
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలలో మేకర్స్ బిజీగా ఉన్నారు. తాజాగా దర్శకుడితో పాటు ముగ్గురు హీరోలు యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి అభిప్రాయం చెప్పాలని బెల్లంకొండ శ్రీనివాస్‌ను సుమ అడిగింది. అందుకు వారు చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లిని ఉద్దేశిస్తూ.. దర్శకుడు విజయ్ కనకమేడల ఇలా అంటాడు 'పెళ్లి గురించి చెప్పడానికి ఏమీ లేదు.. అంతా డాడీనే' అంటూ నవ్వేస్తాడు. ఆపై పక్కనే ఉన్న మనోజ్ కలుగజేసుకుని ఇలా అంటాడు.. 'నిద్రలేచాక నువ్వు అన్ని విషయాలు మరిచిపోతున్నావ్ కదా తమ్ముడు రోజుకొక పెళ్లి అంటే కష్టం' అని అంటాడు. బహుషా 'భైరవం' సినిమాలో శ్రీనివాస్ పాత్ర మతిమరుపుతో సంబంధం ఉండొచ్చు. అయితే, చివరగా తన పెళ్లి గురించి బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా అంటాడు. 'కొంతమంది హీరోలను ఆదర్శంగా తీసుకుని రెండుమూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నాను.' అని అంటాడు. సరదాగా సాగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ఏ హీరోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు రెండో పెళ్లి చేసుకున్నారని నువ్వు కూడా అలా చేసుకుంటానని ఎలా కామెంట్ చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మనోజ్‌కు కౌంటర్‌గానే శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చెబుతున్నారు. బెల్లంకొండ వ్యాఖ్యలు ఎవరిపై ఉండొచ్చు అనేది తెలిస్తే మీరూ కామెంట్ చేయండి.
"కొంత మంది హీరోలని చూసి inspire అయ్యి రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్కుందాం అనుకుంటున్నాను" - #BellamkondaSreenivas#Bhairavam pic.twitter.com/e0SIZMwdiG
— Daily Culture (@DailyCultureYT) May 22, 2025