family
-
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
-
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
-
కళ్ళు మూసుకున్న సమాజానికి కన్నతల్లి మేలుకొలుపు!
కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాలు సైతం పట్టుమని వారమైనా ఆడని ఈ రోజుల్లో... ఒక నాటిక గత 13 నెలల కాలంలో వివిధ ప్రాంతాల్లో సగటున వారానికి ఒక ప్రదర్శన జరుపుకుందంటే నమ్మగలరా. ఈ వింతకు ఓ తెలుగు డ్రామా కారణమైందన్న మాట కలలోనైనా ఊహించగలరా. అవును... మీరు విన్నది నిజమే. అందుకే, ఇది అపూర్వమే కాక అందరినీ ఆశ్చర్యపరిచే సందర్భం. ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే ఓ తెలుగు నాటిక రంగస్థలంపై రాకెట్ లా దూసుకుపోతోంది. తెలుగు నేలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ... ప్రతి చోటా ప్రేక్షకాదరణతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే... 53 ప్రదర్శనలు! 150 బహుమతులు!!ఇటీవల ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే కేవలం నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు వేదికలపై (గచ్చిబౌలిలో రంగభూమి, లకడీకాపూల్ వద్ద రవీంద్రభారతి) ఈ నాటిక ప్రదర్శన జరిగింది. రెండు చోట్లా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వెనువెంటనే కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గర ప్రదర్శనకు సిద్ధమైంది. వెరసి, ఈ మే నెల ప్రథమార్ధంలో వారం రోజుల్లోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రదర్శనలు. ప్రదర్శన జరిగిన ప్రతిచోటా ఈ నాటికకు జేజేలు. నటి – రచయిత్రి జ్యోతిరాజ్ బీశెట్టి రచించగా, గోవాడ క్రియేషన్స్ పతాకంపై నట - దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ సారథ్యంలోని నట, సాంకేతిక బృందం ఈ ఘనత సాధించింది. గుజరాత్‌లోని వడోదరాలో సైతం సభికులతో స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న సమకాలీన రంగస్థల సూపర్ హిట్ ఇది.అంతేకాదు... తెలుగు నేలపై దాదాపు 35 నాటక పరిషత్తులు జరుగుతుంటే, అందులో 32 పరిషత్తుల్లో ఈ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ నాటికగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లోనే నిలిచి, 32 బహుమతులు సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలా పలు విభాగాల్లో ఈ నాటిక ఇప్పటి వరకు ఒకటీ, రెండు కాదు... ఏకంగా 150 దాకా బహుమతులు గెలుచుకొని, అరుదైన ఘనత సాధించింది. “ఇటీవలి కాలంలో ఓ తెలుగు నాటిక వరుసగా ఇన్ని ప్రదర్శనలు, ఇంత ప్రాచుర్యం, ప్రజాదరణ సంపాదించింది లేదు. అందుకే, సమకాలీన తెలుగు రంగస్థల చరిత్రలో ఈ నాటికకు ప్రత్యేక స్థానం ఉంది” అని సీనియర్ రంగస్థల పరిశోధకులు, రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు వ్యాఖ్యానించారు.సరిగ్గా గత ఏడాది మార్చి చివరలో (2025 మార్చి 28) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నెలకొన్న ‘రంగభూమి స్పేసెస్’లో ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తొలి ప్రదర్శన జరిగింది. ఏడాది తిరిగేసరికల్లా... 50 ప్రదర్శనలు పూర్తి చేసుకొని, ఈ మే నెల 5న సరిగ్గా అదే ప్రాంగణంలో 51వ ప్రదర్శన జరగడం గమనార్హం. అంతేకాదు... సినిమాలే యాభై రోజుల విజయోత్సవం జరుపుకోవడం గగనమవుతుంటే, ఓ నాటిక యాభై ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా అభినందన సభ, ప్రత్యేక ప్రదర్శన జరిపారు.ఆ పోషకుల్ని అంతగా కదిలించిందేమిటి?కళాపోషకులు, రసహృదయలైన గుదే పాండురంగారావు దంపతులు ఈ ప్రదర్శన, విజయోత్సవం ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఆ దంపతులు, వారి బృందం ఎన్.టి.ఆర్. కళాపరిషత్ పక్షాన ప్రత్యేకంగా హైదరాబాద్‌లో వచ్చి మరీ, ఈ 51వ ప్రదర్శన, విజయోత్సవం నిర్వహించడం వారి కళాప్రియత్వానికి మచ్చుతునక. “నేను నటుణ్ణి, దర్శకుణ్ణి కాదు. కేవలం కళాభిమానిని. మూడో ప్రదర్శన సమయంలోనే ఈ నాటిక చూశాను. నాలుగేళ్ళుగా పరిషత్ నాటకాల పోటీలు నిర్వహిస్తున్న నాకు ఈ నాలుగేళ్ళ కాలంలో మనసుకు బాగా నచ్చిన నాటిక ఇది. అందుకే, అభినందించాను. అంతేకాకుండా, ఈ నాటిక ఊరూరా ప్రదర్శనలతో అఖండ విజయం సాధిస్తుందని చెప్పాను. యాభై ప్రదర్శనలు పూర్తయినప్పుడు మా సంస్థ పక్షాన ఉత్సవం చేస్తామనీ అప్పుడే మాట ఇచ్చాను. మా అంచనా నిజమై, ఈ నాటిక ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉంది” అని పాండురంగారావు తన భావాలు పంచుకున్నారు. ఇంతగా అందరినీ కదిలించిన ఈ నాటికలో ఇంతకీ ఏముంది అంటే... అమ్మ ప్రేమ ఉంది. కట్టుకున్నవాడు కాదన్నా, కంచెలు వేసిన సమాజం ఏమన్నా సరే... కన్నబిడ్డలోని శారీరకమైన మార్పునూ, మానసికమైన సంఘర్షణనూ అర్థం చేసుకున్న అసలైన అమ్మదనం ఉంది. బ్రహ్మ చేసిన మానవ సృష్టిని అర్థం చేసుకొని, కడుపున పుట్టిన బిడ్డ కష్టాన్ని అవగాహన చేసుకొని, కడుపులో పెట్టుకొని కాపాడి, కృషితో విజయతీరం వైపు నడిపించిన అపర బ్రహ్మ అమ్మ గొప్పదనం ఉంది. ఓ ట్రాన్స్ జెండర్ తాలూకు ఆవేదన ఉంది. మన మధ్యే ఉన్న అలాంటి మనుషుల పట్ల మనకుండాల్సిన కనీసపాటి మానవత్వం గురించి ఆలోచన ఉంది. వాళ్ళూ మనలాగే మనుషులే అన్నది మర్చిపోతున్న మన దృష్టికోణంలోని లోపాన్ని ప్రశ్నించడం ఉంది. మారాల్సిన మన తీరును గుర్తు చేయడం ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే.... మనిషి సృష్టికర్త బ్రహ్మ అయినా, ఆ మనిషిని ఈ లోకంలోకి తెచ్చిన అమ్మే... మన లోపాలనూ, మనసునూ అర్థం చేసుకొని, సరైన మార్గంలో పెట్టి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దగల మరో బ్రహ్మ. ఆ మాటే ఈ నాటిక భావోద్వేగాలతో బలంగా చెబుతుంది.కనిపించని దేవుడి తప్పు... కని పెంచిన అమ్మ తీర్పు ఇటీవలి కాలంలో భిన్నమైన ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న నాటిక ఇది. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద అమ్మ కథాంశంగా సాగే ఓ నాటికల రచన పోటీ గతంలో నిర్వహించారు. అందులో ద్వితీయ బహుమతి పొందిన నాటిక ఇది. దానికి మరింత మెరుగులు దిద్ది, దేశం నలుమూలలా చేస్తున్న ప్రదర్శన – ‘అమ్మ చెక్కిన బొమ్మ’.స్థూలంగా కథ చెప్పాలంటే... అబ్బాయిగా పుట్టి, స్కూలు చదువులకు ఎదుగుతాడు శశి (బాల నటుడు భానుప్రకాశ్). అయితే, హార్మోన్ల మార్పు ఫలితంగా అమ్మాయిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని తల్లి అనసూయ (నటి జ్యోతిరాజ్ బీశెట్టి) గ్రహిస్తుంది. భర్త గోవర్ధన్ (నటుడు వెంకట్ గోవాడ) – బంధువులు – లోకం ఏమన్నా సరే ఆ బిడ్డ మానసిక పరిస్థితికే తల్లి మద్దతుగా నిలుస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా, సహిస్తుంది. భరిస్తుంది. అదే సమయంలో కన్నబిడ్డ దారి తప్పకుండా చూస్తుంది. అతని మానసిక స్థితికి అనుగుణంగా శారీరకంగా అమ్మాయిగా (వెన్నెల పాత్ర – నటి హర్షిణి మేకల) మారేందుకు అవసరమైన వైద్యచికిత్స చేయిస్తుంది. ఏటికి ఎదురీదుతుంది. అపురూపమైన అమ్మ ప్రేమ, త్యాగం, కష్టం చూసిన ఆ బిడ్డ, కన్నతల్లికి మాటిచ్చి మరీ, చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది. చివరకు ‘వెన్నెల ఐ.ఏ.ఎస్’ అవుతుంది. అక్షరాలా ‘అమ్మ చెక్కిన బొమ్మ’గా సమాజంలో నిలుస్తుంది. కనిపించని దేవుడు చేసిన తప్పును, కని పెంచిన అమ్మ ఓ దేవతలా అలా సరిచేస్తుంది. సమస్యల్ని గెలుస్తుంది.తెలుగులో అరుదైన ఇతివృత్తంఆధునిక తెలుగు నాటకరంగం 1860 ప్రాంతంలో ఆరంభమయ్యాక... స్త్రీ, పురుషులు కాక, ఈ తృతీయ ప్రకృతిని సైతం రంగస్థలంపై పాత్రలుగా చూపెడుతూ ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ సహా పలు నాటికలు, నాటకాలు రాకపోలేదు. కానీ, జన్మ రీత్యా పురుషుడైన పాత్ర ఆధునిక వైద్యవిధానంతో స్త్రీగా మారడం, మారేందుకు పడిన మానసిక సంఘర్షణ, కుటుంబంలో – సమాజంలో ఎదుర్కొన్న చిక్కులు... లాంటి అంశాలను సున్నితంగా చూపెడుతూ, ఆలోచింపజేసిన ప్రయత్నం మాత్రం ‘అమ్మ చెక్కిన బొమ్మే’ అని రంగస్థల పరిశీలకుల మాట. “ఎన్నో రంగస్థల రచనలు చేసిన నేను కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే, ఈ నాటిక చూసినప్పుడు ఆనందంతో కూడిన అసూయకు లోనయ్యాను” అని కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ అని ఛలోక్తిగానే ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శనను ప్రశంసించారు. ‘7 స్టెప్స్ ఎరౌండ్ ది ఫైర్’ అంటూ ఇంగ్లీషులో మహేశ్ దత్తానీ, అలాగే తొమ్మిది మంది హిజ్రా పాత్రలతో నవరసాలను అభినయింపజేస్తూ ‘నవ’ అంటూ కన్నడంలో శరణ్యా రామ్ ప్రకాశ్ చేసిన ప్రయోగాలను ఆయన ప్రస్తావించారు.రంగభూమిపై.. భావోద్వేగ ప్రయాణం!ఇటు భర్త – అటు బిడ్డల మధ్య నలిగిపోయి, చివరకు కట్టుకున్నవాడి కన్నా, కన్నబిడ్డ వైపు మొగ్గే తల్లి పాత్రలో జ్యోతిరాజ్ వివిధ భావోద్వేగాలను పండించారు. గెంటేస్తానంటున్న తండ్రి – గేళి చేస్తున్న తోటి స్నేహితులు – శరీరంలో తనకు తెలియకుండానే కలుగుతున్న భావాల మధ్య, మానసికంగా సంఘర్షణలో చిక్కుకొన్న బాలుడు శశి పాత్రపోషణ ఈ నాటికకు మరో మూలస్తంభం. గతంలో పలు సినిమాల్లోనూ నటించిన బాలనటుడు భానుప్రకాశ్ అమ్మాయిగా మారాలనుకొనే అబ్బాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఓ సన్నివేశంలో “అమ్మా! నిన్ను ముట్టుకోవచ్చా అమ్మా?” అంటూ బాధ, ఆవేదన, సంకోచాలను అభినయించినప్పుడు అప్రయత్నంగా ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాడు.తండ్రి పాత్రలో నటించడమే కాక, వీలైనంత తక్కువ సెట్టింగులతోనే ప్రతీకాత్మకంగా నాటకాన్ని నడిపించడంలో దర్శకుడు వెంకట్ గోవాడ అనుభవం, శ్రమ అభినందనీయం. నిజజీవితంలో ట్రాన్స్ జెండరైన హర్షిణి తన జీవితానుభవాన్ని వెన్నెల పాత్రలోకి ప్రవహింపజేశారు. చివరకు వచ్చేసరికి, “ఆపదలలో తోడు లేని నేను, ఆనందంలో భాగం ఆశించకూడదు. నువ్వు తల్లిగా గెలిచావు, నేను తండ్రిగా ఓడిపోయాను” అంటూ నేపథ్యంలో వినిపించే తండ్రి పాత్ర మాటలు ఆగి, ఆలోచింపజేస్తాయి. ఇన్ని ప్రదర్శనలుగా ఓ నాటిక విజయవంతం కావడం వెనుక ఎంత సమష్టి కృషి ఉందో కూడా ప్రదర్శన చూసినవారు ఇట్టే గ్రహిస్తారు.ప్రాణమై నిలిచిన పాట, సంగీతం!“బొమ్మరా ఇది బొమ్మరా... అమ్మ చెక్కిన బొమ్మరా....” అంటూ నాటికలో వివిధ సందర్భాల్లో వినిపించే శీర్షికా గీతం మరో హైలైట్. “బృహన్నలకు బంధువా, శిఖండికి తా చిహ్నమా, అర్ధనారి స్వరూపమా, మోహినీ అవతారమా” అంటూ నాటికా రచయిత్రే రాసిన ఈ పాట, దానికి సురభి నాగరాజు చేసిన బాణీ కరుణ రసాత్మకంగా నేరుగా మనసు తాకుతాయి. వర్ధమాన గాయని ఎన్. శ్రీనిధి తన గళంతో ఆ పాటకు మరింత జీవం నింపారు. “పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోదనెవరిది” అన్న మాటలు ఆమె గొంతులో పలికినప్పుడు కరగని ప్రేక్షక హృదయం అరుదు.అలాగే, “అమ్మ ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ లాలనకు అంతమేది, అమ్మ కన్నా మిన్న ఏది” అన్న చరణం వింటుంటే కన్నతల్లి జ్ఞాపకాలు గుర్తుకు రానివారూ ఉండరు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే, కళారంగంలో మనకు మరో మంచి గాయని లభించినట్టే! “నిజానికి, ఆ పాట, ఆ బాణీ, శ్రీనిధి పాడిన విధానం... ఈ నాటికను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముందుగా నేను ఊహించిన దాని కన్నా ఎక్కువగా పదుల కొద్దీ ప్రదర్శనలకు ముందుకు నడిపించడంలో ఓ కీలక పాత్ర పోషించాయి” అని ఈ నాటక రథసారథి వెంకట్ గోవాడ స్వయంగా వివరించారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే, నేపథ్య సంగీతం, లైటింగ్ సైతం ఈ నాటిక ప్రదర్శనలకు అంతే ఆయువుపట్టుగా నిలిచాయని ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది.“మనసు చంపుకొని నటిస్తున్నాం!”: సినీ నటి శివపార్వతిఈ నాటికను తిలకించిన ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటి శివపార్వతి, నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటకంపై ప్రేమతో ఒకప్పుడు తామెలా రంగస్థలంపై కృషి సాగించిందీ గుర్తు చేసుకున్నారు. “నా పదమూడో ఏట నుంచి నేను రంగస్థలం ఒడిలోనే పెరిగాను. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో నాటక రంగం నుంచే వెండితెరకు పరిచయమయ్యాను. ఇవాళ సినిమా, టీవీ, ఓటీటీ ఎన్నో వచ్చినా... నటిస్తున్నా... నాకు అన్నం పెట్టి, నన్ను ఇంతదాన్ని చేసిన రంగస్థలాన్ని మర్చిపోలేదు. కరెంట్ పోయినా, వర్షం పడి తడుస్తున్నా... అంకితభావంతో సాగించిన ఆ రోజుల్ని మర్చిపోలేను. కానీ, ఇవాళ చాలా సందర్భాల్లో కెమెరా ముందు మనసు చంపుకొని నటించాల్సి వస్తోంది. ‘ఆఁ’, ‘ఊఁ’, ‘అమ్మా నాన్న’ లాంటి వాటికి కూడా ప్రాంప్టింగ్ చెప్పించుకొనే తరం, పరభాషీయులదే పెత్తనం. మనం ఏదన్నా చెప్పినా చాదస్తంగా భావిస్తూ, ‘మీకు నటన తెలీదు. ఆ నాటకాల నటన వద్దు’ అని కించపరిచిన చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. కానీ, అదే షూటింగ్ సెట్ లో... ఒకే షాట్లో 3 పేజీల డైలాగును ఏకబిగిన చెప్పి అందరితో శభాష్ అనిపించుకున్నానంటే అది రంగస్థల అనుభవం పెట్టిన భిక్షే” అని శివపార్వతి తన మనోభావాలను పంచుకున్నారు.