaluru Mystery Man Buys A Rs.200 Crore Private Jet Ambani Pandit shares video10
రూ. 200 కోట్ల ప్రైవేట్‌ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్‌ వైరల్‌

200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్‌ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్‌ జెట్‌ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‌పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్‌లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్‌ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్‌, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement