రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.
వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై అందరూ హుషారుగా డ్యాన్స్‌లు వేశారు.
శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది.
ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