రంగస్థల ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల ప్రదర్శనల గుణనిర్ణేత మానాపురం సత్యనారాయణ, తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనమైన ‘వేదిక’ సంస్థకు అధ్యక్షుడైన రంగస్థల, సినీ, టీవీ నటుడు ముత్తవరపు సురేశ్ బాబు, మరో నటుడు చలపతిరాజు తదితరులు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ బృందాన్ని ప్రశంసించారు. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ వారు సైతం తెలుగు రంగస్థలాన్ని చూసి అబ్బురపడేలా ఆ మధ్య గుంటూరులో జాతీయ నాటకోత్సవాలకు తాము ఆతిథ్యం ఇచ్చిన సంగతులను ముత్తవరపు ప్రస్తావించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో “ఏటా పుచ్చలపల్లి సుందరయ్య నాటక కళాపరిషత్ ద్వారా ఇప్పటికి 23 ఏళ్ళుగా సాగిస్తున్న కృషి చేస్తున్నాం. సమాజంలోని వివిధ రంగాలకు చెందిన 20 మంది న్యాయ నిర్ణేతలతో నిష్పాక్షికంగా విజేతలను ఎంపిక చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే, త్వరలోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగస్థలంపై కొత్త పద్ధతిలో, భారీ నాటక ప్రదర్శనగా రూపొందించాలని యోచిస్తున్నాం” అని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.హాస్య దర్శకుల్ని మెప్పించిన సెంటిమెంట్‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శన ప్రముఖ సినీ దర్శకుల, పత్రికా విమర్శకుల ప్రశంసలు సైతం పొందడం అసామాన్యం. గురువు దాసరి నారాయణరావు బాటలోనే పయనించి, 90కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు తన ప్రసంగంలో, “పదిహేనేళ్ళ వయసులోనే పాలకొల్లులో నాటకాల్లో పాల్గొన్న అనుభవం నాది. చాలా రోజుల తర్వాత ‘అమ్మ చెక్కిన బొమ్మ’ రూపంలో ఓ మంచి నాటిక చూశాను. హాస్య చిత్రాల దర్శకులుగా పేరొందిన నన్ను, శివనాగేశ్వరరావును కదిలించి, కన్నీరు పెట్టించిన సెంటిమెంటల్ డ్రామా ఇది. మా గురువు దాసరికి సినిమాలే జీవితమైతే, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రంగస్థలానికే అంకితమైన గోవాడకు నాటకాలే జీవితం. ఆదుర్తి, దాసరి లాంటి దిగ్దర్శకుల బాటలో ఈ నాటికలో సింబాలిక్ షాట్స్‌ను దర్శకుడు గోవాడ బాగా ఉపయోగించారు” అని అభినందించారు.దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, “రచయిత, దర్శకుడు పోటాపోటీగా చేసిన నాటిక ఇది. ఇదే నాటికను ఆ మధ్య పరిషత్ పోటీల్లో చూసి, న్యాయనిర్ణేతలందరం ఏకాభిప్రాయంతో అనేక బహుమతులు ప్రకటించాం. ఇప్పుడు రెండోసారి చూస్తున్నా, రంగస్థలంపై రసానుభూతి మారలేదు. నాలో స్పందన మారలేదు. తొలిసారి ఎక్కడ కంట నీరు పెట్టుకున్నానో, ఈసారీ అక్కడే అప్రయత్నంగా కన్నీరు ఒలికింది. ఒక కళారూపం విజయానికి అంతకు మించిన గీటురాయి ఏముంటుంది” అన్నారు. క్యారవాన్ సంస్కృతితో నేడు సినీ నటుల్లో సైతం కొరవడిన ప్రొఫెషనలిజం నటిగా జ్యోతిరాజ్లో చూసి, ఆనందం, ఆశ్చర్యం కలిగాయి అని సినీ దర్శకుడు యాట సత్యనారాయణ ప్రశంసించారు. సీనియర్ జర్నలిస్ట్-రచయిత డాక్టర్ రెంటాల జయదేవ ప్రసంగిస్తూ, ఇతివృత్తం ఎంపిక, నాటిక నిర్వహణ, నటీనటుల అభినయంలోని ప్రతిభా ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. “ముఖ్యంగా, తానే ఆ పాత్రగా మారి, అమ్మాయిగా కూడా అద్భుతంగా హావభావాలు చూపిన భానుప్రకాశ్ ఇలాగే శ్రద్ధగా కృషి చేస్తే, మరో జూనియర్ ఎన్టీఆర్ అంతవాడు అవుతాడు” అని అంచనా వేశారు.మంచిరోజులు మళ్ళీ వస్తున్నట్టే(నా)!?వెరసి, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం ఈ మధ్య కాలంలో తెలుగు నాటకానికి కొత్త ఉత్సాహం తెచ్చింది. నట, సాంకేతిక బృందాన్ని, అతిథులనూ ఎన్.టి.ఆర్. కళాపరిషత్ స్థాపకులు పాండురంగారావు పేరు పేరునా ప్రత్యేకంగా ఆహ్వానించి, జ్ఞాపికలతో సత్కరించడం కళాకారుల కళ్ళల్లో వెలుగులు నింపింది. “నిర్విరామంగా నాటకోత్సవాలు జరుపుతున్న మా పరిషత్ రానున్న రోజుల్లోనూ ఇలాంటి మంచి నాటకాలను ఇలాగే మరింత ప్రోత్సహిస్తుంది. తెలుగు నాటకం దానికి అదే ఓ ఆదాయవనరుగా మారాలనీ, కళాకారులు రంగస్థలం మీదే ఆధారపడి జీవనోపాధి సంపాదించుకొనే స్థాయికి మన నాటకరంగం ఎప్పటికైనా చేరాలనీ నా కోరిక. అందుకోసం ఉడతాభక్తిగా మా సంస్థ వంతున కృషి చేస్తాము” అని పాండురంగారావు తన సతీమణి సాక్షిగా ప్రేక్షకుల చప్పట్ల మధ్య ప్రకటించారు. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ సతీమణి, చివరకు ఎం.బి.బి.ఎస్. చదివిన వారి కుమార్తె సైతం ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికలో నటించడం, ప్రదర్శన రక్తి కట్టడానికి ప్రతి చిన్నపనిలో భాగం కావడం గమనార్హం. రంగస్థలంపై ఆ కుటుంబానికి ఉన్న ప్రేమ, అంకిత భావాలకు అది నిదర్శనం. అంతేకాదు... సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నా అభినయంపై ఆసక్తితో ఇంకా పలువురు యువతీ యువకులు ఈ ప్రదర్శనలో భాగమైన తీరు చూసినప్పుడు ముచ్చటేస్తుంది. అలాగే, నగరం నడిబొడ్డుకు దూరంగా ‘రంగభూమి’లో ప్రదర్శన జరుగుతున్నా... ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం, ఆకస్మిక వర్షం - విద్యుత్ సరఫరా లోపాల మధ్య కూడా ఆసక్తిగా ఆసాంతం కూర్చోవడం తెలుగు నాటక రంగంపై ఆశలు చిగురింపజేస్తోంది. సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉంటే కొత్త తరం రంగస్థలంపై విజృంభిస్తుంది. సరికొత్త ఇతివృత్తాలు, సమయపాలన, ప్రొఫెషనలిజం ఉంటే... ప్రేక్షకులు సైతం నేటికీ నాటకాన్ని ఆదరిస్తారని అర్థమవుతోంది. అందుకు ఒకరకంగా, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం శుభ నాందీ సూచకమైతే... మన రంగస్థలానికి కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్టే!::: రెంటాల జయదేవ -
శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసిన.. అల్లు అరవింద్, స్నేహా రెడ్డి
-
ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్
-
తండ్రి కూతురి మృతి.. భర్త బాడీ పక్కనే 3 రోజులు భార్య.. చంపింది ఎవరు?
-
అషు రెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
-
అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)
-
అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్ ఫొటోలు
-
కుటుంబ జీవితం, కెరీర్ ప్లాన్‌పై సింగపూర్ మాజీ ప్రధాని సలహా!
వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్, మంచిగా సెటిల్ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్‌కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.శ్రీధర్ వెంబు షేర్ చేసిన ఎక్స్ పోస్ట్‌లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు. ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్డీ, మంచి బాయ్‌ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు. తీరా కెరీర్లో సెటిల్ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు. I studied the life and work of Lee Kuan Yew, the Founder-Prime Minister of Singapore intensely during my early 20s. Immense respect for him.In this video clip, he advises a young woman pursuing a PhD not to neglect marriage and kids. I recently gave very similar advice. Elon… https://t.co/BVlUSDsBnP— Sridhar Vembu (@svembu) April 24, 2026 (చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!) -
పదేళ్ల ప్లాన్.. ఉత్తర కొరియా నుంచి సురక్షిత ప్రదేశానికి!
ఉత్తర కొరియా.. నిరంకుశత్వ పాలనకు ఒక ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర నేతగా పేరున్న కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉండడం అక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇప్పటికీ కిమ్ నియంతృత్వ పాలన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కఠిన నిబంధనలు, ఆంక్షలతో దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడం కిమ్ జోంగ్ ఉన్ నైజం. అలాంటి దేశాధ్యక్షుడి కళ్లు గప్పి అతడి అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు ఉత్తర కొరియాకు చెందిన 9 మంది సభ్యులున్న కుటుంబం చేసిన సాహసం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కిమ్ అరాచక పాలన నుంచి తప్పించుకోవడానికి పదేండ్ల పాటు ప్రణాళిక రచించారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే పదేళ్ల పాటు రచించిన ప్రణాళికను కేవలం రెండు గంటల్లోనే అమలు చేయడం విశేషం.విషయంలోకి వెళితే.. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ కుటుంబ పెద్ద. అయితే కిమ్ జోంగ్ ఉన్ అరాచక పాలనను కళ్లారా చూస్తూ వచ్చిన కిమ్.. తన కుమారులతో ఈ దేశంలో భవిష్యత్ లేదు, బాహ్య ప్రపంచం చాలా పెద్దది, అక్కడికి చేరుకోవాలంటే సముద్రమే మనకు ఏకైక మార్గం అని చెప్పడంతో ఈ సుదీర్ఘ ప్రయాణం మొదలైంది.దక్షిణ కొరియా నుంచి అక్రమంగా వచ్చే టీవీ ఛానెళ్లను చూడటం ద్వారా వారు అక్కడి జీవనశైలిని, సామాజిక స్వేచ్ఛను గమనించారు. ఇది వారిలో స్వేచ్ఛ పట్ల ఉన్న కాంక్షను మరింత బలోపేతం చేసింది. ఈ కుటుంబం ఎంచుకున్న మార్గం చాలా ప్రమాదకరమైంది. చైనా సరిహద్దు లేదా అత్యంత కట్టుదిట్టమైన భూభాగ సరిహద్దు కాకుండా, వారు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. వారు మత్స్యకారులు కాకపోయినా ఈ ప్రయాణం కోసం పక్కాగా సిద్ధమయ్యారు.మత్స్యకారులుగా మారి...చిన్న కుమారుడు కిమ్ యి హ్యోక్ సముద్ర తీరానికి వెళ్లి చేపల వేటను వృత్తిగా మార్చుకున్నాడు. పడవలను ఎలా రిపేర్ చేయాలి. అలల వేగాన్ని ఎలా అంచనా వేయాలి అనే విషయాలు నేర్చుకున్నాడు. సముద్రంపై గస్తీ తిరిగే ఉత్తర కొరియా పెట్రోలింగ్ పడవల కదలికలను వారు సుదీర్ఘ కాలంపాటు గమనించారు. రాత్రి వేళల్లో నిఘా తక్కువగా ఉంటుందని వారు గుర్తించారు. వర్కర్స్ పార్టీ సభ్యులకు, భద్రతా సిబ్బందికి తమపై ఎటువంటి అనుమానం రాకుండా సాధారణ మత్స్యకారుల వలే వారు ప్రవర్తించారు. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు అధికారులకు లంచాలు ఇచ్చి తప్పించుకుంటూ తాము తిరిగి వస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించారు.రెండు గంటల ప్రయాణంమే 2023లో ఒక వర్షపు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రాడార్ నిఘా తక్కువగా ఉంటుందని వారు ఆ సమయాన్ని ఎంచుకున్నారు. చేపల వేట కోసమే వెళ్తున్నామని నమ్మించి గార్డులకు లంచం ఇచ్చి పడవను సముద్రంలోకి తీసుకెళ్లారు. గర్భిణీగా ఉన్న కిమ్ ఇల్ హ్యోక్ భార్యతో సహా కుటుంబంలోని మహిళలు, పిల్లలను రహస్యంగా పడవలోకి ఎక్కించారు. పడవ ప్రయాణంలో నాలుగు, ఆరేళ్ల వయసు ఉన్న పిల్లల శబ్దం చేయకుండా ఉండేందుకు వారిని గోనె సంచుల్లో దాచి ఉంచారు. సుమారు రెండు గంటల పాటు ప్రాణాలకు తెగించి ప్రయాణించి, చివరకు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పద జల సరిహద్దు అయిన నార్తర్న్ లిమిట్లైన్ను దాటారు.ఎన్ఎల్ఎల్ దాటిన తర్వాత వారు యోన్ ప్యాంగ్ ద్వీం సమీపంలో దక్షిణ కొరియా నౌకాదళానికి సంకేతాలు పంపారు. దక్షిణ కొరియా అధికారులు వారిని రక్షించి, ఆశ్రయం కల్పించారు. ఇలా తప్పించుకునే క్రమంలో చిక్కితే జైలు శిక్ష, చిత్రహింసలు లేదా మరణ శిక్ష ఉంటుంది. అటువంటి మృత్యువలయం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సురక్షితంగా బయటపడటం అద్భుతమని చెప్పాలి. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
పెద్ద దస్తగిరి హత్యపై సంచలన నిజాలు బయటపెట్టిన భార్య, కొడుకు
-
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
-
కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్‌లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్‌ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్‌ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్‌గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్‌గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్‌పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే! -
మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!
మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్‌కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా మామూలే. మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, చాలా గ్రాండ్‌గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...– రమా కుమారి, బోధన్మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్ యాక్టివ్‌గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు. ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్ డిసార్డర్’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్ స్టెబిలైజర్స్’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)
-
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు!
