
ఘంటసాలలో వెల్లివిరిసిన మత సామరస్యం
ఘంటసాల (అవనిగడ్డ): కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామరస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వరాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయించారు. తొలిరోజు ఈ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. బుధవారం అన్న సమారాధన నిర్వహించగా, గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా అక్బర్ బాషా, షర్మిల దంపతులను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సత్కరించారు.