breaking news
Women
-
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
సినిమాల్లో నటించాలనేది నా కోరిక: నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటర్, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్‌షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికారి్డంగ్లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.2021లో మొదటి అవకాశం2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. యూట్యూబ్‌లో 100 మిలియన్ బేంచ్ మార్క్‌కు చేరింది. శాస్త్రీయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కూచిపూడిలో పీహెచ్డీ చేస్తా..చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్‌షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం. -
స్టడీ..రెడీ.. స్టార్ట్ అప్
అక్షరం అంటే ఆమెకు ఆరాధన. పుస్తక పఠనమంటే ప్రీతి. దాంతో అందరూ ఆమెను పుస్తకాల పురుగు అని పిలిచేవారు. పుస్తకాలు చదువుతూనే ఆమె మార్కెటింగ్‌లో ఎం.బి.ఎ. పూర్తి చేసింది. అయితే ఆ చదువును ఆమె కార్పొరేట్ సంస్థలలో లక్షలు సంపాదించి పెట్టే ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకోదలచుకోలేదు. సెల్ఫోన్లతో... రకరకాల గ్యాడ్జెట్స్‌తో... కంప్యూటర్ గేమ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్న నేటి తరంతో కూడా పుస్తకాలను చదివించాలనుకుంది. ముందు తన కూతురు చదవడం కోసం ఆమెను ఆకట్టుకునే పుస్తకాల కోసం వెతుకుతూ, తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించకపోయేసరికి తానే ఒక పుస్తకాలు అమ్మే వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు.. అన్న ఆలోచన కలిగింది. అదే బిబ్లియోఫైల్స్ అనే స్టార్టప్‌కు పునాదిగా మారింది. ఆమే ముంబయ్‌కి చెందిన అపూర్వ మాత్రే. ప్రారంభించిన 6 నెలల్లో 10 వేలకు పైగా కస్టమర్లు 150+ ప్రేరణాత్మక సమీక్షలు వచ్చాయి. ఎందుకంటే బిబ్లియోఫైల్స్ నినాదమే చదవడాన్ని ఒక జీవనశైలిగా మార్చుకోవడం. ఈ ఆలోచనతోనే, అపూర్వ మాత్రే 2020లో పిల్లల పుస్తకాలు అమ్మే స్టార్టప్‌ను స్థాపించింది. ఒక ఆలోచన నుంచి పుట్టిందిస్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అనుభవజ్ఞురాలైన అపూర్వ మాత్రే, గొప్ప కార్పొరేట్ నేపథ్యం కలిగిన వ్యూహాత్మక సలహాదారు అద్న్యేష్ దళపతిని తన జీవితంలోనే కాదు... వ్యాపారంలో కూడా భాగస్వామిని చేసుకుంది. వారి భాగస్వామ్యం బిబ్లియోఫైల్స్కు మూలస్తంభం. విభిన్న నైపుణ్యాలతో కలబోసుకున్న కలలు అద్భుతమైన ఒక ఆలోచనను ఎలా సృష్టించగలవో ఇది రుజువు చేస్తుంది, ‘‘ఒక పుస్తక ప్రియురాలిగా నా బిడ్డకు బాల్యం నుంచే చదవడం పరిచయం చేయాలన్నది నా ఆలోచన. అయితే అది ఒక పనిగా అనిపించకూడదు – దానిని ఆనందదాయకంగా మార్చాలనుకున్నాను. నా కుమార్తె అభిరుచులకు సరిపోయే వయస్సుకు తగిన పుస్తకాలను నేను జాగ్రత్తగా పరిశోధించి ఎంచుకున్నాను. ఫలితంగా, ఆమె పుస్తకంతో ప్రేమలో పడింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించేసింది. త్వరలోనే ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు వయస్సుకు తగిన పుస్తకాలను సిఫార్సు చేయడం, అమ్మడం ప్రారంభించింది. పిల్లలు ఈ పుస్తకాలను ఇష్టపడ్డారు. చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారింది. పుస్తకాలతోపాటు...ప్రారంభంలో పుస్తకాలను మాత్రమే అమ్మే ఈ కంపెనీ చాలా దూరం వచ్చింది. ఇప్పుడు విద్యార్థుల కోసం వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటు ధరలలో అందిస్తోంది. ఇందులో లంచ్‌బాక్స్‌లు, బాటిళ్లు, అందమైన స్టిక్కర్ ట్యాగ్లు ఇలాంటి అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. పిల్లల పుస్తకాల విషయానికి వస్తే అనేక ఎంపికలు ఉన్నాయి. అసలు చదవడం ఒక జీవనశైలిగా మార్చుకోవాలంటుంది అపూర్వ. దీనిని సాధించాలంటే... మనం మన పిల్లలకు ప్రినేటల్ దశ నుంచే అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదివి వినిపించాలన్నది ఆమె ఆలోచన. ఇందుకోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది; అది కొత్తపుస్తకం మార్కెట్లోకి ప్రవేశించిన క్షణం నుంచి సిఫార్సులు పంచుకునే స్థలం. బిబ్లియోఫైల్స్ అంతిమ లక్ష్యం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న... సంతోషంగా, బాగా అభివృద్ధి చెందిన పిల్లలను పెంచడం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. సోషల్ మీడియా, అధిక స్క్రీన్ సమయం ఉన్న సమకాలీన కాలంలో బిబ్లియోఫైల్స్ వంటి స్టార్టప్‌లు మనలోని సృజనాత్మక, ఊహాత్మక స్వభావాన్ని గ్రహించడంలో, దానితో కనెక్ట్ అవ్వడంలో కీలక పాత్రపోషిస్తాయి. ఇది ముఖ్యంగా మన ఆత్మను సజీవంగా ఉంచుతుంది. యువ హృదయాలలో ప్రేమ, కరుణ, సానుభూతిని పెంపొందించడం చాలా అవసరం, బిబ్లియోఫైల్స్ విలువలు, సూత్రాల ద్వారా దానిని సాధ్యం చేస్తోంది అవును... నేనే ఓ బిబ్లియోఫైల్‘‘నేను బిబ్లియోఫైల్స్ను ప్రారంభించినప్పుడు, దానిని ఎలా పెంచుకోవాలో నాకు తెలియదు. నా కుమార్తె జీవితాంతం చదవ గలిగేందుకు సరిపడా పుస్తకాలు కొన్నప్పటికీ, నేను ఖర్చు చేసినంత సంపాదించలేదనే అపరాధ భావనలోకి నాకు తెలియకుండానే వెళ్లి పోయాను. ఈ ఆలోచన నిప్పురవ్వలా నా అభిరుచిని రగిలించింది, అది నా వృత్తిగా మారింది. అవును... బిబ్లియోఫైల్స్ పుట్టింది, ఎందుకంటే నేనే ఓ బిబ్లియోఫైల్ కాబట్టి. అందుకే నేను దీని ద్వారా ఎంత సంపాదించ గలిగాన్న దానికంటే ఏం సాధించానన్నదే నాకు సంతృప్తినిస్తుంది.’’ – అపూర్వ మాత్రే -
పీరియడ్స్ ఆలస్యానికి పిల్స్ వాడితే ప్రాణాలే పోయాయ్, తస్మాత్ జాగ్రత్త!
పుణ్యకార్యాలు, శుభకార్యాలు, ఆచారాలు, ప్రయాణాలు ఇలా అనేక కారణాలతో పీరియడ్స్ లేదా నెలసరిని వాయిదా (delay period pills) వేయడానికి కొన్ని మందులు వాడతారు. అయితే ఋతుచక్రాన్ని వాయిదా వేసే మాత్రలవల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే పీరియడ్స్ సురక్షితంగా ఆపడం ఎలాగో తెలుసుకోవాలి. వీటివల్ల తలెత్తే ప్రమాదాలను కూడా ముందు అర్థం చేసుకోవాలి.రీబూటింగ్ ద బ్రెయిన్ అనే ఇనస్టా పేజ్‌లో డాక్టర్ వివేకానంద్,డాక్టర్ శరణ్ శ్రీనివాసన్‌తో ఇటీవల ఒక హృదయ విదారకమైన కథను పంచుకున్నారు. దీని ప్రకారం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి పీరియడ్ ఆలస్యానికి మందులు వాడి ప్రాణాలు కోల్పోయింది. ఒక పూజ కోసం మాత్రలు తీసుకోవడం ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఆమె పూజ అయితే పూర్తి చేసింది కానీ కాళ్ళు ,తొడ నొప్పి, తీవ్రమైన అసౌకర్యం లాంటి లక్షణాలతో ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. అస్పత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు పట్టుబట్టినప్పటికీ, తల్లి మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయువతి ప్రాణాలు కోల్పోయింది. క్లిష్టమైన క్షణాల్లో జాప్యం కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందంటూ బాధాకరమైన జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అసలేంటీ పిల్స్మెన్స్ట్రువల్ సైకిల్‌ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నియంత్రిస్తాయి. నెలసరిని వాయిదా వేసే మాత్రలు హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క సింథటిక్ రూపమైన నోరెథిస్టెరాన్ను కలిగి ఉంటాయి. View this post on Instagram A post shared by Rebooting The Brain (@rebootingthebrain)వీటి వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలువికారం లేదా జీర్ణ సమస్యలు: తేలికపాటి కడుపు నొప్పి లేదా ఉబ్బరంరొమ్ములో నొప్పి,హార్మోన్ల మార్పులు వాపు లేదా అసౌకర్యానికి కారణం కావచ్చుతలనొప్పి , తలతిరగడం: తరచుగా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరగవచ్చు.చిరాకు, ఆందోళన లేదా తేలికపాటి నిరాశలాంటి మానసిక స్థితిలో మార్పులు సంభవించవచ్చుఎక్కువ కాలం తీసుకుంటే అధిక రక్తస్రావం. అరుదైన తీవ్రమైన ప్రభావాలురక్తం గడ్డకట్టే ముప్పు రావచ్చు. ముఖ్యంగా గడ్డకట్టే రుగ్మతలు, ఊబకాయం లేదా ధూమపాన అలవాట్లు ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువ.దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అలెర్జీ సమస్యలు రావచ్చు. ఇలాంటివి సంభవిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలివైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరం కావచ్చు.ఈ మాత్రలను గర్భనిరోధకంగా ఉపయోగించకూడదు. ఇవి గర్భధారణను నిరోధించవు.సుదీర్ఘ కాలం..సాధారణంగా 5–14 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు.సాధారణం ఈ మందు వాడటం అపివేసిన తరువాత ఈ ప్రభావాలు తగ్గిపోతాయి. అలాగే సాధారణంగా ఋతుస్రావం 2–4 రోజుల్లో తిరిగి ప్రారంభమవుతుంది. కానీ పక్షంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్టు, లాపరోస్కోపిక్ సర్జన్ డా. పూజిత సురానేని ఏమంటారంటే..ప్రిమోలుట్ఎన్ (నోరెథిస్టెరాన్ అధిక రక్తస్రావం, బాధాకరమైన పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ , ఎండోమెట్రియోసిస్ వంటి ఋతు రుగ్మతల చికిత్సలో వాడతారు. ఈ ఔషధం కృత్రిమంగా పెరిగిన ప్రొజెస్టెరాన్ స్థాయిలను నిర్వహించడం ద్వారా ఋతుస్రావాలను వాయిదా వేస్తుంది. అయితే దీన్ని ఋతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి తరచుగా లేదా సాధారణం ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే ఇది సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో పీరియడ్ సైకిల్‌ను ప్రభావితం చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా అధిక రక్తస్రావానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, పదేపదే వాయిదా వేయడం వల్ల తలనొప్పి, రొమ్ము నొప్పి, వికారం వంటి ప్రతికూల ప్రభావాల ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక వాడకంతో, రక్తం గడ్డకట్టడం, కాలేయ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా థ్రాంబోసిస్, కాలేయ వ్యాధి లేదా తీవ్ర రక్తస్రావం చరిత్ర ఉన్న మహిళల్లో విరుద్ధంగా ఉంటుంది. అందుకే వీటిని వాడేముందు నిపుణులైన గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలని కోరుతున్నారు.చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
19 ఏళ్లకు వెదుక్కుంటూ వచ్చిన అదృష్టం, వేలమందికి విందు
హర్యానా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, లింగ నిష్పత్తితో చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం. ఈ ప్రాంతంలో లింగ నిష్పత్తి చాలా కాలంగా సామాజిక సవాలుగా ఉంది; 2024లో 1,000 మంది పురుషులకు 910 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంతో సహా అనేక కార్యక్రమాల అమలుపై ఎక్కువ దృష్టిపెట్టారు. అయితే ఇటీవల అక్కడ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని జింద్‌లోని తువా గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత ఆడబిడ్డ పుట్టడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.చుట్టుపక్కల 21 గ్రామాల నుండి 8 వేల మందితో గొప్ప విందును ఏర్పాటు చేశారు.సురేంద్ర , కృష్ణ దంపతులకు పెళ్లైన 19 ఏళ్లకు ఆడబిడ్డకు జన్మనించారు. పాపాయి భూమి దేవి అని పేరు పెట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమ ఇంట్లో పాపాయి పారాడటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు ఇక తమకు పిల్లలు పుట్టరని భావించి, భర్త మేనల్లుడిని దత్తత తీసుకున్నారు. ఆ వేళా విశేషమో ఏమో కానీ కానీ జూలైలో, ఎలాంటి వైద్య చికిత్స తీసుకోకుండానే అద్భుతం జరిగింది. సాధారణంగా అబ్బాయి పుట్టినపుడు నిర్వహించే బావిపూజను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల 8 వేలమందికి విందును ఏర్పాటు చేశారు. తువా, తపా ఖాప్లతో సహా 25 ఖాప్‌ల నుండి సర్పంచ్‌లు నవజాత శిశువును ఆశీర్వదించడం విశేషం. హర్యానా గ్రామీణ ప్రాంతంలో ఆలోచనలను మార్చే దిశగా ఒక అడుగుగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది ప్రశంసించారు. "మా కుమార్తె ఒక వరం, కొడుకు పొందే ప్రతి గౌరవానికి ఆమె అర్హురాలు ఈ సందేశాన్ని చాటాలనుకున్నాం అందుకే ఈ విందు" అని తండ్రి సంతోషంగా చెప్పారు. మా సొంత బిడ్డ పుట్టడం మా జీవితాల్లో వర్ణించలేని ఆనందం.. అలాగని దత్తత కొడుకు మీద ప్రేమ ఏ మాత్రం తగ్గదు అంటూ తల్లి చెప్పింది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం
తన పరిస్థితిపై..మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..తెలంగాణ ఉద్యమంపై..భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగవిుస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది.వికసించిన రాజేశ్వరీ కవిత్వంరాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్‌మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్‌ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్‌లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది.వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజబూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్‌టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం.మహారాష్ట్రలో పాఠ్యాంశంరాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్‌తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్‌రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం. -
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా. వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతివర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి. మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు -
బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని
టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్(Sameera Shareef) ఒకతల్లిగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమీరా NICU శిశువుల కోసం 6 లీగటర్లకు పైగా తల్లిపాల (Breast Milk)ను భద్రపర్చారు. కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, తాను తనబిడ్డ సయ్యద్ అమీర్(రెండోబిడ్డ)ఇది సాధించామని ఇకముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో సమీరాపై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులుఆరు నెలల వరకు శిశువులకు తల్లి పాలు చాలా అవసరం. అలా తల్లి పాల విశిష్టతను తెసుకున్న చాలామంది మాతృమూర్తులు, తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను (బ్రెస్ట్‌మిల్క్)ను దానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమీరా కూడా తన పాలను డొనేట్ చేశారు. అంతేకాదు దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదనీ, తల్లిపాలు ఇవ్వడం అంత కష్టమేమీ కాదని పాలిచ్చే తల్లులకు ప్రోత్సాహానిచ్చారు. . మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ఉండండి, విశ్రాంతి తీసుకోండి. బాగా తినండి, హైడ్రేటెడ్ గా ఉండండి, బాగా తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పారు. అలాగే ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి భయపడాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief)fy"> టీవీ నటిగా, యాంకర్‌గా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సమీరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆడపిల్ల, అభిషేకం ముద్దుబిడ్డ, మూడు ముళ్ల బంధంలాంటి సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది సమీరా. 2019లో అన్వర్ జాన్(Anwar Jahn)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంటకు అర్హాన్, ఆమీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. -
300 లీటర్ల అమ్మపాలు దానం చేసిన అమృతమూర్తి
పుట్టే బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చేది తల్లి పాలు. ఇదే పోషకాహారం కూడా. అందాన్ని కాపాడుకునేందుకు కొద్దిమంది తల్లులు బిడ్డలకుపాలు ఇవ్వడం మానేసిన ఈ రోజులలో తిరుచ్చికి చెందిన బృంద నెలల తక్కువతో పుట్టే బిడ్డలకు అమృత మూర్తి అయ్యారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధి స్మారక ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్‌కు 300.17 లీటర్లపాలను దానం చేసి రికార్డులోకి ఎక్కారు. తిరుచ్చి కాట్టూరుకు చెందిన సెల్వ బృంద (34) ఇద్దరు బిడ్డల తల్లి.తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరం అని చాటే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బృంద. పసి బిడ్డల పాలిట అమృత మూర్తిగా ఉన్న సెల్వ బృంద దాన గుణానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆమెకు ‘అమృతం ఫౌండేషన్’ అండగా నిలిచింది. ‘సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, వ్యక్తిగత కారణాల వల్ల తల్లులుపాలను దానం చేయడానికి ముందుకు రావడం లేదు. తొలి నాళ్లలో నన్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. నిరాశపరిచే మాటలు వినిపించేవి. అయినా వెనక్కి తగ్గలేదు. తల్లిపాల దానంపై అవగాహన విస్తృతం కావాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలి’ అంటుంది సెల్వ బృంద.– అస్మతీన్ మైదీన్, సాక్షి–చెన్నై ఇవీ చదవండి: సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రత్యేకతే వేరు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన కమ్ అండ్ సే ‘జీ’డే రూ.1137 కోట్ల భారీ ప్రచారానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.చిన్న చిన్న క్రియేటివ్ మూమెంట్స్‌తో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఇన్‌స్టాలో సందడి చేస్తోంది. ఆత్మ , మనస్సు రెండింటినీ ఉత్తేజపరుస్తూ కొత్త అభిరుచిని కనుగొంది. ‘‘ఫైండ్ సారా ఎ న్యూ హాబీ" అనే ఇన్స్టాగ్రామ్ సిరీస్‌లో సారా టెండూల్కర్ తన ఖాళీ సమయంలో ఉత్తేజకరమైన మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే హాబీని ప్రదర్శించింది.సారా రగ్ టఫ్టింగ్లో తన టాలెంట్‌ను పరీక్షించుకుంది. ఆకుపచ్చ రంగు నూలును ఎంచుకుని టఫ్టింగ్ ద్వారా పావ్ ప్రింట్ రగ్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. టఫ్టింగ్ పూర్తైన తరువాత జిగురుతో అంటించింది కూడా. రగ్ టఫ్టింగ్ పూర్తి చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట్ సందడిగా మారింది.చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) రగ్ టఫ్టింగ్ అంటే ఏమిటిటఫ్టింగ్ అనేది ఒక టెక్స్టైల్ టెక్నాలజీ. టఫ్టింగ్ గన్ను ఉపయోగించి నూలుతో కాన్వాస్ మీద కుట్టడం. వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల, టఫ్టింగ్ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, నూలు చిక్కుకుపోవడం, లేదా కాన్వాస్ చిరిగిపోవడం వంటివి జరగవచ్చు. టఫ్టింగ్ తర్వాత, రగ్గును శుభ్రపరచడం, అంచులు కత్తిరించడం, ఇతర మెరుగులు పెట్టడం కూడా ముఖ్యమైనవి. ఇందులో విభిన్న అల్లికలు, మోడల్స్ ఉంటాయి.టఫ్టింగ్ ప్రక్రియ ఒక ఫౌండేషన్ ఫాబ్రిక్ను ఫ్రేమ్‌పై గట్టిగా సాగదీయడంతో ప్రారంభమవుతుంది. ఆపై ఒక డిజైన్ ఫాబ్రిక్పైకి మారుస్తారు. కావలసిన డిజైన్స్ కట్స్ చేస్తారు. చివరగా, రగ్ వెనుక భాగంలో రబ్బరు పాలు జిగురుతో అంటిస్తారు. టఫ్టింగ్కు అవసరమైన కొన్నిప్రాథమిక సాధనాల్లో టఫ్టింగ్ గన్, నూలు, టఫ్టింగ్ ఫ్రేమ్,బ్యాకింగ్ ఫాబ్రిక్, అంటుకునే, చెక్కే సాధనాలు, షీరింగ్ కోసం కత్తెర తదితర టూల్స్ అవసరం.ఇదీ చదవండి: ఒకే ఒక్క టిప్‌తో స్లిమ్‌గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం -
ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!
ప్రముఖ అమెరికన్ నటి, ప్రొడ్యూసర్ కెల్లీ మాక్ (kelley mack) ప్రాణాంతకమైన కేన్సర్‌తో కన్ను మూసింది.అరుదైన మెదడు కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. చిన్న వయసులోనే నటిగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న కెల్లీ అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.జూలై 10, 1992న ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు కెల్లీ మాక్. ది వాకింగ్ డెడ్, 9-1-1 , చికాగో మెడ్ వంటి మూవీలతో బాగా పాపులర్ అయ్యారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కరియర్ పీక్‌లో కొనసాగుతున్న సమయంలో, అరుదైన గ్లియోమా కారణంగా 33 ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కెల్లీ మాక్ సోదరి, కాథరిన్ క్లెబెనో ఇతర కుటుంబ సభ్యులు ఆమె మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు.కెల్లీ మాక్ మరణ వార్త అభిమానుల హృదయాలను కలచి వేసింది. అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ , బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన తరువాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె ప్రియుడు లోగన్ లానియర్ చాలా అండగా నిలిచాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణం తనకు తోడుగా ఉన్నాడని స్వయంగా కెల్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో కెల్లీ తన గ్లియోమా వ్యాధి గురించి అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు."సెప్టెంబర్‌లో, నేను నా బాయ్‌ఫ్రెండ్ లోగన్తో కలిసి కొత్త అపార్ట్మెంట్లోకి మారాను. ఆ తర్వాత ఒక నెల పాటు, నడుము నొప్పి విపరీతంగా ఉంది. డిస్క్ జారిందనుకున్నాను. కొన్ని వారాల తర్వాత, నా కుడి క్వాడ్(తొడకు, మెకాలిపైభాగానికి మధ్యలో)లో న్యూరోపతిక్ పెయిన్, ఆపై, కాళ్ళు , వీపులో తట్టుకోలేనంత నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అరుదైన ఆస్ట్రోసైటోమా, డిఫ్యూజ్ మిడ్లైన్ గ్లియోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది’’గ్లియోమా అంటే ఏమిటి?గ్లియోమా అనేది మెదడు, వెన్నుపాములలో వచ్చే ఒక రకమైన కణితి. న్యూరోగ్లియా అని కూడా పిలిచే గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఈ కణాలు నరాలకు మద్దతు ఇస్తాయి . కేంద్ర నాడీ వ్యవస్థ పనికి సహాయపడతాయి. అన్ని గ్లియోమాలు కణితులు కేన్సర్‌కు దారి తీయవు కానీ చాలా గ్లియోమాలు ప్రాణాంతకమైనవి.గ్లియోమాలు సాధారణంగా మెదడులో పెరుగుతాయి. కానీ వెన్నుపాములో కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా లాంటి అనేక రకాలు ఉన్నాయి. గ్లియోమా లక్షణాలు:గ్లియోమా లక్షణాలు కణితి ఎక్కడ ఉందో, పరిమాణం, కణితిఎంత వేగంగా పెరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటాయి. నొప్పి, వాంతులు, దృష్టి సమస్యలు, బలహీనత, మూర్ఛలు సాధారణంగా కనిపించే లక్షణాలు. గ్లియోమా చికిత్స కణితి రకం, పరిమాణం, వచ్చిన ప్లేస్‌పై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ , కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు. View this post on Instagram A post shared by Kelley Mack (@itskelleymack) -
లిఖిత అమ్మమనసు, హ్యాట్సాఫ్ అనాల్సిందే!
నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం’ అనే మాటను చాలాసార్లు విని ఉంటాం. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల వల్ల అందరు శిశువులు ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. నెలలు నిండని పిల్లలు, తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు తల్లిపాలు దొరకడం గగనమైంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది అనంతపురం నగరానికి చెందిన దర్శి లిఖిత. తాను పడిన ఇబ్బంది ఇతరులు పడకూడదని భావించిన లిఖిత పేదింటి శిశువులకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది.ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగూరులో ఎలక్ట్రికల్ మేనేజర్‌గా పని చేస్తోంది లిఖిత. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు బాబు పుట్టాడు. ‘మొదటి రెండు వారాల పాటు నాకుపాలు తక్కువగా వచ్చేవి. నాపాలతో పాటు డబ్బాపాలు బాబుకు పట్టేవాళ్లం. బాబు కడుపు నిండా తాగేవాడుపాలు తక్కువైన ప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న డబ్బాపాలు పట్టేదాన్ని. అయితే డబ్బాపాలు తాగించేటప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు, కొందరు వైద్యులు చెప్పిన సూచనలను, సలహాలను పాటించిన తర్వాత అదృష్టవశాత్తూ నాకు పాలు బాగా పడ్డాయి. నా బిడ్డ బొజ నింపుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలేవి. వాటిని తల్లిపాలు దొరకని చిన్నారుల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. విదేశాల్లో, బెంగళూరులాంటి ప్రాంతాల్లో మిల్క్ బ్యాంకుల గురించి విన్నాను. అనంతపురంలోనూ మదర్ మిల్క్ బ్యాంకు ఉందని అక్క శ్రీలేఖ (గైనకాలజిస్టు) చెప్పారు. నేను పడ్డ ఇబ్బంది ఇతరుల పిల్లలు, తల్లులూ పడకూడదని, అలాంటి వారికి తల్లిపాలు అందజేయాలని నిర్ణయించు కున్నాను’ అంటుంది లిఖిత.చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!లిఖిత తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. ప్రోత్సహించారు. పాలను స్టోరేజ్ చేయడానికి ఆన్లైన్లో ΄్యాకెట్స్ కొనుగోలు చేస్తుంది లిఖిత. వాటిలో నుంచి తన బిడ్డకు సరిపడాపాలు ఇస్తూనే మిగిలిన పాలను రోజూ 200 మి.లీ. వరకు సేకరించి డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంది. అలా నెల రోజుల పాటు సేకరించిన మొత్తం తొమ్మిది లీటర్ల పాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అందిస్తోంది.‘చనుబాల దానం కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. తల్లిపాల ప్రాముఖ్యత, దానిలోని ΄ోషకాలు, రోగనిరోధక శక్తి గురించి ప్రచారం చేస్తాను’ అంటుంది లిఖిత– ఆర్డీవీ బాలకృష్ణారావు, సాక్షి, అనంతపురంఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు లిఖిత బాటలోఅనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదతల్లులు గర్భం సమయంలో రకరకాల కారణాల వల్ల సౌష్టికాహారం తీసుకోకపోవడంతో నెలలు నిండక, బిడ్డ ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పసికందులు పాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం మదర్ మిల్క్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. లిఖిత ముందుచూపుతో తొమ్మిది లీటర్ల పాలు అందజేయడం సంతోషంగా అనిపించింది. వృత్తిరీత్యా బిజీగా ఉండే లిఖిత పేద పిల్లల గురించి ఆలోచించడం అభినందనీయం. ఇంకా ఎంతోమంది తల్లులు ముందుకువచ్చి పాలు ఇవ్వాలి. లిఖితను స్ఫూర్తిగా తీసుకోవాలి.– డాక్టర్ హేమలత, డిప్యూటీ ఆర్ఎంఓ -
ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’
ఇటీవలి కాలంలో భర్తలపై భార్యల హత్యాకాండలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అలాగే మహిళపై హింసకు వ్యతిరేకంగా, రక్షణకోసం తీసుకొచ్చిన గృహహింస చట్టం, 498ఏ చట్టాలు దుర్వినియోగ మవు తున్నాయనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు బాధితులుగానే ప్రపంచానికి తెలిసిన మహిళా లోకం ఎందుకు తిరగబడుతోంది? ఎందుకు ఇలా వికృతంగా మారుతోంది అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక మహిళ స్టోరీ నెటిజన్లను తీవ్రంగా కదిలిస్తోంది. అదేంటో తెలుసుకుందామా!రెడ్డిట్‌లో మర మహిళ పోస్ట్ ప్రకారం ఈ స్టోరీలోని మహిళది ప్రేమ వివాహం , ఇద్దరు పిల్లలు. చక్కగా సజావుగా సాగుతున్న కాపురమే. కానీ ఆమె భర్తతో జరిగిన చిన్న గొడవ , ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆమె క్షణికావేశాన్ని తండ్రి , సోదరుడు వాడుకున్నారు. భర్త మీద వరకట్నం, గృహ హింస కింద కేసు నమోదు చేయమని ఆమెను బలవంతం చేశారు. ఈమె కూడా మరేమీ ఆలోచించకుండా భర్తపై తప్పుడు కేసు పెట్టింది. విచారణల అనంతరం నాలుగేళ్లకు ఇరువురూ విడి పోయారు. కానీ భర్తతో విడిపోయే దాకా ఆమెను రెచ్చగొట్టిన సొంత తల్లిదండ్రులు, సోదరుడు, భార్య ఇప్పుడు ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పడుగానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. అసలు విషయం తెలిసి వచ్చి.. తప్పు చేశానని పశ్చాత్తాపడింది. భర్తకు క్షమాపణ చెప్పాలని ఆలోచించింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 37 ఏళ్ళ వయసులో ఆమె భర్త మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు“నా భర్త వద్దకు వెళ్లి అతనిపైనా, అతని కుటుంబంపైనా పెట్టిన అన్ని కేసులకుగాను క్షమాపణ చెప్పాలని అనుకున్నాను. కానీ అతను వివాహం చేసుకున్నాడు. జీవితంలో పూర్తిగా ఫెయిలయ్యాను” అని ఆ మహిళ రాసుకొచ్చింది. దీనిపై నెటిజనులు మిశ్రమంగా స్పందించారు. జరిగిన విషయంపై మహిళకు సానుభూతి తెలిపారు. ‘ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది, ధైర్యంగా ఉండండి’ అని ఒకరు ధైర్యం చెబితే, మరొకరు అన్యాయంగా కష్టాలు పడ్డ భర్తపై సానుభూతి వ్యక్తం చేశారు.‘మీకు తోడు నీడగా, కంఫర్ట్ జోన్‌గా ఉండాల్సిన భర్తను చాలా బాధపెట్టారు. గాయపరిచారు. పగవాళ్లకి కూడా మీ భర్తలాంటి కష్టం రాకూడదు’ అని మరొకరు కమెంట్ చేశారు. బంధువులు కాదు రాబందులు అంటూ ఒకరు, తల్లిదండ్రులు తోబుట్టువులను తప్పుబట్టారు. దగ్గరి బంధువులెవరైనా ఇంత మోసపూరితంగా ఎలా ఉంటారు అసలు? అంటూ మరి కొందరు వారి కుటుంబ సభ్యులను నిందించారు.చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం“భారతీయ భర్తలూ/పురుషులూ : ఇటువంటి మోసగాళ్లనుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్న ఒక యూజర్ వ్యాఖ్య వైరల్‌గా మారింది.తప్పుడు కేసులు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 మహిళలపై నేరాలను పోలీసుల డేటా ప్రకారం, మొత్తం 34,662 కేసులు తప్పుడు కేసులుగా తేల్చారు. ఇందులో భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత్వం కింద 7,076 కేసులు, అత్యాచారం కేసులు 4,340 మరియు మహిళలపై దాడి కింద 6,821 కేసులు ఆమె నమ్రతను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉన్నాయి. అలాగే, కిడ్నాప్ మరియు అపహరణ కింద 8,588 కేసులు కూడా తప్పుడు కేసులుగా ముగిశాయి.ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే! -
షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
షార్జాలో మరో మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్‌తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్‌లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.చదవండి: లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే2014లో సతీష్, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్‌తో కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య అప్పటినుంచీ బైక్, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి. పోలీసు కేసు కూడా నమోదైంది. ఇదీ చదవండి: బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంటఅయితే ఈ ఆరోపణలను సతీష్ ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన 16 నెలల కుమార్తెను హత్య చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే. -
కేన్సర్‌తో కన్నుమూసిన నటి, ప్రముఖ గాయని, కన్నీటి సంద్రంలో అభిమానులు
ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్ పోరాడి, పోరాడి తనువు చాలించింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 50 ఏళ్ల వయసులో పేగు క్యాన్సర్ తో పోరాడి, చికిత్స పొందుతూ,న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురుప్రముఖుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.ప్రేటా గిల్ బ్రెజిలియన్ సంగీత పరిశ్రమలో పేరుగాంచిన మహిళ ప్రెటా. 2023 జనవరిలో ఆమెకు పేగు కేన్సర్ నిర్ధారణ అయింది. కేన్సర్‌తో పోరాటం గురించి బహిరంగంగా చర్చించేది. రెండేళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, కఠినమైన తన పోరాటంలో అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. 2024లో శస్త్రచికిత్స జరిగింది.కణితిని, గర్భాశయాన్ని కూడా తొలగించారు. కీమోథెరపీ , రేడియోథెరపీతో చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా, చాలా ఆశావహ దృక్పథంలో ఉండేది. తన పోరాటంలో అనేక సవాళ్ల గురించి ఆత్మస్థైర్యంతో మాట్లాడేది. తద్వారా తనలాంటి కేన్సర్ రోగులకు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేది.సంగీత కారుడు, రాజకీయవేత్త గిల్బర్టో గిల్ కుమార్తెప్రేటా. 'ప్రేటా' అంటే పోర్చుగీస్ భాషలో 'నలుపు' అని అర్థం. తన కుమార్తెకు ఈ పేరు పెట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాడట.గిల్బర్టో గిల్ తన కుమార్తె ప్రేటా గిల్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.lutou até o fim. tentou, foi forte, foi guerreira. lidou com abandono, traição em plena descoberta da doença e em nenhum momento parou de sorrir. descanse em paz, preta gil. você é amor 🤍 pic.twitter.com/T6ddwBpPcY— mari (@ahcamilas) July 20, 2025 పేగు కేన్సర్, లేదా పెద్ద పేగు కేన్సర్, పెద్దప్రేగు లేదా మలనాళంలో ఏర్పడే కేన్సర్. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది, కానీ ఇటీవల యువతలో కూడా ఈ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.లక్షణాలు:మలంలో రక్తంమలబద్ధకం లేదా అతిసారం వంటి ప్రేగు అలవాట్లలో మార్పుబలహీనత, అలసట, బరువు తగ్గడంకడుపు నొప్పి, తిమ్మిరి, లేదా ఉబ్బరంపేగు కదలిక తర్వాత ప్రేగులు పూర్తిగా ఖాళీ అవ్వడం లేదనే భావన కారణాలు: 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.పేగు కేన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం.శారీరక శ్రమ లేకపోవడం.సిగరెట్లు, మద్యపానం. -
లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు. -
ఆ అయిదు రోజుల నిషేధంపై విజయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు. ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..ఒంటరి వేదన నుంచి విముక్తిమహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది. ఆంక్షల నుంచి అవగాహనవైపుగానెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.. -
తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్‌లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులుబెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు. -
అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
భువనేశ్వర్: ఒడిశారాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ (Soumyashree) ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు. దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్ పట్నాయక్ ‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: బాలేశ్వర్‌లో ఫకీర్ మోహన్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. సాయంత్రం ప్యాలెస్ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు. రాయగడ: బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపారీ్టలైన బీజేడీ, కాంగ్రెస్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్ లొ మంగళవారం నాడు కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భగ్గుమన్న బీజేడీ శ్రేణులుజయపురం: బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. నేడు, రేపు బంద్ భువనేశ్వర్: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై నిరసనలతో రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికి పోతుంది. ప్రధానంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాలు బలిగొందని నిందిస్తున్నాయి. విషాదకర సంఘటనని రాజకీయం చేయొద్దని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, రాష్ట్ర కాంగ్రెస్ వరుసగా రెండు రోజులు బంద్‌కు పిలుపునిచ్చాయి. తొలుత బిజూ జనతా దళ్ బుధవారం బాలాసోర్ బంద్ నిర్వహిస్తుందని ప్రకటించింది. విద్యార్థిని మృతిపై ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిజూ జనతా దళ్ బాలసోర్‌లో ఆరు గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. బంద్ సమయంలో దుకాణాలు, మార్కెటు సముదాయాలు, మోటారు వాహనాల రవాణా, బస్సులు, రైళ్లు రాకపోకలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని అభ్యర్థించారు. రేపు రాష్ట్ర బంద్ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 17 గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, 8 ఇతర రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా ఒడిశా బంద్ నిర్వహిస్తున్నట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విలేకర్లకు వివరించారు. బాలాసోర్ సంఘటనకు నిరసనగా ఒడిశా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌తో భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎం సహా 8 ఇతర రాజకీయ పార్టీలు మంగళ వారం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒడిశా బంద్ ప్రకటన చేశాయి. ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన,ఉద్రిక్తతసౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
Ajibabu చౌరస్తా నుంచి జిమ్ వరకు...!
‘మాట్లాడితే నవ్వు. నడిస్తే నవ్వు. నా జీవితం నవ్వుల పాలైంది’ అంటూ నిరాశ చీకట్లో అనీ మంగుళూరు మగ్గిపోయి ఉంటే... ఎంతో మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది కాదు. భిక్షాటన స్థాయి నుంచి అయిదు ఆటోల యజమాని స్థాయికి ఎదిగిన అనీ ఇతరులకు ఉపాధి ఇవ్వడంతో పాటు ట్రాన్స్‌జెండర్ వృద్ధులకు అండగా ఉంది.కర్నాటకలోని రాయచూర్‌లో పేదింట్లో పుట్టిన అజిబాబు మాటతీరు, నడక అమ్మాయిలను పోలి ఉండేవి. దాంతో స్కూల్ రోజుల నుంచి వెక్కిరింపులు, అవమానాలు కొత్త కాక΄ోయినా మంగుళూరులో డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ఎదుౖరైన చేదు అనుభవాలు తనకు చదువును దూరం చేశాయి. చదువును మధ్యలోనే వదిలేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చేరాడు.జెండర్ చేంజ్ సర్జరీ తరువాత అనిబాబు అనీ మంగుళూరుగా మారింది. సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం అయింది. ఉద్యోగం దొరకడం గగనం అయింది. గత్యంతరం లేక భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అమ్మ ఇచ్చిన కొద్దిమొత్తంతో ఆటో కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టింది అనీ. ఆటో కొనడం తన జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. మరో మూడు ఆటోలు కొనేస్థాయికి, ఇతరులకు ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగింది.అయినప్పటికీ ‘ఇక నాకు ఎలాంటి కష్టాల్లేవు’ అనుకోలేదు అనీ. కష్టాల్లో ఉన్న ట్రాన్స్జెండర్లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.అనీ నటి కూడా. ‘శివలీల’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే అనీ ఇప్పుడు జిమ్ ట్రైనర్‌గా మారింది.ట్రాన్స్ జెండర్ వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలనేది అనీ లక్ష్యంఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది -
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
ప్రముఖ కన్నడ నటి తన జీవితంలో ఒకముఖ్యమైన అంశం గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. 40 ఏళ్ల వయసులో బిడ్డల్ని కంటున్నాను అంటూ ప్రకటించింది. తద్వారా తాను పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ప్రేరణగా నిలవ బోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంతకీ ఎవరా నటి? ఎందుకు సింగిల్ మదర్‌గా ఉండాలనే సాహసోపేత నిర్ణయం తీసుకుంది? View this post on Instagram A post shared by Bhavana Ramanna (@bhavanaramannaofficial) భావన రామన్న తాను గర్భం దాల్చినట్టు తెలిపింది. ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నా అంటూ ఒక ధీర ప్రకటన చేసింది నటి భావన. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆరు నెలల బేబీ బంప్‌తో రెండు చిత్రాలను పోస్ట్ చేసింది. చాలా మంది మహిళల బిడ్డను కనాలనే కలలకు తాను ప్రతిరూపమంటూ ఈ భావోద్వేప్రయాణం ఎలా ఒడిదుడుకులతో నిండి ఉందో పంచుకుంది. ఒంటరి మహిళగా తన ప్రయాణాన్ని షేర్ చేసింది.ఇదీ చదవండి : రెండే రెండు టిప్స్ : 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్‌గా "ఇదొ కొత్త అధ్యాయం, ఇది నేను ఊహించలేదు. కవలలతో ఆరు నెలల గర్భవతిని. 20-30 ఏళ్లపుడు తల్లినవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ నాకు 40 ఏళ్లు నిండిన తరువాత ఆ కోరికను కాదనలేకపోయా. ఇపుడు ఇద్దరికి జన్మనివ్వబోతున్నా..అదీ ఒంటరి మహిళగా. ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. చాలా IVF క్లినిక్‌లు, వైద్యులు నన్ను తిరస్కరించారు.’’ అయినా సాధించాను. "తన పిల్లలకు తండ్రి ఉండరని తెలుసు, కానీ వారు కళ, సంగీతం, సంస్కృతి, ఎల్లలులేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. ఏంతో ప్రేమగా నమ్మకమైన చేతుల్లో పెరుగుతారు’’ అని తెలిపింది. అలాగే ఇంత కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన, తల్లిదండ్రులు, తోబుట్టువులకు, డాక్టర్ సుష్మకు భావన కృతజ్ఞతలు తెలిపింది. ‘‘ఇదేదో తిరుగుబాటుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కోరికను గౌరవించడానికే ఈ నిర్ణయం. నా స్టోరీ కనీసం ఒక మహిళను ఇన్స్పైర్ చేసినా అది చాలు నాకు.’’ అని పేర్కొనడం విశేషం. -
International Yoga Day మహిళలకోసం బెస్ట్ అండ్ హెల్దీ ఆసనాలు
మహిళల ఆరోగ్యానికి, అంతర్గత ఆనందానికి మేలైన సాధనంగా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేడు యోగా డే సందర్భంగా కొన్ని ఆసనాలు.హెల్దీగా.. హ్యాపీగా...కోణాసనం: సైడ్ యాంగిల్ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వేస్తే.. శరీరం బాగా స్టెచ్ర్ అవుతుంది. కాళ్లు, చేతులకు బలం చేకూరుతుంది. వెన్ను నొప్పి, సయాటికా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.వృక్షాసనం: నిటారుగా నిల్చొని, ఒక పాదాన్ని రెండవ కాలు మధ్యకి తీసుకొచ్చి, రెండు చేతులు తలమీదుగా పూర్తిగా పైకి నమస్కారం భంగిమలో తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది.పాద హస్తాసనం: నిటారుగా నిల్చొని, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను పాదాలకు, తలను మోకాళ్లకు ఆనించాలి. దీనివల్ల నరాల వ్యవస్థ చురుకుగా మారి.. రక్త ప్రసరణ మెరుగవుతుంది.అర్ధ మత్స్యేంద్రాసన: మ్యాట్ పైన కూర్చొని, ఎడమ కాలుని కుడి తొడ పక్కగా తీసుకొచ్చి, నేల మీద ఉంచాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలు నుంచి తీసుకొచ్చి, పాదం పట్టుకోవాలి. కుడి చేతిని నిటారుగా నేల మీద ఉంచాలి. ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.సేతు బంధాసన: దీనిని బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఇది కటి భాగం, గర్భాశయం, వెన్నుకి చాలా మంచిది. ఇది కటి కండరాలను బలోపేతం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.మార్జాలాసనం: క్యాట్–కౌ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వెన్నెముక బలానికి, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది కటి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.బాలాసన: చైల్డ్ పోజ్ పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతికి సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.భుజంగాసన: కోబ్రా పోజ్ గా పిలిచే ఈ ఆసనం ఛాతీ, వెన్ను భాగాలను బలోపేతం చేస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది. త్రికోణాసన: ట్రయాంగిల్పోజ్ వల్ల పాదాలు, కాళ్ళు, చేతులు, వెన్నును బలోపేతం అవుతాయి. శరీరానికి సమతుల్యతను అందిస్తుంది.మాలాసన: దీనిని గార్లాండ్ పోజ్ అంటారు. రెండు కాళ్ళను వెడల్పుగా ఉంచి, మోకాళ్ళ వరకు వంగి, చేతులను నమస్కారం స్థితికి తీసుకురావాలి. ఈ ఆసనం సాధన చేయడం వల్ల రుతుక్రమమం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. తొడ కండరాల శక్తి పెరుగుతుంది.ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి శారీరక ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఫలితంగా జీవన శైలిలో మంచి మార్పులు కలుగుతాయి. Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!– అనూష రాకేష్, యోగా ట్రైనర్, హైదరాబాద్ -
WE Reach వినూత్నంగా వీ రీచ్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడం, దానిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరంలోని ‘వీ హబ్’ (ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) మరో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా వ్యాపారం నిర్వహించాలనుకునే మహిళల స్టార్టప్ ప్రయాణానికి దోహదపడే ప్రీ–ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ‘వీ రీచ్’ గురువారం హబ్ వేదికగా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీ రీచ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార ఔత్సాహికులైన మహిళలకు ఈ ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా విభిన్న అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా టైర్–2, టైర్–3 ప్రాంతాల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ బూట్ క్యాంప్‌ల ద్వారా 120 మంది మహిళలను ఎంపిక చేసి పారిశ్రామికవేత్తలుగా రెండు బ్యాచ్‌లుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యాపార ఆలోచనకు అంకుర దశ నుంచీ వ్యాపారం స్థాపించే దశ వరకూ సమగ్ర మద్దతు అందించేందుకు రూపొందించారు. ఇందులో బిజినెస్ స్కిల్స్‌పై శిక్షణ, ఆర్థిక–డిజిటల్ లిటరసీ, మెంటార్íÙప్, ఎక్స్పోజర్ విజిట్లు, ఎమ్ఎస్ఎమ్ఈ ఫార్మలైజేషన్‌కు అవసరమైన సహకారాన్ని అందించడం వంటి కార్యక్రమాలుంటాయి. వీటివల్ల మహిళలు తమ సొంత వ్యాపారాన్ని స్థాపించి దాన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు పొందుతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!దీర్ఘకాలిక మార్పుకు నాంది.. వీ రీచ్వీ రీచ్ కార్యక్రమ ప్రారభోతవం సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కలిగించడం, వారి సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. ‘వీ రీచ్’ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడమే కాకుండా, సమాజంలో దీర్ఘకాలిక మార్పుని తీసుకురాగల సామర్థ్యం కలవని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి సహకార కార్యక్రమాలు పెరగాల్సిన అవసరముందన్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరోవీహబ్ సీఈఓ సీత పల్లచొల్ల మాట్లాడుతూ.. ఈ మూడు నెలల ప్రోగ్రాంలో వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకున్న మహిళలు అవసరమైన బిజినెస్ రిజి్రస్టేషన్లు సమకూర్చుకొని తమ వ్యాపార యూనిట్లను లాంఛనప్రాయంగా ప్రారంభించి ఆర్థిక పరిపుష్టి వైపు బాటలు వేస్తారని పేర్కొన్నారు. వీ హబ్ దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి ఇంక్యుబేటర్, నోడల్ సంస్థ అని అన్నారు. -
ఆర్టీ‘షీ’ డ్రైవర్!
ఆటో డ్రైవర్‌గా తండా గతుకుల రోడ్డు మీద ప్రయాణం ప్రారంభించిన సరిత నాయక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లకు భయపడి ఉంటే... తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా ప్రత్యేకత సాధించేది కాదు.సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ బాధ్యతలు భుజాలకెత్తుకుంది. అక్క భర్త దేవరకొండలో ఆటోడ్రైవర్. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఆటో నడపడం నేర్చుకుంది సరిత. బావకు విశ్రాంతి ఇచ్చి తానే ఆటో నడిపేది. తోటి డ్రైవర్లు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్లు. ఆటోకు పంక్చర్లు చేయ్యడం, బ్రేక్‌డౌన్ చేసి ఇబ్బందులకు గురి చేసేవారు.అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ మూడు సంవత్సరాల పాటు అక్కడే ఆటో నడిపింది. ఆ తరువాత ఆసుపత్రిలో నర్సుగా పని చేయడానికి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్ళింది. హోలి మేరీ నర్సింగ్ కాలేజిలో చేరడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫీజు కట్టే స్థోమత లేక అదే కాలేజిలో వార్డెన్ ఉద్యోగంలో చేరింది. వార్డెన్ గా పనిచేస్తునే హెవీ డ్రైవింగ్ స్కూల్లో బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. అదే కాలేజీలోనే బస్ డ్రైవర్‌గా పనిచేసింది.తండా టు దిల్లీహెవీ వెహికిల్ నడపడంలో సరిత నైపుణ్యం ఆజాద్ ఫౌండేషన్ ప్రతినిధి భానుశ్రీ దృష్టికి వచ్చింది. ఆమె సరితకు తమ సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చింది. ‘సఖీ క్యాబ్స్’ పేరుతో వంద మంది మహిళా డ్రైవర్లతో క్యాబ్స్ నడుపుతోంది ఆజాద్ ఫౌండేషన్. దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా కొత్త జీవితం ప్రారంభించిన సరిత, ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణతో హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలలో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో మహిళా డ్రైవర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుంది. అన్ని పరీక్షలలో నెగ్గి ఆ ఉద్యోగానికి ఎంపిక అయింది.తెలంగాణ ఆర్టీసీ గతంలో మహిళ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన్నప్పటికీ ఎవరూ దరఖాస్తు చేయ్యలేదు. సరిత ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా చేరడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళ డ్రైవర్‌గా ప్రత్యేకత సాధించింది. – తడకమళ్ళ శ్రీధర్, సాక్షి, సంస్థాన్ నారాయణపురంఅమ్మా,నాన్నల కోసం...దిల్లీలో ఉద్యోగం వదిలిపెట్టి అమ్మ,నాన్నల కోసం హైదరాబాద్‌కు వచ్చాను. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు లభించినందుకు గర్వంగా ఉంది. నేను ప్రయాణించిన దారిలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.– సరిత నాయక్ -
భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4— ANI (@ANI) June 16, 2025తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot. He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025 కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్యవిజయ్ రూపానీ - అంజలి రూపానీ విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
బాంబుల మోతలు వింటూనే...జేఈఈలో సక్సెస్!
అన్ని విజయాలను ఒకే గాటన కట్టలేము. అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని విజయాలు నల్లేరు మీద నడక అవుతాయి. కొన్ని విజయాలు అలా కాదు... కారుమేఘాల్లాంటి ప్రతికూల పరిస్థితులను చీల్చుకొని వెలుగు కిరణాలు అవుతాయి. ఇందుకు సాక్ష్యం కశ్మీరి అమ్మాయి జెనిస్... ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధవాతావరణ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)లో విజయం సాధించింది.పరీక్షకు ప్రిపేర్ కావాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. అయితే జెనిస్ ప్రిపరేషన్‌కు అవేం లేవు. ‘జేఈఈ’ పరీక్షలకు కొన్నిరోజుల ముందు... పాకిస్తాన్ బాంబుల శబ్దం వినిపించేది. మరోవైపు విరామం ఇవ్వని సైరన్లు. భయపెట్టేలా ఆకాశంలో డ్రోన్లు.ఎటు చూసినా భయానకమైన వాతావరణం.‘జేఈఈ పరీక్ష వాయిదా పడితే బాగుండేది’ అని మనసులో చాలాసార్లు అనుకుంది జెనిస్.‘ఇంత భయానక పరిస్థితుల్లో పరీక్ష రాయగలనా అనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది. ప్రిపరేషన్ సంగతి ఎలా ఉన్నా ‘పరీక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకోగలనా? అసలు వెళ్లగలనా?’ అనే సందేహం ఆమె మనసులో సుడులు తిరిగేది. ‘ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని పరీక్షకు పంపడం సరిౖయెనదేనా?’ అని జెనిస్ తల్లిదండ్రులూ ఆలోచనలో పడ్డారు.ఇదీ చదవండి: Air India plane crash కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!‘స్కూలు రోజుల్లో నాకు జేఈఈ గురించి బొత్తిగా తెలియదు. కశ్మీర్లో చాలామంది తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. తమ పిల్లలను మెడిసిన్ చదివించా లనుకుంటారు. కశ్మీర్లో జేఈఈ కోచింగ్ సెంటర్లు కూడా చాలా తక్కువ. ఇంటర్మీడియెట్‌లో జేఈఈ గురించి తెలిసిన తరువాత నాలో ఆసక్తి పెరిగింది. జేఈఈ ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను. గూగుల్ నాకు కోచింగ్ సెంటర్‌గా మారింది. జేఈఈ పరీక్షకు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్ చేసేదాన్ని’ అంటుంది జెనిస్.మొదటి ప్రయత్నంలో విఫలం అయినా రెండో ప్రయత్నంలో ‘జేఈఈ’లో విజయం సాధించింది. మొదటిసారితో పోల్చితే రెండోసారి ‘జేఈఈ’ కోసం ప్రిపేరవుతున్నప్పుడు బయటి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి.ఇంటర్నెట్ షట్‌డౌన్ మరో సమస్య. కరెంట్ కోతలు సరేసరి. ‘ఇంటర్నెట్ లేకపోతే ఆ ప్రభావం ప్రిపరేషన్‌పై పడుతుంది. ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్లో చేరలేదు’ అంటుంది జెనిస్. అయినప్పటికీ ‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అనే గట్టి పట్టుదలతో విజయం సాధించింది పుల్వామాకు చెందిన జెనిస్.‘మా ప్రాంతంలో ఇంజనీరింగ్ అంటే అబ్బాయిలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. నన్ను మెడిసిన్ చదివించాలనేది వారి కోరిక. నేను వారికి జేఈఈ గురించి వివరించాను. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టం. జేఈఈ గురించి చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్ చదవాల్సిందే అనకుండా నన్ను ప్రోత్సహించారు’ అని చెప్పింది జెనిస్. ‘జేఈఈ’ ప్రిపేర్ కావడానికి ముందు ఎంతోమంది బంధువులు జెనిస్ తల్లిదండ్రులతో.. ‘జేఈఈ అంటే అబ్బాయిలు రాసే పరీక్ష. మీరు జెనిస్‌తో మెడికల్ ఎంట్రెన్స్ రాయించండి ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు’ అనేవాళ్లు. అయితే వారి మాటలను జెనిస్ తల్లిదండ్రులు పట్టించుకోలేదు.చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!‘నువ్వు సాధించగలవు’ అని కూతురికి ధైర్యాన్ని ఇచ్చారు.తల్లిదండ్రులు ఇచ్చిన ్ర΄ోత్సాహబలంతో తన ‘ఐఐటీ’ కలను నిజం చేసుకుంది జెనిస్.‘జేఈఈ’ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నప్పుడు సైరన్లు, బ్లాకవుట్స్ వల్ల ఏకాగ్రత కుదిరేది కాదు. ‘జేఈఈ’ అడ్వాన్స్డ్ ఫామ్స్ ఫిల్ చేయలేనేమో అని భయపడ్డాను. అదృష్టవశాత్తు చేయగలిగాను. ఆపరేషన్ సిందూర్ మే 7న జరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 18. ఈ మధ్య కాలంలో ఎంతో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎక్కడెక్కడి నుంచో బాంబుల శబ్దాలు వినిపించేవి. అంతా భయంలోనూ ఈసారి ఎలాగైనా సీటు సాధించాల్సిందేనని అనుకున్నాను. – జెనిస్ -
కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!
Air India plane crash అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్‌లో తమ ప్రియమైన స్నేహితురాలు రంజిత గోపకుమార్ చనిపోయిందనే వార్త తెలిసి పుల్లాడ్ (కేరళ)లోని శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు షాక్ అయ్యారు.‘ఇది నిజమేనా!’ అని ఒకరికి ఒకరు ఫోన్ చేసుకున్నారు.పాత ఫోటోలలో రంజితను చూస్తూ భోరున విలపించారు.రంజిత నర్స్‌గా పనిచేసేది.‘రంజిత ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉండేది. అందరినీ నవ్వించేది. ఎన్నో కబుర్లు చెప్పేది. రంజిత నాకు మంచి స్నేహితురాలు. ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి’ అంటోంది జీజా దేవి. ఆమె రంజితకు పదవతరగతిలో క్లాస్మేట్.తురుతికాడ్లో ఇద్దరూ బీఎస్సీ కలిసి చదువుకున్నారు.డిగ్రీ సెకండ్ ఇయర్లో బీఎస్సీ నర్సింగ్‌లో చేరింది రంజిత.‘రంజితది ఒకరి మీద ఆధారపడే స్వభావం కాదు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఓపెన్‌గా ఉండేది. ఆమె చనిపోయిందనే వార్త ఒక పట్టాన నమ్మలేకపోయాను’ అంటోంది దేవి. రంజితకు ‘సొంత ఇల్లు’ కల ఉండేది.‘ఇల్లు కట్టుకోవాలనేది రంజిత కల. అందుకోసమే యూకేలో ఉద్యోగం చేయాలనుకుంది. కొత్త ఇంటి నిర్మాణం పుల్లాడ్లో జరుగుతోంది. తన కలల ఇంట్లోకి అడుగుపెట్టక ముందే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది’ అని బాధపడ్డారు రంజిత పొరుగింటి వ్యక్తి అనిల్ కుమార్.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
UNEP అంబాసిడర్, నటి లగ్జరీ కారు చూశారా? ధర ఏంత?
బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) తన ఖరీదైన కార్ల లిస్ట్‌లో మరో లగ్జరీ కారును జోడించింది. లగ్జరీ కంపెనీ బీఎండబ్లయూకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 635 కి.మీ. దూసుకుపోతుందట. మరీ దీని ఖరీదెంత? ఆమె గ్యారేజీలో ఇంతకుముందున్న కార్ల లిస్ట్ ఏంటి?బాలీవుడ్ ప్రముఖులు నెమ్మదిగా లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో ఇపుడు దియామీర్జా చేసింది. భారత మార్కెట్లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా పేరొందిన, రూ.1.39 కోట్ల (ప్రారంభధర) విలువైన BMW iX ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్) అంబాసిడర్ దియా గ్యారేజీకి సరిగ్గా సరిపోయేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.BMW బ్రాండ్‌పై దియాకు చాలా ప్రేమ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె లగ్జరీ కార్ కలెక్షన్లో BMW X3,BMW X5 కూడా ఉన్నాయి. భారతదేశంలో BMW X3, ధర సుమారు రూ.45 లక్షలు. 2013లో గుర్గావ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో BMW X1ని లాంచింగ్ ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ వెహికల్ ప్రౌడ్ ఓనర్‌గా ప్రకటించుకుంది. ఇంకా గ్యారేజీలో లెక్సస్ LX 570 , ఆడి Q7 వంటి ఇతర హై-ఎండ్ SUVలు కూడా ఉన్నాయి. చదవండి: ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?దియా మీర్జా కొత్త EVలో 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్,14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను,కర్వ్డ్ డిస్ప్లే లాంటి స్పెషల్ ఫీచర్స్‌తోపాటు, ఎలక్ట్రోక్రోమిక్ పనోరమిక్ గ్లాస్ రూఫ్ , మెమరీ ,మసాజ్ సామర్థ్యాలను అందించే మల్టీ-ఫంక్షనల్ సీట్లు ఉన్నాయి. 195 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి దాదాపు 35 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, 50 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి 97 నిమిషాల్లో, 22 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి దాదాపు 5.5 గంటల్లో, 11 kW AC ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు 11 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జ్‌పై 425 కి.మీ ప్రయాణించగలదట.బ్లాక్ సఫైర్ మెటాలిక్ కలర్లో ఈ కారులో లోపలి భాగం కాస్టానియా చెస్ట్న,నలుపు రంగుల క్లాసిక్ డ్యూయల్-టోన్ షేడ్స్‌లో ఉంది ఈ కారు. రితేష్ దేశ్‌ముఖ్,నుష్రత్ భరుచ్చా ,ఇబ్రహీం అలీ ఖాన్ వంటి నటులతోపాటుగా , కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ లగ్జరీ కారు సొంత చేసుకున్నారు. ఇదీ చదవండి: To day recipes : మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి! -
అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్‌శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం. -
ప్రపంచానికి పచ్చబొట్టు
ఒకప్పుడు చేతిపై బైగ పచ్చబొట్టు కనిపిస్తే... ‘పక్కా పల్లెటూరు వాళ్లు’ అని వెక్కిరించేవాళ్లు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ పల్లెల్లో ఒక వెలుగు వెలిగిన బైగ టాటూ ఆర్ట్ మిణుకు మిణుకుమంటూ ఆరి పోయే స్థితికి చేరుకుంది. ఆ కళ మళ్లీ ఉజ్వలంగా వెలిగేలా గల్లీ నుంచి దిల్లీ వరకు కృషి చేస్తోంది ఆదివాసీ మహిళ మంగళ బాయ్. మధ్యప్రదేశ్‌లోని మారుమూల పల్లె లాల్పూర్ నుంచి సిడ్నీ వరకు బైగ టాటూ ఆర్ట్‌ను తీసుకువెళ్లిన మంగళబాయ్...మధ్యప్రదేశ్‌లోని దిందోరీ జిల్లాలోని చిన్న గ్రామం అయిన లాల్పూర్లో పుట్టింది మంగళబాయ్. తల్లి శాంతిబాయ్ బైగ టాటూ ఆర్టిస్‌గా గొప్ప పేరు పొందింది. తల్లి నుంచి బైగ ఆర్ట్‌ను నేర్చుకుంది మంగళ. శాంతిబాయ్ ఎవరికైనా టాటూ వేస్తుంటే ‘నేను వేస్తాను’ అంటూ తల్లిని బతిమిలాడేది. ‘అలాగే’ అంటూ ఒకటి, రెండు గీతలు వేసే అవకాశం ఇచ్చేది శాంతిబాయ్. ఈ మాత్రం దానికే మంగళ ఏనుగు ఎక్కినంత సంబరపడి పోయేది. ఏడు సంవత్సరాల వయసు నుంచే బైగ టాటూ వేయడం మొదలుపెట్టింది మంగళ. పదకొండు సంవత్సరాల వయసులో తన బైగ ఆర్ట్‌ను నేషనల్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.పాత కళకు కొత్త కళబైగ టాటూ ఆర్ట్‌లో చెట్ల నుంచి పక్షుల వరకు, ఆదిమ చరిత్ర నుంచి పురాణాల వరకు ఎన్నో ప్రతీకలు కనిపిస్తాయి. వాటికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకోవడం గురించి ఎంతో శోధన చేయడమే కాదు నుదురు, మెడ, భుజాలు... శరీర భాగాలకే పరిమితం అయిన ‘బైగ’ను కాగితం, కాన్వస్ పైకి తీసుకురావడం ద్వారా ఆ కళకు కొత్త వెలుగు తీసుకువచ్చింది మంగళ. కాగితం, కాన్వస్పైకి తీసుకురావడం ద్వారా బైగ టాటూ ఆర్ట్ పునర్జీవానికి కొత్త మార్గాన్ని కనిపెట్టింది.అంతర్జాతీయ స్థాయిలో... ఆహా!మారుమూల ఆదివాసీ పల్లెలకే పరిమితమైన బైగ టాటూ ఆర్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఆహా అనిపిస్తోంది మంగళ. ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’లో జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్లో మంగళ ఆర్ట్‌వర్క్‌కు మంచి స్పందన లభించింది. ‘మా సంప్రదాయ కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గర్వంగా ఉంది. ఇది మా కళ అని ప్రతి ఆదివాసీ గర్వపడేలా చేసింది’ అంటుంది మంగళ.అనేక అంశాల ప్రతీక... బైగమోడ్రన్ బాడీ ఆర్ట్‌తో పోల్చితే బైగ డెకరెటివ్ కాదు. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆధ్యాత్మిక స్ఫూర్తి, ప్రకృతిలో తమకు ఉన్న అనుబంధం, జీవితంలోని వివిధ దశలు ఈ కళలో ప్రతిఫలిస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ పల్లెల్లో అమ్మాయిలలో కొందరికి ‘బైగ’పై ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ్ర పోత్సహించడం అరుదు. ‘బైగ’ వల్ల పిల్లల చదువు దెబ్బతింటుందని వారి భయం. ‘ఈ కాలం పిల్లలు మోడ్రన్‌గా ఉండాలనుకుంటున్నారు. సంప్రదాయ కళలలోని గొప్పదనం వారు గ్రహించడం లేదు’ అంటుంది మంగళ. గల్లీ నుంచి దిల్లీ వరకు ‘బైగ’ కళ గురించి విస్తృత ప్రచారం చేస్తున్న మంగళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందలేదు. అయితే దాని తాలూకు అసంతృప్తి ఏదీ ఆమె మాటల్లో వినిపించదు.ఎంతోమంది దృష్టికి వచ్చేలా...నిరాశపరిచే మాటలు ఎన్ని వినబడినా బైగ కళపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు మంగళ. తాను ఊహించని స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బైగకు ఆదరణ లభించింది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వలన ‘బైగ’ ఆర్ట్‌ను విద్యావంతులు, ఆంత్రోపాలజిస్ట్‌లు, ఆర్ట్ కలెక్టర్ల దృష్టికి వచ్చేలా చేసింది. ‘నా లక్ష్యం బైగకు సంబంధించి ఘనమైన గతాన్ని గుర్తుకు తేవడం కాదు.భవిష్యత్ తరాలకు దాని విలువ తెలియజేయడం. దాన్ని కాపాడుకునేలా చేయడం’ అంటుంది మంగళ. ‘మన దేశంలో బైగ ఆర్ట్ అంతరించి పోకుండా ఉండడానికి మంగళ ఎంతో కృషి చేశారు. ఈ కళను బతికించుకోవడానికి ధైర్యం, శక్తి కావాలి. అవి మంగళలో ఉన్నాయి’ అంటున్నాడు మంగళ బాయ్ అసిస్టెంట్ అమిత్.మార్పు వస్తుందిమోడ్రన్ టాటూలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సంప్రదాయ టాటూలకు ఉన్న విలువ వేరు. అవి మన చరిత్ర, సంస్కృతి, పురాణాలతో ముడిపడి ఉన్నవి. ప్రతి ప్రతీకకు ఒక అర్థం ఉంటుంది. బైగ అనేది మన మూలాలను గుర్తుకు తెచ్చే కళ. నా చిన్నప్పుడు అమ్మ ఊరూరికీ వెళుతూ మహిళలకు బైగ టాటూ వేసేది. ఒంటిమీద బైగ టాటూ ఆర్ట్ కనిపిస్తే ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఉండేది. బైగను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం వలన వారిలో మార్పు వస్తుందని, ‘ఇది మా కళ’ అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది అని ఆశిస్తున్నాను. – మంగళ బాయ్ -
SITHA APP మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సాధికార తను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని, ఇప్ప టికే ఆ దిశగా ప్రయాణం మొదలైందని చెప్పారు. సోమవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ‘షీ జాబ్స్’ఆధ్వర్యంలో రూపొందించిన ‘సీత’(షి ఈజ్ ది హీరో ఆల్వేస్ SITHA)’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కుటుంబాల్లో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకుని నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఆ దిశగా ఇంటి నుంచే మొదటి అడుగు పడాలి. కేంద్ర గణాంక శాఖ భారత్‌లో పురుషులు, మహిళలు – 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86%, పట్టణాల్లో 89% మంది మహిళలు భాగస్వాములవుతున్నారు. మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తు న్న తెలంగాణ విజయగాథ ఇది’అని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ‘ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025’కు శ్రీకారం చుట్టి, 17 రకాల వ్యాపారాల్లో వారిని పారిశ్రామిక వేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.మహిళా సంఘాలకు తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 31 జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ప్రారంభానికి చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’అని వివరించారు. ‘సీత’యాప్ మహిళల ఉత్పత్తు లకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. కార్య క్రమంలో ప్రముఖ సినీనటి శ్రీలీల, సినీ డైరెక్టర్ హరీష్ శంకర్, షీ జాబ్స్ నిర్వాహకురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
వృథా చేయని సమయమే ర్యాంక్ తెస్తుంది
ఐ.ఐ.టి. జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్ష అంటే పరీక్షలకే పరీక్ష. అలాంటి పరీక్షను 2025లో లక్షా తొంభై వేల మంది రాస్తే వారిలో అమ్మాయిలు 43,000 మంది. ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది దేవదత్తా మాఝీ(Devdutta Majhi). బెంగాల్‌లోని చిన్న ఊర్ల విద్యార్థినుల విజయం ఇది. జె.ఇ.ఇ. మెయిన్ సీజన్ 1, సీజన్ 2లలో టాప్ 1 ర్యాంక్ సాధించిన దేవదత్తా కోచింగ్ లేకుండా సొంతగా చదువుకుంది. ‘మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని ర్యాంక్‌కు దూరం చేస్తుంది’ అని హెచ్చరిస్తూ ఉంది ఆ చదువుల సరస్వతి.ర్యాంక్ రావడం గురించి కోచింగ్ సెంటర్లకు ఒక వైఖరి ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది. మా దగ్గర కూచోబెట్టి రాత్రి తెల్లవార్లు చదివిస్తే ర్యాంకు వస్తుందని కోచింగ్ సెంటర్ వాళ్లూ, ఎయిత్ క్లాస్ నుంచే కోచింగ్‌లో పెడితే ఇంటర్ అయ్యే సరికి చచ్చుకుంటూ ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులూ, ఆపకుండా క్లాసులు విని మాక్ టెస్టులు రాస్తే ర్యాంక్ వస్తుందని విద్యార్థులు అనుకుంటూ ఉంటారు.తీరా రిజల్ట్స్ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి. బ్లేమ్ క్వశ్చన్ పేపర్ మీదకు వెళుతుంది. ‘పేపర్ చాలా టఫ్‌గా వచ్చింది కాబట్టే మా అబ్బాయికి ర్యాంక్ రాలేదు’ అనీ, ‘కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా చేసింది కాని మేథ్స్‌లో దెబ్బతింది మా అమ్మాయి’ అని కామెంట్లు వస్తుంటాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్ సెంటర్ వారూ అనుకుంటారు. మన తెలివితేటలకు ఇంకా మంచి ర్యాంక్ రావాలని విద్యార్థులు డిజ΄్పాయింట్ అవుతారు.కాని జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌కే కాదు ఏ పరీక్షకైనా ర్యాంక్ రావాలంటే మొదట పూనుకోవాల్సింది, సంకల్పించాల్సింది విద్యార్థే అంటోంది దేవదత్తా మాఝీ. లక్షా తొంభై వేల మంది రాసిన జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్షలో కామన్ ర్యాంక్ 16 సాధించిన దేవదత్తా అమ్మాయిలందరిలో టాప్ 1 ర్యాంకర్‌గా నిలిచింది. అంతే కాదు జె.ఇ.ఇ మెయిన్స్‌లో 100 పర్సంటైల్ సాధించింది.కోచింగ్ లేకుండానే...‘నేను కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చరర్ల నుంచి తీసుకున్నాను. మిగిలినదంతా సెల్ఫ్ స్టడీనే.పోటీ పరీక్షల్లో ర్యాంకు రావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి. టెన్త్ అయిపోయాక రెండేళ్లపాటు నేను నా ఫ్రెండ్స్‌ని, బంధువులను కలవలేదు. ఫంక్షన్స్‌కు అటెండ్ కాలేదు. కచ్చితంగా రోజుకు పది, పన్నెండు గంటలు చదివాను. ఏనాడూ డిసిప్లిన్ తప్పలేదు. మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలి’ అంది దేవదత్తా మాఝీ.తల్లి మార్గదర్శనందేవదత్తా తల్లి ఫిజిక్స్ టీచర్. తండ్రి లెక్చరర్. వీరు ఉంటున్నది కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరు. దేవదత్తా గవర్నమెంట్ హైస్కూల్లోనే టెన్త్ చదివి 2023లో స్టేట్ టాప్ 6వ ర్యాంకర్‌గా నిలిచింది. ‘అప్పటినుంచే నాకు ఐ.ఐ.టి. అడ్వాన్స్డ్ సాధించాలని కోరిక. అందుకు వేరెవరో కష్టపడితే నాకెలా ర్యాంక్ వస్తుంది. కష్టపడి చదవాల్సింది నేనే... ర్యాంక్ సాధించాల్సింది నేనే. కోచింగ్ సెంటర్లలో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్ వచ్చేయదు. నా చదువుకు అమ్మ కొంచెం గైడ్ చేసింది. నేను మొదట మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో థియరీ అంతా చదువుకున్నాను. తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. టెక్స్›్టబుక్స్ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదివాను’ అంటుంది దేవదత్తా.ఏ.ఐ. చదవాలని...దేవదత్తా ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి. పరిధిలోకి వచ్చినా తాను మాత్రం ఐ.ఐ.ఎస్.సి. బెంగళూరులో ఏ.ఐ. అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటోంది. ‘నేను వయొలిన్ బాగా వాయిస్తాను. కాని పరీక్షల కోసం దానినీ పక్కన పెట్టేశాను. అయితే పరీక్షలయ్యాక ఇప్పుడు మళ్లీ వయొలిన్ వాయిస్తున్నాను. ఈ రెండేళ్లు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్ అయ్యాను. ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలతోనే’ అని ముగించింది దేవదత్తా. -
‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా!
చెద పురుగులు (termites) ఇళ్లలోనే కాదు, పంట పొలాల్లో కూడా సమస్యలు సృష్టిస్తుంటాయి. పంటలను ఆశిస్తూ 10 నుంచి 50% వరకు దిగుబడి నష్టం కలిగిస్తుంటాయి. రైతులు సాధారణంగా రసాయనాలు చల్లి పంట పొలాల్లో చెదలును నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, రసాయనాలతో పని లేకుండా సులభంగా, స్వల్ప ఖర్చుతో చెదలు సమస్యకు పరిష్కారాన్ని వెదకటంలో ఓ వృద్ధ మహిళా రైతు అసాధారణమైన విజయం సాధించారు. యూకలిప్టస్ కొమ్మలు/కట్టె ముక్కలను పొలంలోని పంటల సాళ్ల మధ్య ఉంచితే, చెద పురుగులు పక్కనే ఉన్న పంటల జోలికి వెళ్లకుండా యూకలిప్టస్ కొమ్మలనే ఆశిస్తున్నాయని ఆమె కనుగొన్నారు. సజ్జ నుంచి గోధుమ వరకు..గోధుమ చేనులో 12“12 మీటర్ల దూరంలో ఎకరానికి 32 చొప్పున స్ప్రింక్లరు ఉంటాయి. ప్రతి స్ప్రింక్లర్‌కు దగ్గర్లో ఒక యూకలిప్టస్ కట్టె ముక్క/ కొమ్మను ఆమె పెట్టారు. ఒక్క గోధుమ మొక్కను కూడా చెదలు ఆశించలేదు. ఒక్కో కట్టె ముక్కను వేలకొద్దీ చెద పురుగులు చుట్టుముట్టాయి. అంటే పంట వైపు నుంచి ఈ యూకలిప్టస్ కట్టెలు చెదపురుగుల దృష్టిని వంద శాతం మళ్లించాయన్న మాట. ఎకరానికి ఖర్చు కేవలం రూ. 320లు. ఈ కట్టెలను ప్రతి పంట కాలానికీ కొత్తవి వేయాల్సిన అవసరం లేదు. మూడు పంటల వరకు అవే సరిపోతున్నాయని ఆమె తెలిపారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ గుర్తింపుభగవతి దేవి ఈ విషయాన్ని ఫతేపూర్ షెఖావతిలోని కేవీకే శాస్త్రవేత్తల చెప్పారు. వరుసగా నాలుగేళ్ల పాటు అనేక పంటల్లో ప్రయోగం చేసి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. బికనెర్‌లోని రాజస్థాన్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీ పంటలోనూ అద్భుత ఫలితాలు రావటంతో, రైతులందరికీ ఇది అనుసరించమని చెబుతున్నారు. తళుక్కుమన్న ఉపాయంపనులు చేస్తూనే అసాధారణంగా ఉన్న విషయాలను గమనిస్తూ ఉండటం భగవతి దేవికి అలవాటు. వంట కలపను ఇంటికి తెచ్చి పొయ్యిలో పెడుతున్న ఒక సందర్భంలో ఆమె దృష్టిని యూకలిప్టస్ కర్రలు ఆకర్షించాయి. యూకలిప్టస్ కర్ర ముక్కల పైకి మిగతా కర్రల కంటే చాలా ఎక్కువ చెదపురుగులు చేరుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ గ్రహింపు కలిగిన మరుక్షణమే ఆమె మదిలో ఒక కొత్త ఉపాయం తళుక్కున మెరిసింది. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పుడు సాగులో ఉన్న సజ్జ పంటలో అమలు చేసింది. 2 నుంచి 3 అడుగుల పొడవు, 2 నుంచి 3 అంగుళాల లావు ఉన్న యూకలిప్టస్ కర్ర ముక్కలను తీసుకొని, సజ్జ పొలం అంతటా సాళ్ల మధ్యలో పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే, ఆ కర్ర ముక్కల చుట్టూ వేలకొలది చెద పురుగులు చేరి, కర్రలను కొరికి తినటం ప్రారంభించాయి. ఆశ్చర్యమేమిటంటే.. చెద పురుగులు ఇక సజ్జ మొక్కల జోలికి పోలేదు. యూకలిప్టస్ కర్ర ముక్క నుంచి 4 అంగుళాల దూరంలో ఉన్న సజ్జ మొక్కలను కూడా అవి ఆశించలేదు. అంతే. భగవతి దేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. జఠిలమైన చెదలుకు ప్రకృతిసిద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్న రాజస్థాన్ వృద్ధ మహిళా రైతు యూకలిప్టస్ కర్ర ముక్కలను పొలంలో ఉంచటం ద్వారా.. చెద పురుగులు పంటలను పాడు చెయ్యకుండా కాపాడుతున్నారు. -
SHE Teams: మేముంటాం అండగా!ధైర్యంగా ముందుకు రండి..
బంజారాహిల్స్: మహిళలు, చిన్నారుల కోసం బీఎన్ఎస్లో ఓ బలమైన చట్టాలను ఏర్పాటు చేశారని వాటి పట్ల మహిళలకు అవగాహన ఉండాలని షీ టీమ్స్, భరోసా ఏసీపీ ప్రసన్న లక్ష్మి అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్డు నం. 12లోని సీఎంటీసీ భవన్లో జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలోని మహిళా సమాఖ్యలకు షీటీమ్స్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసరావు, భరోసా సెంటర్ అడ్మిన్ మేరీతో కలిసి మహిళలు, చిన్నారుల చట్టాలతో పాటు పాష్ యాక్ట్, పోక్సో యాక్ట్, వరకట్న వేధింపు చట్టం, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. ఎన్నోసార్లు ఏదైనా ఘటన జరిగినప్పుడు అది ఎవరికి చెప్పాలి.., ఎలా చెప్పాలి, అసలు అది తప్పా కాదా అనే మహిళలకు అవగాహన ఉండటం లేదని వారు అన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ లావణ్య సూచనల మేరకు అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో మహిళా సమాఖ్యలు, అనుబంధంగా పని చేసే రిసోర్స్ పర్సన్లకు ఈ చట్టాల పట్ల అవగాహన ఉండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు సరైన మార్గంలో వెళ్తారని వారు సూచించారు. నగరవ్యాప్తంగా 13 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, షీ టీమ్స్ ఉన్నాయని ప్రత్యేకంగా భరోసా సెంటర్ కూడా ఉందని వారు తెలిపారు. భరోసాతో కౌన్సెలింగ్ ... ఏదేని క్రైం వల్ల బాధితులయ్యే మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని అన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారికి ఒక్కోసారి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా భరోసా అండగా ఉంటుందని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే పోష్ యాక్ట్ ప్రకారం వారు శిక్షార్హులు అవుతారని ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని అలాగని వాటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో తిరిగే మహిళా సమాఖ్యల ప్రతినిధులు బాల్య వివాహాలు ఎక్కడ, ఎవరు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి సరైన విద్యతో పాటు కౌన్సెలింగ్ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. చిన్నారులను వేధిస్తే... 1090 షీటీమ్ 9490616555, 040–27852355 మహిళలందరికీ అవగాహన కలిస్తాం చాలా మంది మహిళలకు చట్టాలపై అవగాహన లేదు. చట్టాలపై అవగాహన అనేది ఎంతో అవసరం. ఏ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి.. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అనే విషయాలను మహిళలకు వివరిస్తున్నాం. త్వరలోనే నగర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. – ప్రసన్న లక్ష్మి, షీటీమ్స్, భరోసా ఏసీపీ క్షేత్ర స్థాయిలో వివరిస్తాం : పోలీసు అధికారులు చెప్పిన ఎన్నో చట్టాలను మహిళా సమాఖ్యల ప్రతినిధులు తెలుసుకున్నారు. వీటిపై మేం కూడా క్షేత్ర స్థాయిలో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తాం. మా సర్కిల్ పరిధిలో మహిళా సమాఖ్యలతో అనుసంధానమైన 8 వేల మందికిపైగా మహిళలు ఉన్నారు. వారందరికీ చట్టాలపై అవగాహన కల్పిస్తాం. – ఆషా విరానిక, డీపీవో, సర్కిల్ –18 బస్తీల్లోనూ అవగాహనకల్పిస్తాం.: చట్టాలపై అధికారులు పెట్టిన ఈ సమావేశంతో ఎన్నో విసయాలు తెలుసుకోగలిగాం. బస్తీల్లో చాలా మంది మహిళలు జరిగిన విషయాలను మా వద్దకు వచ్చి చెప్తుంటారు. ఈ చట్టాలను వినియోగించి వారికి న్యాయం జరిగేందుకు సహకరిస్తాం. - పద్మ, మహిళా సమాఖ్య ప్రతినిధి -
సాగర ధీరలకు స్వాగతం
ఎనిమిది నెలలు ఒక సెయిలింగ్ వెసెల్. ఇద్దరే నావికులు... మూడు మహా సముద్రాలను నాలుగు ఖండాలను 50,000 కిలోమీటర్ల దూరాన్ని భీకర వాతావరణాన్నిదాటి విజేతలుగా నేడు (మే 29)న గోవాకు చేరుకోనున్నారు. వీరికి ఘన స్వాగతం చెప్పడానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ రానున్నారు. ఇండియన్ నేవీ ఆఫీసర్లు దిల్నా, రూపాలకు హర్షధ్వానాలతో స్వాగతం చెప్పాల్సిన సమయం ఇది.భారత నౌకాయాన చరిత్రలో గతంలో స్త్రీల సాహసం ఎటువంటిదో నమోదు చేసే వివరాలు అంతగా తెలియదు. కాని వర్తమానంలో మన నారీశక్తి ఎంత గొప్పదో నిరూపించే ఘనయాత్రలను నావికా దళ మహిళా ఆఫీసర్లు పదే పదే నిరూపిస్తున్నారు. నావికాదళంలోని మహిళా నావికులు తమకు తాముగా సముద్రం మీద ప్రపంచ యాత్ర చేయగలరు అని చాటడానికి 2017–18లో ఆరుగురు మహిళా సిబ్బందితో ‘నావికా సాగర్ పరిక్రమ – 1’ జరిగింది. 40 వేల కి లోమీటర్లు ఐ.ఎన్.ఎస్.వి. తారిణిపై చుట్టివచ్చారు. ఆరుగురు సిబ్బంది అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఉండే వెసులుబాటు ఎక్కువ. అయితే మనవాళ్లు అక్కడే ఆగిపోలేదు. కేవలం ఇద్దరు మహిళా ఆఫీసర్లతో ‘నావికా సాగర్ పరిక్రమ–2’ చేయ సంకల్పించారు. ఇందుకు తగిన ఆఫీసర్ల ఎంపికకే సంవత్సర కాలం పట్టింది. అనేక వడపోతల తర్వాత ఇద్దరు ఆఫీసర్లు ఈ సాహసయాత్రకు యోగ్యత పొందారు. వారే లెఫ్టినెంట్ రూపా, లెఫ్టినెంట్ దిల్నా. కేవలం ఇద్దరు ఆఫీసర్లు అనంత జలరాశిపై సెయిలింగ్ బోట్ మీద 50 వేల కిలోమీటర్లు చుట్టి రావాలంటే ఎంత ధైర్యం... సాహసం ఉండాలి? ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలి? అసలు తిరిగి వస్తారో రారో అనే భయం అయినవాళ్లను పీడించకుండా ఉంటుందా? అయినప్పటికీ అవన్నీ దాటి ఆ ఇద్దరు ధీరవనితలు తమ సాగర పరిక్రమను దిగ్విజయంగా ముగించారు. ఎనిమిది సుదీర్ఘ నెలలు సముద్రంతో చెలిమి, చెలగాటం చేసి తిరిగి మన జలాలలోకి చేరుకున్నారు. నేడు వారికి ఘనస్వాగతం గోవాలో లభించనుంది.అక్టోబర్ 2, 2024నప్రారంభంనావికా సాగర్ పరిక్రమ–2 అక్టోబర్ 2, 2024న గోవాలో మొదలైంది. ఇద్దరు నావికా ఆఫీసర్లు దిల్నా, రూపాలు అంతకుముందే ఐ.ఎన్.ఎస్.వి.తారణిలో చిన్న చిన్న దూరాలున్న సముద్ర యాత్రలు చేసి ఆ రిహార్సల్స్‌తో సర్వసన్నద్ధం అయ్యారు. వీరు ఎనిమిది నెలల పాటు తారణిలో ఉండాలి. 50 వేల కిలోమీటర్లు పడవ నడపాలి. మూడు మహా సముద్రాలు– ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్ గుండా ప్రయాణించాలి. నాలుగు ఖండాలు ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, ఆఫ్రికాలను చుట్టాలి. కేవలం నాలుగు చోట్ల వీరు బ్రేక్ తీసుకునే ఏర్పాటు చేశారు. అవి– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్‌ల్యాండ్, కేప్‌టౌన్. తారిణిలో అత్యాధునిక సిగ్నెలింగ్ వ్యవస్థ ఉంటుంది. తీరం నుంచి నావికాదళం వీరితో అనుసంధానమై ఉండి వీరి యాత్రను గమనిస్తూ ఉంటుంది. అయినా సరే నడిసముద్రంలో నావ ఉన్నప్పుడు వీరు ఇరువురు మాత్రమే ఉంటారు. వీరితోపాటు నావ. ఎదురుగా అనంత జలరాశి.గాలే కీలకంలెఫ్టినెంట్ దిల్నా, రూపా ప్రయాణిస్తున్న తారిణి ఒక సెయిలింగ్ వెస్సెల్. అంటే గాలివాటుతో ప్రయాణించాల్సిన తెరచాప పడవ. దీనికి 25 మీటర్ల ఎత్తు తెరచాపలు ఉన్నాయి. గాలి అదుపులో ఉంటే పడవ దూసుకెళుతుంది. ‘ఒక్కోసారి సముద్రం మీద రోజుల తరబడి గాలి ఉండదు. నావ కదలదు. మన సహనం పరీక్షకు గురవుతుంది’ అన్నారు దిల్నా, రూపా. అదే సమయంలో కేప్ హార్న్స్, కేప్ టౌన్, డ్రీక్ పాసేజ్ వంటి చోట ఇదే గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తే పడవను అదుపు చేయడంప్రాణాంతకం అవుతుంది. గ్రీక్ పాసేజ్ దగ్గర అలలు ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతూ పడవను ముంచెత్తుతాయి. కాగితం పడవను ఊపినట్టు ఊపేస్తాయి. అంతేకాదు కొన్నిచోట్ల అతి శీతల గాలులు... వణికించే చలి... గడ్డకట్టినంత చల్లగా ఉండే సముద్రనీరు ఉంటాయి... వీటన్నింటిని తట్టుకోవడం వల్లే దిల్నా, రూపాలను ధీరలని, సాహస నావికులని అనాలి. ముఖ్యంగా ‘కేప్ హార్న్’ను జయించే అదృష్టం అందరికీ దక్కదు. అది దాటిన వారికి ‘కేప్ హార్నర్స్’ అనే బిరుదును ఇస్తారు. ఇప్పుడు దిల్నా, రూపాలకు కూడా ఆ బిరుదు దక్కింది.నీమొ పాయింట్సముద్ర ధ్రువంగా భావించే నీమొ పాయింట్‌ను లెఫ్టినెంట్ దిల్నా, లెఫ్టినెంట్ రూపాలు ఈ సాగర పరిక్రమలో టచ్ చేయడం పెద్ద విశేషంగా చెప్పాలి. దాదాపుగా ఈ పాయింట్ దగ్గరకు నావికులు వెళ్లరు. దీనికి దగ్గరి భూభాగమే 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే ఆలోచించుకోవచ్చు. ఈ పాయింట్‌కు భూమిపై ఉండే మనుషుల కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే మనుషులే దగ్గర. ఆ పాయింట్‌ను దాటిన క్షణం చారిత్రాత్మకంగా దిల్నా, రూపా భావిస్తున్నారు. ఆ పాయింట్ దగ్గర ఇద్దరూ సంబరం జరుపుకున్నారు.ఆకాశమూ, అగాథాలూగడప లోపలే ఉండిపోయినా స్త్రీ ఆకాశాలనూ అగాధాలనూ అందుకుంటూ ప్రయాణం సాగిస్తున్నది. సునీతా విలియమ్స్ ఆకాశానికి ఉన్న హద్దును చెరిపేస్తే దిల్నా, రూపాలు అగాథాల పట్ల ఉన్న భయాలను తొలగించారు.సాహస వనితలు, చరిత్రలో నిలిచిపోయిన మహిళా నావికులు దిల్నా, రూపాలు గోవాకు నేడు చేరుకుంటున్న సందర్భంగా అందరూ ఉత్సవాలు జరపాలి. వీరి గాథను పాఠాలుగా చెప్పాలి. -
Menstrual Hygiene Day : ‘నెలసరి’పై ఇన్ని అబద్ధాలా?!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగామ్, వా ట్సాప్ తదితర వేదికలపై లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చాలామంది నిపు ణులు సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. డాక్టర్లు సైతం తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ సమాచారం ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కొందరు మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్న సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లో నెలసరికి (పిరియడ్స్) సంబంధించిన వివరాలు, సలహాల కోసం మహిళలు సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం మహిళల నెలసరి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు వెల్లడయ్యింది. అందుకే మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బుధవారం ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’(Menstrual Hygiene Day). ఈ నేపథ్యంలో మహిళల నెలసరి ఆరోగ్యంపై ఇటీవల ‘ఎవర్టీన్ మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే’నిర్వహించారు. సర్వేలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 1,152 మంది మహిళలను ప్రశ్నించారు. వీరిలో 72.4 శాతం మంది 19 నుంచి 35 ఏళ్లలోపువారే ఉన్నారు. 76.6 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈ సర్వేలో ఏం తేలిందంటే. నెలసరికి సంబంధించిన సోషల్ మీడియాలో తగినంత సమాచారం అందుబాటులో ఉన్నట్లు 71.6 శాతం మహిళలు నమ్ముతున్నారు. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. పిరియడ్స్ గురించి ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తున్నారు. నెలసరి శుభ్రతపై వారు చక్కటి అవగాహన కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు. మెన్స్ట్రువల్ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం 11.5 శాతం మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తప్పుదోవ పట్టించే లేదా ప్రమాకరమైన సమాచారం సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీనవల్ల తాము శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు మహిళలు చెప్పారు. పిరియడ్స్ ఆలస్యం కావడం అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్(పీసీఓడీ)కు సంకేతమని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. (పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్) నెలసరి సమయంలో నొప్పి అధికంగా ఉంటే నిమ్మరసం లేదా కాఫీ తాగాలన్నది కొందరి సలహా. కానీ, అలా చేస్తే నొప్పి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. (వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా)నెలసరి వచ్చినప్పుడు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఆ సమయంలో వ్యాయామం చేస్తే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నెలసరిలో విడుదలయ్యే రక్తం అపవిత్రమైందని, ఆ సమయంలో దేవాలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లో పచ్చళ్లు కూడా ముట్టుకోవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికే సమాజంలో పాతుకుపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి మూఢవిశ్వాసాలను మరింత పెంచేస్తున్నారు. కొత్తకొత్తవి జోడిస్తూ మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఫలానా ఆహారం తీసుకోవాలని లేదా తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నెలసరి సమయంలో భాగస్వామితో కలిస్తే గర్భం రాదు అనేది తప్పుడు అభిప్రాయమేనని నిపుణులు అంటున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో కచి్చతత్వం, వాస్తవాలతో కూడిన, నిర్ధారించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాన్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ చిరాగ్పాన్ సూచించారు. నెలసరి శుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు 87.8 శాతం మంది చెప్పారు. 5.7 శాతం మంది డిస్పోజబుల్ పిరియడ్ ప్యాంటీస్, 4.7 శాతం మంది మెన్స్ట్రువల్ కప్స్, 1.6 శాతం మంది టాంపోన్స్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
ప్రపంచ సాహిత్యంలో దీప కాంతులు
మూల రచయిత బాను ముష్టాక్(Banu Mushtaq) తన కమ్యూనిటీలోని స్త్రీల సమస్యలను చిన్న చిన్న కథలుగా అక్షరీకరిస్తే .. ఆ సహజత్వాన్ని, సున్నితత్వాన్ని అంతే చక్కగా అంగ్లీకరించి తన స్పందననూ తెలియజేశారు దీపాభష్ఠీ! ఈ రచనతో బాను ముష్టాక్ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి ప్రాంతీయ భాషా రచయితగా, రెండో భారతీయురాలిగా నిలిస్తే, ఇదే రచనతో దీపాభష్ఠీ(Deepa Bhasthi).. బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ అనువాదకురాలిగా ప్రపంచ సాహిత్య రంగంలో చరిత్ర సృష్టించారు. ‘హార్ట్ ల్యాంప్’ కన్నడ సాహిత్యంలో ఓ గొప్ప అచీవ్మెంటే కాదు ప్రపంచపాఠకులకు గొప్ప కానుకగా అభివర్ణిస్తున్నారు సాహిత్యకారులు. అంతేకాదు దీపాభష్ఠీ అనువాదం చిక్కగా..పాఠకులను ఉత్తేజపరిచేలా ఉంది. ఇలాంటి శైలి నేటి ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో అరుదుగా కనిపిస్తోందని ప్రశంసిస్తున్నారు.దీపాభష్ఠీ సొంతూరు కర్ణాటకలోని కొడగు జిల్లా, మడికేరి. మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశారు. ఆమె అనువాదకురాలే కాదు పిల్లల రచయిత, కాలమిస్ట్, సాంస్కృతిక విమర్శకురాలు కూడా. దీపారాసిన వ్యాసాలు, కాలమ్స్, సాంస్కృతిక విమర్శలు, ఫిక్షన్స్ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కన్నడ ప్రముఖ రచయిత కోట శివరామ కారంత్ నవల ‘అదే ఊరు, అదే మార’ను ‘ద సేమ్ విలేజ్, ద సేమ్ ట్రీ’గా, కన్నడ స్త్రీవాద రచయిత కొడగిన గౌరమ్మ రచన ‘ఫేట్స్ గేమ్ అండ్ అదర్ స్టోరీస్’గా ఆంగ్లంలోకి అనువదించారు. మూల రచనను ఉన్నదున్నట్టుగా అనువదించడం ఆమె స్టయిల్ కాదు. ఆ రచనల్లోని ఆత్మను పట్టుకుంటారు. అందుకే మూల రచనల్లోని స్థానికత ఆమె అంగ్ల అనువాదంలో ఎక్కడా మిస్ కాదు.పాఠకులకు మూల రచన చదివిన అనుభూతే కలుగుతుంది. ఆ శైలికే బుకర్ ఆమెను వరించింది. ‘హార్ట్ ల్యాంప్’ను అనువదించే ముందు దీపా.. ఇస్లాం స్త్రీల తీరుతెన్నులు, సంస్కృతీసంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడానికిపాకిస్తానీ సీరియల్స్ చూసేవారట. ఉర్దూ చదవడం, రాయడం వరకే కాకుండా సామెతలు, జాతీయాలు, నుడికారాలు సహా భాషను నేర్చుకున్నారట. ఆ కమిట్మెంటే ఆమెకు ఈ రోజు ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆమె రాసిన పిల్లల పుస్తకం ‘చంపి అండ్ ఫిగ్ ట్రీ’ పుస్తకం త్వరలోనే పబ్లిష్ కానుంది. -
Health Issues నవ మాసాలు నిండకముందే...
సాక్షి, సిటీబ్యూరో: నెలలు నిండక ముందే శిశువుల జననం ఆందోళన కలిగిస్తోంది. నవ మాసాలు తల్లి గర్భంలో ఉండాల్సిన బిడ్డ.. అంతకుముందే భూమ్మీదకు వచ్చేందుకు ఆరాటపడుతుండటంతో ఫలితంగా పిల్లల్లో ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, ఇతర అవయవాలు పూర్తి స్థాయిలో వృద్ధి చెందకపోవడం, బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధానంగా ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భిణుల్లో రక్తపోటు, ఐవీఎఫ్ పద్ధతులు వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 40 ప్రసవాలు జరిగితే అందులో 20కిపైగా ప్రీ మెచ్యూర్ బేబీ కేసులు వస్తున్నాయి. అంటే దాదాపు 50 శాతం అన్నమాట. ఎందుకిలా జరుగుతోంది.. ఉన్నత చదువులు చదవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ప్రస్తుత యువతలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఫలితంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, తినే ఆహారం, కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్, ఐవీఎఫ్ పద్ధతులు, ఇన్ఫెర్టిలిటీ తదితరాల కారణాలతో నెలలు నిండక ముందే ప్రసవాలకు (ప్రీ మెచ్యూర్ డెలివరీ) కారణమవుతున్నాయి. కనీసం రెండు కేజీలకుపైగా బరువు ఉండాల్సిన శిశువులు కేజీ, అంతకంటే తక్కువ బరువుతో జని్మస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసులను రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ప్రసవం క్రిటికల్‌గా మారితే వెంటనే నిలోఫర్‌కు రిఫర్ చేస్తున్నారని, ఇక్కడ మంచి వైద్యం అందుతోందని నమ్మకంతోనే వస్తున్నారని నిలోఫర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలు స్వప్న పేర్కొన్నారు. -
మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! -
యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు!
మీ వయసు యాభై దాటిందా? ఏమనుకోకండి...మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియక΄ోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం... నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరి΄ోతుంది. అయితే ఇక్కడ మరో విషయం... శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం.విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది.సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి.యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర ΄ోషణకు మాంసకృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా. చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.మరో ముఖ్య విటమిన్ – విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్ బి 12, శరీరఆరోగ్యాన్ని పరిక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం.ఇవీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్బి 12 పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైన వాటిలో లభిస్తుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్త΄ోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.50 సం. దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది. చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం. ఇవీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
అందం కాదు బంధం
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్‌క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.నేను ఎఫ్‌జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్‌ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్‌ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్‌జీఎమ్ చేస్తారు. ఎఫ్‌జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్లో కూడా నా తోటి కంటెస్టెంట్స్‌కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్‌లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.కొత్తగా అనిపించడం లేదు.. ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్‌ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్‌తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్పీరియెన్సెస్ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమమండేలా స్ఫూర్తి నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్‌జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేస్తున్నాను.అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్‌హుడ్‌ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్ -
రైతు కూతురి కలల సేద్యం
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta) రాజస్థాన్‌లోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించింది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ నందిని..’ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్పోటీలోపాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ‘ఎక్కడ నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం.. అన్నదే ముఖ్యం’ అన్న ఆత్మవిశ్వాసంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలనూ మన ముందుంచింది మిస్ వరల్డ్– 2025 కాంటెస్ట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.‘‘అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. స్కూల్లో చదివేటప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలా మంది అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతుండటం టీవీలో చూసి... ‘ఆమె ఎవరు?’ అని అమ్మను అడిగాను. ‘ఆమె మిస్ వరల్డ్, నటి’ అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటినుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని, మేకప్ చేసుకునేదాన్ని, హెయిర్‌స్టైల్స్ మార్చేదాన్ని. అందాలపోటీలోపాల్గొనడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కనే ధైర్యం చేయవచ్చా! అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మానాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబయ్‌కి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పోలాల మధ్య పెరిగిన నేను ముంబయ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.మాట్లాడాలంటే బెరుకుపోటీలలోపాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడటానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్నీ సమర్థంగా ఉన్నప్పుడు దేనికీ వెనకంజ వేయనక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది.మార్పునకు శ్రీకారంఅందాలపోటీలవైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియాపోటీల్లో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి, వారికి పెద్దగా చదువు అక్కర్లేదు, త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడా బ్యూటీ కాంటెస్ట్‌లకు ట్రైనింVŠ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కాంటెస్ట్లోపాల్గొనడానికి పోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.దివ్యాంగుల సాధికారత కోసం..దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. మా మేనమామ పుట్టుకతోనే దివ్యాంగుడు. సరిగా మాట్లాడలేరు. కానీ, ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కళ్ల నుంచి ప్రపంచాన్ని చూశాను. కనిపించని బాధ ఏదో మోస్తున్నట్టుగా అతనిలో నాకు కనిపించేది. అలాంటి వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. వికలాంగుల గాధలు చాలా బాధనిపించేవి. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచాక ‘ఏక్తా ప్రాజెక్టు’లో భాగంగా అనేక మంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లోపాల్గొన్నా. వారి కలల సాకారానికి కృషి చేయాలనుకున్నాను. భవిష్యత్తు ప్రణాళికలుఇప్పటికే మోడల్‌గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమాలు, డ్యాన్స్‌లు అంటే చాలా ఇష్టం. మహేష్‌బాబు నటించిన సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి .. ’సాంగ్ మరీ మరీ ఇష్టం. ఆపాట విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటా. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది’’ అంటూ వివరించింది ఈ బ్యూటీ. – నిర్మలారెడ్డిరాజస్థాన్లోని కోటాకు దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్‌లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలినిపాటిస్తోంది. యోగా, డ్యాన్స్, హెల్తీ డైట్నుపాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. -
ఆపరేషన్ సిందూర్ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
Hyderabad: సిటీలో.. మదర్స్‌డే.. సందడి..
సాక్షి, హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్లో ప్రత్యేక బ్రంచ్ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్ హోటల్ లోని ఫీస్ట్ రెస్టారెంట్లో విత్ లవ్ మమ్స్ కిచెన్ థీమ్‌తో ప్రత్యేక బ్రంచ్. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్‌డే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీలోని ది వెస్టిన్ హోటల్లో సీజనల్ టేస్ట్స్ రెస్టారెంట్లో కాంటినెంటల్, నార్త్ ఇండియన్, ఇటాలియన్ వంటకాలతో ప్రత్యేక డైనింగ్ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో మదర్స్ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్ డే థీమ్‌తో పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్ గిఫ్ట్ ప్యాక్స్‌ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్లైన్ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పలు వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. -
World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!
కరీంనగర్‌టౌన్: ఒవేరియన్ (అండాశయ) కేన్సర్. స్త్రీలలో వచ్చే కేన్సర్లలో మూడోస్థానంలో ఉంటుంది. అండాశయ కేన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. ఇది చాపకింద నీరులా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీన్ని నిశ్శబ్దహంతకిగా పేర్కొంటారు. ఈ కేన్సర్ మొదటి, రెండో దశల్లో స్వల్ప లక్షణాలు ఉండటంతో రోగులు పెద్దగా పట్టించుకోరు. 60 నుంచి 70శాతం మంది వ్యాధి ముదిరిన త ర్వాతనే వైద్యులను ఆశ్రయిస్తుంటారు. దీంతో చాలా మంది మరణం అంచులకు వెళ్తున్నారు. అండాశయ కేన్సర్ ఉంటే..అండాశయాల్లో కేన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోయి పక్కన ఉన్న కణజాలానికి, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని అండాశయ కేన్సర్ అంటారు. స్త్రీలకు ప్రమాదకంగా పరిణవిుంచే అండాశయ కేన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. కడుపు, ఉబ్బరంగా, నొప్పిగా ఉండడం, అజీర్తి, వికారం, తేన్పులు తదితర జీర్ణ సంబంధ సమస్యలు, యోని స్రావాలు అసాధారణంగా ఉండటం, అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, ఊపిరి కష్టంగా ఉండటం, వెన్నునొప్పితో బాధ పడుతుంటారు. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, నెలసరి సక్రంగా లేకపోవడం ప్రధాన లక్షణాలు.అండగా నిలుస్తున్న ఆరోగ్య మహిళజిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆధ్వర్యంలో స్త్రీలకు నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. గత రెండేళ్లుగా ఎంపిక చేసిన ఆస్పత్రులతో పాటు అన్ని ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్త్రీల కు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేన్సర్ అనుమానం ఉన్న వారికి పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉంటే అల్ట్రాసౌండ్‌లో సీఏ–125 మార్కర్, రక్తపరీక్షలు, సిటీస్కాన్, ఎంఆర్ఐ వంటివి కూడా చేసి వ్యాధిని గుర్తిస్తున్నారు.ముందే గుర్తిస్తే చికిత్సవ్యాధి దశల ఆధారంగా సర్జరీ చేయడం, థెరపీ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ నేపథ్యం ఉండి, బ్రాకా పాజిటివ్ వచ్చిన వారు పిల్లలు పుట్టిన తర్వాత ముందుజాగ్రత్తగా అండాశయాలను తొలగించుకోవచ్చు. కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సర్జరీ, హైపెక్కీమో థెరపీ చేస్తారు. అండాశయ కేన్సర్ చికిత్స తర్వాత మళ్లీ 40 శాతం మందిలో తిరగబెట్టేందుకు ఆస్కారం ఉంది. అప్పుడు కూడా కీమో థెరపీతోనే చికిత్స అందిస్తారు. – విష్ణుప్రియ, గైనకాలజిస్టు, మెడికవర్ ఆస్పత్రిజన్యుపరమైన అంశంమారుతున్న జీవనశైలిలో అండాశయ కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జన్యుపరమైన అంశం దీనికి కారణమవుతోంది. ఐదు నుంచి 10శాతం కేన్సర్లు వంశపారంపర్యంగా ఉంటాయి. ఇటీవల ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా జిల్లాలో కేన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించిన మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. సాధారణంగా 50 ఏండ్లు నిండిన వారిలోనే అండాశయ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చాలా నిశ్శబ్దకరమైనది. ముందుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమే. – వెంకటరమణ, డీఎంహెచ్‌వో -
నేడు ప్రపంచ అధ్లెటిక్స్ దినోత్సవం: ‘హర్డిల్స్’ దాటి...
డబ్బు ఉంటేనే పెద్ద పెద్ద కలలను సాధించవచ్చు అనుకునే నేటి తరానికి అది సరికాదని, కృషి, పట్టుదల ఉంటే అన్ని హర్డిల్స్‌ను దాటవచ్చునని నిరూపిస్తోంది. విశాఖపట్టణవాసి జ్యోతి యర్రాజి. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా చేస్తుంటే తల్లి కుమారి కుటుంబపోషణకు ఇళ్లలో పనులు చేసేది. తన తలరాతను తనే మార్చుకుంటానని తెలియని వయసులోనే స్కూల్లో గ్రౌండ్లో పరుగులు మొదలు పెట్టింది జ్యోతి. సీనియర్ అథ్లెట్ల పరుగులు గమనిస్తూ, తన మార్గాన్ని తనే వేసుకుంది. ఆ పరుగులు జాతీయ స్థాయికే కాదు ఒలింపిక్స్ వరకు వెళ్లేలా... ఫోర్బ్స్ జాబితాలో చేరేలా చేశాయి.దక్షిణ కొరియాలో ఈనెల 27 నుంచి జరగబోయే ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కిపోటీ పడటానికి సిద్ధపడుతోంది జ్యోతి. అందుకు ముంబయ్‌లోని రిలయెన్స్ అ«థ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ‘పతకాన్ని సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా’ను అని తెలిపింది.తన రికార్డుల్ని తానే తిరగరాస్తూ...స్కూల్ వయసులో గ్రౌండ్లో తోటి పిల్లలతో పరుగులు తీసేది.పాఠశాలకు చేరువలోనే విశాఖపోర్ట్ స్టేడియం ఉండటం, అక్కడ సీనియర్ అథ్లెట్ల్ల ప్రాక్టీస్‌ను పరిశీలించడం దినచర్యగా ఉండేది. తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతరపాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పతకం సాధించింది. అలా ప్రారంభమైన జ్యోతి ఎర్రాజీ ట్రాక్ ఒలింపిక్స్లోపాల్గొన్న తొలి భారతీయ ఉమెన్ హార్డిలర్గా ఖ్యాతి దక్కించుకుంది. ట్రాక్‌లో గాయపడటం, జాతీయ రికార్డు నమోదును గుర్తించకపోవడం లాంటి సమస్యలనూ అధిగమించింది. పసిడి పతకాలతో జాతీయ రికార్డును తిరగరాయడమే కాదు 100 మీటర్ల హార్డిల్స్‌లో అర్దశతాబ్దపు భారత్ కలను నెరవేర్చింది. మరెవ్వరూ పొటీపడలేనంతగా తన రికార్డులను తనే తిరగరాసుకుంది. కిందటేడాది ఫిబ్రవరిలో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో జ్యోతి ఎర్రాజి పేరు చేరింది. కలను లక్ష్యంగా మలుచుకొని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది జ్యోతి. – డా. సూర్యప్రకాష్ మాడిమి, సాక్షి స్పోర్ట్స్, విశాఖపట్నం -
తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్ వినోద్ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్ ట్రైనింగ్‌లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం. -
న్యాయపీఠంపై మహిళా తేజం
‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్ గండ్రాతి, ‘సాక్షి’ నెట్వర్క్1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్ఎల్బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు సొంత నోట్స్ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిఖీషా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి? -
బర్త్‌డే రెండు రోజులనగా ఇన్ఫ్లూయెన్సర్,హెయిర్ బ్రాండ్ సీఈవో ఆత్మహత్య
ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.కామెడీ స్కిట్లు, వీకెండ్ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్‌తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్లైన్లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.ఎవరీ మిషా అగర్వాల్2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీహెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్ కూడా డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది. చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్ యాప్
మహిళలకు సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పింపంచేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రో ((HMR) రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ పోలీస్ సహకారంతో సరికొత్త మొబైల్ యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బిట్స్ పిలానీ–హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మొబైల్ యాప్ రూపంలో ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. ఈ మేరకు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్‌లో గురువారం జరిగిన యూజర్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే ఏకైక పరిష్కారమన్నారు. మెట్రోలో పయనించే మహిళలు తమ చిట్టచివరి గమ్యస్థానానికి భద్రంగా చేరడానికి ట్యూటెమ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి గమ్యస్థానాల వరకు రాకపోకలు సాగించే క్రమంలో ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందన్నారు. ఈ మొబైల్ యాప్‌లో డ్రైవర్ యాప్, యూజర్ యాప్ అని రెండు భాగాలు ఉంటాయని, మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే అన్ని జాగ్రత్తలు ఇందులో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ప్రయాణికులు మెట్రోస్టేషన్‌కు చేరుకోవడానికి, తిరిగి ఇంటికి బయలేదేరడానికి కాలినడకన, ద్విచక్ర వాహనంపై కానీ కారు లేదా బస్సు లేదా ఆటో తదితర ఎలాంటి ప్రయాణ సదుపాయాలను వినియోగించినా సరే ఈ యాప్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. గమ్యస్థానికి చేరే క్రమంలో మహిళలు ఎలాంటి అభద్రతకు గురైనా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను, కుటుంబసభ్యులను, బంధువులను అప్రమత్తం చేసే సదుపాయం ఉంటుందన్నారు. సామాజిక, ఆర్థిక సమస్యలకు ఇంజనీరింగ్, సాంకేతిక పరిష్కారం చూపాలన్నదే తమ అభిమతమని, అందుకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలకు ముందుంటామని ఎన్వీఎస్ తెలిపారు. బిట్స్ పిలానీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్‌రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాలకు కూడా ఈ యాప్‌ను విస్తరించేలా తమ సంస్థ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీబీ ప్రతినిధి కుమారి జోసెఫిన్ ఎక్వినో, బిట్స్ పిలానీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్యో ముఖర్జీ, ఐఐటీ బొంబాయి కి చెందిన ప్రొఫెసర్ అవిజిత్ మాజీ, బిట్స్ పిలానీ ప్రొఫెసర్ ప్రశాంత్ సాహు పాల్గొన్నారు. -
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ -
ఖాకీ రీల్స్
దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా పోలీసులు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొంటున్నారు. ‘ఖాకీ రీల్స్’ కొత్త ట్రెండ్‌గా మారింది. ఉత్తేజపరిచే వ్యక్తిత్వ వికాస ప్రసంగాల నుంచి వర్కవుట్ల వరకు ఆకట్టుకునే ‘రీల్స్’ చేస్తున్నారు....ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ కాంచన్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో 99,900 మంది ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ చేయడం, పోలీస్ యూనిఫామ్‌లో స్టైల్‌గా నడవడం, జుట్టును చలాకీగా తిప్పడంలాంటి ‘రీల్స్’ చేస్తుంటుంది. ‘హిందీ సినిమా తారలకు ఏమాత్రం తీసిపోదు’ అంటూ పాండే అందాన్ని ΄÷గుడుతుంటారు అభిమానులు. ‘ప్రతి రోజూ పరుగెత్తండి. కానీ ప్రతిరోజూ ఒక రౌండ్ పెంచండి’లాంటి సలహాలు ఆమె నోటి నుంచి వినిపిస్తాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సిమ్రాన్ రఘువంశీ ఒకప్పుడు మోడల్ కావాలని కలలు కన్నది. కాని ఆమె కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ‘మోడల్’ కలకు తెర వేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరింది. ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ‘ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తుంటాను’ అంటున్న సిమ్రాన్‌ను–‘పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేయవద్దని సీనియర్ అధికారులు చెప్పారా?’ అని అడిగితే...‘యూనిఫాంలో అభ్యంతరకరమైన రీల్స్ చేసినప్పుడు, అసభ్యకరమైన పాటకు యూనిఫామ్‌తో డ్యాన్స్ చేయడంలాంటివి చేసినప్పుడే సమస్య. అలా చేయనంత కాలం ఎలాంటి సమస్య ఉండదు’ అంటుంది సిమ్రాన్.సిక్కింకు చెందిన ఆలివా సవాడెన్ ‘లేడీబైకర్కాప్’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాష్ట్రంలోని పచ్చని చెట్ల పక్క నుంచి, పరిశుభ్రమైన రోడ్ల వెంట రైడింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫామ్, సివిడ్ డ్రెస్‌లలో ఆమె పోస్ట్‌లు కనిపిస్తుంటాయి.‘ఫిట్ సురేఖ’ అనే హ్యాండిల్ ద్వారా పోలీసు అధికారి సురేఖ పవర్ లిఫ్టింగ్ నుంచి రన్నింగ్ వరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ‘మీరు గెలవాలంటే మొండిగా ఉండాలి. ఓడిపోవడానికి భయం చాలు’ అని తన పోస్ట్‌లో రాసింది.అస్సాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున జిమ్మీ రోంగ్మేయ్ ఎంటీవీ రియాలిటీ షోలో పాల్గొంది, వర్కవుట్ వీడియోలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.దిల్లీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్షు ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పేరు తెచ్చుకుంది. ఆమె పోస్ట్ చేసే వీడియోలలో ఆకట్టుకునే డైలాగులు ఎన్నో ఉన్నాయి.తన సన్ గ్లాసెస్‌పై ‘ఐ డోండ్ కేర్’ అని రాసి ఉంటుంది.మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సారిక రావత్....‘అమ్మాయిలు ఏ గులాబీపై ఆధారపడరు. వారే ఈ విశ్వపు తోటలు’ అంటుంది. సబ్–ఇన్స్పెక్టర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం గైడెన్స్ వీడియో ను రూపొందించమని ఫాలోవవర్స్ నుంచి వచ్చిన విన్నపాన్ని ఆమె అంగీకరించింది. -
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తున్నారు. కాలమెంత మారినా విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూసే ధోరణి మాత్రం పోలేదు. డైవోర్స్‌ని ఓ అవమానంగా, పరువు ప్రతిష్ఠలకు భంగంగా భావించే పరిస్థితే ఇంకా! అయితే వాయవ్య ఆఫ్రికా దేశమైన మారిటానియా (Mauritania) తీరు ఇందుకు భిన్నం. అక్కడ విడాకులు అంటే ఒక వేడుక. ఆ దేశంలోని మారి తెగలోని మాతృస్వామ్య పద్ధతులే ఇందుకు కారణం అంటారు పరిశీలకులు, విశ్లేషకులు. మారిటానియాలో ఒక వివాహిత ఎన్నిసార్లయినా విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకుల సందర్భాన్ని ఒక మెహెందీ, పాటలు, డాన్సులు, విందుతో ఒక సెలబ్రేషన్‌గా నిర్వహిస్తారు. దాని ఉద్దేశం.. ఆ అమ్మాయి మళ్లీ పెళ్లికి సిద్ధంగా ఉందని తెలియజెప్పడమేనట. అమ్మాయిలైతే విడాకులను తమకు దొరికిన స్వేచ్ఛలా భావిస్తారట. విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్నిపెంపొందించుకునే ప్రయత్నం చేస్తారట. కొంతమంది పైచదువులు చదువుకుంటారు, కొంతమంది రాజకీయాల వైపు మళ్లుతారు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌లు అవుతారు.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని ఎంచు కుంటారు. పిల్లలుంటే వాళ్ల సంరక్షణ తల్లి చాయిసే! చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ఇంకో విషయం ఏంటంటే.. విడాకులు తీసుకున్న ఆడవాళ్లందరికీ ఒక మార్కెట్ ఉంటుంది. అందులో వాళ్లింటి సామాన్లన్నిటినీ అమ్మేస్తారు. ఒకరకంగా ఈ మార్కెట్‌ను వాళ్లు తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. పాత భారాన్నంతా దింపేసుకుని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామనే సూచననిస్తున్నట్టన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం.. మారిటానియాలో కొత్త పెళ్లికొడుకులు డైవోర్స్ అయిన మహిళలను చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే సంసారంలో వాళ్లు అనుభవజ్ఞులని. అందుకే పెళ్లికి అక్కడ విడాకుల వనితలకే డిమాండ్ ఎక్కువ. మరో ముఖ్యమైన సంగతేంటంటే.. విడాకుల వనితలు మాత్రం విడాకులు పొందిన పురుషులను చేసుకోరు. కొత్త పెళ్లికొడుకులనే చూస్తారు. విడాకులు పొందిన మగవాళ్లను ఫెయిల్యూర్ హజ్బెండ్స్గా పరిగణిస్తారట. -
కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్‌కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా? - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్హెచ్.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్‌కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా మెయింటెనెన్స్ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత మెయింటెనెన్స్స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 144 బీఎన్ఎస్ ( పా సీ.ఆర్.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి. నాకు, నా మూడేళ్ల కొడుకుకి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్ చట్టం లోని సెక్షన్ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్ చేయ వచ్చు. -
సెలబ్రిటీ రైటర్స్
మూవీ సెలబ్రిటీల ఆట, మాట, పాట మనకు తెలుసు. మరి అక్షరం? ... ఈ పుస్తకాలే సాక్ష్యం. మూవీ సెలబ్రిటీలు రాసిన ఈ పుస్తకాల్లో మచ్చుకు కూడా కాలక్షేప కథనాలు లేవు. స్త్రీ సాధికారత నుంచి మానసిక ఆరోగ్యం వరకు విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి.ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే: ప్రియాంక చోప్రా‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. ఈ పుస్తకం తన జ్ఞాపకాల సమాహారం. తాను నడిచొచ్చిన దారి.‘నేను ఎప్పటినుంచో పుస్తకం రాయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు రాయాలనేదే సమస్య. నా జీవితం గురించి రాయడానికి ఇది సరిౖయెన సమయం కాదు.ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు అనుకుంటాం. అయితే జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణంలోనే బోధించడతాయి. వాటి గురించి పంచుకోవడం అవసరం. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే కలం పట్టుకున్నాను. నా జ్ఞాపకాలను అన్ఫినిష్డ్ ద్వారా పాఠకులతో పంచుకున్నాను’ అంటుంది ప్రియాంక చోప్రా.డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం: సోనాలి బింద్రే‘బంగారు కళ్ల బుచ్చమ్మ’గా ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనాలి బింద్రే ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్: ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా’ ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకాలు రాసింది. ఆమె తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ నేడు విడుదల అవుతోంది. ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్’ పుస్తకంలో భారతీయ జానపద కథలను తనదైన శైలిలో తిరిగి చెప్పింది సోనాలి. లడఖ్, అస్సాం, తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌లలో తాను విన్న మౌఖిక జానపద కథలకు అక్షర రూపం ఇచ్చింది. పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది.ఒకప్పుడు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలే కనిపిస్తున్నాయి. ‘ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకం రాసింది సోనాలీ. పిల్లల పెంపకానికి సంబంధించి మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఇక తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ పుస్తకాలకు సంబంధించి సమస్త విషయాల గురించి మాట్లాడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి? ఉపయోగం ఏమిటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి?... మొదలైన విషయాలతో ‘జీవితాంతం రీడర్‌గా ఉండాలి’ అని చెబుతుంది ఏ బుక్ ఆఫ్ బుక్స్.తరాల మధ్య అంతరం: ట్వింకిల్ ఖన్నా‘మిసెస్ ఫన్నీ బోన్స్’ ‘పైజామాస్ ఆర్ ఫర్ గీవింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మిప్రసాద్’ ‘వెల్కమ్ పారడైజ్’ పుస్తకాలతో రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది ట్వింకిల్ ఖన్నా. ‘పాఠకులకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. ఇలా జరిగింది తెలుసా? అంటూ నాకు తెలిసిన విషయాలను పాఠకులతో పంచుకుంటాను’ అంటున్న ట్వింకిల్ దయాదక్షిణ్యాలు, ఒంటరితనం, తరాల మధ్య అంతరాలు వంటి ఇతివృత్తాలతో రచనలు చేసింది.‘నేను రాయడానికి కూర్చున్నప్పుడు ఇతివృత్తం గురించి ఆలోచించను. నా కథలు హితబోధ చేస్తున్నట్లు ఉండకుండా జాగ్రత్త పడతాను. ఐడియా మదిలో మెరవగానే కథ పూర్తికాదు. కథ ఎక్కడ మొదలవుతుందో చెప్పలేము. అది మైండ్‌లో తనకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటుంది. కొన్నిసార్లు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతుంది’ అంటుంది ట్వింకిల్, ‘జెల్లీ స్వీట్స్’ అనే కథ రాయడానికి ఆమెకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది!తల్లులు, కాబోయే తల్లుల కోసం...: కరీనా కపూర్ప్రెగ్నెన్సీ సమయంలో తన శారీరక, భావోద్వేగ అనుభవాలకు ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకంతో అక్షర రూపం ఇచ్చింది కరీనా కపూర్. ఐవీఎఫ్ మదర్స్, ప్రెగ్నెన్సీ డిప్రెషన్, వికారం, మార్నింగ్ సిక్నెస్, పిల్లలకు పాలు ఇవ్వడం... ఇలా ఎన్నో విషయాల గురించి తన పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే అనలేము. ఎక్స్‌పెక్టింగ్ మదర్స్‌కు ఎంతో ఉపయోగపడే పుస్తకం. ‘ఈ పుస్తకం నా మూడవ సంతానం’ అని నవ్వుతూ అంటుంది కరీనా.రోషెల్ పింటోతో కలిసి ‘ది స్టైల్ డైరీ ఆఫ్ ఎ బాలీవుడ్ దివా’ అనే పుస్తకం కూడా రాసింది కరీనా కపూర్.‘ఆటోబయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాదు’ అని పుస్తక ఆవిష్కరణ సభలో చెప్పింది. ఆటోబయోగ్రఫీకి ముందు ఆమె నుంచి మరిన్ని పుస్తకాలను ఆశించవచ్చు.జెండర్ ఈక్వాలిటీ... దయా గుణం... పర్యావరణం: అలియా భట్‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్’ పుస్తకంతో రచయిత్రిగా మంచి మార్కులు తెచ్చుకుంది అలియా భట్. పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. పర్యావరణం, దయాగుణం, లింగ సమానత్వం... ఇలాంటి ఎన్నో విషయాల గురించి పుస్తకంలో రాసింది. బాల పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రాసింది.‘పిల్లలకు ప్రకృతిపై ప్రేమ కలిగేలా చేయడానికి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి తెలియజెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఇంట్లో కంటే ఆరుబయట ఎక్కువ సమయం గడపడానికి, సహజ ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి పిల్లలను ్రపోత్సహించడానికి మొదటి అడుగుగా ఈ పుస్తకం రాశాను’ అంటుంది అలియా భట్.పింపుల్స్ నుండి పీరియడ్స్ వరకు...: టిస్కా చోప్రాయాక్టర్, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న టిస్కా చోప్రా రైటర్ కూడా. తమ శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడాని 9 నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ‘వాట్స్ అప్ విత్ మీ?’ పుస్తకం రాసింది. యుక్త వయస్సు సమస్యలు, పీరియడ్స్, మొటిమలు... ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. యుక్తవయసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతకు సహాయపడే పుస్తకం ఇది. ‘తొమ్మిదేళ్ల నుంచి 13, 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వాట్స్ అప్ విత్ మీ రాశాను. తల్లులే కాదు తండ్రులు కూడా నా పుసక్తంలో భాగం కావాలని కోరుకున్నాను. మార్కెట్లో లభించే ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్ల గురించి తెలియజేశాం. పాఠం చెబుతున్నట్లుగా కాకుండా వినోదాత్మకంగా ఉండేలా పుస్తకం రాశాను’ అంటుంది టిస్కా చోప్రా. -
సివిల్స్ లో ఆమె టాప్
యు.పి.ఎస్.సి. నిర్వహించిన సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ పరీక్షలో మహిళా అభ్యర్థులు 5 మంది టాప్ టెన్ లిస్ట్‌లో నిలిచారు. శక్తి దూబె (1), హర్షిత గోయల్ (2), షామార్గి చిరాగ్ (4), కోమల్ పునియా (6) ,ఆయుషి బన్సాల్ (7) ర్యాంకులు సాధించారు.పాలకులు ఎవరైనా పరిపాలన అధికారుల చేతుల్లో ఉంటుంది. సమర్థులైన అధికారులే దేశాన్ని ముందుకు నడిపించగలరు. అందుకే ఎన్నో వడపోతలతో యు.పి.ఎస్.సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సి.ఎస్.ఇ) ఫలితాలు అభ్యర్థుల ప్రతిభకు అత్యున్నత ఆనవాలుగా నిలుస్తాయి. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ పోస్టులతో పాటు ఐ.ఎఫ్.ఎస్. తదితర పౌర సేవల ఉన్నత స్థానాల భర్తీ ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. 2024 సంవత్సరానికి ప్రభుత్వం 1129 సివిల్ సర్వీసెస్ పోస్టుల ఖాళీని గుర్తించగా వాటికోసం 5,83,599 మంది జూన్ 16, 2024న ప్రిలిమనరీ పరీక్ష రాశారు. వీరిలో14,627 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 2,845 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా మొన్నటి జనవరి నుంచి ఈ నెల మొదటి వారం వరకూ సాగిన ఇంటర్వ్యూలలో 1009 మంది నియామకాలుపొందారు. వీరిలో 725 మంది పురుషులైతే 284 మంది స్త్రీలు. విశేషం ఏమిటంటే టాప్ 10 ర్యాంకుల్లో ఐదుమంది స్త్రీలు ఉండటం.... మొదటి ర్యాంకు మహిళా అభ్యర్థి సాధించడం. అందుకే ఇది అన్నివిధాలా స్త్రీలకు స్ఫూర్తినిచ్చే అంశం. వీరిలో టాప్‌టెన్‌లో నిలిచిన మహిళా ర్యాంకర్ల వివరాలు...శక్తి దూబె 1వ ర్యాంక్ప్రయాగ్రాజ్లో పుట్టి పెరిగిన శక్తి దూబె టెన్త్ క్లాస్‌లో టాపర్. అలహాబాద్‌లో బీఎస్సీ చదివితే అందులోనూ టాపర్‌గా నిలిచింది. తండ్రి ఇన్స్పెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. సివిల్స్ సాధించాలన్న కలతో కోచింగ్ కోసం ఢిల్లీ చేరినా కోవిడ్ వల్ల తిరిగి ఇంటికి వచ్చేయాల్సొచ్చింది. దాంతో ఇంట్లోనే ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యింది శక్తి దూబె. పోలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ప్రధానంగా ఎంచుకుని పరీక్ష రాసింది. దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది.‘గత సంవత్సరం ఇంటర్వ్యూ వరకూ వెళ్లి వెనక్కు వచ్చాను. అప్పుడు నా సోదరుడు... ఏం బాధ పడకు.. ఇంకోసారి ప్రయత్నించు... మొదటి ర్యాంకు నీ కోసం వేచి చూస్తోంది అన్నాడు. అతని మాట నిజమైంది. కాని నేను ఇంత పెద్ద ర్యాంక్ వస్తుందని అనుకోలేదు’ అంది శక్తి దూబె. ‘సివిల్స్ కోసం అందరూ కృషి చేస్తారు. ఏ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుని కృషి చేస్తే గెలుస్తారు’ అందామె.హర్షిత గోయల్ 2వ ర్యాంక్హర్షిత గోయల్ స్వరాష్ట్రం హర్యాణ అయినా ఆమె ప్రస్తుతం వడోదరాలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా ్రపాక్టీసు చేస్తోంది. తల్లి మరణించడంతో తండ్రి, సోదరుడితో కలిసి జీవిస్తున్న హర్షిత ‘నేను ఐ.ఏ.ఎస్ చేయాలనేది మా నాన్న కల. ఇవాళ ఆ కల నెరవేర్చాను. మా అమ్మ కూడా మబ్బుల్లో నుంచి సంతోషంగా ఉండే ఉంటుంది. ఇది నా మూడో అటెంప్ట్. నిరాశలో ఉండిపోకుండా ప్రయత్నించి సాధించాను. ఈ ర్యాంక్ సాధించడానికి రోజుకు కొన్ని గంటలు పెట్టుకొని చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు నేను. ఒక్కోసారి చదవాలనిపించదు. ఆ రోజు బ్రేక్ తీసుకున్నాను తప్ప బలవంతంగా చదవలేదు. నేను ఇన్‌స్టాలో ఉన్నాను. అయితే అది నా దృష్టి మరల్చలేదు. సోషల్ మీడియాను మీ చదువుకు ఉపయోగించుకుంటున్నారా కాలక్షేపానికా అనేది మీకు తెలిసి, కంట్రోల్లో ఉండగలిగితే సోషల్ మీడియా వాడండి’ అంది.మార్గి చిరాగ్ షా 4వ ర్యాంక్‘నాలుగుసార్లు విఫలమయ్యాను. ఐదోసారి నాల్గవ ర్యాంకు సాధించాను’ అంది మార్గి చిరాగ్ షా. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మార్గి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా 2017 నుంచి సివిల్స్ కోసం పోరాడుతోంది. మధ్యలో తండ్రి మరణించినా ఆ దుఃఖాన్ని అధిగమించి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రిపరేషన్ వల్ల గుజరాత్ గ్రూప్ 1 పరీక్షల్లో ర్యాంక్ సాధించి ట్యాక్స్ అఫీసర్ అయ్యింది. అయితే ఐ.ఏ.ఎస్. కలను వదల్లేదు. ఇప్పటికి సాధించింది. ‘కొన్ని కోచింగ్ క్లాసెస్ విన్నాక సెల్ఫ్ స్టడీ బెటర్ అనుకున్నాను’ అందామె. ‘మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా పరీక్ష రాసే సమయంలో ప్రశాంత చిత్తం ముఖ్యం. అది లేకపోతే కష్టం’ అని తెలిపిందామె.కోమల్ పునియా 6వ ర్యాంక్32 ఏళ్ల కోమల్ పునియా ఐ.ఐ.టి. రూర్కీలో బి.టెక్ చేసింది. ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన కోమల్ చిన్నవూళ్ల నుంచి కూడా అమ్మాయిలు విజయం సాధించగలరు అని నిరూపించాలనుకుంది. తండ్రి రైతు కావడం వల్ల తన లక్ష్యానికి తానే మార్గనిర్దేశనం చేసుకుంది. గత సంవత్సరం ఆమెకు 474 ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్.కు ఎంపికైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రయినింగ్లో ఉంది. అయితే ఐ.ఏ.ఎస్. లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాసి ఈసారి ఏకంగా 6వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే కాదు ఊళ్లో కూడా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.ఆయుషీ బన్సాల్ 7వ ర్యాంక్ఆయుషీ బన్సాల్ ఐ.ఐ.టి. కాన్పూర్లోబీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ రంగంలో వెంటనే ఉద్యోగం వచ్చింది. అయితే సివిల్స్‌పై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి 2022 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. మొదటి అటెంప్ట్‌లోనే ఆమెకు 188వ ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్.కు ఎంపికై కర్నాటక కేడర్‌కు వెళ్లింది. 2023లో ఆమెకు 97వ ర్యాంక్ వచ్చింది. మూడోసారి ఇప్పుడు 7వ ర్యాంక్ సాధించి తన ఐ.ఏ.ఎస్ కలను నెరవేర్చింది.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే...⇒ సివిల్స్‌లో మెరిసిన వరంగల్ వాసి⇒ 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల్లో టాపర్⇒ రెండో ప్రయత్నంలోనే సత్తాచాటిన సాయి శివాని⇒ గ్రూప్ వన్ లోనూ 21వ ర్యాంక్!వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదం్రడుల ప్రోత్సాహంతోనే...‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువుకునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగాప్రోత్సహిస్తున్నారు. కుటుంబప్రోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. కఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతో పాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
మహిళలు ఉద్యోగం చేస్తున్నా తప్పని తిప్పలు, తీరని వ్యధ
మాచారెడ్డి: అందమైన దాంపత్య జీవితంలో వరకట్నం చిచ్చుపెడుతోంది. అన్యోన్యంగా సాగాల్సిన కాపురం అనుమానాలతో కలహాల కాపురంగా మారుతోంది. పెద్దల సమక్షంలో పంచాయతీలు, పోలీసులు కౌన్సెలింగ్ చేసినా దంపతులు మధ్య సఖ్యత కుదరడం లేదు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో వరకట్న వేధింపులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఏడాది కాలంలో పది వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. పలువురికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించినా మళ్లీ కొద్ది రోజులకు అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేయడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వర కట్న వేధింపులు తప్పడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నా పలువురు అనుమానాలతో వేధింపులకు గురి చేస్తుండగా, మరి కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.ఉమ్మడి మాచారెడ్డి మండలంలో జరిగిన ఘటనలు ..● పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడికి 2006వ సంవత్సరంలో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లాంఛనంగా 10తులాల బంగారం ఒప్పుకొని పెళ్లి సమయంలో 5తులాల బంగారం ఇచ్చి మరో 5తులాలు పదేళ్ల తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న విధంగా ఇంకో తులం బంగారం కలిపి మొత్తం 11తులాల బంగారం ముట్టజెప్పారు.గత కొన్నేళ్లుగా భర్త,అత్త అదనపు కట్నం కోసం వేధించసాగారు. అంతటితో ఆగకుండా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో వివాహం చేసుకున్నట్టు బాధితురాలు ఇటీవల ఠాణా మెట్లెక్కింది.● మండలంలోని సోమారంపేటకు చెందిన యువతిని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ కు చెందిన యువకుడికి ఇచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు.అప్పుడు లాంఛనంగా రూ.లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారం కట్నంగా ముట్టజెప్పారు. ఓ కుమారుడు పుట్టేంత వరకు ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు.కొద్ది రోజుల తర్వాత ఆ యువతి టీచర్ ఉద్యోగం సాధించింది.అప్పటి నుంచి అనుమానాలతో వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.● పాల్వంచ మండలం ఆరెపల్లికి చెందిన యువతిని 11 ఏళ్ల క్రితం ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు.లాంఛనంగా కట్నకానుకలు అప్పజెప్పారు.ఓ కుమారుడు పుట్టాక అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు.ఒక సారి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా మార్పు రాకపోవడంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది.కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాంవరకట్నంతో ఇతర కారణాలతో మహిళలను వేధిస్తున్న కేసులలో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. కౌన్సెలింగ్ తో పరిష్కారం కాని కేసులను కోర్టుకు పంపిస్తున్నాం.ఎవరైనా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారు.– ఎస్.అనిల్, ఎస్సై, మాచారెడ్డి -
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా కంపెనీని పరుగులు పెట్టిస్తోంది. 2022లో వ్యాపారవేత్తను ఆనంద్ పిరమిల్‌ను పెళ్లాడిన ఇషా ఆదియా ,కృష్ణలకు(కవలలు) తల్లి. రిటైల్ వారసురాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో కీలక బాధ్యతల్లో ఉన్న ఇషా గత సంవత్సరం, ఫిబ్రవరి 2024లో మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు గెల్చుకుంది. అలాగే, టైమ్ మ్యాగజైన్ టైమ్100 నెక్స్ట్ రైజింగ్ స్టార్ల జాబితాలో పేరు సంపాదించింది.ఇషా అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో నిండిన అద్భుతమైన దృశ్యాలు ఆధునిక డిజైన్‌ను సాంప్రదాయ అంశాల సమ్మితంగా ఉంటడంలో ఆశ్చర్యమేముంది. చక్కని వాస్తు, అద్భుతమైన ఇంటీరియర్స్, నుండి అత్యాధునిక సాంకేతికత వరకు ప్రతీ కార్నర్ అంబానీ శైలిని, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.డైమండ్ థీమ్డ్ ఇల్లుఇషా అంబానీ , ఆనంద్ పిరమల్ విలాసవంతమైన నివాసం అయిదు అంతస్తుల భవనం ‘గులిటా’. ఈ అతి విలాసవంతమైన ఇల్లు భారతదేశంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటైన ముంబైలోని వర్లిలో ఉంది. అరేబియా సముద్రం తీరాన, గాలి, అలల హొయల లయల మధ్క 3-D డైమండ్ థీమ్‌తో ఉంటుందీ అపార్ట్మెంట్. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు లగ్జరీలకు కొదువే లేదు. లండన్‌కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్చరల్ కంపెనీ ఎకర్స్లీ ఓ'కల్లఘన్ దీన్ని డిజైన్ చేసిందట. దీన్ని ఆనంద్ తల్లిదండ్రులు అజయ్ , స్వాతి పరిమల్ వివాహ బహుమతిగా ఇచ్చారట. అప్పటికి దీని విలువు దాదాపు వెయ్యి కోట్లు రూపాయలు. 2012లో హిందూస్తాన్ యూనిలీవర్ నుండి భూమిని కొనుగోలు చేసింది. దీన్ని రెన్నోవేషన్ కోసం 500 కోట్లు చెల్లించారట.ఇంటీరియర్స్ఇంద్రభవనం లాంటి ఇల్లు కళాత్మకమైన ఇంటీరియర్స్‌తో నిండి ఉంటుంది. ఈ ఇంటిలో11 మీటర్ల పొడవైన పైకప్పుతో అలంకరించబడిన లివింగ్ రూమ్ ,ఓపెన్ స్విమ్మింగ్ పూల్, బహుళ లివింగ్ రూములు, డైమండ్ రూమ్,మాస్టర్ బెడ్రూమ్ డబుల్-హైట్ మల్టీ-పర్పస్ లాంజ్, లాంటి అన్ని హంగులతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లల సౌకర్యార్థం, ఇన్-హౌస్ వైద్యులు, బట్లర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, అనేక ఇతర ముఖ్యమైన సేవలు వంటి సౌకర్యాలు మరిన్ని ఉన్నాయి. -
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్, టీవీ ప్రెజెంటర్, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.సూపర్ సింగర్, ది వాల్ అండ్ కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ వంటి షోలలో హోస్ట్‌గా పాపులర్ అయిన ప్రియాంక DJ వాసి సచ్చితో ఏడడగులు వేసింది.కరియర్లో సక్సెస్అయినప్పటికీ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిన ప్రియాంక రెండోసారి ప్రేమను వెదుక్కుంది. ఏప్రిల్ 16 కొంతమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అభిమానులతో ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకుంది. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపారు. టెలివిజన్ ఐకాన్ పెళ్లి అవతార్‌పై నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్లు ముగ్ధులయ్యారు. View this post on Instagram A post shared by Priyanka Deshpande (@priyankapdeshpande)రాయల్ లుక్‌లో వధూవరులుప్రియాంక , వాసి కొత్త దంపతులుగా చాలా అనందంగా కనిపించారు. చాలా సంతోషంగా ఇరు కుటుంబాలతో కలిసి పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రియాంక తన స్పెషల్ డే కోసం ఐవరీ అండ్ గోల్డెన్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరిలాగా మెరిసిసోయింది. హెవీ ఎంబ్రాయిడరీ , జరీ వర్క్ బ్లౌజ్, సన్నని బంగారు అంచు, సింపుల్ ఎంబ్రాయిడరీతో ఎరుపు దుపట్టాతో కొత్త పెళ్లికూతురిలా కళకళలాడింది. ఇంకా సింపుల్ మేకప్ లాంగ్ నెక్లెస్, గాజులు, ఝుమ్కి, కమర్ బంద్ ,మాంగ్ టీకాతోపాటు, ఆమె ఉత్సాహభరితమైన చిరునవ్వుతో అలంకరించుకుంది. మరోవైపు, వాసి సాధారణ తెల్లటి కుర్తా , వేష్టి ధరించాడు.మొత్తం మీద ఇద్దరూ రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక అభిమాన ప్రేమ పూర్వక సందేశం"మనం కోరుకునే ప్రేమను పొందడం నిజంగా చాలా అరుదు. అలాంటి ప్రేమ దొరికడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు; ఇది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం,ఒకరినొకరు సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవడం,ఒకరికొకరు చిన్న విషయాలను మార్చుకునేంత శ్రద్ధ వహించడం..అంతేగా.. అదే ప్రేమ. ప్రియాంక, స్వచ్ఛమైన, సంతోషకరమైన ప్రేమకు మీరు అర్హులు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ చుట్టూ ప్రేమతో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడం చూసి హృదయం నిండిపోతుంది. "మీకు చాలా, చాలా, చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను."ప్రియాంక దేశ్పాండేప్రియాంక దేశ్‌పాండే 2016 ఫిబ్రవరిలో సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ 2022లో విడిపోయినట్లు సమాచారం. ఎవరీ డీజే వాసిమ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్లిక్ 187 కంపెనీకి డైనమిక్ వ్యవస్థాపకుడు. అగ్రశ్రేణి క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీలు సెలబ్రిటీ వివాహాలను నిర్వహణలో దిట్ట. దీనికితోడు సంగీత నైపుణ్యం ,ఈవెంట్ నైపుణ్యం అతన్ని హై-ప్రొఫైల్ ఈవెంట్స్‌లో కీలకంగామారాడు. ప్రియాంక హోస్ట్ చేస్తున్న వాసి ఈవెంట్లలో అయిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది. -
ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి ఒక హోటల్లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు. -
వారి సంఖ్య ఎందుకు తక్కువ?
ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం...⇒ పోలీస్‌శాఖకు సంబంధించి జాతీయ స్థాయిలో కేవలం 8 శాతం మహిళా అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో 52 శాతం మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 25 శాతం మంది ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.⇒ కానిస్టేబుల్ స్థాయిలో మహిళలు 13 శాతం ఉన్నారు. ⇒ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారులలో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.⇒ అత్యధికంగా మహిళా డిఎస్పీలతో (133) మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.⇒ ప్రస్తుతం 78 శాతం పోలిస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయి.⇒ ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్రపాలితప్రాంతం కూడా పోలీసుశాఖలో మహిళల కోసం వారి స్వంత రిజర్వ్ కోటాను చేరుకోలేదు.ఎందుకు ఇలా?‘పోలీసు శాఖలో మహిళలప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి దీర్ఘకాలిక, సామాజిక, వ్యవస్థాగత వైకల్యాలే కారణం. పోలీసింగ్ అనేది పురుషులు, శారీరక బలం ఉన్న వారి వృత్తి మాత్రమే, సుదీర్ఘమైన పనిగంటలతో ముడిపడి ఉన్న ఉద్యోగం అనే లోతైన అబిప్రాయం చాలామందిలో ఉంది. కుటుంబం, సామాజిక ఆకాంక్షలు మహిళలు పోలీసు వృత్తిలోకి రాకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది’ అంటున్నారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ.వ్యవస్థాగత అవరోధాలను కూడా ఆమె ఎత్తి చూపారు.‘చైల్డ్‌కేర్ ఫెసిలిటీస్, సేఫ్ వర్కింగ్ కండీషన్, జెండర్–సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత స్పష్టంగా ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని తగినంత రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు లేకపోవడం, పరిమిత మార్గదర్శకత్వం, కెరీర్ పురోగతి మందగించడం వంటి ఇతర సమస్యలు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ మౌలిక సమస్యలను పరిష్కరించకపోతే, పోలీస్ వృత్తిలోకి మహిళల ప్రవేశం పరిమితంగానే కొనసాగుతుంది’ అంటారు కిరణ్ బేడీ.‘యూనిఫాం ధరించిన పురుష సిబ్బంది నుంచి మహిళా పోలీసులకు తగినంత సహకారం లభించడం లేదు’ అంటున్నారు కొందరు మహిళా పోలీసు అధికారులు.నెమ్మదిగా అయినా సరే...‘చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో మహిళలకు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎక్కువమంది మహిళలను చేర్చుకోవడంలో వారంతా సీరియస్‌గా ఉన్నారు. నెమ్మదిగా మా సంఖ్య పెరుగుతోంది’ అంటారు మాజీ ఐపీఎస్ అధికారి మీరాన్ చద్దా. -
వ్యాపారవేత్తతో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్
ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్ న్యూస్ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్ పాపులర్ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ప్రకటించింది. తన నిశ్చితార్థం చిత్రాలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అభినందనలు వెల్లువెత్తాయి. ‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వైష్ణవి గౌడ. సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నిశ్చితార్థ వేడుక కోసం, వైష్ణవి గౌడ భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. సీక్విన్, బీడ్‌వర్క్, సున్నితమైన జరీతో కూడిన సంక్లిష్టంగా అలంకరించబడిన బ్లౌజ్ ధరించింది. ఇంకా పచ్చరంగు రాళ్ల స్టేట్మెంట్ చోకర్ నెక్లెస్‌ను కూడా జత చేసింది. ఇంకా మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకా, స్టేట్మెంట్ కడాతన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. మరోవైపు అనుకూల్ మిశ్రా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఐవరీ షేర్వానీలో రాయల్ లుక్‌లో అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Vaisshnavi (@iamvaishnavioffl) వైష్ణవి గౌడ గురించి మరిన్ని వివరాలువైష్ణవి గౌడ 1995, ఫిబ్రవరి 20, 1995న జన్మించారు. ఆమె కన్నడ నటి అమూల్యకు ప్రాణ స్నేహితురాలు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాదు బెల్లీ డాన్సర్ కూడా. గత పదేళ్లకుపైగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. 2011లో 16 సంవత్సరాల చిన్న వయసులో వైష్ణవి తన మొదటి షో 'దేవి' చేసింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిని వై ష్ణవి వరుస ఆఫర్లను దక్కించుకుంది. అయితే, ఆమె 2013 షో 'అగ్నిశాక్షి' బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో కూడా పాల్గొంది. -
సహజమైన మార్పు ఇది.. మనమూ మారుదాం!
గైనకాలజిస్ట్లు, సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, లైఫ్ కోచ్‌లు.. అందరూ చెబుతున్నదీ, అవగాహన పెంచుతున్నదీ.. మెనోపాజ్‌తో మహిళ జీవితం అయిపోదని, అదొక ఫేజ్ అని, సహజమైన మార్పు అనే! దాన్ని ఆమె సాఫీగా దాటి.. లైఫ్‌ని ఉత్సాహంగా రీస్టార్ట్ చేయాలంటే ఆ దశ మీద అందరికీ అవగాహన ఉండాలని! ఆ ఉద్దేశాన్ని ఈ క్యాంపెయిన్ కాస్తయినా నెరవేర్చిందని.. సైలెంట్‌గా ఉన్న ఆ అంశాన్ని చర్చలోకి తెచ్చిందని భావిస్తున్నాం! మెనోపాజ్ గురించి మరికొందరు నిపుణులు చెబుతున్న మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..మెనోపాజ్‌ను మనతో సహా తూర్పుదేశాలన్నీ పాజిటివ్‌గానే చూస్తున్నాయి. ఇది మహిళ జీవితంలో అత్యంత సహజమైన దశ. సింప్టమ్స్ తీవ్రంగా ఉండి దైనందిన జీవితం కూడా కష్టమైప్పుడు తప్ప దీన్ని దాటడానికి మెడికల్ సపోర్ట్ అంతగా అవసరం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఆసక్తికరమైన మార్పు. కాబట్టి దీని గురించి మాట్లాడ్డానికి సిగ్గుపడనక్కర్లేదు. బిడియం అంతకన్నా వద్దు. 45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయమూ లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి! కుటుంబాలకు ఆ అవగాహన రావాలంటే పెరిమెనోపాజ్లోని మహిళలు తాము అనుభవిస్తున్న శారీరక, మానసిక సమస్యల గురించి కుటుంబానికి చెప్పాలి. చర్చించాలి. అప్పుడే ఆమె పరిస్థితిని కుటుంబం అర్థం చేసుకోగలదు. అండగా నిలబడగలదు. అంతేకాదు ఆ దశలోని మహిళలు తమ మానసిక భారాన్ని తేలిక చేసుకోవడానికి పదిమందితో కలుస్తూ .. మాట్లాడుతూ ఉండాలి. నడివయసు స్త్రీలలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. అయితే వయసుతో వచ్చిన మార్పులేమిటీ, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చిన మార్పులేమిటో కనుక్కోవడం కష్టమే! సమస్యలు తీవ్రంగా ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహిళ వైద్యులను సంప్రదించాలి. ఆమె చెప్పింది వైద్యులు శ్రద్ధగా విని, అవసరమైన సలహాలు, సూచనలతో ఆమె ఆ దశను సాఫీగా దాటేలా సాయం చేస్తారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల పెరిమెనోపాజ్ పట్ల సమాజంలో అవగాహన కలిగే అవకాశం ఉంది.కష్టం లేకుండా పెరిమెనోపాజ్ దశను దాటేందుకు కొన్ని చిట్కాలు...డైట్ : పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం భోజన మోతాదును, అందులోని అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి కానీ పూర్తిగా భోజనాన్నే మానేయకూడదు! రోజు మొత్తంలో తీసుకునే భోజనంలో 30 శాతం లేదా అంతకంటే తక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫ్యాటీ మీట్స్, హోల్ మిల్క్, ఐస్‌క్రీమ్స్, చీజ్ లాంటివాటికీ దూరంగా ఉండాలి. మసాలానూ దరిచేరనివ్వద్దు. చక్కెర, ఉప్పునూ తగ్గించాలి. గ్రిల్డ్, స్మోక్ ఫుడ్‌కీ నో చెబితే మంచిది. ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు నీటిని తాగాలి. మద్యం పూర్తిగా మానేయాలి. కాఫీ తగ్గించాలి. వ్యాయామం: క్రమం తప్పని వ్యాయామంతో శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. అందుకే రోజూ 45 నిమిషాల పాటు కచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్,ప్రాణాయామాన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్రియేటివ్ వర్క్‌ని వెదుక్కోవాలి. ఇది ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు, చుట్టాలు, స్నేహితులతో కలుస్తుండాలి. హాట్ ఫ్లషస్ ఇబ్బందిగా మారితే.. వాటిని ట్రిగర్ చేస్తున్నవేవో గమనించి వాటికి దూరంగా ఉండాలి. పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. వాకింగే కాక స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్ ఇలా ఇష్టమైనదాన్ని ఎంచుకోవచ్చు. విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవాలి. 40 నుంచి 60 గ్రాముల సోయా ప్రొటీన్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటన్నిటి సహాయంతో పెరిమెనోపాజ్ దశను హాయిగా దాటేయొచ్చు. – డాక్టర్ ప్రణతి రెడ్డిక్లినికల్ డైరెక్టర్, రెయిన్బో హాస్పిటల్స్45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయం లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి!పాజ్ నుంచి పుంజుకుందాం.. మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన ప్రక్రియ. దీని తర్వాత కూడా ఆమెకు 30 ఏళ్లు పైబడిన ఆరోగ్యకర మైన, చురుకైన జీవితం ఉంటుంది. అందుకే మెనోపాజ్‌లో వచ్చే మార్పులు, సమస్యల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం అత్యంతవసరం! ఈ దశలోని శారీరక మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. హాట్ ఫ్లషస్.. ఆ వెంటనే చెమటలు పట్టడం వంటివి మహిళ దైనందిన జీవితాన్ని ఇబ్బందిగా మారుస్తాయి. వెజైనల్ డ్రైనెస్ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అది ఆమెలో ఆందోళనకు తద్వారా ఇతర మానసిక సమస్యలకూ దారీతీయవచ్చు. ఈ సమయంలో కొందరు మహిళలు బరువు పెరుగుతారు. కీళ్లనొప్పులు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివీ అనుభవంలోకి వస్తుంటాయి. ఇవన్నీ మానసిక ఇబ్బందులకు దారితీస్తుంటాయి. ఈ మొత్తంలో ప్రధానంగా చర్చించుకోవాల్సింది మెనోపాజ్‌లో వచ్చే డిప్రెషన్ లేదా కుంగుబాటు గురించి. మహిళలకు మెనోపాజ్ కంటే ముందు డిప్రెషన్ ఉన్నా లేకపోయినా.. ఈ దశలో దీనిబారినపడే ప్రమాదం రెండు నుంచి నాలుగింతలు ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ టైమ్‌లో కుటుంబం ఆమెకు అండగా నిలవాలి. కానీ మన దేశంలో దీని పట్ల సరైన అవగాహన లేక కుటుంబాల నుంచి కోరుకున్న మద్దతు లభించట్లేదు. అందుకే మెనోపాజ్ ప్రభావాన్ని కుటుంబమూ అర్థం చేసుకొని, అవగాహన పెంచుకోవాలి. మెనోపాజ్ తర్వాతా ఆమె జీవితం సాఫీగా సాగిపోయేలా సహకరించాలి. లేకపోతే ఒత్తిడి పెరిగి అది ఆమెను వేగంగా వృద్ధాప్యానికి చేరువచేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు ఏమాత్రం కనపడినా జంకు, సందేహం లేకుండా వెంటనే మానసిక వైద్యనిపుణులను కలవాలి. ఏ మానసిక సమస్యకైనా కౌన్సెలింగ్ రూపంలోనో.. మందులో రూపంలోనో.. ఇంకే ఇతర సపోర్ట్ రూపంలో అయినా చికిత్స ఉంటుంది. దానికంటే ముందు మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్, మెడిటేషన్‌ను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమస్యలను సాటి మహిళలతో పంచుకోవడానికి, చర్చించడానికి సందేహించవద్దు. షేరింగ్ వల్ల ఆందోళన, భయం తగ్గుతాయి. భరోసా వస్తుంది. అంతేకాదు ఆ చర్చల వల్ల సమాజంలోనూ దీనిపట్ల అవగాహన పెరుగుతుంది. ఇది జీవితంలో మళ్లీ పుంజుకోవడానికి సాయపడుతుంది.– డాక్టర్ అల్లం భావన, సైకియాట్రిస్ట్ఫిట్నెస్ పెంచుకుందాం... మెనోపాజ్ అనగానే జీవితం అయిపోయిందని భావించడమో, ఇక ఉపయోగం లేదని అనిపించుకోవడమో, తమ అవసరాన్ని ఎవరూ గుర్తించరనే భయమో కలుగుతుంది. నిజానికి ఇప్పుడే జీవితానికి కొత్త అర్థం మొదలవుతుంది. ఈ దశలో ఫిట్నెస్ చాలా కీలకం. ఫిట్నెస్ పెంచుకోవాలి. బ్రిస్క్ వాకింగ్, యోగా (భుజంగాసనం, చైల్డ్ పోజ్, శవాసనం లాంటివి),ప్రాణాయామం శరీరకంగా, మానసికంగా ఉపశమనాన్నిస్తాయి. సమతుల (కాల్షియం, విటమిన్ డి, ఒమేగా 3, ఫైబర్,ప్రొటీన్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌తో కూడిన) ఆహారం, తగినంత వ్యాయామంగల ఆరోగ్యకర జీవనశైలి మెనోపాజ్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఒంటరితనం, దిగులుకు లోనవకుండా కొత్త యాక్టివిటీ మొదలుపెట్టాలి. ఫ్రెండ్స్‌తో గ్రూప్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూండాలి. మహిళ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఆమె మనసు, భావోద్వేగాలు కూడా! ఈ కోణంలో కుటుంబం మెనోపాజ్ దశలోని మహిళను అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆమె ఆ దశను ఆనందంగా మలచుకుంటుంది.. ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. – రజిత మైనంపల్లి, లైఫ్ కోచ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, యోగా అండ్ డైట్ ఎక్స్పర్ట్సిద్ధమైపోవాలంతే!అప్పటిదాకా బాధ్యతల్లో మునిగిపోయిన మహిళకు తన జీవితాన్ని తనకు నచ్చినట్టు మలచుకునే ఒక వెసులుబాటు మెనోపాజ్! పీరియడ్స్ ఆగిపోవడం వలన శారీరకంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ పీరియడ్స్ వల్ల అప్పటిదాకా ఉన్న కొన్ని అసౌకర్యాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ప్రయాణాలకు, కొత్త ప్రయత్నాలకు పీరియడ్స్ ఆటంకం ఉండదు. ఫ్యామిలీ ప్లానింగ్ బాధ్యతను మోసే బెడదా తప్పుతుంది. ఒక స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ సానుకూలతల పట్ల దృష్టి నిలిపి.. మనసుకు ఉత్సాహాన్ని పట్టించి.. వయసుకు రెక్కలు తొడిగి రీస్టార్ట్‌కు సిద్ధమైపోవాలంతే!– శిరీష చల్లపల్లినిర్వహణ: సరస్వతి రమ -
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఆమె సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో తన స్టైల్‌ని చాటుకున్నారు. తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌తో కలిసి నీతా అంబానీ ఇక్కడికి రావడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ వీడియోను అంబానీ అప్డేట్ పేజ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా పాదాలకు మొక్కొ ఆశీర్వాదం తీసుకున్నారు. నీతా అంబానీ పువ్వులు సమర్పించడం, దీపాలు వెలిగించడం ,ఆలయంలో సమయం గడపడం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఆలయం తరుపున ఆమెకు షిర్డీ సాయిబాబా జ్ఞాపికను కూడా బహుకరించారు.ముఖ్యంగా సింపుల్ గులాబీ రంగు బాంధానీ కుర్తాలో చాలా హుందాగా కనిపించారు. దీనికి జోడీగా పింక్ కలర్ మ్యాచింగ్ దుపట్టాతో సింపుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. అలాగే డైమండ్ స్టడ్లు, రత్నాలు పొదిగిన గాజులు , ఉంగరాలతో చాలా సరళంగా కనిపించారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఇటీవల నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజు సందర్భంగా అనంత్, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి రామ నవమి వేడుకల కోసం ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. -
ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డులు స్ఫూర్తిదాయకం
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం: మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
‘‘మానవ తప్పిదాలు సహజమే’’, ‘‘అసలు తప్పే చేయనోడు మనిషే కాదు’’ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ, తేడా వస్తే.. రిజల్ట్స్ భయంకరంగా ఉన్నాయి. దిమ్మదిరిగి బొమ్మ కనుపడుద్ది..తూచ్..నేనొప్పుకోను అంటే కుదరదు.. అస్సలేమీ అర్థం కాలేదు కదా... ఆ మాటల వెనుక మర్మం తెలియాలంటే ఈ కథనం గురించి తెలుసుకోవాలి.మారుతున్న జీవన పరిస్థితులు, జన్యుపరమైన కారణాల రీత్యా అనేక మంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా గర్భం ధరించడం కష్టమైన వారు కృత్రిమ పద్దతుల ద్వారా బిడ్డల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. దీంతో వీధికో ఐవీఎఫ్ సెంటర్ (IVF) పుట్టుకోస్తోంది. ఇవి కొందరికి వరాలిచ్చే కేంద్రాలుగా మారుతుండగా, మరికొందరికి మాత్రం పీడకలగా మారుతున్నాయి.ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో ఈ వివాదం నెలకొంది. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నించిందో ఆస్ట్రేలియన్ మహిళ. మరో వైపు ఇదే ఆశతో బ్రిస్బేన కేంద్రానికి వచ్చిందో జంట. అయితే ఆ జంటకు చెందిన పిండాన్న ఆయా మహిళల గర్భంలోకి ప్రవేశ పెట్టారు. అనుకున్నట్టు ఆస్ట్రేలియన్ మహిళ గర్భం నిలిచింది. అంతులేని ఆనందంతో, నవమాసాలు మోసి కోటి ఆశలతో బిడ్డకు జన్మనిచ్చింది. తీరా అది తన బిడ్డకాదని తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది. ఐవీఎఫ్ కేంద్రం చేసిన పొరబాటు కారణంగా మహిళ తానొక అపరిచితుడి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకుంది. ఇది చట్టపరమైన, నైతిక ఆందోళన లేవనెత్తింది.చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు తప్పయిదంటూ వివరణ, నష్ట పరిహారంఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన ఈ తప్పును. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించారు. అయితే జరిగిన తప్పును అంగీకరించి ఐవీఎఫ్ సెంటర్ మోనాష్ బాధితులు అందరికీ క్షమాపణ చెప్పింది. అలాగే వారికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించింది. దాదాసే భారత కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు నష్ట పరిహారం చెల్లించింది.ఇపుడా బిడ్డ ఎవరికి చెందుతుంది?నిజమైన జన్యు తల్లిదండ్రులు ముందు కొచ్చిదీని గురించి చర్చించాలనుకుంటున్నారా, లేదా అనేది ప్రశ్న అంటోంది మోనాష్ సంస్థ. ఇది అన్ని చోట్ల భయంకరమైన, విచారకరమైన పరిస్థితి అని మోనాష్ ఐవీఎఫ్ నిపుణుడు పేర్కొన్నారు. ఇది పాల్గొన్న జంటల జీవితాన్నిమార్చివేసేది అయినప్పటికీ, తదుపరిసారి ఎక్కువగా బాధపడేది ఈ తప్పుకు కారణమైన శాస్త్రవేత్త" అన్నారు. ఆస్ట్రేలియాలోని చట్టం ఎలా నిర్ణయిస్తుందో తెలియదు, మానవులు తప్పులు చేస్తారని అంగీకరించడం తప్ప ఇంతకు మించి చేసేదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో?అయితే తల్లైన జంట, బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరు, బిడ్డను ప్రస్తుతం ఎవరికి అప్పగించారు? ఈ శిశువు ఎవరికి చెందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం, జన్మనిచ్చిన తల్లి , ఆమె భాగస్వామి చట్టపరమైన తల్లిదండ్రులుగా గుర్తించ బడతారని, జీవసంబంధమైన తల్లిదండ్రులను కస్టడీ హక్కులు లేకుండా చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు IVF పరిశ్రమపై భద్రత, పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. దీంతోపాటు సహాయక పునరుత్పత్తి సాంకేతికతలలో మెరుగైన రక్షణల అవసరాన్ని హైలైట్ చేసింది. -
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
ఏడాది వరకు నెలసరి రాకపోతే అప్పుడు దాన్నిమెనోపాజ్ గా పరిగణిస్తారు. సాధారణంగా 45 నుంచి 52 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది. తొలి లక్షణంగా నెలసరి క్రమం తప్పుతుంది. అంటే రెండు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి వస్తూంటుంది. తర్వాత ఒంట్లో వేడి ఆవిర్లు, నిద్రలేమి, గుండె దడ, అలజడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం, జీవనాసక్తి తగ్గడం, బరువు పెరగడం, ఒంటరితనం వంటివీ ఉంటాయి. మూడు, నాలుగేళ్ల వరకు కొనసాగే ఈ దశను ప్రీమెమెనోపాజల్ స్టేజ్ అంటారు. అయితే ఆ ఫేజ్‌లో ఉన్న అందరికీ ఆ లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరు ఏ లక్షణమూ లేక సాఫీగా ఆ దశను దాటేయవచ్చు. లక్షణాలు ఉంటే జీవనశైలిలో మార్పులు, యోగా, ఎక్సర్‌సైజ్‌తో మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యమైన విషయం.. మెనోపాజ్ అని నిర్ధారణ అయ్యాక స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవాలి. మెనోపాజ్ తర్వాత.. స్త్రీ మేనికి మెరుపు, నిగారింపునిచ్చేవి ఫిమేల్ హార్మోన్సే. మెనోపాజ్ తర్వాత వాటి ఉత్పత్తి లేక గ్లో కూడా తగ్గిపోతుంది. చర్మం సాగి, ముడతలు పడుతుంటుంది. వెజైనా పొడిబారి పోతుంది. లైంగికాసక్తి తగ్గిపోతుంది. బ్లోటింగ్ ఉంటుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలూ మొదలయ్యే చాన్స్ ఉంటుంది. అయితే వీటన్నిటికీ భయ పడాల్సిన పనిలేదు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలి. డాక్టర్ సూచనల మేరకు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. వెజైనల్ డ్రైనెస్ సమస్య కోసం ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ మెడిసిన్స్ తీసుకోవచ్చు లేదా జెల్లీని ఉపయోగించొచ్చు. ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. మసాలా, వేపుళ్లకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. హెల్త్ చెకప్స్ మరచిపోవద్దు. మామోగ్రఫీ, పాప్‌స్మియర్ పరీక్షలు తప్పనిసరి. ఇంకో విషయం.. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వచ్చింది. కాబట్టి.. పెద్దమనిషి అయిన అమ్మాయిల నుంచి 45 ఏళ్ల మహిళల వరకు ఈ వాక్సిన్ను తీసుకోవచ్చు. లైంగిక జీవితం మొదలుకాకముందే ఈ వాక్సిన్ తీసుకుంటే మంచిది. మెనోపాజ్ మూడు రకాలుగా వస్తుంది. ఒకటి.. సహజంగా వయసుతో వచ్చేది. రెండు.. వయసుతో సంబంధం లేకుండా జీవనశైలిలో మార్పులు, పొల్యుషన్, పెస్టిసైడ్స్ ఫుడ్ లాంటి వాటితో 40 ఏళ్లలోపే వచ్చే అర్లీ మెనోపాజ్. మూడవది.. శస్త్రచికిత్స ద్వారా గర్భసంచి, అండాశయాలను తొలగించడం వల్ల, క్యాన్సర్‌కు వాడే కొన్నిరకాల మందులు, రేడియేషన్ వల్ల కృత్రిమంగా వచ్చే మెనోపాజ్ మెనోపాజ్ లక్షణాల్లో ఒకటైన హాట్ ఫ్లషస్ను యూరప్, ఉత్తర అమెరికా దేశాలలో 60–90 శాతం మంది స్త్రీలు ఎదుర్కొంటున్నారని, వారితో పోలిస్తే ఆసియా ఖండంలో 10–20 శాతం మంది మహిళలు మాత్రమే ఈ సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకు ఆసియా ఖండంలోని ఆహారపు అలవాట్లు అంటే వారు తీసుకునే ఆహారంలోని ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ దేశాల్లో మెనోపాజ్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నవారు కౌన్సెలింగ్, జీవనశైలిలో మార్పులతో ఆ దశను సమర్థంగా ఎదుర్కొంటున్నారట. ధూమపానం, ΄ పొగాకు, ఊబకాయం, స్పైసీ ఫుడ్, పొగలుగక్కే ఆహారం తినడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, మద్యం, థైరాయిడ్ గ్రంథి లోపాలు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివన్నీ హాట్ఫ్లషస్కి ప్రేరకాలు (ట్రిగర్) గా పనిచేస్తాయి. అయితే జీవన శైలిలో మార్పులు, వైద్య సలహా సూచనలతో ఆ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నువ్వులు, గడ్డి నువ్వులు, అవిసె గింజలు, సోయా బీన్స్, ముల్లంగి, నట్స్, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటితోనూ మెనోపాజ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.మెనోపాజ్ అనేది సవాళ్లతో కూడిన మార్పు!‘శాస్త్రీయ అవగాహన ఉంటే సమర్థవంతంగా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చు.. ఆ మార్పును ఆస్వాదించొచ్చు’ అని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్లు డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ ఆలియా రెడ్డి!శిల్పా శెట్టి మొదలు ట్వింకిల్ ఖన్నా, శ్వేతా బచ్చన్ (జయ బాధురి, అమితాబ్ బచ్చన్ల కూతురు), టెలివిజన్ హోస్ట్ మినీ మాథూర్ లాంటి వాళ్లందరూ హాట్ ఫ్లషస్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారే. ఆ లక్షణాల గురించి అవగాహనలేక చాలా ఇబ్బందులు పడ్డారట. వాళ్ల మూడ్ స్వింగ్స్‌ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెర΄ోయేవారని, తామెందుకలా ప్రవర్తిస్తున్నామో అర్థంకాక .. ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఆందోళన చెందారని చెప్పారు. ఆ బాలీవుడ్ సెలెబ్స్ అందరూ ఇప్పుడు మెనోపాజ్ అవేర్నెస్ ప్రచారకర్తలుగా మారారు. మెనోపాజ్ దశ, లక్షణాల మీద విస్తృతంగా చర్చిస్తూ మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయ అవగాహన పెంచుకుంటూ.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే.. మెనోపాజ్ అన్నది స్త్రీ జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. దాన్నో జబ్బుగా పరిగణించకుండా శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటూ కుటుంబం ఆమెకు అండగా నిలబడాలి. జీవిత భాగస్వామి ఆమెకు ఓ ఫ్రెండ్‌గా మారాలి. పిల్లలు అమ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆమెకు అనుకూలంగా మెలగాలి. ఇలాంటి వాతావరణం ఉంటే.. అది ఆమెకు హార్మోన్స్ కన్నా ప్రభావంతంగా పనిచేస్తుంది. మెనోపాజ్ మీద సమాజంలోనూ అవగాహన పెరగాలంటే ఆరోగ్యశిబిరాల్లో దాని మీద చర్చించాలి. మీడియా కథనాల ద్వారా ప్రచారం జరగాలి. అంతేకాదు మహిళ ఆరోగ్యాన్ని పాఠ్యాంశాల్లోనూ భాగం చేయాలి. – శిరీష చల్లపల్లి ఉమనోపాజ్ అర్థం చేసుకుందాం: నిర్వహణ సరస్వతి రమ -
Menopause: పాజ్ కాదు..కొత్త ఫేజ్...!