సాక్షి, చెన్నై : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలో ఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం. -
కుటుంబమే కీలకం
ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ తన ఎనిమిది దశల వికాస సిద్ధాంతంలో మొదటి దశను ‘ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్’ అని పిలిచారు. శిశువు జన్మించిన మొదటి ఏడాదిలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదరణ, రక్షణ ఆ బిడ్డలో ‘ఈ ప్రపంచం సురక్షితమైనది’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆ దశలో నిర్లక్ష్యానికి గురైతే, ఆ బిడ్డ పెద్దయ్యాక ఎవరినీ నమ్మలేని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాడు. మానవ పరిణామ క్రమంలో మనిషిని ఒక సామాజిక జీవిగా తీర్చిదిద్దే మొదటి పాఠశాల ‘కుటుంబం’. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు, ఇతరులతో బంధాలను ఎలా కొనసాగిస్తాడు అనే అంశాలన్నీ ఆ వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే, వ్యక్తిత్వం అనేది కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు, అది అనుభవాల సమాహారం. ఆ అనుభవాలకు కేంద్ర బిందువు కుటుంబం.ఒక కుమ్మరి మట్టిని ఎలాగైతే తన చేతులతో నొక్కుతూ, సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాడో, తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి.మాటల కంటే చేతలు మిన్నకుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటే, పిల్లలు ‘గౌరవం’ అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. వారు విన్న దానికంటే, కళ్లారా చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతారు. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారని అల్బర్ట్ బండూరా తన ‘సోషల్ లెర్నింగ్ థియరీ’లో నిరూపించారు. ఇంట్లో తండ్రి కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? తల్లి సమస్యలను ఎలా ఎదుర్కొంటోంది? తాతయ్య ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ బిడ్డ మెదడులో నిక్షిప్తమైపోతాయి.ఉదాహరణకు, ఒక ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి, బయట చాలా సౌమ్యంగా ఉంటూ ఇంట్లో మాత్రం భార్యపై అరుస్తూ ఉంటాడు. అతని కుమారుడు అది చూస్తూ పెరిగాడు. ఆ అబ్బాయి పెద్దయ్యాక తన భాగస్వామితో కూడా అదే ‘అగ్రెసివ్’ ప్రవర్తనను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే, అతని దృష్టిలో మగతనం అంటే అధికారం చలాయించడం అనే తప్పుడు భావన నాటుకుపోయింది. దీనినే ‘ఇంటర్‌జెనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బిహేవియర్’ అంటారు.ఫ్యామిలీ డైనమిక్స్ – ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిత్వ వికాసంలో ఐక్యూ (తెలివితేటలు) కంటే ఈక్యూ (భావోద్వేగ పరిణతి) ముఖ్యం. కుటుంబంలో భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటేనే బిడ్డలో ఈక్యూ పెరుగుతుంది. ‘మగపిల్లలు ఏడవకూడదు‘ అని అణచివేయడం వల్ల, వారు పెద్దయ్యాక తమ భావాలను వ్యక్తపరచలేని ‘ఎమోషనల్లీ స్టంటెడ్’ వ్యక్తులుగా మారుతారు. కుటుంబం అనేది ఒక సురక్షిత ్రపదేశంగా ఉండాలి, అక్కడ తప్పులు చేసినా క్షమించబడతామనే ధైర్యం ఉండాలి.మనం ఇంటికి వేసే రంగులు (బయట ప్రపంచానికి కనిపించే మన నడవడిక) అందంగా ఉండవచ్చు. కాని, వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా ఇల్లు నిలబడాలంటే పునాది (కుటుంబం ఇచ్చిన మానసిక స్థైర్యం) బలంగా ఉండాలి. పునాదిలో పగుళ్లు ఉంటే, పైన ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం లేదు. అలాగే, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే, అవి కుటుంబ వాతావరణం నుండి వచ్చినవే అయి ఉంటాయి.మార్పు మన నుండే...కుటుంబం వ్యక్తిత్వానికి పునాది అనగానే, మనలోని లోపాలకు తల్లిదండ్రులను నిందించడం పరిష్కారం కాదు. కార్ల్ జంగ్ అన్నట్లు, ‘నేను నా గతాన్ని మార్చలేను కాని, నా భవిష్యత్తును నేను నిర్మించుకోగలను.’ మన కుటుంబం నుంచి మనకు వచ్చిన నెగటివ్ పాటర్న్స్ను గుర్తించడం మొదటి అడుగు. ఆ తర్వాత వాటిని మార్చుకుంటూ, మన తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని అందించడం మన బాధ్యత.నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉన్నా, ఎవరి మొబైల్స్‌లో వారు నిమగ్నమై ఉంటున్నారు. దీనిని ‘ఫబ్బింగ్’ అంటారు. ఇది పిల్లల్లో ‘నిర్లక్ష్యానికి లోనవుతున్నాం’ అనే భావనను కలిగిస్తుంది. నాణ్యమైన సమయం గడపకపోవడం వల్ల పిల్లలు తమ వ్యక్తిత్వానికి కావాల్సిన సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు. ముఖాముఖి సంభాషణలు లేకపోవడం వల్ల సహానుభూతి తగ్గుతోంది.-సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!
పైలట్ వృత్తిలో ఉండే వ్యక్తులకు మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఉంటాయని తెలుసా. అందరీ పైలెట్లకి రెండు ఫ్లైట్ జర్నీలు అత్యంత సర్వసాధారణం. మూడోది మాత్రం.. కొందరికే దొరికే సువర్ణావకాశం. అలాంటి లక్కీఛాన్స్ కొట్టేశాడు ఈ పైలట్. ఆ పట్టరాని సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఇలా. ఆ వ్యక్తే కెప్టెన్ అజమ్ అల్లి. ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ మధురమైన క్షణాన్ని కెమెరాలో బంధించి మరి పంచుకున్నారు. విమానంలో ప్రత్యేక ప్రకటన ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకంటూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఆయన శుభోధయం, లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేసి..మీ ఫైట్ డెక్ నుంచి మీ కెప్టెన్.. ఐయామ్ కెప్టెన్ అజమ్ అల్లి, అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పైలట్ జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయంటూ వాటిని వివరిస్తాడు. ఒక పైలట్‌కి ఎప్పటికీ మర్చిపోలేని మూడు ప్రయాణాలు ఉంటాయని పేర్కొన్నాడు. వాటిలో మొదటిది సోలో ఫ్లైట్ అని, దాదాపు 24 సంవత్సరాల క్రితం భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఉన్నప్పుడు తనకు ఎదురైన జర్నీ అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. రెండో ముఖ్యమైన ఘట్టం పదవీ విరమణకు ముందు చేసే చివరి విమానం ప్రయాణం. అయితే ఆ మైలురాయి తనకు ఇంకా దాదాపు రెండు దశాబ్దాల దూరంలో ఉందని అన్నారు. అన్నింట్లకంటే మూడో ఘట్టం అన్నింటికన్నా ప్రత్యేకమైనదంటూ ఇలా చెప్పారు. మూడోది బహుశా ఇది అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విమాన ప్రయాణం..ఎందుకుంటే కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం లభించడం. ఈ రోజు నాకు అలాంటి రోజే ఎదురైంది. నా భార్య, పిల్లలు, ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే..విమానంలోని ప్రయాణికులు చప్పట్లు కొడుతూ, చిరునవ్వులతో స్పందన తెలిపారు. కెప్టెన్ అల్లి ఈ వీడియోకి "ఒక పైలట్ ఎప్పటికీ మరచిపోలేని మూడు విమాన ప్రయాణాలు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Fishbed Motorist (@azam_ally) (చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!) -
పేరుగొప్ప దేశాల కన్నా. పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలే మిన్న..
ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో విదేశీ విద్యా ప్రాధాన్యతల విషయంలో భారతదేశపు విద్యార్థుల ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ , సింగపూర్, న్యూజిలాండ్ దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారతీయులు మొగ్గు చూపడం పెరుగుతోంది.అమెరికా, కెనడా, బ్రిటన్ (యూకే), ఆస్ట్రేలియా లాంటి ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు, ముఖ్యంగా స్టెమ్ (ఎస్‌టిఇఎమ్) కోర్సుల కోసం అమెరికాకు ఇప్పటికీ అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ.. విద్యార్థులు తమ ఎంపికలను చురుకుగా విస్త్రుతం చేసుకుంటున్నారు. విద్యకయ్యే మొత్తం ఖర్చు, విద్యాసంస్థల నాణ్యత, వీసా నిబంధనలు, ఇంటర్న్‌షిప్ ఉపాధి అవకాశాలు, అలాగే విద్యార్థుల భద్రత వంటి అంశాలు వారి వారి నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.పెట్టుబడిపై రాబడికే పెద్ద పీట...‘నేటి భారతీయ విద్యార్థులు విదేశీ విద్య విషయంలో మరింత ఆచరణాత్మకంగా ’పెట్టుబడిపై రాబడి ఆధారిత విధానంతో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ (ఎస్‌టిఇఎమ్) ప్రోగ్రామ్‌ల కోసం స్పెయిన్, జర్మనీ న్యూజిలాండ్ వంటి దేశాలకు ఇటీవల బలమైన డిమాండ్ కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చు, స్పష్టమైన వీసా నిబంధనలు, చదువు–ఉపాధికి మధ్య మెరుగైన సమన్వయం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం,‘ అని ఆక్సిలో ఫిన్ సర్వ్ ఓవర్సీస్ లోన్ సీబీవో శ్వేతాగురు విశ్లేషించారు. భారతీయ విద్యార్ధుల సంఖ్యకు సంబంధించి సాంప్రదాయేతర యూరోపియన్ దేశాలు, 2023 నుంచి 2025 మధ్య బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇదే ధోరణి 2026లో కూడా కొనసాగుతుందని విదేశీ విద్యా మార్కెట్ నిపుణులు అంటున్నారు.భారతీయ విద్యార్థులు తమ మొదటి ఎంపికగా ఈ కొత్త దేశాల వైపు మొగ్గుచూపుతుండడానికి కారణం..‘ సంప్రదాయంగా పేరొందిన దేశాలతో పోలిస్తే.‘కొన్ని దేశాలు పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ కోర్సులను దాదాపు సగం ఖర్చుతోనే అందిస్తున్నాయి. అంతేకాకుండా, వీసా సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు త్వరగా పెట్టుబడిపై రాబడి కూడా లభిస్తుంది‘ అని శ్వేతా గురు వివరించారు. విదేశీ విద్య రంగంలో వస్తున్న ఈ మార్పులు.. విద్యార్థుల పరిణతి చెందిన, పరిశోధనాత్మక నిర్ణయాలను సూచిస్తున్నాయి. భారతీయ విద్యార్థులలో నవతరం ఇప్పుడు ఈ కొత్త దేశాలను కేవలం ’ప్రత్యామ్నాయంగా’ కాకుండా తమ వ్యూహాత్మక ’మొదటి ఎంపికగా’ పరిగణిస్తోంది.మార్పును సూచిస్తున్న కొన్ని గణాంకాలు..స్పెయిన్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): 2023లో 865గా ఉన్న భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 2025 నాటికి 1,192కి పెరిగాయి. ఇది రెండేళ్ల వ్యవధిలో 17 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. అందుబాటులో ఉండే ట్యూషన్ ఫీజులు, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సుల సంఖ్య పెరుగుతుండటంతో... బిజినెస్, డేటా అనలిటిక్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ పాలసీ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో వృద్ధి కనిపిస్తోంది.పోర్చుగల్– లిథువేనియా (ఉన్నత విద్య కోసం మాత్రమే): పోర్చుగల్‌లో 2023లో 980 మంది మన విద్యార్థులు చేరగా, 2025 నాటికి ఆ సంఖ్య 1,350కి పెరిగింది. ఇదే సమయంలో లిథువేనియాలో ప్రవేశాలు 1,120 నుంచి 1,557 కు పెరిగాయి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ అప్లైడ్ ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా ఈ దేశాలు భారతీయ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.ఇటలీ , నెదర్లాండ్స్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): ఇటలీలో 2023లో 4,145గా ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 5,196కి పెరిగింది. డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులకు ఈ దేశం ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మరోవైపు, స్టెమ్ ఏఐ,, ఫిన్ టెక్, సస్టైనబిలిటీ (సుస్థిరత) ఆధారిత పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. నెదర్లాండ్స్‌లో అడ్మిషన్లు 2,871 నుంచి 3,512 కు పెరిగాయి.జర్మనీ (ఉన్నత విద్య, పీజీ – స్టెమ్ కోర్సులకు): ఇంగ్లీష్ మాతృభాష గా లేని యూరోపియన్ దేశాలలో భారతీయ పీజీ స్టెమ్ విద్యార్థులకు జర్మనీ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ లేదా పూర్తిగా ఉచిత ట్యూషన్ ఫీజు, బలమైన పరిశోధనా విధానం, పరిశ్రమలతో అనుసంధానం ఇందుకు ప్రధాన కారణాలు. ఇంజనీరింగ్, ఆటోమోటివ్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్ అప్లైడ్ సైన్సెస్ ప్రోగ్రామ్‌లను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇక్కడ వేగంగా పెరుగుతోంది.సింగపూర్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): సింగపూర్‌లో భారతీయ ఉన్నత విద్యా ప్రవేశాలు 2023లో 2,850 నుంచి 2025లో 3,250కి పెరిగాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ ఆధారిత ప్రోగ్రామ్‌లకు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. తక్కువ కాలవ్యవధి గల కోర్సులు, గ్లోబల్ ర్యాంకింగ్ ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమలతో బలమైన అనుసంధానం, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చదువు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక కోర్సుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. -
భర్తను శ్మశానవాటికలో వదిలేసిన భార్య
జగిత్యాల క్రైం: అనారోగ్యంతో ఇంటిపెద్ద మంచానపడగా.. అతడు బతికుండగానే శ్మశానవాటికలో వది లేసిన దీనగాథ పలువురిని కన్నీరు పెట్టించింది. పోషణ భారమవుతోందని సొంతింటి వారే శ్మశానవాటిక లో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాం«దీనగర్‌కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ది నిరుపేద కుటుంబం. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీధర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి మూడు నెలల కిందటే అనారోగ్యం బారిన పడి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దీంతో భార్య కిరాణం షాపులో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లతో పాటు భర్తను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీధర్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ శివారులోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు. శ్మశానవాటికలో ఒంటరిగా ఉన్న శ్రీధర్‌ను గమనించిన స్థానిక కౌన్సిలర్ భర్త రాము 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. కనికరం లేకుండా ప్రాణం ఉండగానే శ్మశానవాటికలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో శ్రీధర్‌ను కుటుంబ సభ్యులే పోషించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)
-
ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్‌ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి
పశ్చిమాసియా యుద్దంలో మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ లెబనీస్ ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ కమల్ తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం ప్రస్తుతం విషమంగా ఉంది.ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్‌పై దాడులు చేస్తూనే మరోవైపు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. హిజ్బుల్లా స్థావరాలే లక్షంగా పెద్దఎత్తున మిసైల్స్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్ ఆ దేశంలోకి చొచ్చుకొని కంబాట్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. ఈ దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని సాధారణ ప్రజలు సైతం దాడులలో పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ భర్త మెుహమ్మద్ షెబాద్, ఆమె చిన్న కుమార్తె తాలిన్ మరణించారు. అంతేకాకుండా ఈ అటాక్‌లో నటాలీ సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బీరూట్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆశ్రయం కోల్పోయిన అనేక కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మెుత్తంగా ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. -
రైల్లో రీల్స్‌తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్‌కు కాల్ చేస్తే...!
రైలు ప్రయాణం అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు, ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్‌కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా చేరింది. రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో "రీల్ స్టూడియో"గా మార్చింది. కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారు. వ్యక్తి తన తలపై రైల్వే బెడ్‌షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్‌లైన్‌కు (139)ను సంప్రదించారు. దీంతో రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్‌లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. View this post on Instagram A post shared by Manmohan Verma (@bioeducator_manmohan) ‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ, రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్‌లో చెప్పారు. నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు. రైళ్లలో పుట్టిన రోజు జరుపుకోవడం, బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం తనకూ ఎదురైందంని ఒక యూజర్ పేర్కొన్నారు.ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్) -
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
-
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్‌ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్‌కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్‌తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
భార్య, పిల్లలను హత్తుకొని ఎమోషనలైన కేజ్రీవాల్
-
థాయ్‌ల్యాండ్ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఇద్దరి మధ్య 16 ఏళ్ల గ్యాప్.. రష్మిక చెల్లి గురించి తెలుసా?
