సాక్షి, చెన్నై : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్‌లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు.
వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలో ఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్‌డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్‌గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం.


