హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబం మొత్తం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగ్ అంబర్‌పేటలోని రామకృష్ణా నగర్‌లో చోటు చేసుకుంది.
దీనిపై స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మీలతో పాటు వారి కూతురు శ్రావ్యగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం రాంనగర్‌లో నివాసం ఉంటున్న ఆ దంపతులు పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది.
దీంతో ఆ కుటుంబం రామకృష్ణా నగర్‌కు మారింది. వారు అక్కడ అద్దెకు ఉంటున్నారు. ఢ నమ్మకాలే వారి ఆత్మహత్య కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు సమాచారం.