హీరోయిన్ రష్మిక ఎట్టకేలకు హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ రోజు సాయంత్రం రష్మికకు చెందిన కొడవ పద్ధతిలోనూ వివాహం జరగనుంది. సరే ఈ విషయాలు కాసేపు పక్కనబెడితే విజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ రష్మిక విషయానికొస్తే ఈమె కుటుంబం గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా రష్మిక చిట్టి చెల్లెలు ఎవరు? ఈమెకు ఆమెకు 16 ఏళ్ల గ్యాప్ అని తెలుసా?రష్మిక విషయానికొస్తే.. కర్ణాటకలోని విరాజీపేటలో 1995లో పుట్టింది. తండ్రి మదన్‌కి స్థానికంగా ఓ కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. తల్లి సుమన్ హౌస్ వైఫ్. రష్మికతో పాటు వీళ్లకు మరో కూతురు కూడా ఉంది. పేరు షిమన్. ఈ పాపకు ఇప్పుడు 14 ఏళ్లు. అంటే రష్మిక కంటే 16 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తోంది. ఇంతలా వయసు వ్యత్యాసం వల్ల షిమన్‌ని చెల్లిలా కంటే కూతురిలా చూసుకుంటున్నాని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: #Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక)రష్మిక కాస్త పెద్దయ్యాక షిమన్ పుట్టింది. దీంతో తన చిట్టి చెల్లిల్ని ఎంతో గారాబంగా చూసుకోవాలని రష్మిక అనుకుంది. కానీ నటిగా మారి వరస సినిమాలు చేయడం వల్ల చెల్లితో గడపడమే రష్మికకు చాలా కష్టమైపోయింది. షిమన్‌ని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని రష్మిక బయటపెట్టింది కూడా. ఇండస్ట్రీలోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా ఆమెతో(చెల్లి) ఉండలేకపోతున్నాను. పెరిగి పెద్దవడాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నా అంత ఎత్తు ఎదిగిపోయింది. ఒక్కోసారి తనని కలవలేకపోతున్నానని ఏడ్చేసేదాన్ని అని రష్మిక చెప్పుకొచ్చింది.రష్మిక ఇంతలా పాన్ ఇండియా స్టారడమ్ అనుభవిస్తున్నప్పటికీ.. తన కుటుంబాన్ని ఎప్పుడు పెద్దగా మీడియా కంటపడనివ్వలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా షిమన్‌ని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి షిమన్.. మైసూరులో ఉండగా.. రష్మిక మాత్రం వరస సినిమాలతో హైదరాబాద్, ముంబైకి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇంట్లో వాలిపోయి చెల్లితో సరదాగా ఆడుకుంటుంది. ఆ ఫొటోల్ని కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!) -
అతని కోసం రూ. 8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!
జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్(Jharkhand Air Ambulance Crash) లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాంచీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో రోగి సంజయ్ కుమార్ షా (41), అతని భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, నర్సు సచిన్ కుమార్ మిశ్రా , ఇద్దరు పైలట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్దీప్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అత్యంత విషాదకరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి.సంజయ్ గత సోమవారం, జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలోని చాంద్వాలోని తన హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, వైద్యులు అతన్ని ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రికి పంపించాలనుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతోఅతని కుటుంబం బంధువులను సంప్రదించి ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 7.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. క్షణాల్లో అంతా అయిపోయిందిరాంచీ విమానాశ్రయంలో సంజయ్‌ను అలా పంపించి ఇంటికి వచ్చారో లేదో ప్రమాదం జరిగిందని, అంతా ఒక్క క్షణంలో ముగిసిపోయిందంటూ సంజయ్ అన్నయ్య విజయ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‌తోపాటు, అతని భార్య అర్చన కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలను అనాథలుగా మారారని కుటుంబం వాపోయింది. రాంచీలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే, సంజయ్‌ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదనీ,అతనికి సరైన చికిత్స అందించి ఉంటే, విలువైన ప్రాణాలను కాపాడగలిగేవారమని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.#WATCH | Chatra, Jharkhand | On air ambulance crash, father of deceased pilot Vikas Bhagat, DS Bhagat says," My son saved many lives by piloting an air ambulance, but today he has lost his life. He had spoken to his mother before the incident...I saw my only son's mortal… pic.twitter.com/8mq5ffk5wv— ANI (@ANI) February 24, 2026 మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. తన కొడుకును డాక్టర్‌గా చేయడానికి ఉన్న భూమ నంతా అమ్మేశానని, ఇపుడు అతనే లేకుండా పోయాడని భావోద్వేగానికి లోనయ్యారు. అతని ఏడేళ్ల కొడుకు ఉన్నాడు... అతను ప్రతిభావంతుడు మరియు ఒడిశాలోని కటక్ నుండి MBBS పూర్తి చేసి రాంచీలోని సదర్ హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారని గుప్తా తండ్రి బజరంగీ ప్రసాద్ తెలిపారు.VIDEO | Jharkhand air ambulance crash: A relative of one of the deceased, says, "My younger brother, Sachin Kumar Mishra, was everything to me. He was like my own child. He was my whole life and my entire world. Since my father is no more, he was my only support. He worked as a… pic.twitter.com/oamIF8qdu2— Press Trust of India (@PTI_News) February 24, 2026ఎంతోమంది ప్రాణాలు కాపాడిన పైలట్ దుర్మరణంఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో మరణించిన పైలట్ వికాస్ భగత్ తండ్రి డీఎస్ భగత్ తన కొడుకు మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ అంబులెన్స్ నడపడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడిని తన కొడుకు ఈ రోజు అతను ప్రాణాలు కోల్పోయాడని వాపోయారు. సంఘటనకు ముందు తన తల్లితో మాట్లాడాడు అంటూ తన ఏకైక కుమారుడి మరణాన్ని తలుచుకుని కుమిలిపోయారు. -
పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పెళ్లిరోజున తిరుమలలో యాంకర్ లాస్య దంపతులు (ఫోటోలు)
-
అంబానీ నివాసంలో జోర్డాన్ రాణి (ఫొటోలు)
-
సన్నిధి గొల్ల కుటుంబానికి కూటమి నేతల వేధింపులు..
-
కాలమే సమాధానం చెప్తుంది.. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన బొత్స
-
అంబటి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ
-
రైల్లో శాండ్విచ్...నెటిజన్లరియాక్షన్స్ వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే 24-28 గంటలకు మించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు సరిపడా భోజనాలు చేసుకుని వెంట తీసుకెళతారు. తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్విచ్లు తయారు చేసుకున్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దివ్య జైన్ అనే ఇన్స్ట గ్రామ్ యూజర్ ‘రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం’ అంటూ చేసిన పోస్ట్ ప్రకారం కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్విచ్లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్‌పై చాకుతోసాస్, చట్నీ పూస్తూ ఎంతో జాయ్‌ఫుల్‌గా బ్రెడ్ శాండ్విచ్లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. Railways should ban such people, they are menace in public places pic.twitter.com/m5F0XBcEfD— Ritik (@ThenNowForeve) February 8, 2026 fy"> నెటిజన్ల స్పందన ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. రైల్వేస్‌లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియోఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా శాండ్విచ్లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు. ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం -
విషాదం.. ముగ్గురు పిల్లలని చంపి ఆపై వారు మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాదం జరిగింది. తీవ్ర మనస్థాపంతో ఒక పండంటి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుపచ్చలారని తమ ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపిన అనంతరం భార్యభర్తలిద్దరూ తనవు చాలించారు.మధురలో నివసించే మనిష్ కుమార్ అనే వ్యక్తికి 2018లో వివాహమయ్యింది. వారికి హానీ, ప్రియాంశ్, ప్రీతిక్ అనే ముగ్గురు పిల్లలు అయితే ఏం జరిగిందే తెలియదు కాని కుటుంబసభ్యలు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ముగ్గురిని గొంతు నులిమి హతమార్చిన అనంతరం భార్యభర్తలు తనువు చాలించారు.మనిష్ విద్యుదాఘాతంతో మరణించగా ఆయన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే వారి ఇంటి వద్ద సూసైడ్‌కు సంబంధించిన ఒక వీడియో లభించింది. అందులో తమ ఇష్టపూర్వకంగానే తాము చావాలనుకుంటున్నారని ఇందులో ఎవరి తప్పుగానీ బలవంతం గానీ లేదన్నారు. పోలీసులు సైతం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు.అయితే తాను ఇటీవల ఒక స్థలాన్ని రూ.12 లక్షలకు అమ్మానని దానికి ఎటువంటి ఇబ్బందులు జరగలేదని వీడియోలో పేర్కొన్నారు.అయితే పిల్లలు ఆడుకోవడానికి బయిటకి రాకపోగా అనుమానం చెందిన గ్రామస్థులు తలుపులు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో గోడలు బద్దలు గొట్టి లోపలికి వెళ్లగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆసమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేప్టటారు. -
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
-
నా భార్త సంసారానికి పనికిరాడు.. నేనెలా రుజువు చేయాలి
మాకు పెళ్లి అయ్యి ఏడాది అవుతోంది. తొలిరాత్రి మేము కలవడానికి నా భర్త నన్ను కొంత సమయం కావాలి అని అడిగారు. నేను సరే అన్నాను. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకు నేను తనను సంతృప్తి పరచడం లేదు అని నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి΄ పోమ్మని చెప్పాడు. బంధుమిత్రులందరి దగ్గరా అలాంటి దుష్ప్రచారమే చేస్తున్నాడు. అయితే అది తప్పు. అతను అసలు ఒకసారి కూడా కనీసం నాకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అతను సంసారానికి పనికిరాడు అని చెప్పి కోర్టులో కేసు వేశాను. రుజువు చేయండి అంటున్నారు. నేనెలా రుజువు చేస్తాను? – సరళ, విజయవాడపెళ్ళైన తర్వాత భర్త భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండకపోవటం లేదా లైంగికంగా తగిన విధంగా లేకపోవటం వలన చాలా వివాహ బంధాలు విడాకులతో అంతమవుతున్నాయి. భార్య అయినా భర్త అయినా లైంగిక సంతృప్తి ఇవ్వకపోవడం మానసిక క్షోభకి గురిచేస్తుందని కోర్టులు చాలా సందర్భాలలో చెప్పాయి. లైంగిక సంబంధం లేని భర్తతో కలిసి కొంతకాలం ఉన్న తర్వాత, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే స్త్రీలు ‘ఇంపొటెన్సీ’ని (నపుంసకుడు / లైంగిక శక్తిహీనత/ సంసారానికి పనికిరాడు అని) కారణంగా చూపి కేసులు వేస్తున్నారు. ఇలా వేసే కేసులలో దాదాపుగా స్త్రీలకు వ్యతిరేకం అయ్యే దాఖలాలే ఎక్కువ.ఎందుకంటే భర్త ఇంపొటెన్సీని రుజువు చేయలేని పక్షంలో, భర్త లైంగిక సమర్థతపై అబద్ధపు ప్రచారం చేశారు అని, సమాజంలో భర్త పరువును తీశారని.. ఇవన్నీ కూడా భాగస్వామిపై క్రూరమైన చర్యలే అని కోర్టు భావించే ఆస్కారం ఉంది. తనని నపుంసకుడు అని అందరిలో ప్రచారం చేస్తోందనే కారణం చూపి–దానిని రుజువు చేస్తే, విడాకులు అడిగే భర్తలకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఎందుకంటే, పురుషులలో తరచుగా వుండే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, స్తంభన సమస్యలని చాలా సందర్భాలలో నపుంసకత్వం అని చాలామంది, ముఖ్యంగా సరైన అవగాహన లేని స్త్రీలు భావిస్తుంటారు. అదే కోర్టులో కూడా చెప్పి, చివరికి రుజువు చేయలేక నష్టపోతారు. అందుకే, అలాంటి అంశం ఏదైనా ఉంటే, విడాకుల దరఖాస్తు వేసేముందు నిపుణులతో వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మగవారు సైతం వారికి ఉండే సమస్యలు దాచి ఉంచి పెళ్ళి చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో అయితే తాము సంసారానికి పనికిరామని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లేదా తమకి స్త్రీలపై ఎటువంటి ఆకర్షణా లేదు అని తెలిసి కూడా పెళ్లికి సిద్ధమవుతారు. కేవలం తమని తాము మగాడిలా చూపించుకోవాలి అనే తపనతో స్త్రీ హక్కులను, జీవితాన్ని పట్టించుకోకుండా కావాలని పెళ్ళి చేసుకుని, తర్వాత ఏదో ఒక కారణం చూపి విడిపోవాలని పథకం ప్రకారం చేసుకునే పెళ్ళిళ్ళు కూడా చాలానే వున్నాయి. అయితే, ఒకవేళ తన భర్త సంసారానికి పనికిరాడు అని రుజువు చేయగలిగితే మాత్రం, అన్ని రకాల పరిహారాలతో΄ాటు తగిన భరణం కూడా పొందవచ్చు. అంతేకాక క్రిమినల్ చేసు కూడా నిరూపించవచ్చు. విడాకులు తీసుకోవాలి అనుకునే స్త్రీలు అయినా పురుషులు అయినా, తన భాగస్వామి లైంగికతను తెలుసుకొని, సరైన కారణాలు, రుజువు చేయదగ్గ అంశాలను కోర్టుకు చూపగల్గితేనే సరైన ఉపశమనం దొరుకుతుంది. - శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, పూజిత
-
మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..
-
అంబటి కుటుంబానికి రోజా, భూమన పరామర్శ
-
'సేవా' కుటుంబం
కుటుంబం అంతా కలిసి పాల్గొనే సేవా కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వాన్ని చక్కగా రూపుదిద్దటమే కాకుండా, వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఒక మంచి పని కోసం కుటుంబం అంతా కలిసికట్టుగా శ్రమించటం వల్ల, పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవి తీపి జ్ఞాపకాలుగామిగిలిపోతాయని మనోవికాస నిపుణలు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతరులకు సహాయం చేయడంలోని గొప్పతనం, ఔన్నత్యం ‘వాలంటీరింగ్’ ద్వారా పిల్లలకు అర్థం అవుతుంది. దీనివల్ల వారిలో జాలి, దయ, కరుణ, ఓర్పు, కృతజ్ఞతా భావం వంటి మంచి గుణాలు ఏర్పడతాయి. మనం చేసే చిన్న సాయమైనా ఒకరి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు.ఆత్మ విశ్వాసం పెరుగుతుందితల్లిదండ్రులు పిల్లల్ని తరచూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవటానికి తీసుకెళ్లటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల పట్ల ప్రేమతో మెలుగుతారు. నలుగురితో కలిసి పని చేయటం నేర్చుకుంటారు. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను అలవరచుకుంటారు. కుటుంబ బంధం బలపడుతుందిఇంట్లో అందరూ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, రోజూవారీ పనుల ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఫోన్లకు, టీవీలకు లేదా ఇంటి పనులకే పరిమితం అయిపోకుండా.. ఒక మంచి లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేసినట్లవుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరుస్తుంది.ఎలాంటి సేవల్ని ఎంచుకోవాలి?పిల్లల వయసును బట్టి, వారికి ఆసక్తి ఉన్న పనులు ఎంచుకోవడం ముఖ్యం. చిన్న పిల్లలైతే చేతులతో చేసే చిన్న చిన్న పనులను ఇష్టపడతారు, అదే కొంచెం పెద్ద పిల్లలైతే బాధ్యత తీసుకునే పనులను లేదా నాయకత్వం వహించే పనులకు చొరవ చూపుతారు. ఏమైనా, అది వారికి సరదాగా అనిపించాలి. ఆ పని తప్పక చేయాలనే ఉత్సాహం వారిలో కలగాలి. పనుల ఎంపికకు ఇవే గీటురాళ్లు. నెలకు ఒక్కసారి.. కుదరకపోతే రెండునెలలకు ఒక్కసారైనా వాలంటీరింగ్ చేసినా చాలు, అది పిల్లల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. నివేదికలు..అధ్యయనాలు‘పాయింట్స్ ఆఫ్ లైట్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా ‘ఫ్యామిలీ వాలంటీర్ డే’ ని నిర్వహిస్తుంది. కుటుంబంతో కలిసి సేవ చేయడం వల్ల పిల్లల్లో సహానుభూతి పెరుగుతుందని, సామాజిక బాధ్యత అలవడుతుందని వారి అధ్యయనాలు చెబుతున్నాయి.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సర్వే ప్రకారం, స్వచ్ఛంద సేవల్లో పాల్గొనే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు 18 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటున్నాయి. ఇండియానా యూనివర్సిటీ జరిపిన సర్వేలో టీనేజర్లు, బాలలు సేవా కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా సమాజం తీరును గ్రహిస్తున్నారు. సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. చిన్నప్పటి నుండి సేవ చేసే అలవాటు ఉన్న పిల్లలు, పెద్దయ్యాక కూడా సమాజానికి సేవ చేసే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ‘కార్పొరేషన్ ఫర్ నేషనల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్’ గణాంకాలు చెబుతున్నాయి. -
ఫ్యామిలీతో వండర్ పార్క్‌లో లహరి (ఫోటోలు)
-
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)
-
అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
దుబాయ్ బిలియనీర్ బంపర్ ఆఫర్..! పెళ్లికి రూ. 12 లక్షలు, పిల్లలు కంటే..