మార్పును అంగీకరిస్తేనే మనోనిబ్బరం, శక్తి తెలుస్తాయి.. స్త్రీలకు మెనోపాజ్ అలాంటి మార్పే! దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి! అలా అంగీకరించాలంటే ఆ దశ మీద ముందు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే మౌనం వీడాలి! ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రముఖ గాయని సునీత ముందుకు వచ్చారు.పాజ్ కాదు.. కొత్త ఫేజ్!‘‘మెనోపాజ్ మనకు చాలా దూరం అనుకునేవాళ్లలో నేనూ ఒకదాన్ని. కానీ అది మన శరీరంలో ఓ వలయంలా తిరుగుతూ మెల్లగా మన జీవితాన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఒకరోజు హఠాత్తుగా మనలో చిత్రమైన ఒత్తిళ్లు మొదలవుతాయి. మూడ్ మారిపోవడం, అసహనం, చర్మం ముడతలు పడటం, నిద్రలేమి, ఒంటరితనపు వేదన.. ఇవన్నీ ఓ పెద్ద సవాలుగా మారుతాయి. అదే మెనోపాజ్. పైకి ఉచ్చరించలేని మౌనంగా భరించే మార్పు. అదొక భయంకరమైన ప్రయాణం. మన చేయిపట్టుకునే వాళ్లు లేక ఒంటరితనం ఆవహిస్తుంది. దిగులు తోడవుతుంది.అదృష్టమే.. కాని అరుదు!మెనోపాజ్ దశకు చేరేప్పటికి జీవితం నెమ్మదిస్తుంది. పిల్లలు సెటిలవుతారు. భర్తా బిజీ అయిపోతాడు. మన ఉద్యోగంలో పెద్దగా మార్పు కనపడదు. వీటన్నిటికి తోడు మెనోపాజ్ ఇబ్బందులు.. అంతా అయిపోయిందనే భావన. మనల్ని మనమే సహించలేని రోజులు, భర్తకు చెబితే అసహనంగా చూసే క్షణాలుంటాయి. పిల్లలతో షేర్ చేసుకోనివ్వని బిడియం. స్నేహితులతో మాట్లాడదామంటే వారు ఇంకా ఆ దశకు చేరనివారే! అమ్మ కూడా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంటుంది.. ‘మా రోజుల్లో..’ అంటూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా నాస్టాల్జియాలోకి వెళ్లే ఆమె మాటలను వింటుంటే! మెనోపాజ్ స్టేజీని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్లుంటే అదృష్టమే! కాని అది అరుదు! అందుకే మనల్ని మనమే సముదాయించుకోవాలి.. మోటివేట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన మెడికేషన్ తీసుకోవాలి. మెనోపాజ్‌ను కొత్త ఫేజ్‌గా భావించాలి. అప్పటిదాకా నిర్వర్తించిన బాధ్యతల నుంచి వెసులుబాటు దొరికిందని ఆనందపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ స్వేచ్ఛను ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలకు ఓ అవకాశం అనుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, అభిరుచులు, ఆసక్తులతో జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. వదిలేయకండి.. ఎంత సెల్ఫ్మోటివేషన్తో ఉన్నా కుటుంబం, ఫ్రెండ్స్ నుంచి ఆమెకు సపోర్ట్ అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడాలి.. తను అనుభవిస్తున్న స్థితి గురించి అడగాలని కోరుకుంటుంది. తనను వినాలని ఆశపడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడాలి.. ఆమెను వినాలి.. ఆత్మీయంగా హత్తుకోవాలి. ఇవన్నీ ఆమెకు దివ్యౌషధాలు. కుటుంబ సభ్యులు ఆమెను వినడం వల్ల వాళ్లకు మెనోపాజ్ దశ పట్ల అవగాహన పెరిగి.. వర్క్‌ప్లేస్‌లోని మహిళలను అర్థంచేసుకుని సహానుభూతి చూపించగలుగుతారు. దీనివల్ల ఆడవాళ్లలో బిడియం పోయి.. ధైర్యం వస్తుంది. తమ ఇబ్బందుల గురించి చెప్పగలుగుతారు. ఆ స్టేజ్ ఎలా ఉంటుందో అమ్మాయిలూ గ్రహించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిగ్గా మెనోపాజ్ పట్ల ఉన్న సైలెన్స్ బ్రేక్ అయ్యి అవేర్నెస్ పెరుగుతుంది. అందుకే ఆ దశను అనుభవిస్తున్న ఆడవాళ్లను ఒంటరితనానికి వదిలేయకండి. అప్పటిదాకా ఇంటిని.. ఇంట్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆమెకు తోడుగా నిలబడండి. ఈ ప్రయాణం మనది అనే భరోసానివ్వండి!’’ అంటూ ముగించారు సునీత. మెనోపాజ్ అనేది స్త్రీ జీవితంలో సహజమైన దశ. ఆ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల గురించి తరచూ మాట్లాడుతూ.. చర్చిస్తూ ఉంటేనే దానిపట్ల అవగాహన పెరుగుతుంది. మెనోపాజ్‌ను అనుభవిస్తున్న మహిళే కాదు కుటుంబ సభ్యులూ దాన్ని అంగీకరించాలి. ఆమె దైనందిన జీవితం సాఫీగా సాగడానికి తగిన సపోర్ట్ అందించాలి. మహిళలు కూడా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధను మరచిపోవద్దు. – జూహీ చావ్లా, నటి, పర్యావరణ ప్రేమికురాలు.మెనోపాజ్ అనేది సహజమైన స్థితి. దాన్ని అంగీకరించి.. కొత్త అభిరుచులు, కొత్త అవకాశాలు, కొత్త పనులతో ఆ దశలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ట్రాన్సిషన్‌తో సరికొత్త జీవితాన్ని ఆరంభించాలి తప్ప అంతా అయిపోయిందనే నిరాశకు లోనుకాకూడదు. – నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’లోంచి!– శిరీష చల్లపల్లి -
ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం
ప్యూబర్టీ, మాతృత్వంలాగే స్త్రీ జీవితంలో మెనోపాజ్ కూడా శారీరక, మానసిక మార్పులతో కూడిన సహజమైన దశ! అయితే... ఇది సాఫీగా సాగిపోయే దశ కాదు. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మందగించి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అవి స్త్రీ దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇంత తీవ్రమైన అంశం మన సాంస్కృతిక నేపథ్యం కారణంగా సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ సైలెన్స్ మెనోపాజ్ మీద అవగాహన కొరవడేలా చేస్తాయి. ఎంతలా అంటే సమాజం సంగతి అటుంచి మెనోపాజ్ ఎఫెక్ట్స్ మీద ఆ దశను అనుభవిస్తున్న స్త్రీలకే తెలియనంతగా! అందుకే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి... మెనోపాజ్ మీద విస్తృతమైన చర్చ కొనసాగాలి. అప్పుడే సమాజం ఆమెను అర్థం చేసుకోగలుగుతుంది. తన వంతు మద్దతు అందించగలుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది.‘నేనిప్పుడు ఫ్రిజ్ డోర్ ఎందుకు తెరిచానబ్బా..?’ ఎంత చించుకున్నా అరుంధతికి గుర్తు రావడం లేదు. ‘ముందిక్కడి నుంచి వెళ్లు...’ చిన్న విషయానికే పెద్దగా అరిచేసింది ప్రతిమ. కంగుతిన్నాడు భర్త. ఆఫీస్‌లో సీరియస్ వర్క్‌లో ఉన్న అపర్ణ ఒక్క ఉదుటన లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్వసాగింది. ఎందుకంత దుఃఖం వచ్చిందో తెలియదు ఆమెకు. పనిమీద ఏకాగ్రత కుదరట్లేదు వైశాలికి. మాలతికి జాయింట్ పెయిన్స్, నీలిమకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటోంది. విజయ డిప్రెసివ్‌గా ఫీలవుతోంది. దిగులు వెంటాడుతోంది. కారణం లేకుండానే ఆందోళన చెందుతోంది ప్రేమ. జీవనాసక్తి లేదు. గిరిజ అయితే కళావిహీనంగా మారిపోయింది. రజితకు ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. క్షణంలో జ్వరమొచ్చినట్టుగా అయిపోతోంది. వీణకు నిద్ర కరవైంది. దాంపత్య జీవితం పట్లా ఆసక్తి పోయింది. దాంతో భర్త ఆమెను సాధిస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.పైన చెప్పిన మహిళలవే కాదు 40– 50 మధ్య వయస్సు వనితలందరివీ దాదాపు అవే సమస్యలు! మెనోపాజ్ ఎఫెక్ట్స్! చిత్రవిచిత్రమైన ఆ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్లకే అర్థంకాకపోతే కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బందికేం అర్థమవుతుంది.. వాళ్ల సహకారమెలా అందుతుంది! దీని మీద అవగాహన కల్పించేందుకు రమావైద్య, ఊర్వశి ఝా అనే వైద్యులు 1995 (ముంబై)లోనే తమ ప్రయత్నాన్నిప్రారంభించారు ‘ద ఇండియన్ మెనోపాజ్ సొసైటీ’ని స్థాపించడం ద్వారా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తూనే ఉంది. జర్నలిస్ట్, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త శైలీ చోప్రా కూడా ‘మెనోపాజ్’ మీద అవగాహన కల్పించేందుకు, దానికి సంబంధించిన మెడికల్ కేర్, కమ్యూనిటీ సపోర్ట్‌ను కూడగట్టేందుకు ఉద్యమిస్తున్నారు. మెనోపాజ్‌కి సంబంధించి విప్లవమే రావాలి అంటూ ఆమె రోడ్ షోస్ చేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ల ప్రకారం వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకపోతే మెనోపాజ్ వచ్చినట్టే! రుతుక్రమంలోని స్త్రీలు తప్పించుకోలేని దశ అది! కానీ మన సాంస్కృతిక నేపథ్యం దీనిగురించి మాట్లాడనివ్వకుండా చేస్తోంది. దానిమీద విస్తృతమైన చర్చ జరిగితేనే అదో వినకూడని మాటలా కాకుండా సాధారణమైన అంశగా మారుతుంది. మెనోపాజ్ ఫేజ్‌లోని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ దశలో వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం మొదలు శారీరక వ్యాయామం, ధ్యానం, ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటివాటి మీద ఎరుక వస్తుంది. అప్పుడే మెనోపాజ్ ప్రభావాన్ని స్త్రీ సమర్థంగా ఎదుర్కోగలదు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ సాక్షి ఫ్యామిలీ కూడా శారీరక, మానసిక వైద్యనిపుణుల విశ్లేషణలు, వివరాలు, సలహాలు, సూచనలతో నేటినుంచి మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను మొదలుపెడుతోంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019– 21) డేటా ప్రకారం..ప్రీమెచ్యూర్, అర్లీ మెనోపాజ్ గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతోంది. దానికి పేదరికం, నిరక్షరాస్యత వంటివి కారణాలుగా చూపెడుతోంది. మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, బహిష్టు సమయంలో అపరిశుభ్రంగా ఉండటం, అనారోగ్య పద్థతులు అనుసరించడం కూడాప్రీమెచ్యూర్ మెనోపాజ్‌కి కారణాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సంతానం,18 ఏళ్లకే తొలి కాన్పు, పన్నెండేళ్లు లేదా అంతకంటే చిన్నవయసులో రుతుక్రమం ప్రారంభం అవడం లాంటి వాటివల్లా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రిస్క్ పెరగొచ్చని తెలుపుతున్నాయి. దేశంలోని మిగిలినప్రాంతాల కన్నా బిహార్‌లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేట్ ఎక్కువగా కనబడుతోందని సర్వేల సారాంశం. అలాగే యాభై పైబడ్డాక కూడా నెలసరి కొనసాగిన వాళ్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ.నలభై ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చేస్తే దాన్నిప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. మన దేశంలో 2.2 శాతం మంది మహిళలు ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌లో ఉన్నట్లు అంచనా. నలభైనుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో గనుక మెనోపాజ్ దశ మొదలైతే దాన్ని అర్లీ మెనోపాజ్ అంటారు. ఈ దశలో ఉన్న మహిళల సంఖ్య 16. 2 శాతం.దేశంలో మెనోపాజ్ సగటు వయసు నలభై ఆరున్నరేళ్లు. అయితేప్రాంతాల వారీగా ఈ సగటు వయసులో తేడాలున్నాయి. దక్షిణ భారతదేశంలో 46 ఏళ్లు. ఉత్తర భారతంలో 45.5, మధ్య భారతంలో 47.8, పశ్చిమ భారతంలో 46.2, తూర్పు భారతంలో 47.3 ఏళ్లు.ముందు తరాల వారితో పోలిస్తే.. మెనోపాజ్ సింప్టమ్స్‌కి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, రోజులో ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం వంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.మెనోపాజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్‌లోని తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిస్పృహకు లోను కారాదు. – షబానా ఆజ్మీ, నటిమెనోపాజ్ దశలోని మహిళలు ముందు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి నిస్సంకోచంగా కుటుంబంతో చర్చించి, సపోర్ట్ అడగాలి. ఎమోషనల్ చాలెంజెస్‌కి డీలా పడిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని నార్మలైజ్ చేసుకోవాలి. – ప్రీతి జింటా, నటి– సరస్వతి రమ(చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమన్నాసెక్యూరిటీఅధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలిచాయి.తమన్నా ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్లో ఆ పోలీసు అధికారిని మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్ సైడ్ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్..సైడ్’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్‌గా మారింది.ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్ ఆఫీసర్ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్ కమెంట్ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
ఎడబాటు మానసికమా? భౌతికమా?
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు. -
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి. -
‘ఆడజన్మ’ పై నటి నీనాగుప్తా సంచలన వ్యాఖ్యలు
తన మనసులోని భావాలను అభిప్రాయాలకు నిక్కచ్చిగా చెప్పే మహిళల్లో ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఒకరు. ‘సచ్ కహో తో’ అంటూ తన ఆటోబయోగ్రఫిలో నీనా గుప్తా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే రేపారు. తల్లిని తన తండ్రి మోసగించిన తీరు.తల్లి ఆత్మహత్యాయత్నం చేయడం లాంటి ఇందులో ప్రస్తావించారు. అలాగే క్రికెటర్ రిచర్డ్స్‌తో సహజీవనం, మసాబాకు జన్మనివ్వడం, సింగిల్ పేరెంట్‌గా ఆర్థిక ఇబ్బందులు, బాలీవుడ్లో దర్శక, నిర్మాతల వేధింపులు బాలీవుడ్లో దర్శక, నిర్మాతల వేధింపులు ఇలా చాలా విషయాలను కూడా ఆత్మకథలో నిర్మొహమాటంగా రాసుకొచ్చారు.ఆడబ్రతుకు శాపం కన్నా తక్కువేమీకాదుఇటీవల ఫాల్తూ ఫెమినిజం అంటూ స్త్రీ పురుషు సమానత్వంపై మనసులోని మాట బెట్టింది నీనాగుప్త. స్త్రీ పురుషులు ఎప్పటికీ సమానంగా ఉండలేరంటూ స్త్రీవాద ఉద్యమం వేస్ట్ కొట్టి పారేసిన నీనా గుప్త తాజాగా మరోసారి దేశంలోని మహిళల భద్రత, దేశంలోని మహిళల పరిస్థితిపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. మహిళగా పుట్టడం శాపమే నని, ముఖ్యంగా పేద మహిళగా పుట్టడం శాపం కంటే తక్కువేమీ కాదని పేర్కొనడం గమనార్హం. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నీనా గుప్త గత వివాదాలు, స్త్రీవాద చర్చ, స్త్రీగా పుట్టడంపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే భారతదేశంలోని మహిళల కోసం తాను ఏమి కోరుకుంటున్నాడో అడిగినప్పుడు,“నేను కోరుకునేది సాధ్యం కాదు. మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అదీ సాధ్యం కాదు. మహిళలకు విద్య నేర్పించాలి.. చదువుకోవాలి అంటారు...ఆ తరువాత వాళ్లు ఉద్యోగం చేయాలను కుంటారు. తీరా ఉద్యోగానికి వెళితే అత్యాచారానికి గురవుతారు. మరిది శాపం గాకపోతే మరేమిటి? ‘స్త్రీగా, పేద మహిళగా పుట్టడం శాపం’ గానే భావిస్తున్నాను. ఈ పరిస్థితి చాలా బాధగా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆశావహంగా ఎలా మాట్లాడగలను అంటూ ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలోని ఒక వర్గం మహిళలు శారీరక సాన్నిహిత్యాన్ని వివాహం తర్వాత కేవలం ఒక విధిగా మాత్రమే చూడాలి. ఆనందం కోసంగా కాదు అనేలా ఉన్న సామాజిక కట్టుబాటుపై కూడా ఆమె స్పందించారు.‘ఫాల్తూ’ స్త్రీవాద వివాదంపై స్పందననీనా గుప్తా లింగ సమానత, సమస్యలపై నీనా గుప్తా వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడం ఇదే మొదటిసారి కాదు. ‘సమానత్వం అనే ఆలోచనను నమ్మాల్సిన అవసరం లేదు దీనికి బదులుగా, ఆర్థిక సాధికారత, పనిలో నైపుణ్యంపై మీ పనిపై శ్రద్ధ చూపాలి. గృహిణి అయితే, ఏం తక్కువ. నిజానికి ఇది ఒక ముఖ్యమైన పాత్ర. మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి. ఆత్మగౌరవాన్ని పెంచుకోండి ఇదే మహిళలకు చెప్పాలనుకుంటున్న ప్రధాన సందేశం’’ అన్నారామె. చదవండి: చెక్క ముక్కను నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీపురుషులు, మహిళలు సమానం కాదు. పురుషులు గర్భం దాల్చడం ప్రారంభించిన రోజే సమానత అని చెప్పింది నీనా గుప్తా. అయితే కాంటెక్ట్స్ సంబంధం లేకుండా మొత్తం ఇంటర్వ్యూలోని ఒక భాగాన్ని ప్రమోషన్ల కోసం మాత్రమే ఉపయోగించారని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. కాగా పంచాయత్ సిరీస్‌తో నటిగా విశ్వరూపం చూపించారు నీనా. బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పంచాయత్ సీజన్ 4 విడుదలకు సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య -
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. పాటరీ వర్క్షాప్నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది. -
కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
ముంబై: కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నాలజీ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వారు ఎక్కువగా ఎంట్రీ స్థాయికే పరిమితమవుతున్నారే తప్ప కెరియర్లో పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే వేతనాల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ అవకాశాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే (డీఈఐ) విధానాలు గత నాలుగేళ్లలో మహిళా టెకీల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. 2020లో కాంట్రాక్టు టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 9.51 శాతంగా ఉండగా, 2024లో ఇది 27.98 శాతానికి పెరిగింది. ఐటీ సర్వీసుల రంగంలో మహిళా సిబ్బంది వాటా 7.8 శాతం నుంచి 21.2 శాతానికి పెరిగింది. అయితే, ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో కెరియర్ పురోగతికి దారితీయడం లేదు. మధ్య స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 4.13 శాతం నుంచి 8.93 శాతానికి మాత్రమే పెరగడం ఇందుకు నిదర్శనం. ఎంట్రీ స్థాయిని దాటి పురోగమించేందుకు మహిళలకు గణనీయంగా అవరోధాలు ఉండటాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. 2020–2024 మధ్య టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బందిలోని 13,000 మంది అసోసియేట్స్ గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వేతనాల్లోనూ వ్యత్యాసాలు.. వేతనాల విషయానికొస్తే పురుషులు, మహిళల మధ్య ఎంట్రీ స్థాయి కొలవుల్లో 6 శాతం, మధ్య స్థాయి ఉద్యోగాల్లో 19 శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అయితే, సీనియర్ స్థాయిలో మాత్రం 13 శాతంగా ఉంటోంది. ‘కాంట్రాక్ట్ టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమే అయినప్పటికీ, లింగ సమానత సాధించాలంటే నియామకాల పరిధికి మించి బహుముఖ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం అంతగా లేకపోవడం, పురుషులతో పోలిస్తే వేతనాల మధ్య వ్యత్యాసాలు అలాగే కొనసాగుతుండటమనేది వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులను చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. మహిళలు ఉద్యోగాల్లో చేరడమే కాకుండా, కెరియర్లో పురోగమించేందుకు, సారథ్య బాధ్యతల్లో రాణించేందుకు అవసరమైన పరిస్థితులను కలి్పంచే దిశగా కంపెనీలు కృషి చేయాలి‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. -
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్‌కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్‌రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్‌రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్‌కు చైర్పర్సన్ గా సరళ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్‌రెడ్డి -
లేడీ బౌన్సర్స్‌కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు. -
ప్రతి పేషెంట్ కోసం మొక్కుకునేదాన్ని!
కోవిడ్ టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నిలబడ్డ నర్స్‌లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, చేసిన సాయం గురించి మపం గుర్తు చేసుకుంటున్నాం... అందులో భాగంగా నేడు కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో తెలంగాణలోనే ఏకైన కోవిడ్ వైద్యశాలగా సేవలందించిన గాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తించిన మహిళ కానిస్టేబుల్ వేలుపుల ప్రమీల అప్పటి వాతావరణాన్ని తలుచుకుంటూ చెప్పిన విషయాలు..ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. – వేలుపుల ప్రమీలనేను పుట్టి, పెరిగిందంతా సికిందరాబాద్‌లోనే! మొదటి నుంచీ యూనిఫామ్ అంటే రెస్పెక్ట్. అందుకే పోలీస్ జాబ్‌లోకి వచ్చాను. 2003లో సిటీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో పని చేస్తున్నా. కరోనా టైమ్‌లో బేగంపేట ఠాణాలో పని చేసేదాన్ని.అప్పుడు గాంధీ హాస్పిటల్‌కి తెలంగాణ వివిధప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ఇందుకోసం పోలీసు విభాగం అక్కడ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. దానికోసం ప్రతి స్టేషన్ నుంచి సిబ్బందిని తీసుకున్నారు. అలా బేగంపేట పోలీసుస్టేషన్ నుంచి నేనూ గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఐదు వారాలకు పైగా డ్యూటీలో ఉన్నా. అక్కడ పని చేయడానికి ఎస్సై నేతృత్వంలో పని చేసిన ఐదుగురు సభ్యుల్లో భాగమయ్యా. వాళ్లూ మన లాంటి మనుషులే కదా అనుకున్నా..ఓపక్క విజృంభిస్తున్న కరోనా.. మరోపక్క గాంధీ హాస్పిటల్‌కి రోజూ రోగుల తాకిడి. అలాంటి సమయంలో అక్కడ డ్యూటీ ఓ అరుదైన అవకాశంగానే భావించా. ఎంత కరోనా బారినపడితే మాత్రం వాళ్లూ మనలాంటి మనుషులే కదా! వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ వారికి సహాయం చేయాలనుకున్నా. నడుస్తూ కొందరు, నడవలేని స్థితిలో మరికొందరు, అసలు స్పృహలోనే లేకుండా ఇంకొందరు.. చూస్తే బాధనిపించేది. కుటుంబ సభ్యుల సాయంతో వచ్చేవాళ్లు. అయితే గేట్ లోపలికి పేషెంట్స్‌కి తప్ప మిగిలిన వారికి ప్రవేశం ఉండేది కాదు. పేషంట్స్ని గేట్ దగ్గరే వదిలేయాల్సి వచ్చేది. దాంతో కొందరు వాదనకు దిగేవాళ్లు. వారిని సముదాయించి, పరిస్థితి వివరించి పంపడం పెద్ద సవాల్‌గా ఉండేది.రోజూ విషాద వార్త వినాల్సి వచ్చేది..గాంధీ హాస్పిటల్ మెయిన్‌గేట్ దగ్గర రోజూ ఎనిమిది గంటల డ్యూటీ. చికిత్స కోసం వచ్చే రోగులు అనేక మంది తారసడేవాళ్లు. అప్పుడు లాక్డౌన్ అమలులో ఉండటంతో వారితో పాటు సహాయకులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లం. ఇలా చాలామందితో మాట్లాడాల్సి వచ్చేది. ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. ఒకోసారి అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. ఆ పేషంట్‌తో తమకున్న జ్ఞాపకాలను వాళ్లు మాతో పంచుకుంటుంటే మనసు భారమయ్యేది. ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని నిన్సహాయ స్థితి మాది. ప్రతి పేషెంట్ క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకునేదాన్ని.నాకూ కరోనా..గాంధీ హాస్పిటల్ దగ్గర ఐదు వారాల డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి బేగంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లిపోయా. అప్పుడు ఇతర రాష్ట్రాలు,ప్రాంతాల వారిని తరలించే ప్రక్రియ మొదలైంది. ప్రతిరోజూ ఏరియాల వారీగా బయటి వారిని గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ్రపాధాన్య క్రమంలో అక్కడ నుంచి బస్సుల్లో రైల్వే స్టేషన్ కు తరలించడం మా డ్యూటీగా మారింది. దీనికోసం వారితో సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. ఆ సందర్భంలో నాకూ కరోనా సోకింది.నా నుంచి నా హజ్బెండ్కీ వచ్చింది. ముగ్గురు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించినప్పటికీ మా అత్తగారిని మాత్రం మేమే చూసుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఆ మహమ్మారి ఆమెకు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నా. పీపీఈ కిట్, మాస్క్, గ్లోవ్స్ వేసుకుని వంట చేసేదాన్ని. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడంతో పదిహేను రోజులకు నాకు, నా హజ్బెండ్‌కి నెగటివ్ వచ్చింది. అప్పటివరకు పిల్లల్ని కంటితో కూడా చూడలేదు. ఆ రోజులు, ఆ అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. – శ్రీరంగం కామేష్, క్రైమ్ బ్యూరో, సాక్షి, హైదరాబాద్ -
నీటిని ఒడిసిపట్టారు
‘నీరు ఉన్న చోట ఊరు ఉంటుంది’ అనే మాట ఉంది. ఊరు సరే... నీటి మాట ఏమిటి?‘నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు’ అనే రోజులు వచ్చాయి.నీటి విలువ గురించి అవగాహన కలిగించడం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నారు...అస్సాంలోని అమ్తోలా గ్రామానికి చెందిన అరుణా దాస్ గుస్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ (డబ్ల్యూయుజీ) అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ‘ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది’ అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ్రపోగ్రామ్ (ఇండియా) ద్వారా ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని పాలియ కాలన్ గ్రామానికి చెందిన రమణ్‌దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు....ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో ‘వాటర్ మేనేజ్మెంట్ కమిటీ’లు ఏర్పాటు చేసింది.ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను వాటర్ మేనేజ్మెంట్ గ్రూపులలో భాగమయ్యేలా చేసింది.మహారాష్ట్రలోని కోటంబ గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలుగా ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన రేణుక కొంత కాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. ‘వాటర్ ఎయిడ్ ఇండియా’ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. నీటి వృథాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది.మధ్యప్రదేశ్‌లోని నయాపూరా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించడం, నీటి పంపుల రిపేర్...మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ బబితాను ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తించింది.మధ్యప్రదేశ్‌లోని మహుకల గ్రామానికి చెందిన రాధ మీనా ‘విమెన్ ప్లస్ వాటర్ అలయెన్స్’ ్రపోగ్రామ్ వాలెంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయడం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం వరకు ఎన్నో పనులు చేస్తోంది. ప్రతీ వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్‌తో ప్రచారం చేసేది..దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్‌లో వీరు కొందరు మాత్రమే. ‘వరల్డ్ వాటర్ డే’ సందర్భంగా అందరికీ వందనాలు. – శిరీష చల్లపల్లినీటి నిజాలు⇒ ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు ⇒భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా, డీసాలినేషన్ (సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చడం), వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడడం ముఖ్యం.వాటర్ గర్ల్... నీటి పుస్తకాలు‘వాటర్ గర్ల్’గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటీ ‘వై వేస్ట్?’ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, సీయివో. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది. -
కెపాసిటీ ఉన్న వారికి మధ్యంతర భరణం ఎందుకు : ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
భార్యాభర్తల విభేదాలు, మధ్యంతర భరణం విషయంలోఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామర్థ్యం ఉన్న మహిళలు మధ్యంతర భరణం కోరకూడదంటూ భర్త నుండి తాత్కాలిక భరణం నిరాకరించిన చర్చకు తావిచ్చింది. సంపాదనా సామర్థ్యం ఉన్న అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని, పనిలేకుండా ఉండటానికి చట్టం ప్రోత్సహించదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ నిరుద్యోగిగా ఉన్న ఒక మహిళకు మధ్యంతర భరణం తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 [ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (BNSS) సెక్షన్ 528] కింద మధ్యంతర భరణాన్ని నిరాకరించిన కుటుంబ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ చంద్ర ధరి సింగ్ తోసిపుచ్చారు.చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 19న జస్టిస్ చంద్ర ధరి సింగ్ మాట్లాడుతూ, CrPCలోని సెక్షన్ 125 (భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల భరణం కోసం ఆర్డర్) జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి భార్యలు, పిల్లలు ,తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి చట్టం ఉంది కానీ, ఈ పేరుతో వారు పనీ పాటా లేకుండా ఉండడాన్ని కోర్టు ఆమోదించదన్నారు. బాగా చదువుకున్న భార్య, చక్కటి ఉద్యోగంలో ఉన్న భర్త నుండి భరణం పొందడానికి మాత్రమే ఖాళీగా ఉండకూడదన్నారాయన. అంతేకాదు తన చదువుకు తగిన ఉద్యోగాన్ని వెదుక్కోవాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రాథమిక అవసరాలకోసం భర్తలపై పూర్తిగా ఆధారడే, ఇతర చదువురాని మహిళల మాదిరిగా ఉండకూదని హితవు పలికింది.కేసు నేపథ్యంఈ కేసులోని జంట 2019 డిసెంబర్ 11 వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట త్వరలోనే విదేశాలకు మకాం మార్చారు. అయితే, వైవాహిక విభేదాలు కారణంగా రెండేళ్లకు (ఫిబ్రవరి 20, 2021) ఇండియాకు తిరిగి వచ్చేసింది.భర్త తనను క్రూరంగా హింసించాడని, జీవిత భాగస్వామి వీసా చేశాడని ఆరోపించింది. ఇంటికి తిరిగి రావడానికి తన నగలను అమ్మమని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. తదనంతరం, ఆమె CrPC సెక్షన్ 125 కింద తాత్కాలిక ఉపశమనం కోసం దరఖాస్తుతో పాటు భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కుటుంబ న్యాయస్థానం మధ్యంతర భరణం పిటిషన్‌ను 2022 నవంబరులో తిరస్కరించింది.దీనిపై దాఖలైన రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!పెళ్లికి ముందు కూడా తాను ఆర్థికంగా స్వతంత్రంగా లేనదిభార్య వాదన. భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి నిరుద్యోగిగా ఉన్నాననీ, భర్త నెలకు రూ. సుమారు 27.22 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి నెలకు రూ.3.25 లక్షలు భరణం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే తన భార్య ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ పట్టా పొందింది. గతంలో టాప్ కంపెనీలో పనిచేసింది. సొంత కృత్రిమ ఆభరణాల వ్యాపారాన్ని నడిపింది. పైగా ప్రస్తుతం తాను ఉద్యోగం లేదు. కనుక అంత భరణం చెల్లించ లేనని భర్త వాదన -
సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్‌మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది! -
బిందె నిండాలంటే.. జాగారం చేయాల్సిందే!
