
సాక్షి, చిత్తూరు జిల్లా: ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులోని కృష్ణగిరిలోని కేఆర్‌పీ ఆనకట్టపై నుంచి దూకి నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన అత్త శారదమ్మాళ్ (75), అల్లుడు లక్ష్మణమూర్తి (50), ఆయన భార్య జ్యోతి (45), కుమార్తె కీర్తిక (20) ఆనకట్టలోని చిన్న స్లూయిస్ గేట్ల దగ్గర నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. శారదమ్మాళ్, లక్ష్మణమూర్తి ఆనకట్టలోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. జ్యోతి, కీర్తికను సమీపంలోని మత్స్యకారులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.