దుబాయ్ షేక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే షాకవ్వుతారు. జస్ట్ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్ మీడియా ఎక్స్‌లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు దుబాయ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్ ఉద్యోగులకు ఈ ఆఫర్ అందిస్తూ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు. కాగా, ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్‌గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్‌గా, అలాగే UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.గతేడాది అక్టోబర్‌లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్ ఆఫర్ ఇచ్చారు.تزوّجتُ وأنا في عمر 17 عاماً، وأسّستُ مع زوجتي عائلة جميلة، أحمدُ الله على هذه النعمة في كل لحظة. منذ تلك اللحظة، أصبحت الأسرة بالنسبة لي دائماً ملاذ راحة، ومصدر سكينة، ونعمة حقيقية أستمدّ منها القوة والسعادة.ومن هذا الإيمان، أودّ أن أُشجّع شبابنا على تأسيس أسر متماسكة تكون… pic.twitter.com/ououH8gqkj— Khalaf Ahmad Al Habtoor (@KhalafAlHabtoor) January 24, 2026 (చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
సాక్షి, మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాపం.. ఏం కష్టం వచ్చిందో ఏమో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మీనక మధు (35), ఆయన భార్య సత్యవతి (30), వారి కుమార్తె ఆయోష (6), నాలుగు నెలల పసికందు మోషలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు వారిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారుల అమాయక ముఖాలు, తల్లిదండ్రుల నిర్జీవ దేహాలు ఒకే ఇంట్లో కనిపించడంతో స్థానికులు కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వనజ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఐఐటీలో మరో విషాదం.. ఆ ఘటన మరువక ముందే..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గల ఒక భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి 25 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఇది రెండో ఆత్మహత్య కావడం విద్యార్థులను, అధ్యాపకులను ఆందోళనకు గురిచేస్తోంది.ఎర్త్ సైన్సెస్ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న రామ్‌స్వరూప్ ఇష్రామ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రామ్‌స్వరూప్ ఇష్రామ్, ఐఐటీ క్యాంపస్‌లోని న్యూ ఎస్బిఆర్ఏ రెసిడెన్షియల్ బ్లాక్‌లో ఉన్న ఏఏ-21 అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య మంజు, మూడేళ్ల కుమార్తెతో అతనితోపాటు ఉంటున్నారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో మృతుడు గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. గతంలో ఆయన పలుమార్లు కౌన్సెలింగ్ కూడా తీసుకున్నారని డీసీపీ ఎస్.ఎం. ఖాసిం అబిది వెల్లడించారు.ఈ ఘటనపై విచారణలో భాగంగా మృతుని భార్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఐఐటీ కాన్పూర్‌లో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకుముందు 2025, డిసెంబర్ 29న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జై సింగ్ మీనా తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మీనా, బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ-బ్లాక్ హాస్టల్లోని గది నంబర్ 148లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మీనా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: మందులకు ఏఐ సాయం.. ‘ఎయిమ్స్’ తీవ్ర హెచ్చరిక -
ప్రముఖ ఆలయంలో బన్నీ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్‌తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
-
కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
చచ్చిపోయాడనుకుంటే..30 ఏళ్లకు తిరిగొచ్చాడు!
ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన షరీఫ్ ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది. దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్ఐఆర్ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు. షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారంగత 15, 20 ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు. -
ఘోరం.. డోర్ లాక్‌చేసి ఐదు గృహాలకు నిప్పంటించారు..!
బంగ్లాదేశ్ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్‌గా జరుగుతున్న దాడులు భారత్‌ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్‌లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్‌పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.🚨 BangladeshAn attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025 అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్‌లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు పేర్కొన్నారు. -
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ జరిగింది..రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
బంగ్లాలో మరో ఘాతుకం.. హిందూ కుటుంబంపై దాడి
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్‌లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్‌లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్‌లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్‌తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్‌గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్‌కు కలర్‌ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్‌ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్‌ఫోన్‌ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్‌లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్‌ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్‌తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
-
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్‌కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్‌లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు -
వదిన, మరిది మధ్య పంచాయతీ పోరు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 11న జరగనున్న పంచా యతీ ఎన్నికల్లో వదిన, మరిది మ ధ్య రసవత్తర పోరు సాగుతోంది. హాజీపుర్‌కు చెందిన మాధవరపు రామారావు భార్య శ్రీలత బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా రామారావు సోదరుడు వెంకటరమణారావు బీజేపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.బరిలో తోడికోడళ్లు...మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సర్పంచ్‌గా నాడు భర్త.. నేడు భార్యదండేపల్లి: 2019 పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిడిపల్లి సర్పంచ్‌గా ఎల్తపు శ్రీనివాస్ గెలుపొందాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో శ్రీనివాస్ తన భార్య ఎల్తపు వైష్ణవిని బరిలో నిలిపాడు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ రోజున సమీప ప్రత్యర్థి గుర్రాల మాధవి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైష్ణవి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. -
ఆందోళనతో కంటికి కునుకే కరువైంది!
నా వయస్సు 72 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైరై దాదాపు 14 ఏళ్లయింది. నేను చాలా సంవత్సరాల నుండి ఒక సమస్యతో బాధపడుతున్నాను. అదేమిటంటే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఎప్పుడూ మనసులో గందరగోళంగా ఉంటుంది. ఈ ఆలోచన వలన చేసే పనిలో ధ్యాస ఉండదు. రాత్రి పడుకున్న తర్వాత విపరీతంగా కలలు వస్తుంటాయి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా ఉండడం లేదు. ఈ సమస్య ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు కానీ, రిటైర్మెంట్ తర్వాత నన్ను మరింతగా బాధిస్తోంది. నాకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూడగలరు. –కె.ఎల్.వి ప్రసాద్, హైదరాబాద్మీరు రాసిన లక్షణాలను బట్టి మీకున్న సమస్యను ‘యాంక్సైటీ డిజార్డర్‘ (నిరంతర ఆందోళన రుగ్మత) అంటారు. యాంగై్జటీ లేదా భయం అనేవి ప్రమాదాలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఏర్పరచిన, ఒక ర క్షణ వ్యవస్థ. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మెదడు రసాయనాల్లో మార్పులు, చిన్న వయసులో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ఈ రక్షణ వ్యవస్థలో లోపం ఏర్పడుతుంది. ఆ కారణంగానే మెదడు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. రోజూవారి వ్యవహారాలు, చిన్నచిన్న సమస్యలని కూడా మెదడు భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు. చేసే పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ కంగారు కంగారుగా భయంగా ఉంటుంది. రాత్రిపూట కూడా మెదడు ఇలా ఆతిగా ఆలోచనలు చేయడం వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది యుక్తవయసులోనే మొదలైతే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. తర్వాతి కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీయొచ్చు. దీనికి ఆధునిక వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మందులు, చికిత్స పద్ధతులను మానసిక వైద్యుల సూచన మేరకు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, ఎక్స్΄ోజర్ థెరపీ వంటి కౌన్సెలింగ్ పద్దతుల ద్వారా క్లినికల్ సైకాలజిస్టులు ఈ సమస్య తీవ్రతని తగ్గించగలరు. మీరు దగ్గరలోని మానసిక వైద్యుని కలిసి ఖచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
బీచ్‌లో కుమారుడితో ఎంజాయ్ చేస్తోన్న అగ్ర నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
ఫ్యామిలీ ట్రిప్ కోసం కేరళకు వెళ్తే చివరికి..
-
ఫ్యామిలీతో కరీబియన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న లయ (ఫొటోలు)
-
హ్యాపీ మూమెంట్స్.. హీరో అజిత్ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
సూర్యాపేట జిల్లా: మునగాల మండలం బరాఖత్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్‌గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్‌రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్‌రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్‌గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్‌గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్‌రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలపై ఉపేందర్‌రెడ్డి దాడి చేశాడు. అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
Hyd: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబం మొత్తం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగ్ అంబర్‌పేటలోని రామకృష్ణా నగర్లో చోటు చేసుకుంది. దీనిపై స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మీలతో పాటు వారి కూతురు శ్రావ్యగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం రాంనగర్లో నివాసం ఉంటున్న ఆ దంపతులు పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం రామకృష్ణా నగర్‌కు మారింది. వారు అక్కడ అద్దెకు ఉంటున్నారు. ఢ నమ్మకాలే వారి ఆత్మహత్య కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు సమాచారం. -
శివ మందిరాన్ని ప్రారంభించిన అంబానీ ఫ్యామిలీ
గిర్‌లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం శివాలయాన్ని ప్రారంభించారు. భక్తి, ప్రపత్తులతో పవిత్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. శ్లోక పఠనంతో పరమేశ్వరుని ఆరాధించారు. అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల ముకేశ్ అంబానీ పలు ఆలయాలకు భారీ విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ అక్కడ అత్యాధిక వంటశాల నిర్మించనున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆయన రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా శ్రీనాథ్జీ మందిరం, కేరళలోని గురువాయూర్ ఆలయాలను సందర్శించారు.నాథ్ ద్వారా శ్రీనాథ్జీ మందిరంలో నాథ్ద్వారాలో అంబానీ భగవాన్ శ్రీనాథ్ జీ భోగ్ హారతి దర్శనానికి హాజరై గురు శ్రీ విశాల్ బావా సాహెబ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అక్కడ యాత్రికులకు, సీనియర్ సిటిజన్ల సేవా సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆలయానికి రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అంబానీ నెయ్యి దీపాలు వెలిగించి, ఆలయ ధ్వజ స్తంభం వద్ద నైవేద్యాలు సమర్పించారు. దేవస్వం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మొదటి విడతగా గురువాయూర్ దేవస్వంకు రూ .15 కోట్ల చెక్కును అందజేశారు. -
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్‌కి భార్య సలహా
బిగ్‌బాస్ షోలో మిగతా అన్ని వారాలు ఎలా ఉన్నాసరే ఫ్యామిలీ వీక్ అంటే మాత్రం అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ వారమంతా అందరూ ఒక్కటైపోతారు. ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అంతకంటే ముందు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. దివ్య, పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయ్యారు. రీతూ కూడా అయ్యింది కానీ కెప్టెన్ తనూజ వల్ల ఆమె సేవ్ అయిపోయింది.ఈసారి ఫ్యామిలీ వీక్ నేరుగా మొదలుపెట్టేయకుండా బిగ్‌బాస్.. చిక్కుముడి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓ ఫ్రేమ్‌కి గజిబిజిగా కట్టున్న తాడుని విప్పి, ఒంటికి చుట్టుకుని.. చివరలో దాన్ని విప్పి మాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైమ్ కార్డ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాంబ్ ఉన్న కారణంగా సంజనకు ఈసారి ఛాన్స్ లేదు. దీంతో ఆమెని ఈ టాస్క్ కోసం సంచాలక్‌గా పెట్టారు. కెప్టెన్ కావడంతో తనూజకు నేరుగా టైమ్ తీసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇవ్వడంతో 60 నిమిషాల టైమ్ కార్డ్ తీసుకుంది. తర్వాత పోటీ జరిగింది. ఇమ్మాన్యుయేల్ 45, పవన్ 30, కల్యాణ్ 20, దివ్య 20, సుమన్ 15, రీతూ 15, భరణి 15 నిమిషాల కార్డ్స్ తీసుకున్నారు.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)తొలుత సుమన్ శెట్టికి అవకాశమొచ్చింది. 16వ పెళ్లిరోజు అని చెప్పి భార్య లాస్య నుంచి లెటర్ వచ్చింది. అలానే ఓ స్పెషల్ కోట్ కూడా వచ్చింది. దీంతో సుమన్ రెడీ కాగానే.. భార్య లాస్య లోపలికి వచ్చింది. చాలారోజుల తర్వాత కలిసేసరికి సుమన్, భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చివరలో లాస్య.. 'టాప్-5లో ఉండాలి. గెలిస్తే ఇంకా హ్యాపీ. తనూజతో తగ్గించండి. హైప్లో ఉండేవాళ్లని దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు' అని చెప్పి వెళ్లిపోయింది.సుమన్ భార్య వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనూజ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చెల్లితో పాటు అక్క కూతురు శ్రేష్ఠ హౌస్‌లోకి వచ్చింది. చెల్లి పూజ లోపలికి రాగానే.. పెళ్లి కూతురు పూజ అని చెబుతూ హౌస్మేట్స్ అందరికీ తనూజ తన చెల్లిని పరిచయం చేసింది. తనే చెల్లి, కానీ నాకు అమ్మ లాంటిది అని కూడా అందరితో చెప్పింది. ఇద్దరూ సెపరేట్‌గా వెళ్లి మాట్లాడుకున్నారు. 'ఎక్కువగా బాధపడకు, ఏడవుకు. అను, అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా పెళ్లికి కొన్నిరోజులే ఉంది. నువ్వు గేమ్ ఆడేదంతా ఫెర్ఫెక్ట్గా ఉంది. నువ్వే చేస్తావో నాకు తెలీదు నువ్వే గెలవాలి. నా పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ కావాలి' అని పూజ, తనూజకి మంచి బూస్టప్ ఇచ్చింది. చివరికు పూజని పెళ్లి కూతురిని చేసి, ఆమెని హౌస్ నుంచి పంపించారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'రాధేశ్యామ్' దర్శకుడి ఇంట్లో విషాదం) -
కెన్యాలోనే అనసూయ ఫ్యామిలీ.. మరిన్ని జ్ఞాపకాలు (ఫొటోలు)
-
భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి
బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే 'ఫ్యామిలీ వీక్' వచ్చేసరికి హౌస్మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్‌లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్‌గా అడిగాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ')అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా) -
మక్కా యాత్రే చివరి ప్రయాణం..
ముషీరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం నగరవాసుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా వారి జీవిత ప్రయాణం ముగిసింది. విద్యానగర్ ఏడవ వీధి మార్క్స్ భవన్ పక్కన గల 1–9–295/11/ఏ/1 ఇంటి యజమాని ఎస్కే నసీరుద్దీన్ (70) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన రైల్వే ఉద్యోగి. భార్య అక్తర్ బేగం (60), ఆమెజాన్లో మేనేజర్‌గా పని చేసే రెండవ కుమారుడు సలావుద్దీన్ (40), భార్య ఫర్హానాతో పాటు వీరి ముగ్గురు పిల్లలు జైన్ (5), రిదా(6), షీజా(7) వెంట ఉన్నారు.అమెరికాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ భార్య సనా, ఆమె ముగ్గురు పిల్లలు హుజేర్, మెహరీష్, హుమేజాలు కూడా వీరికి తోడయ్యారు. అలాగే అప్పటికే వివాహమై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కూతురు అమీనాబేగం (మూసారాంబాగ్), ఆమె కుమార్తె అనీస్ (21), రెండవ కుమార్తె షబానా బేగం (హిమాయత్‌నగర్), ఆమె కుమారుడు జాఫర్, మూడవ కుమార్తె రిజ్వానా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు మరియన్, షాజహాన్..మొత్తం 18 మంది అల్ మక్కా ట్రావెల్స్ ద్వారా సౌదీ వెళ్లారు. అమెరికాలో నివసించే పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌తో పాటు ముగ్గురు కూతుళ్ల భర్తలు మాత్రం ఇళ్ల వద్ద ఉండిపోయారు.‘తల్లి’డిల్లిన వయో వృద్ధురాలునసీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మంది అగ్నికి ఆహుతి కాగా, ఆయన తల్లి రోషన్‌బీ, పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడు మాత్రమే మిగి లాడు. ఇతను గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య సనా, ముగ్గురు పిల్లలు మాత్రం విద్యానగర్‌లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. సిరాజుద్దీన్ తన సమీప బంధువులతో అమెరికా నుంచి మాట్లాడుతూ పెద్దపెట్టున రోదించాడు. నసీరుద్దీన తల్లి రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. కాగా 18 మందిలో 10 మంది చిన్నారులే ఉండడం స్థానికుల హృదయాన్ని కలచి వేసింది. వీరంతా ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. నసీరుద్దీన తల్లి 90 ఏళ్లు పైబడిన రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. తమ కుటుంబసభ్యులు తమ చివరి మజిలీని ముస్లింలకు పవిత్ర స్థలమైన మక్కాలోనే ముగించారు కాబట్టి వారి అంత్యక్రియలను కూడా అక్కడే నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, కాబట్టి 18 మంది అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని బంధువులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు వహీద్, మునీర్‌లతో పాటు మరో ఐదుగురు మక్కాకు వెళ్లేందుకు పాస్‌పోర్టులను హజ్ కమిటీకి అందజేశారు. మౌన సాక్షిగా మిగిలిన ఇల్లునసీరుద్దీన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 18 మంది మృతి చెందడంతో కనీసం ఆయన ఇంటి తలుపులు తెరిచే వారు కూడా లేకుండా పోయారు. సమీప బంధువులు వచ్చినా అక్కడ నిలబడి ఆ ఇంటి వైపు మౌనంగా చూస్తున్నారు తప్ప ఏమి చేయలేకపోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శవిషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లు నసీరుద్దీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగోల్‌లో అల్మారా దుకాణం నిర్వహించే అబ్దుల్ రషీద్ భార్య అమీనాబేగం, వారి కుమార్తె అనీస్ ఫాతిమా సౌదీలో మరణించడంతో మూసారాంబాగ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మొబైల్ చార్జర్‌ను ప్లగ్కే ఉంచుతున్నారా?
