ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం
హైదరాబాదు: టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్ (24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహం జరిగింది.
అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన శ్రీధర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనంతరం ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో నా చావుకి కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