మొబైల్ చార్జర్‌ను కరెంట్ ప్లగ్లకే వేలాడేసి ఉంచడం.. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో కనిపించేదే. కొందరైతే స్విచ్ ఆన్‌లో ఉండగానే వాటిని అలా వదిలేస్తుంటారు. ఉరుకుల, పరుగుల జీవితమే అందుకు కారణమని సాకులు చెబుతుంటారు. అయితే ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయమేమీ కాదని అంటున్నారు నిపుణులు. సెల్‌ఫోన్ చార్జర్లను ఇలా కరెంట్ ఫ్లగులకు వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెంగా విద్యుత్ వినియోగం.. భారీ పరిమాణంలోనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే.. 👉ఫాంటమ్ పవర్ వినియోగం (Phantom Power): చార్జర్‌కి ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చిన్న మొత్తంలో విద్యుత్ (0.1–0.5 వాట్) వినియోగం జరుగుతుంది. దీన్ని ‘వాంపైర్ ఎనర్జీ’ అంటారు. దీన్ని ఇలాగే లెక్కస్తే రోజులు.. నెలలు.. సంవత్సరాలకు కొన్ని యూనిట్లు వృథా అవుతాయన్నమాట.👉చార్జర్ లైఫ్ తగ్గే అవకాశం.. నిరంతరం విద్యుత్ ప్రవాహంలో ఉండటం వల్ల చార్జర్‌లోని అంతర్గత భాగాలు మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలికంగా పనితీరు తగ్గుతుంది.👉ఇలా స్విచ్ బోర్డులకు, ఫ్లగ్గులకు చార్జర్లు వదిలేయడం సేఫ్ కూడా కాదు. కొన్నిసార్లు విద్యుత్‌తో అవి వేడెక్కే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాణ్యత లేని చార్జర్లతో. దీనివల్ల ఫోన్లు పాడైపోవడం, పేలిపోవడం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. 👉పర్యావరణంపై ప్రభావం.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలవాటు ఎంత మందికి ఉందో?. అంటే.. చాలా విద్యుత్ వృథా అవుతుందన్నమాట. కాబట్టి విద్యుత్ వినియోగం అనేది చిన్న మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా.. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు.పాటించాల్సినవి.. తడి చేతులతో చార్జర్లను ఫోన్‌కు కనెక్ట్ చేయకూడదుఫోన్ చార్జింగ్‌లో లేనప్పుడు చార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేయడం ఉత్తమంనాణ్యమైన చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా వేడి, విద్యుత్ వృథా వంటి సమస్యలు తగ్గుతాయి.మార్కెట్లలోకి రకరకాల చార్జర్లు(ఒరిజినల్ వెర్షన్) వస్తున్నాయి. స్మార్ట్ ప్లగ్‌లు వాడితే, ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ చేయవచ్చు:::సాక్షి, వెబ్డెస్క్ఇదీ చదవండి: పవర్ ఆఫ్‌లో ఉన్నా మీ ఇంట్లో ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? -
రూ.కోట్లు కరిగిస్తున్న ‘షుగర్’!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్ జబ్బు వస్తే వైద్య ఖర్చులకే ఆ కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..భారతదేశంలో డయాబెటిస్ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..డయాబెటిస్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్ ఫుడ్, షుగర్-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.సగటు వైద్య ఖర్చులుమధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది. -
Bihar Election: మొదటి నుంచి తేజస్వీ ఆధిక్యం
రఘోపూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ప్రతిపక్షాల మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబపు కంచుకోట అయిన రఘోపూర్ నుండి పోటీకి దిగారు. కౌంటింగ్ తొలి దశలో ఆయన ముందంజలో ఉన్నారు. వైశాలిలోని రాఘోపూర్ స్థానం ఫలితాల మొదటి రౌండ్ కౌంటింగ్‌లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ 4,463 ఓట్లు సాధించగా, బీజేపీకి చెందిన సతీష్ రాయ్ 3,570 ఓట్లు సాధించారు. ఆర్జేడీకి బలమైన కోట అయిన ఈ నియోజకవర్గంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం 893 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇది ప్రజా విజయం అని, మార్పు తప్పక వస్తుందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రఘోపూర్ ఆర్జేడీకి బలమైన కోట. గతంలో తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్, అతని తల్లి రబ్రీ దేవి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2015 నుండి తేజస్వి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో, ఆయన 38,000 ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈసారి బీజేపీ తన రఘోపూర్ అభ్యర్థిగా సతీష్ కుమార్ యాదవ్‌ను ఎన్నుకుంది. యాదవ్ 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి రబ్రీ దేవిని ఓడించారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా రఘోపూర్‌లో తన అభ్యర్థిని నిలబెట్టింది. -
SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)
-
జీవితాన్ని మళ్లీ చూస్తున్నా.. నవీన్ చంద్ర పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయన అందెశ్రీ పాడెను మోశారు. అంత్యక్రియలు అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని రేవంత్ కోరారు. ‘‘తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా. గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది..అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుంది. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో ఆ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుతాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో అశోక్ కుమార్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన అశోక్ తన రెక్కల కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్‌గా అశోక్ పనిచేస్తున్నాడు. పాత ఢిల్లీ మార్గంలో విధులు నిర్వహిస్తుంటాడు.ఢిల్లీ పేలుడు బాధితుల జాబితాలో తన బంధువు అశోక్ పేరును చూడగానే పప్పు షాక్ అయ్యాడు. ఎల్ఎన్జేజీ ఆస్పత్రి వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను జాబితాలో అశోక్ పేరు చూశాను. అతను నాకు బంధువు. దీనిని ధృవీకరించడానికి నేను ఫోన్ చేశాను. అశోక్ బైక్ ఏమయ్యిందో తెలియడం లేదు’ అని అన్నారు. పేలుడు సమయంలో అశోక్ విధుల్లో ఉన్నారా? అని అడగగా, అతను ఈ రూట్లోనే విధులు నిర్వహిస్తుంటాడని, డ్యూటీ లేనప్పుడు కూడా ఇదే మార్గంలో వెళుతుంటాడని’ తెలిపారు.అశోక్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 15 కి.మీ దూరంలో ఉన్న జగత్పూర్లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతని తల్లి సోమవతి పెద్ద కుమారుడు సుభాష్‌తో కలిసి గ్రామంలో ఉంటోంది. సుభాష్ తరచుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. అశోక్ వారి కుటుంబ బాధ్యతలు కూడా మోసేవాడు. పగటిపూట కండక్టర్‌గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అశోక్ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి.. -
జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
-
ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్‌లో కాజల్ అగర్వాల్ చిల్.. (ఫోటోలు)
-
ఆ నియామకం మీ హక్కు కాకున్నా... మీరు ఆ ఉద్యోగానికి అర్హులే!
మా అమ్మగారు ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేవారు. ఇంకో 3 సంవత్సరాలు సర్వీసు ఉండగానే ఆమె చనిపోయారు. ఇది జరిగి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆయనకి 68 ఏళ్లు. మా అమ్మగారు పోయాక మనస్తాపంతో ఆయన వ్యాపారం సరిగా చేయలేక΄ోతున్నారు. రేపో మాపోవ్యాపారం మూతపడేలా ఉంది. నేను డిగ్రీ చదివాను కానీ నిరుద్యోగిని. అందువల్ల మా అమ్మగారి ఉద్యోగం నాకు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఇది జరిగి ఏడాదిపైనే అయినప్పటికీ ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే ఏదో ఒక కారణం చూపి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు. మా అమ్మ గారి ఉద్యోగం నాకు వస్తుందా? –హరికృష్ణ, రాజమండ్రి సానుభూతి లేదా కారుణ్య నియామకం (Compassionate Appointment) అనేది మానవతా దృక్పథంతో ఇచ్చే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ, అది ఎవరి వారసత్వ హక్కు కాదని జస్టిస్ దీ΄ాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. అంతేకాక, సానుభూతి నియామకాలలో పరిగణించవలసిన అంశాలను, 10 న్యాయ సూత్రాలను కూడా సూచించింది. అందులో భాగంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు : సానుభూతి నియామకం అనేది ప్రజా ఉ;eధికి (అందరికీ సమానంగా రావాల్సిన ఉద్యోగ అవకాశాలకు) ఒక మినహాయింపే తప్ప హక్కు కాదు.సానుభూతి నియామకం కోసం ప్రభుత్వం లేదా ఆ యాజమాన్యం/సంస్థ చట్టబద్ధమైన – నిర్దిష్టమైన నియమాలు, ఆదేశాలు జారీచేయాలి. అవి లేకుండా నియామకం చేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం లేదా ఆరోగ్య కారణాలతో పనిచేయలేకపోవడం (మెడికల్ అన్ ఫిట్) వల్ల కుటుంబం పడే ఆర్థిక సంక్షోభాన్ని తీరుస్తుందే తప్ప, ఇతర సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి నియామకాలు ఆలస్యం కాకుండా త్వరగా ఇవ్వాలి, ఎందుకంటే కుటుంబం ఎదుర్కొనే కష్టాలకు తక్షణ ఉపశమనమే దీని ఉద్దేశ్యం. ∙ఇది ‘‘సైడ్ డోర్ ఎంట్రీ’’గా పరిగణించబడుతుంది కాబట్టి, నియమాలను కఠినంగా అమలు చేయాలి. ఇది శాశ్వత హక్కు కాదు. అభ్యర్థి సంబంధిత నియమాల్లో ఉన్న అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ∙కుటుంబం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేదా అన్నదే ప్రధానం. కుటుంబ పరిస్థితిని పరిగణించకుండా ఇచ్చే నియామకాలు చట్టబద్ధం కావు. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఆ ఉద్యోగి మరణం లేదా అశక్తత తర్వాత తక్షణమే ఇవ్వాలి. సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబానికి తక్షణ అవసరం లేదన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. నియమాలు అనుమతిస్తే తప్ప, చిన్నవాడైన అభ్యర్థి పెద్దవాడయ్యేవరకు ఉద్యోగాన్ని అలాగే ఉంచరాదు. ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య బీమా వంటి పెన్షన్ బెనిఫిట్ స్కీం కింద లభించే నెలవారీ చెల్లింపులు సానుభూతి నియామకానికి అడ్డం కావు.పైన చెప్పిన నియామకాల్లో మీకు ప్రతికూలంగా ఏమీ లేవు. ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్ని మీ దరఖాస్తులో ప్రస్తావించారనే అనుకుంటున్నాను. పైగా మీరు మీ అమ్మగారు మరణించిన వెంటనే దరఖాస్తు కూడా చేసుకున్నారు. పైన పేర్కొన్న నియమాలలో మీరు సరిపోకపోతే తప్ప, మీకు ఉద్యోగాన్ని తిరస్కరించే హక్కు ఆ సంస్థవారికి లేదు. ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే, త్వరితగతిన మీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీరు హైకోర్టును ఆశ్రయించటం ఉత్తమం.ఇదీ చదవండి: దిగుబడుల్లో అంతరాలెందుకుశ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
బేటీకో చోడ్కే ఆవూంగా అని వెళ్లాడు
వికారాబాదు జిల్లా: బేటీకో సాసురాల్ కనే చోడ్కే షామ్ తక్ ఆవూంగా అంటూ ఇంట్లో నుంచి చెప్పి వెళ్లన నా భర్త ఇలా సాయంత్రం వరకు శవమై వస్తాడని అనుకోలేదని.. ఇప్పుడు నా గతి... నా పిల్లల గతి ఏంకాను అని మృతుడు షేక్ ఖాలీద్ భార్య రెహానాబేగం కన్నీరుమున్నీరైంది. మీర్జాగూడా వద్ద జరిగిన ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న షేక్ ఖాలీద్‌తో పాటు కూతురు సాలేహ, మనుమరాలు రెండు నెలల ఫాతిమా సంఘటనా స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతితో మంగళవారం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య రెహానాను ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటల్లోనే.. ‘20 ఏళ్లుగా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. కొన్నాళ్ల క్రితం ఇందిరమ్మ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటున్నాం. భర్త వెల్డర్‌గా పని చేస్తాడు. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు నలుగురు సంతానం. పెద్ద కూతురు సాలేహా బేగంను పదో తరగతి వరకు చదివించి గతేడాది సెప్టెంబర్ 26న పెళ్లి చేశాం. ఇద్దరు కవలలు సమీర్, జమీర్ ప్రస్తుతం నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మరో కూతురు సాదియా బేగం తొమ్మిదో తరగతి చదువుతోంది. కూతురు సాలేహాకు ప్రసవం తర్వాత హైదరాబాద్ నుంచి తాండూరుకు తీసుకొచ్చాం. మనవరాలికి 40 రోజుల తర్వాత చేసే కార్యక్రమానికి పంపించాలని అత్తింటి వాళ్లు ఫోన్ చేయడంతో సోమవారం బస్సు ఎక్కారు. బిడ్డను విడిచి సాయంత్రం వరకు వస్తా అన్న మనిషి ఇలా ప్రాణం లేకుండా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. -
అక్క పెళ్లికి వచ్చి..
తల్లి అంటే ఆ అక్కాచెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. రెండో కూతురు తనూష చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ప్రకృతి చిత్రాలను గీయడం అలవాటు చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మే 10వ తేదీ మదర్స్‌డే సందర్భంగా తనూష తల్లి అంబిక ముఖ చిత్రాన్ని గీసింది. బ్లాక్అండ్వైట్ ఫొటో తీస్తే ఎలా వస్తోందో అలాగే తల్లి ఫొటోను గీసి అందరినీ అబ్బుర పర్చింది. అక్క పెళ్లిలో ఆకాశమే హద్దుగా..అప్యాయతే ముద్దుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఆ ముగ్గురూ పెళ్లిలో చేసిన నృత్యాలు, సందడి చేసిన వీడియోలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. తాండూరు, తాండూరు టౌన్: యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన అంబిక– ఎల్లయ్యగౌడ్ దంపతులకు అనూష, తనూష, సాయిప్రియ, నందినిలతోపాటు మురళీకృష్ణాగౌడ్ అనే కుమారుడు ఉన్నారు. ఐదుగురిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబం తాండూరుకు వచ్చింది. బస్వణ్ణ కట్ట ప్రాంతంలో ఉంటూ ఎల్లయ్యగౌడ్ టవేరా కారును కిరాయిలకు నడుపుతున్నాడు. పెద్ద కూతురు అనూషకు అక్టోబర్ 17వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతు రు నందిని ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కుమారుడు మురళీకృష్ణాగౌడ్ పదో తరగతి చదువుతున్నాడు. అక్క పెళ్లిలో వారంతా సంతోషంగా గడిపారు. సోమవారం ముగ్గురు కూతుళ్లను హైదరాబాద్‌కు పంపేందుకు తండ్రి దగ్గరుండి బస్సు ఎక్కించాడు. ‘సమయానికి మందులు వేసుకో.. అమ్మను ఏమనకు.. తమ్ముడికి రోజు స్కూల్‌కు వెళ్లమని చెప్పు’అంటూ కదులుతున్న బస్సులో నుంచి ఆ ముగ్గురు కూతుళ్లు తండ్రికి టాటా చెప్పి వెళ్లారు. బై డాడీ అని చెప్పిన పిల్లలను తిరిగి విగతజీవులుగా చూస్తాననుకోలేదని...బస్సు ఎక్కకపోతే నా ముగ్గురు కూతుళ్లు బతికే వారని ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాలను చూసి వారి స్నేహితులు ఎక్కిఎక్కి ఏడ్చారు. -
‘తప్పుడు గృహహింస కేసు నుంచి కాపాడండి’
హైదరాబాద్: భార్య మోపిన తప్పుడు గృహహింస కేసు కారణంగా ఇబ్బందుల్లో పడిన ఒక వ్యక్తి న్యాయం చేయాలంటూ సీఎంను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన పంకజ్‌తో పాటు అతని కుటుంబం తప్పుడు గృహ హింస, వరకట్న కేసులపై కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసుల కారణంగా మానసిక వేదన అనుభవిస్తున్నట్లు పంకజ్ ఒక వీడియోలో తెలిపారు. Pankaj and his family from Hyderabad are fighting false domestic violence and dowry cases and have been facing extreme harassment for the past few years. In fact, Pankaj's wife walked out of the house taking their daughter along and is mentally torturing Pankaj. To seek help &… pic.twitter.com/1hI1Qktbgg— ForMenIndia (@ForMenIndia_) November 2, 2025ఆ వీడియోలో పంకజ్ తన భార్య.. తమ కుమార్తెను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి, తనను మానసికంగా హింసిస్తోందని ఆరోపించారు. అయితే సహాయం కోసం అటు పోలీసులను, ఇటు వివిధ సంస్థలను, మంత్రులను వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని పంకజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వింగ్స్ మహిళా భద్రతా డీసీపీలు తాము అందించిన ఫిర్యాదు లేఖను స్వీకరించారని, అయితే ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదన్నారు. అధికారులు తన సమస్యకు పరిష్కారం చూపాలని పంకజ్ ఆ వీడియోలో వేడుకుంటున్నారు. -
మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోయే 'సినీ' వారసులు (ఫొటోలు)
-
ఇట్స్ ఫ్యామిలీ టైమ్ అంటున్న ప్రియాంక చోప్రా (ఫోటోలు)
-
ప్రేయసి ఇంట ఉత్కంఠ.. ప్రియుడు హత్య.. యువతి, మామ ఆత్మహత్యాయత్నం
హమీర్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. తన ప్రియురాలికి బలవంతపు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నాడు. అతనిని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి, హత్య చేశారు. ఇంతలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో తన ప్రియురాలు మనీషా(18)కు బలవంతంగా పెళ్లి జరుగున్నదని తెలుసుకున్న ఆమె ప్రియుడు రవి(35) ఆమెను కలుసుకునేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని కట్టేసి, కర్రలతో దాడి చేశారు. వీరికి గ్రామస్తులు కూడా సహకరించారు. తీవ్రంగా గాయపడిన రవి దాహంతో నీరు అడిగినా వారు నిరాకరించారు. ఈ తరుణంలోనే రవి మృతిచెందాడు.దీంతో హత్యారోపణలు ఎదురైన మనీషా మామ పింటూ(35) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే బాధితులు రవి, పింటూలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రవి చనిపోయాడని అక్కడి వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న మనీషా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె, ఆమె మామ పింటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని మౌదాహాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు తెలిపారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఈ ఘటన దరిమిలా మనీషా అమ్మమ్మ మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే రవి ఇక్కడకు వచ్చాడని, తరువాత పింటూను కత్తితో పొడిచాడని తెలిపింది. గతంలో ఒకసారి రవితో మనీషా వెళ్లిపోయిందని, అయితే తాము బలవంతంగా మనీషాను తీసుకురావడంతో అతను తమ కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నాడని ఆమె పేర్కొంది. ఇదే ఘటన గురించి మనీషా అత్త, పింటు భార్య మాట్లాడుతూ ఇంటిలోనికి వచ్చిన రవిని తన భర్త గట్టిగా పట్టుకోగా, అతను కత్తితో తన భర్తను పొడిచాడని పేర్కొంది.ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. హమీర్‌పూర్‌లోని పోలీసు సూపరింటెండెంట్ దీక్షా శర్మ మాట్లాడుతూ పర్చ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగిందని, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని, మరొకరు గాయపడ్డారని తెలిపారు. మనీషా అనే యువతి తనను తాను గాయపరచుకుని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా! -
నా చావుకి కారణం భార్య.. ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్
హైదరాబాదు: టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్ (24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన శ్రీధర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనంతరం ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో నా చావుకి కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నదియా @59.. సింపుల్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
మా నాన్నది ఆత్మహత్య కాదు! అర్ధరాత్రి 10గంటలకు పోలీసులు మా ఇంటికొచ్చి..!!
-
ఫ్యామిలీతో యాంకర్ రష్మీ గౌతమ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
ఐదేళ్లుగా బహ్రెయిన్ మార్చురీలో మృతదేహం
మెట్పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్‌ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్‌పోర్ట్ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్‌లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్‌పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్ అక్కడే ఉండిపోవడం.. మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్ సోదరుడు ఆనంద్ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది. -
రాజ్‌తో సమంత.. వైరలవుతోన్న దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
గ్రాండ్‌గా మంచు విష్ణు ఇంట దీపావళి వేడుక (ఫోటోలు)
-
ఐపీఎస్ పూరన్ కుటుంబ సభ్యులకు రాహుల్ పరామర్శ
చండీగఢ్: హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్ కుమార్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్ అన్నారు. ఈ నెల 7న పూరన్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు.అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్ కుమార్ భార్య అమ్నీత్ పీ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఐపీఎస్ పురాన్ కుమార్‌ను పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని అమ్నీత్ పీ కుమార్ ఆరోపించారు. -
స్పెయిన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అశ్విన్ (ఫోటోలు)
-
ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ.. బీచ్‌లో ఫ్యామిలీతో (ఫొటోలు)
-
సతీమణితో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్ (ఫోటోలు)
-
'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఫ్యామిలీ (ఫొటోలు)
-
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి
సాక్షి, విజయనగరం: శ్రీపైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వేదికను టీడీపీ నేతలు రద్దు చేశారు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని టీడీపీ నేతలు అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలంటూ ఆదేశించారు. సిరిమాను రథం తిరగకముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫ్యామిలీతో అనసూయ దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
దసరా బొమ్మల కొలువు (ఫోటోలు)
-
ఘనంగా క్రియా యోగ మార్గదర్శి లాహిరి మహాశయులు జయంతి వేడుకలు
హైదరాబాద్: క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన యోగావతారులు లాహిరీ మహాశయుల జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.“ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. లాభం లేని, మతసంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవసంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి.”-లాహిరీ మహాశయులు మనమధ్య అప్పుడప్పుడు, ప్రపంచం దృష్టికి కనిపించకుండా రాబోయే తరాలకు ప్రకాశమానమైన ఒక మార్గాన్ని సుగమం చేసే ఆధ్యాత్మిక మహనీయుడు నిశ్శబ్దంగా సంచరిస్తారు. అలాంటి మహనీయులలో సెప్టెంబర్ 30, 1828న బెంగాల్‌లోని ఘూర్ణిలో జన్మించిన లాహిరీ మహాశయులు ఒకరు.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన "ఒక యోగి ఆత్మకథ"లో వివరించినట్లుగా, వారి జీవితం ఆధ్యాత్మిక సాధన గురించిన మన అవగాహనలో ఒక మలుపును సూచించింది.యోగావతార్గా ప్రసిద్ధి చెందిన లాహిరీ మహాశయులు ఒక సన్యాసి లేదా ఏకాంతవాసి కాదు. ఆయన వారణాసిలో భార్య, పిల్లలతో ఒక సాధారణ జీవితాన్ని గడిపిన ఒక గృహస్థుడు—ప్రభుత్వ అకౌంటెంట్. కానీ 1861లో, రాణీఖేత్ సమీపంలో ఉన్నప్పుడు, వారి విధి మారింది. సాధారణ ప్రజానీకానికి కనపడని, అమర యోగి మహావతార్ బాబాజీచే హిమాలయ పర్వతపాదాల వద్దకు ఆకర్షితులై, అంతరించిపోయిన క్రియాయోగ విద్యలో దీక్ష పొందారు. క్రియాయోగం అనేది ఆధ్యాత్మిక వికాసాన్ని వేగవంతం చేయగల ఒక సాధనం, ఎందుకంటే కేవలం ఒక క్రియ సాధన ఒక సంవత్సర కాలపు సహజ ఆధ్యాత్మిక పురోగతికి సమానం.ఈ సంఘటన చారిత్రాత్మకమైనది. శతాబ్దాలుగా, అటువంటి బోధనలు రక్షించబడి, సన్యాసులకు మాత్రమే ఇవ్వబడేవి. కానీ లాహిరీ మహాశయుల అభ్యర్థన మేరకు, ఈ పద్ధతిని నిజమైన దైవాన్వేషకులందరికీ ప్రసాదించవచ్చని బాబాజీ అంగీకరించారు. లాహిరీ మహాశయుల కార్యసాధన ప్రారంభమైంది. కాషాయవస్త్రాలు ధరించిన గురువుగా కాకుండా, ప్రాచీన యోగం, ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక జీవన వారధిగా.. వారణాసికి తిరిగి వచ్చిన తర్వాత, లాహిరీ మహాశయులు నిశ్శబ్దంగా నిజమైన అన్వేషకులకు క్రియాయోగం బోధించడం ప్రారంభించారు. బ్రాహ్మణులు, వ్యాపారులు, పండితులు, గృహస్థులు ఆయన విద్యార్థులయ్యారు. దేవుడు అందరివాడు అనే ఒక సాధారణ సందేశంతో ఆయన కుల భేదాలను, మత సిద్ధాంతాలను ఛేదించారు.వారి అనేక బోధనలలో, ఒక వాక్యం ప్రసిద్ధి చెందింది: “బనత్, బనత్, బన్ జాయ్” (“శ్రమిస్తూ, శ్రమిస్తూ, చూడు! అదిగో! దివ్యలక్ష్యం”). ఆధ్యాత్మిక మార్గంలో నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నారని నిరుత్సాహపడిన వారికి ఇది వారి సమాధానం. నిలకడైన, నిజాయితీతో కూడిన సాధన ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందనే ఆయన ప్రధాన సందేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.లాహిరీ మహాశయుల ప్రముఖ శిష్యులలో ఒకరు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన వారు. తరువాత కాలంలో పరమహంస యోగానందకు గురువు అయ్యారు. యోగానంద విధిలో లాహిరీ మహాశయులు ఒక కీలక పాత్ర పోషించారు. యోగానంద చిన్న శిశువుగా ఉన్నప్పుడు, వారి తల్లి ఆ మహర్షి వద్దకు ఆశీర్వాదం కోసం తీసుకువెళ్ళింది. లాహిరీ మహాశయులు ఆ శిశువు నుదుటిని తాకి.. "చిట్టి తల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు" అని ప్రకటించారు.ఆ ప్రవచనం నిజమైంది. యోగానందజీ ప్రపంచంలోనే గొప్ప క్రియాయోగ సాధకులయ్యారు. లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ ఆర్ ఎఫ్)ను, రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్)ను స్థాపించారు. ఈ సంస్థలు యోగావతారుల పరంపరలో, యోగానంద తన దివ్యగురువు పాదాల వద్ద నేర్చుకున్న బోధనలను ప్రచారం చేస్తాయి.అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు వినయంగా నిగర్విగా ఉన్నారు. సేవా తత్వంతో కూడిన వారి ప్రశాంత జీవితం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, లౌకిక బాధ్యతల నిర్వహణ పరస్పరం వైరుధ్యాలు కావని చూపింది. సెప్టెంబర్ 30న లాహిరీ మహాశయుల జయంతిని పురస్కరించుకొని, కీర్తిని కోరకుండా ఆధ్యాత్మిక చరిత్ర గమనాన్ని మార్చిన ఒక గురువును మనం స్మరించుకుంటాము. ఒకప్పుడు హిమాలయాలలో నిగూఢంగా ఉన్న క్రియాయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభ్యసించబడుతోంది. లాహిరీ మహాశయులలో, మనం అంతిమ ఏకీకరణను చూస్తాము: దివ్యత్వం మానవునిలో పూర్తిగా జీవించడం, దైనిక జీవితంలో అమరత్వం వ్యక్తమవడం. -
వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్.. యువకునిపై కేసు నమోదు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో వాట్సాప్ వేదికగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం పేరుతో భార్యను వేధించి, తరువాత వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక యువకునితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు అందింది.సోమవారం ముజఫర్ నగర్ జిల్లాలోని బసేరా గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాధితురాలు అస్మా తన భర్త హసన్, అత్త రషీదా, ఇద్దరు బావమరుదలు సలీం, షకీర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్కిల్ ఆఫీసర్ (సీఓ)రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం- 2019 లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు 2017, నవంబర్‌లో హసన్‌తో వివాహం జరిగింది. నాటి నుంచి తనను వరకట్నం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది. దీంతో తన భర్త ఇంటిని వదిలి, ఆమె తల్లిదండ్రులతో ఉండసాగింది. తాజాగా హసన్ ఆమెకు ట్రిపుల్ తలాక్ అని ఉచ్చరిస్తూ, వాట్సాప్ సందేశం పంపాడు. ఇది భారతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఆమె ఫిర్యాదు దరిమిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త నుండి ‘ట్రిపుల్ తలాక్’ ఫోన్ కాల్ విన్నంతనే ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా బాధితురాలు ఇచ్చిన కేసు నమోదు చేయడంలో విఫలమైన సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి, డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించినట్లు వారు పోలీసులు తెలిపారు.తలాక్-ఎ-బిద్దత్ అని కూడా పేర్కొనే ట్రిపుల్ తలాక్‌ను 2019లో భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి నిషేధించారు. దీని ప్రకారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం- 2019 ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను ఏ రూపంలోనైనా ఉచ్చరించడం, రాతపూర్వక లేదా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెప్పడం నేరం. ఇందుకు మూడేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ముస్లిం మహిళలకు ఏకపక్షంగా విడాకులనిచ్చే పద్ధతుల నుండి రక్షణ కల్పించడానికి ఈ చట్టం రూపొందించారు. -
తండ్రి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. ఆ కారు హైలైట్! (ఫొటోలు)
-
‘ప’ చీమ ‘ఉ’ చీమ : సంసారం, వైరాగ్యం ఇంట్రస్టింగ్ స్టోరీ
ఒక వ్యక్తి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకొని ‘బాబోయ్! ఈ స్తంభం నన్ను వదిలి పెట్టటం లేదండోయ్!’ అంటూ అరిచాడట. సంసారం కూడా ఇంతే. సంసారం మనల్ని పట్టుకున్న దనుకొంటారు చాలామంది. కానీ సంసారాన్నే మనం పట్టుకొని సతమత మవుతున్నామని గ్రహించరు. సంసారంలోని సారం తెలిస్తే ఎవరూ బాధపడరు. చావుపుట్టుకల తగలాటమే సంసార సారం. భార్యాబిడ్డలు, ఇల్లూవాకిలి, పొలమూ పుట్ర ఇవన్నీ సంసారమను కొంటున్నాం. ఇవన్నీ జనన మరణాల మధ్య రాగంతో ఏర్పాటు చేసుకొన్న సామగ్రి.జనన మరణాత్మకమైన సంసారంలో రాగద్వేషాలు వదలి తామరాకుపై నీటిబొట్టు లాగా ఉండగలిగితే ఈ సంసారం మనిషినేమీ చేయదు. అలాకాక రాగద్వేషాలతో వీటన్నిటి మీద ఆసక్తి కలిగి ఉన్నంతకాలం అది మనల్ని పట్టుకున్నట్లనిపిస్తుంది. సరిగ్గా దీనికి ఉదాహరణే స్తంభాన్ని కౌగలించుకోవటం! వైరాగ్య భావం అలవాటు చేసుకుంటే సంసారంలో ఆసక్తి ఉండదు. వైరాగ్యం పొందే విధం కోసం సద్గ్రంథ పఠనం చేసి, గురూపదేశం పొందాలి. మనిషి సంసారాన్ని తానే వరించి తెచ్చుకొన్నాడు తప్ప అది పట్టుకోలేదు.‘ఉ’ అనే చీమ ఉప్పుగట్టు మీదనే ఉంటూ ఉప్పే తింటుండేది. అలాగే ‘ప’ అనే చీమ పంచదార గుట్ట మీద ఉంటూ పంచదార తింటూండేది. ఒకసారి ‘ప’ అనే చీమ ‘ఉ’ అనే చీమతో ‘మిత్రమా! కొంచెం పంచదార చవి చూడు. ఎంత తియ్యగా ఉంటుందో!’ అని అన్నది. సరే అలాగే అని కొద్దిగా పంచదార రుచి చూచి ‘అబ్బే! తియ్యగా ఉన్నట్లే లేదోయ్ మిత్రమా’ అంది ‘ఉ’ అనే చీమ. ‘అయితే ఒక పని చెయ్యి! నీ నోట్లో ఉప్పుకణాలున్నాయి. వాటిని పూర్తిగా ఉమ్మివేసెయ్యి. అప్పుడుగాని పంచదార రుచేమిటో నీకు తెలీదు’ అన్నది పంచదార చీమ.‘అంతర్లవణమేవాస్తి బహిర్వమతుమే సఖా’ అనే సూక్తి ఈ విషయాన్నే సూచిస్తున్నది. ఈ మాదిరిగానే గుండెనిండా రాగద్వేషాలు, వ్యామోహాదులను నింపుకొని ఉన్నవానికి గురుబోధ ఎక్కడ ఎక్కుతుంది? వైరాగ్యం ఎలా కుదురుతుంది? వైరాగ్యం కుదరాలంటే అవన్నీ ముందు వదిలించుకోవాలి!-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
దుబాయ్‌లో అభిషేక్ శర్మ ఫ్యామిలీ.. ఫొటోలు షేర్ చేసిన కోమల్ (ఫొటోలు)
-
మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా? ఈ ప్రశ్న అవసరమా?
సాధారణంగా ఏదైనా ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం చేసే ఇంటర్వ్యూలు అభ్యర్థి నైపుణ్యాలు, అర్హతలు, ఆ సంస్థలో వారిని తీసుకోవాలనుకుంటున్న హోదాకు తగిన అర్హతను అంచనా వేయడం పైనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిగత రంగంలోకి వెళతాయి. ఇటీవల ఓ అభర్థి ఎదుర్కొన్న అలాంటి ఒక ప్రశ్న – ‘మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా?’ అది విన్న ఆ అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికిది ఎటువంటి ఇబ్బందీ కలిగించని ప్రశ్నే అయినప్పటికీ కొంతమంది రిక్రూటర్లు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది. నిజమే కదా... ఎందుకు అడుగుతారు? ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒకరిద్దరు అభ్యర్థులు వేర్వేరు ఇంటర్వ్యూయర్లు తమని తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా అని అడిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి ఇది జరిగినప్పుడు, కంపెనీ తరువాత ఉద్యోగ ఆఫర్‌ను పొడిగించింది, కానీ అభ్యర్థి దానిని తిరస్కరించాడు. తరువాతి ఇంటర్వ్యూలో, మరొక రిక్రూటర్ ఆ ప్రశ్నను పునరావృతం చేసి, ఆపై ఇతర ఉద్యోగ ఆఫర్ల వివరాల కోసం, వాటిని తిరస్కరించడానికి గల కారణాల కోసం ఒత్తిడి చేశాడు.ప్రశ్న సముచితమైన దేనా అని ఖచ్చితంగా తెలియదని, అభ్యర్థి ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడతాడా? లేక అతనిపై తల్లిదండ్రుల సంరక్షణ భారం ఎంతమేరకు పడుతుందా అని అంచనా వేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వచ్చిందని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారంటే తక్కువ ఖర్చులు అని రిక్రూటర్లు భావించవచ్చని, తగ్గిన జీతాన్ని మేనేజ్ చేయడం సులభం అవుతుందని వారి అంచనా. నియామక ప్రక్రియలో అసమతుల్యతపై వారు నిరాశ వ్యక్తం చేశారు, ఇంటర్వ్యూయర్లు ఉద్యోగ పనితీరుకు సంబంధం లేని విషయాలను కూడా పరిశీలించవచ్చు. అర్థరహిత వ్యాఖ్యతో, కృత్రిమ మేధస్సు అటువంటి పద్ధతులను పూర్తిగా భర్తీ చేయగలదా అని అభ్యర్థి ఆశ్చర్యపోయాడు.చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియోకమ్యూనిటీ స్పందనఇలాంటి ప్రశ్నలు ఆఫర్ ఎంత తక్కువగా ఉంటుందో నిర్ణయించే ప్రయత్నాన్ని సూచిస్తాయన్నారు. కుటుంబంతో కలసి ఉండటం వల్ల అభ్యర్థిపైన తక్కువ ఆర్థిక ఒత్తిడి పడుతుందని వాళ్ల ఉద్దేశంగా భావించ వచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి?ఈ పరిస్థితులను నిర్వహించడానికి అనేక మంది వినియోగదారులు తమ ఆలోచనలను ఇలా పంచుకున్నారు, వాటిలో ‘‘మీరు ఎందుకు అడుగుతారు?’’ అనే ఆసక్తితో స్పందించడం లేదా ప్రశ్నలోని అసంబద్ధతను ఎత్తి చూపడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగ భృతి లేదా వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి యజమానులు అడిగిన ఇలాంటి అనుభవాలను కొందరు వివరించారు. ఈ చర్చ ఒక సాధారణ భావనను నొక్కి చెప్పింది: కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం గురించి తక్కువగా ఉండవచ్చు లేదా తమ సంస్థలో వీలైనంత తక్కువ ప్యాకేజీకే ఒప్పించేందుకు తగిన అవకాశాలను గుర్తించడం గురించి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారంటే వారు బాధ్యతతో పని చేస్తారని ఇంటర్వ్యూయర్లు భావించవచ్చు. ఇదీ చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్ -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుందా?
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?– ఒక సోదరి, ఖమ్మం జిల్లాబహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది. దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్ని కలవడం అవసరం. -
'కోర్ట్' బ్యూటీ.. దుబాయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ (ఫొటోలు)
-
తమిళనాడులో ఏపీ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులోని కృష్ణగిరిలోని కేఆర్పీ ఆనకట్టపై నుంచి దూకి నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన అత్త శారదమ్మాళ్ (75), అల్లుడు లక్ష్మణమూర్తి (50), ఆయన భార్య జ్యోతి (45), కుమార్తె కీర్తిక (20) ఆనకట్టలోని చిన్న స్లూయిస్ గేట్ల దగ్గర నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. శారదమ్మాళ్, లక్ష్మణమూర్తి ఆనకట్టలోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. జ్యోతి, కీర్తికను సమీపంలోని మత్స్యకారులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. -
ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!
‘మా అమ్మాయి పైలట్’ ‘నా మనవరాలు పైలట్’ అని చెప్పుకోవడంలో సంతోషం ఉంది. అంతకంటే ఎక్కువ సంతోషం ఆమె నడుపుతున్న విమానంలో ప్రయాణించడంలో ఉంది. ఇండిగో పైలట్ తనిష్క ముగ్దల్ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలకు విమానం ఎక్కడం అదే మొదటి సారి. అది తమ ఇంటి ఆడబిడ్డ నడిపే విమానం. యూనిఫామ్‌లో ఉన్న తనిష్క ఆనందబాష్పాలతో అమ్మా,నాన్నలు, తాత,అమ్మమ్మలకు ఇండిగో విమానంలో స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్‌లో భారీ సంభాషణలు, గ్రాఫిక్స్ హంగామా లేకపోవచ్చు. భావోద్వేగాలే బలం అయ్యాయి.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ...‘అమ్మానాన్నల ప్రోత్సాహం, చేసిన ప్రార్థనలు, చేసిన త్యాగాలు నేను పైలట్ కావడానికి తోడ్పడ్డాయి’ అని రాసింది తనిష్క. ‘ఆ తల్లిదండ్రుల కళ్లలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూడండి’‘పిల్లలు మంచి స్థాయికి వెళ్లినప్పుడు, ఆ స్థాయిని కళ్లారా చూసినప్పుడు, వారికి అంతకు మించిన శక్తి ఏముంటుంది!’ ‘మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను ఎప్పుడూ గుండెలో పెట్టుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Tanishka Mudgal ♥️ | aviation | travel | fashion (@pilottanishka) (చదవండి: విలేజ్ సైంటిస్ట్ బనిత) -
టీచర్స్ డే.. ఆరోజులు మళ్ళీ రావు!
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్‌లో స్టేటస్‌గా, ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్‌లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్‌ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్‌లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్‌గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి. టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్‌కు సూట్ బూట్ స్పెషల్‌గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది. నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్‌గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్‌గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్‌పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్‌గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు. ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లా.. స్కూల్ ఈవెంట్‌లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు.. బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్‌కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు. ఇట్లు.. ఓ నిత్యవిద్యార్థి -
వినాయకుని సేవలో ముస్లిం కుటుంబం
ఘంటసాల (అవనిగడ్డ): కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామరస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వరాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయించారు. తొలిరోజు ఈ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. బుధవారం అన్న సమారాధన నిర్వహించగా, గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా అక్బర్ బాషా, షర్మిల దంపతులను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సత్కరించారు. -
మాల్దీవుల్లో కాజల్ గ్లామర్ ట్రీట్.. ఫ్యామిలీ కలిసి (ఫొటోలు)
-
Reasi Cloudburst: కొండచరియలు పడి ఇల్లు ధ్వంసం.. ఏడుగురు మృతి
రియాసి: జమ్ముకశ్మీర్‌లోని రియాసి పరిధిలోని మహోర్ ప్రాంతంలోగల బద్దర్ గ్రామంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. క్లౌడ్ బరస్ట్ అనంతరం వారి మట్టి ఇల్లు కొండ చరియల కింద శిధిలమయ్యింది.ఈ ఘటన గురించి మహోర్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఖుర్షీద్ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆ కుటుంబంలోని వారంతా నిద్రలో ఉన్నారని, ఇల్లు కూలడంతో వారు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. స్థానికులు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టి ఏడు మృతదేహాలను వెలికితీశారు. #KNSUPDATE || Anguished by the cloudburst & rain-triggered landslides in Reasi & Ramban. Condolences to the bereaved families. Spoke to Senior Officials and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the… pic.twitter.com/jZJr9nCTj9— KNS (@KNSKashmir) August 30, 2025మృతులను నజీర్ అహ్మద్, వజీరా బేగం, బిలాల్ అహ్మద్, మహ్మద్ ముస్తఫా, మహ్మద్ ఆదిల్, మహ్మద్ ముబారక్, మహ్మద్ వసీమ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు రంబన్ జిల్లాలోని రాజ్‌గడ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులలో ముగ్గురు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్‌పై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు...వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు. -
మియాపూర్‌లో మిస్టరీ డెత్స్.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త,మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బంధువుల పెళ్లిలో రమేశ్ బాబు కుటుంబం (ఫొటోలు)
-
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
హయగ్రీవ పూజ చేసిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు జయరాం ఫ్యామిలీ (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన రియల్ హీరో
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించారు. కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. పూర్తి గా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో మంది ఆర్థికసాయం అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సాయంగా లక్షన్నర రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలుస్తానని కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఇవాళ హైదరాబాద్‌కు సోనూ సూద్ వచ్చారు. అనంతరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్‌గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్‌లో కనిపించాడు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్య ఫ్యామిలీ (ఫొటోలు)
-
USA: విషాదాన్ని మిగిల్చిన ఎన్ఆర్ఐ వృద్ధుల ‘అదృశ్య ఘటన’
అమెరికాలో న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, చివరికి ఈ అదృశ్య ఘటన విషాదాన్ని మిగిల్చింది.వెస్ట్ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మార్షల్ కౌంటీ పోలీసులు తెలిపారు. మరణించినవారు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)లుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్‌లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు.జులై 29న అదృశ్యం కాగా, వీరి వాహనం ప్రమాదానికి గురైనట్లు నిన్న (ఆగస్టు 2) పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు ద్రువీకరించారు. చివరిసారిగా జులై 29న వీరు పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డును కూడా చివరిసారి అక్కడే వాడినట్లు తెలిసింది. నలుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. చివరికి వారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. -
ఫ్యామిలీతో అరుణాచలం సందర్శించిన బుల్లితెర డాక్టర్‌బాబు నిరుపమ్ (ఫొటోలు)
-
సుదర్శన్ నాయుడు కుటుంబానికి ఆర్కే రోజా పరామర్శ
సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ సుదర్శన్ నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మేలపట్టు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా.. సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.సుదర్శన్ నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్ నాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని.. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. రోజా వెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం విభాగ అధ్యక్షులు ఉన్నారు. -
Gujarat: కుటుంబాన్ని బలిగొన్న రూ. ఐదువేల ఈఎంఐ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను విపుల్ కాంజి వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవానిగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబం మొదట గుజరాత్‌లోని ధోల్కాలో ఉండేది. విపుల్ వాఘేలా ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, బాగోద్ర పోలీసులు, 108 అంబులెన్స్ బృందం, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే కాంజి వాఘేలా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.విపుల్ బావమరిది ఈ ఘటన గురించి మాట్లాడుతూ విపుల్ రుణం తీసుకుని ఆటోరిక్షాను కొనుగోలు చేశాడని, ప్రతీనెలా రూ. ఐదువేల ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఆ భారమే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని అన్నారు. కాగా ఈ ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విపుల్ బంధువులను, పొరుగవారిని, పరిచయస్తులను విచారిస్తున్నారు. -
స్విట్జర్లాండ్ టూర్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్
-
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)
-
ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం
బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్‌కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్‌దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్ మేఘ్వాల్ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్ మేఘ్వాల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్ మేఘ్వాల్కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్ మేఘ్వాల్ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్ మేఘ్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్ మేఘ్వాల్ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్ మేఘ్వాల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్ మేఘ్వాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ -
సింగయ్య, జయవర్దన్ కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో.. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్‌రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు. -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’?
చండీగఢ్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాటియాలా జిల్లాలోని ఒక గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లో విషాదకర దృశ్యం కనిపించింది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మంజిత్ సింగ్ మీడియాకు తెలిపారు.టెప్లా బానూర్‌లోని జాతీయ రహదారిలోని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివుంచిన ఈ కారును పోలీసులు గుర్తించారు. మొహాలీకి చెందిన స్థిరాస్థి వ్యాపారి సందీప్ సింగ్ రాజ్‌పాల్ (45), అతని భార్య మందీప్ కౌర్ (42), వారి కుమారుడు అభయ్ సింగ్ (15)ల మృతదేహాలు ఆ కారులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి శరీరాలపై తుపాకీ కాల్పుల గాయాలు ఉన్నాయని, క్యాబిన్ లోపల రక్తం చిమ్మివుందని పోలీసులు పేర్కొన్నారు. స్థిరాస్థి వ్యాపారి మృతదేహం డ్రైవర్ సీటులో ఉందని, అతని భార్య మృతదేహం ముందు సీటులో, వెనుక సీటులో వారి కుమారుని మృతదేహం పోలీసులకు కనిపించాయి.కొందరు కూలీలు ఈ కారును గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కారులో నుంచి ఒక హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలియజేశారు. ప్రాథమిక దర్యాప్తులో సందీప్ సింగ్ తన భార్యను, కుమారులను షూట్ చేశాక, తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది. వారి కుమారుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. బతిండాలోని సిఖ్వాలా గ్రామానికి చెందిన సందీప్ సింగ్ గత ఎనిమిది ఏళ్లుగా మొహాలిలో నివసిస్తున్నాడు.ఇది కూడా చదవండి: ఇరాన్లో అధికార మార్పు? ట్రంప్ పరోక్ష హెచ్చరిక -
Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్‌కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.దీనికి ఎవరు బాధ్యులు?తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు.. -
Air India flight crash: ఆశలు బుగ్గిపాలు
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఆరేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమీ వ్యాస్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్‌కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్ భారత్‌కు వచ్చి కుటుంబంతో సహా లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులనీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. లండన్‌కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం.. -
ఫ్రెండ్ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ హంగామా (ఫొటోలు)
-
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు...కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. -
'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)