వేసవి వచ్చిందంటే.. మండించే ఎండలేకాదు. నీటి ఎద్దడి కూడా భయపెడుతుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాగు నీరు కోసం ప్రజలు పడే బాధలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల మహిళల అవస్థలు వర్ణనాతీతం. బిందెడు నీళ్లకోసం వారు పడే ఆవేదనకు అద్దం పట్టే కథనం ఇది!ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి సమస్య జఠిలమవుతోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ ఆ ట్యాంకు ఎప్పుడు నిండుతుందో తెలియక ప్రతియేటా గ్రామ శివారులోని చేదబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అయితే ఎండల తీవ్రతతో ఆ బావి ఎండిపోవడంతో మిషన్ భగీరథే దిక్కైంది. అది కూడా మూడునాలుగు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నిండుతుంది. ఒక్కొక్కరికి రెండు బిందెలే వస్తుండటంతో వాటి కోసం గ్రామస్తులు వేకువజామునే బిందెలతో ట్యాంకు వద్దకు చేరుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీరే అందకపోగా మూగజీవాలకు, ఇతర అవసరాలకు నీరు లభించడం గగనమైంది. దీంతో గ్రామస్తులు పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్ చదవండి: అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం -
అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం
ఒక అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి వక్షోజాలను పట్టుకోవడం(Grabbing Breasts), పైజామా నాడాను చింపేయడం (Snapping Pyajama String) అత్యాచార యత్నం కిందికి రావంటూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ చర్యలు అత్యాచారంగా పరిగణించ లేమని పేర్కొంది దీనిని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. అత్యాచారయత్న దశ (preparation stage) కు, వాస్తవ ప్రయత్నం (actual attempt) మధ్య తేడాను ఉందని వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నట్లు రికార్డులో ఉన్న ఏ సాక్ష్యమూ లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. దీనిపై మహిళా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రముఖ గాయని, చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కూడా ఈ వివాదాస్పద తీర్పుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.2021 నాటి కేసులో పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు నమోదైనాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, లిఫ్ట్ ఇస్తామని చెప్పి నిందితులు మైనర్ బాలిక పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెను కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. బాటసారులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు.వారు ఆ బాలికను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిందితులైన పవన్ , ఆకాష్‌లపై మోపబడిన ఆరోపణలు అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడని స్పష్టం చేసింది.ఈ చర్య వల్ల బాధితురాలు నగ్నంగా లేదా వివస్త్రగా మారినట్టు సాక్షులు చెప్పలేదు. అంతేకాదు లైంగిక దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణ లేవీ లేని కోర్టు తెలిపింది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?నిందితులను ఐపీసీ సెక్షన్ 354-బి (దుస్తులను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక దాడి) కింద విచారించాలని ఆదేశించింది. మరోవైపు పవన్ తండ్రి, మూడో నిందితుడు అశోక్ బాధితురాల్ని దుర్భాషలాడి, బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. -
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరేబియన్ దేశానికి విహారయాత్ర కోసం వెళ్లి, కనిపించ కుండా పోయిన సుదీక్ష ఆచూకీ ఇంకా మిస్టరీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తప్పిపోయిన తమ కుమార్తె సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించమని కోరినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోది. ఈ మేరకు సుదీక్ష కుటుంబం డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసులకు లేఖ రాసింది.అమెరికాలో శాశ్వత నివాసి వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్‌లో కనిపించింది. మెడిసన్ చదవాలని కలలు కన్న ఆమె, వెకేషన్లో భాగంగా ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికినా, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఆమె ఆచూకీ లభించలేదు. View this post on Instagram A post shared by De Último Minuto (@deultimominutomedia)మరోవైపు తమ కుమార్తె అదృశ్యమై 12 రోజులు కావొస్తున్నా ఎలాంటి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియాగో పెస్క్వేరా మాటలను ఉటంకిస్తూ NBC న్యూస్ మంగళవారం నివేదించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘సుదీక్ష కోణంకి అదృశ్యం విషాదకరం, ఆమె కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఊహించలేం.. సుదీక్ష మునిగిపోయి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె ఫ్యామిలీ వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటన చేయాలనే తుది నిర్ణయం డొమినికన్ రిపబ్లిక్ అధికారులదే అయినప్పటికీ, తాము బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని’ అధికారులు ప్రకటించారు. ఇది మిస్సింగ్ కేసు తప్ప, క్రిమినల్ విషయం కాదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఆమె మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్నిచట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. సుదీక్ష అదృశ్యంలో ఎవరినీ అనుమానితులుగా పరిగణించలేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు.కాగా సుదీక్ష ఆచూకో కోసం అక్కడి పోలీసులు అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలించారు. కిడ్నాప్‌కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరకాయి. వాటిని సుదీక్ష స్నేహితులు గుర్తించారు కూడ . సుదీక్షతో కలిసిచివరిసారి కనిపించిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే మార్చి 6వ తేదీ రోజు తామిద్దరం కలిసే బీచ్‌కు వెళ్లామని,సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబె అంగీకరించాడు. ఒక పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, అలల తాకిడికి గురైన ఆమెను రక్షించలేక పోయానన్నరిబె మాటలను విశ్వసింఇన పోలీసులు అతనిపై ఎలాంటి ఆరోపణలు నమోదు చేయలేదు. కానీ అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్‌స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్‌తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్‌తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్‌బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్‌గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్‌పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్‌స్టేషన్‌లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్‌లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్‌గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!
అనుకోకుండా రైల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు మహిళలకు చాలా ఆందోళనగా ఉంటుంది. అదీ టిక్కెట్ లేకుండా అయితే ..ఫైన్ కట్టాలన్న భయం వెంటాడుతుంది. సరే.. ఇక తప్పదు కదా ఫైన్ కడదాంలే అని పర్సు చూసుకుంటే.. సరిపడా డబ్బుల్లేకపోతే.. అమ్మో.. ఈ పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది కదా. గుండె గుభేలు మంటుంది. ఏం చేయాల్రా దేవుడా అంటూ ఆ సమయంలో పడే బాధ వర్ణనాతీతం. మరి ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే... ఏం చేయాలి? మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్‌ప్రెస్) క్లాస్‌లో, గరీబ్‌రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్‌లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్‌గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్‌నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్‌లైన్ 139 ఉండనే ఉంది. ఇదీ చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
నవతరం.. నైపుణ్యం..
స్వతహాగా మహిళల హస్తాలు సృజనాత్మకత, కళాత్మకతను నింపుకుని ఉంటాయనేది నానుడి. ఇలాంటి మహిళలకు, వారి కళకు, కష్టానికి, ఆసక్తికి ప్రోత్సాహమందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దీనిని నిజం చేసింది విమెన్ ఎంట్రప్రెన్యూర్‌కు మద్దతునిచ్చే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వీ హబ్. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన టియర్–2, టియర్–3 ప్రాంతాలకు చెందిన మహిళలను వ్యాపారులుగా అభివృద్ధి చేసి, ఆదర్శ ఎమ్ఎస్ఎమ్ఈలుగా మార్చాలనే లక్ష్యంతో వీ హబ్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఇన్ క్లూ్యజన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళా వ్యాపారాలకు మార్కెట్ అనుసంధానం, బిజినెస్ రిజి్రస్టేషన్స్, మెంటార్షిప్, ఆర్థిక స్వావలంబన మార్గాలను అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 31 మంది మహిళలను నగరంలోని వీ హబ్ వేదికగా అభినందించి, వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ 31 మంది మహిళల కృషి, పట్టుదల భవిష్యత్తు తరం వనితలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మహిళలకున్న ఆలోచనలను స్థిరమైన వ్యాపారాలుగా మార్చుతోంది వీ హబ్. దీని కోసం ‘ప్రాజెక్ట్ ఇన్‌క్లూజన్’ను ప్రారంభించింది. ఈ వేదికగా సదరు మహిళల వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందించే ఇతర సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వారసత్వంగా కొనసాగిస్తున్న హస్తకళలు మొదలు అధునాతన జీవన శైలిని ప్రతిబింబించే గృహాలంకరణ ఉత్పత్తుల వరకూ అనువైన వేదికను రూపొందించారు. ఇందులో సహకారం పొందిన వారు సొంత బ్రాండ్ రూపొందించుకుని చేనేత వస్త్ర ఉత్పత్తులు, మోడ్రన్ ప్యాకింగ్‌తో చాక్లెట్ల తయారీ, హోమ్ ఫుడ్స్, కన్స్ట్రక్షన్ బిజినెస్, గానుగ నూనె తయారీ వంటి విభిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా వీ హబ్ సీఈఓ సీతా పల్లబొల్లా మాట్లాడుతూ.. మహిళా వ్యాపారులకు వారి సామర్థ్యాన్ని చాటిచెప్పే ప్రణాళికను అనుసంధానించి కేవలం వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి తోడ్పడుతున్నాం అన్నారు. సెపె్టంబర్ 2024లో ప్రారంభమైన ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్ కోసం 117 దరఖాస్తులు అందగా, ఇందులో 35 మంది మహిళలను ఎంపిక చేశాం. వీరిలో 31 మంది విజయవంతంగా కోర్సును పూర్తి చేశారని అన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత వీరికి నిరంతర మెంటార్íÙప్ మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే.. అర్హులైన వ్యాపారాలను అందించే వీ హబ్ ర్యాంప్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చుతామని పేర్కొన్నారు.కళాత్మక జీవితం మంచి అనుభూతి.. జేఎస్ఎమ్ బ్రాండ్ పేరుతో జెల్ క్యాండిల్స్ తయారు చేస్తున్నాను. మార్కెట్లో లభించే ఒక ప్రత్యేకమైన జెల్‌ను కరిగించి వివిధ డిజైన్లలోని గాజు పాత్రల్లో నింపుతాను. వీటికి అదనపు ఆకర్షణగా జెల్లో పూలను, చిన్న మొక్కల కొమ్మలను అలంకరిస్తాను. క్యాండిల్ వెలిగించినప్పుడు మంచి సువాసన రావడానికి సుగంధ పరిమళాలను వినియోగిస్తాను. ఈ కళను ఒక కోర్సుగా నేర్చుకున్నాను. షాలిబండలో ఒక ప్రదర్శనలో నా స్టాల్ చూసిన వీ హబ్ బృందం ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్లో నన్ను భాగం చేశారు. వీటిని ఆన్లైన్ వేదికగానూ అమ్ముతున్నాను. నచి్చన కళతో జీవితం ఎంతో సంతృప్తినిస్తోంది. – ఇమ్రానా నోషీన్, జేఎస్మ్ జెల్ క్యాండిల్స్కుల వృత్తితో అద్భుతాలు.. వారసత్వంగా వచి్చన కుల వృత్తితో వెండి ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. దీనిని సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. మా పూరీ్వకులు ప్రతిష్టాత్మక పెంబర్తి మెటల్ షీట్స్ తయారు చేసేవారు. వాటికి తోడుగా వినూత్నంగా ఈ వెండి సౌందర్య అలంకార ప్రతిమలను తయారు చేస్తున్నాను. కరీంనగర్ మెప్మా ద్వారా వీ హబ్‌కు చురుకున్నాను. ఈ వేదిక ద్వారా మార్కెటింగ్ ఎలా పెంచుకోవచ్చు, కస్టమర్లను ఎలా చేరుకోవచ్చు వంటి అంశాల్లో అవగాహన పెరిగింది. మా వద్ద రూ. వెయ్యి నుంచి లక్ష విలువ చేసే అందమైన, అరుదైన వస్తువులు లభిస్తాయి. – సరళ, కరీంనగర్.డీహైడ్రేట్ పళ్లతో డ్రైఫ్రూట్ చాక్లెట్లు.. చాకో మిస్టా బ్రాండింగ్‌తో హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేస్తున్నాను. స్ట్రాబెర్రీ, మామిడి, పైనాపిల్ వంటి పళ్లను డీహైడ్రేట్ చేసి, వీటికి డ్రై ఫూట్స్ కలిపి చాక్లెట్స్ తయారు చేస్తాను. నేను హార్టీకల్చర్ నుంచి వచ్చాను.. ఈ ప్రయాణంలోనే చాక్లెట్ తయారీ పైన ఆసక్తి పెరిగింది. వీ హబ్ ప్యాకేజింగ్, డాక్యుమెంటేషన్, లైసెన్స్ రిజి్రస్టేషన్ వంటి అంశాల్లో సహకారం అందించింది. చాక్లెట్లలో ప్రిజర్వేటివ్స్, రంగులు వాడను. స్వచ్ఛమైన కోకో బటర్, పౌడర్, మిల్క్ పౌడర్ వంటివి వినియోగిస్తాను. దీనిని భవిష్యత్తులో పెద్ద బ్రాండ్‌గా మార్చి ఎగుమతి చేయాలనుంది. – కావ్య శ్రీ, చాకో మిస్టా వ్యవస్థాపకురాలురూరల్ టెక్ ప్రాజెక్టు చేయాలనుంది.. మహిళలకు తోడ్పాటునందించే ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. మా సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నాం. ఇక్కడి మహిళ కళ, కృషి సంతృప్తితో పాటు స్ఫూర్తిని నింపింది. ఈ ఫలితాలు అందించిన ఆనందంలో రూరల్ టెక్ అనే మరొక ప్రాజెక్టు చేపట్టాలనే కోరిక మొదలైంది. ఇది కార్యరూపం దాల్చడానికి వీ హబ్‌తో కలిసి పనిచేస్తాం. – సుజీవ్ నాయర్, రీ సస్టెయినబులిటీ గ్లోబల్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్మూలాల్లోంచి కళాకృతులు.. వారాహి హస్తకళ పేరుతో.. ఆదివాసీ ప్రాంతాల్లో లభించే ఎండిన సొరకాయలతో అందమైన ఇంటీరియర్ ఉత్పత్తులు తయారు చేస్తున్నాను. వీటిని గిరిజనులు సహజమైన మంచినీళ్ల బాటిల్‌గా వినియోగించేవారు. ఈ సొర బుర్రలపై వేడి చేసిన ఇనుపచువ్వలతో అందమైన డిజైన్లను రూపొందిస్తాను. దీని మధ్యలో లైట్ వెలుగుతుంది. గత మూలాలను ఈ తరానికి అందంగా మార్చి ఇస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. వీ హబ్ నా ప్రయత్నాన్ని, కళను గుర్తించింది. సామాజికంగా వివిధ రంగాల ప్రజలతో అనుసంధానం చేస్తుంది. ఇందులో భాగంగానే బీఐసీసీఐ ఆధ్వర్యంలోని గ్రీన్ ఉద్యమకర్త అవార్డును పొందాను. గ్రామీణ కళాకృతులను విదేశాల్లోని వారికి చేరడం సంతోషాన్నిచి్చంది. – సింధూ, మొలుగు. -
స్వదేశ్లో చేతివృత్తుల సంగమం: హస్తకళ, మహిళా కళాకారులకు ఘన సత్కారం
దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు చెందిన హస్తకళలతో తయారు చేసిన విలాసవంతమైన కళాకృతులకు గమ్యస్థానమైన జూబ్లీహిల్స్‌లోని స్వదేశ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సృజనాత్మక కళాకారులైన మహిళా ఛాంపియన్స్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆర్ట్ క్రాఫ్ట్స్‌తో చక్కటి హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే మహిళలను అభినందించారు. స్టోరీ టెల్లింగ్, స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో హెర్ సర్కిల్ సీఈఓ థాన్య చైతన్య మోడరేటర్‌గా ఫైర్ చాట్ నిర్వహించారు. ఈ వేదికగా ఆరుగురు ప్రముఖ క్రాఫ్ట్ మాస్టర్లు హస్తకళలతో తయారు చేసిన సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో వారి ప్రయాణాలు, సవాళ్లు, ఆవిష్కరణలను పంచుకున్నారు. ఈ సెషన్లో వారి కథలతో స్ఫూర్తిని నింపారు. సమకాలీన భారతదేశంలో చేతిపనుల ప్రాముఖ్యతను బలోపేతం చేశారు. ఈ ప్రత్యేక వేదికగా.. డిజైన్ ఇన్నోవేషన్ జాతీయ అవార్డు గ్రహీత సునేత్రలహరి (పశ్చిమ బెంగాల్), తోలుబొమ్మలాటతో జాతీయ అవార్డు పొందిన డి.శివమ్మ (ఆంధ్రప్రదేశ్), సిల్వర్ ఫిలిగ్రీ జాతీయ అవార్డు గ్రహీత అర్రోజు ధనలక్ష్మి (తెలంగాణ), కాలిఘాట్ పెయింటింగ్ అవార్డీ స్వర్ణ చిత్రకార్ (పశ్చిమ బెంగాల్), ఇక్కత్ చేనేత జాతీయ అవార్డు గ్రహీత సుకాంతి మెహెర్ (ఒడిశా), మధుబని పెయింటింగ్ జాతీయ అవార్డు గ్రహీత ఆశా ఝా (బీహార్)ను స్వదేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించారు. అత్యుత్తమ వర్క్ ప్లేస్‌గా సింక్రోనీ..సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల్లో అత్యత్తుమ టాప్ 50 పని ప్రదేశాల్లో నగరానికి చెందిన సింక్రోనీ ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఆల్ 2025’ నిర్వహించిన అధ్యయనంలో బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2025 లార్జ్ కేటగిరీలో సింక్రోనీ ఇండియా ఎంపికైంది. ఈ సందర్భంగా సంస్థ హెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రచనా బహదూర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 1,800కు పైగా సంస్థల్లోని 57 లక్షలకు పైగా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఈ అధ్యయనంలో సింక్రోనీ శ్రేష్ఠతకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించడం తమకు గర్వకారణమన్నారు -
అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది. తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్టుగా మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు సూరత్‌కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్‌గా మారాయి. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్‌ను లాకెట్‌గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని, ఇది ప్రస్తుత ట్రెండ్ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే అయినప్పటికీ, ఇది ఫ్యాన్స్ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) కాగా 2024లో, సమంత తన వెడ్డింగ్ గౌను అవార్డుల వేడుక కోసం కొత్తగా డిజైన్ చేయించుకుంది. వైట్ వెడ్డింగ్ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి న్యూలుక్‌ను తీసుకురావడం విశేషం. దీంతో అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని కూడా ట్యాగ్ చేశారు. ఈ డ్రెస్ ఫోటోలను కూడా సమంత ఇన్‌స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది. మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్', 'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు. ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని జీర్ణించుకుంటున్నట్టు చెప్పింది. అలాగే తన పెళ్లి గౌనును మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని సమంతా స్పష్టం చేసింది. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. -
Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో వెలువడిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ తీర్పు కూడా అంతే పంచలనంగా మారింది. సుదీర్ఘ వాదనల అనంతరం నేడు (మార్చి10) తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు స్పందించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతకు న్యాయం కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారులు ఈ తీర్పును ఆహ్వనించారు. ముఖ్యంగా ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ కన్వీనర్ సంధ్య తాజా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుపై వీ సంధ్య స్పందిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె భర్తను కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇది అని గుర్తు చేశారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష సరైనదేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాఉద్యమాలు, ప్రజా పోరాటాల గెలుపు అని పేర్కొన్నారు. అలాగే అత్యంత క్రూరమైన హత్యలు, దౌర్జన్యాల పట్ల, పోలీసులు కోర్టులు స్పందించాల్సిన ఇలాంటి వైఖరి ఇదేనని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిగా పనిచేస్తే వచ్చే ఫలితాలకు, తీర్పులకు ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు. ఈ కేసులో నిర్వహించినట్టుగానే అన్ని కేసుల్లోనూ పకడ్బందీ విచారణలు అవసర మన్నారు. దిశ కేసులో జరిగినట్టుగా ఎలాంటి విచారణలు, సాక్ష్యాలు లేకుండా ఎన్కౌంటర్లు కాదు పరిష్కారం, రుజువులు, సాక్ష్యాలతో టెక్నికల్ ఎవిడెన్స్‌తో జరిగే తీర్పులు ఈ సమాజానికి కావాలని సంధ్య పిలుపునిచ్చారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. అయితే ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సుభాష్‌శర్మ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ప్రణయ్ హత్యనాటికి గర్భవతిగా ఉన్న అమృత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ప్రణయ్ తల్లితండ్రులే కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే తండ్రి మరణం తరువాత అమృత క్రమంగా తల్లికి దగ్గరైంది. అట అత్తమామలు, ఇటు తల్లితోనూ సన్నిహితంగా ఉంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌కు ప్రతిరూపమైన తన కొడుకును అంతే ప్రాణంగా పెంచుకుంటోంది. -
పెళ్లికూతురు డ్యాన్స్, నోట్ల వర్షం: చివరికి ఏమైందంటే..!
భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవూ ఉండదు. అలాగే వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలాకామన్. ట్రెండింగ్‌లో ఉండే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్‌మీడియాను షేక్ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా వధువు వార్తల్లో నిలిచింది. ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టోరీ ఏమిటంటే..డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తోంది. జరీ వర్క్చేసిన ఎరుపు రంగు లెహంగా, దుప్పట్టా, హారాలు, సరిపోయే చెవిపోగులు, చూడమణితో చూడముచ్చటగా ఉన్న ఆమెను అందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నృత్యం చేయడం ఆపి, గౌరవంగా తల వంచుకుని, నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by SR Cinematic (@sr_cinematicc) అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. ఇది చాలాచోట్ల సాధారణమైనప్పటికీ, ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు, "చాలా అందంగా.. తన సంతోషంగా నృత్యం చేస్తోంది....ఆమె ఇతరులను సంతోష పెట్టడం కోసం కాదు, తనకోసం ఆనందంగా నృత్యం చేస్తోంది. వాళ్ కానీ డబ్బులు విసరడం ఎందుకు, అందుకే ఆమె ఆపేసింది అని మరొకరు రాశారు. 'అత్యంత అందమైన వధువు' అని మరికొందరు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా? ప్రశ్నించారు.మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాల చుట్టూ చర్చకు దారితీసిందీ ఘటన.చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె. -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం
విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్ డైరెక్టర్ జి.వి.వనజాదేవి. ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. విమెన్స్ డే 2025 థీమ్మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్... యాక్సిలరేట్ యాక్షన్.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్ యాక్షన్’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్ యాక్షన్’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్ ది సపోర్టర్స్. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.మనం ఏ రకంగా యాక్సిలరేట్ యాక్షన్‌లో భాగం కావచ్చు?వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!ఆత్మస్థైర్యమే బలంమాది కరీంనగర్ జిల్లాలోని గట్ల నరసింగాపూర్ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.దిద్దుబాటుకుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్‌లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి. -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్‌ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్‌కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్‌తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
అతిరథులు ఈ అతివలు..
ఈ సృష్టిలో శక్తి మంతమైనవి రెండే అంశాలున్నాయి.. అందులో ఒకటి ప్రకృతి, మరొకటి మగువ అని ఆనాడే ఓ ప్రఖ్యాత రచయిత చెప్పాడు. సమాజమంతా మహిళలను కీర్తిస్తూ.. మహిళా సాధికారత అంటూ గొంతెత్తుతున్నప్పటికీ.. తమ గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోడానికి ఆ తల్లులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పలువురి స్ఫూర్తిదాయక మహిళల ఇతివృత్తాలను తెలుసుకుందాం.. సాహిత్యం.. సావాసం..తన ప్రయాణమంతా సాహిత్యంతోనే.. తన మనసంతా ప్రకృతిమయం. గొప్ప గొప్ప విషయాలు ఎక్కడో ఉండవు.. కాస్త తరచి చూస్తే మనచుట్టూనే, మన మధ్యే ఉంటాయంటారు ప్రముఖ రచయిత స్వర్ణ కిలారి. సామాజిక ఇతివృత్తాలతో పలు ప్రభావ వంతమైన కథలు, రచనలు, అనువాదం చేసిన స్వర్ణ కిలారి.. మహిళల ట్రావెలింగ్ అనుభవాలతో ఇంతియానం అనే పుస్తకానికి సంపాదకీయం రాశారు. విశ్వవ్యాప్త ప్రయాణాలు చేసిన మగువలు.. విభిన్న అంశాల పై వారి అనుభవాలు, ఆలోచనలకు అక్షరరూపం తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇంతియానం 2.0 సైతం రాబోతోంది. ఈ నేపథ్యంలో తన స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఆమె మాటల్లోనే..ది షూటింగ్ స్టార్ స్ఫూర్తితో..రచనలన్నా, సాహిత్యమన్నా నాకెంతో ఇష్టం. ఇందులో భాగంగానే నాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో కేరళకు చెందిన బాల మేధావి క్లింట్ బయోగ్రఫీ లిప్తకాలపు స్వప్నం, ది గోట్ లైఫ్ అనే ప్రముఖ రచనను మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. వ్యక్తిగతంగా నల్ల బంగారం, 13 వంటి రచనలు చేశాను. ఒక రచన కోసం నార్త్ థాయ్‌లాండ్ వెళ్లిన సమయంలో.. ఉన్న కొద్ది ఆస్తిని అమ్మి ప్రపంచ యాత్ర చేసిన అమ్మాయి నవ్య నాథ్ రాసిన ది షూటింగ్ స్టార్ బుక్ చదివి ఆశ్చర్యపోయాను. ఇలా మన తెలుగువారి ట్రావెలాగ్స్‌తో మంచి పుస్తకం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకుని పని ప్రారంభించాను. ఇందులో భాగంగా మన తెలుగు మహిళలు చేసిన అద్భుత ప్రయాణాలు, అనుభవాలు చూసి స్ఫూర్తిని పొందాను. ఇందులో ఒంటరిగా ప్రయాణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇంటి నుంచి బయటకి వచ్చి ఉద్యోగాలు చేయడమే గగనమైన తరుణంలో స్థానిక ఆదిలాబాద్, కాకినాడ అడవులు మొదలు.. విదేశాల్లోని దండకారణ్యాలు, నగరాలు, సంస్కృతులు ఎన్నెన్నో వింతలు, విశేషాలను ఆస్వాదించిన మహిళ ప్రయాణ కథలు నాకు జీవితకాల సంతృప్తినిచ్చాయి. ఇలా 45 మంది కథలతో మొదటి పుస్తకం ముద్రించాను. ప్రస్తుతం మరో 55 మంది వనితల ప్రయాణ కథలతో ఇంతియానం 2.0ను తీసుకురానున్నాను. ఆడవారి ట్రావెలాగ్ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. వారు చూసే కోణం, ఆస్వాదించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉమెన్ ట్రావెంలింగ్ అంత సులభం కూడా కాదు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా పలు అంశాలు సహకరించవు. ఈ సారి మహిళల సోలో కథలతో పాటు తల్లీ కూతుళ్లు వంటి వైవిధ్యాలున్నాయి. వ్యక్తిగతంగా నేను మెక్సికో, బాలి, శ్రీలంక, అమెరికా, భూటాన్ వంటి దేశాలు ప్రయాణించాను. నా రచన 13 కోసం ఉత్తర థాయిలాండ్ వెళ్లి అక్కడ చియాంగ్ రాయ్ గుహలో చిక్కుకున్న 13 మంది పిల్లల నిజజీవిత కథను, వ్యథను రాశాను. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలనుంది. – స్వర్ణ కిలారి, ప్రముఖ రచయిత్రి, హైదరాబాద్వైకల్యాన్ని జయించి.. తానోక దివ్యాంగురాలు.. చిన్నప్పటి నుంచి అందరిలానే తానూ వివక్షకు గురైంది. ముందే దివ్యాంగురాలివి, అందులోనూ అమ్మాయివి.. నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు అనే మాటల తూటాలు ఆమె మనసును విచి్ఛన్నం చేశాయి. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి, ఎవరి, జాలి, సహాయంపైన ఆధార పడకూడదని నిశ్చయించుకుని ఇంటిని వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సంపూర్ణంగా తన పనులు తాను చేసుకోలేకపోయినా, అందరిలా నడవలేకపోయినా.. కుంగిపోకుండా కంప్యూటర్ వర్క్ నేర్చుకుని, డీటీపీ వర్క్ చేసి తన ఖర్చుల వరకూ సంపాదించుకునేది. తానే కాదు తనలాంటి మరికొందరికి ఆశ్రయం ఇవ్వాలని ‘ఆద్య నిలయం ట్రస్ట్’ ఏర్పాటు చేసి మరి కొందరు మహిళా దివ్యాంగులకు ఉచితంగా ఆశ్రయం, ఆహారం, వసతులను అందిస్తోంది. ఈ క్రమంలో తమకు కూడా మగతోడు ఉంటే బాగుంటుంది.. వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు. అందరిలాగే తమకు కూడా అనుభూతులు, కోరికలు, ఇష్టాలు ఉంటాయని.. మిత్రుల సూచనతో మరో దివ్యాంగ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తను సతీష్ అనే దివ్యాంగుడినిపెళ్లి చేసుకోవడమే కాకుండా తనలాంటి మరికొందరికి పెళ్లిల్లు చేయిస్తోంది. మరికొందరికి బాసటగా.. దివ్యాంగులకు మొదటి వివక్ష వారి కుటుంబాల నుంచే మొదలవుతుంది. నువ్వేం చేయలేవు.. జీవితాంతం వారు పెట్టింది తింటూ ఇంట్లో ఓ మూలన కూర్చో అనే సందర్భాలే ఎక్కువ. ఇలాంటి తరుణంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మా కష్టంతో ముందుకు సాగుతున్నాం. ఇలా మరికొందరు దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తూ ఒక కుటుంబంగా బతుకుతున్నాం. మా ప్రయాణంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తోడ్పాటును అందించిన వారు ఎందరో ఉన్నారు. నా పెళ్లిని సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థ జరిపించింది. నా మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఆత్మీయుల్లో ఒకరు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారు. ఆ డబ్బుతో నేను మరికొందరు దివ్యాంగుల జంటలకు పెళ్లి పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకూ ఐదు జంటలకు చేశాను. మరికొన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. – క్రిష్ణప్రియ, ఆద్య నిలయం ట్రస్ట్, హైదరాబాద్ -
International Women's Day 2025: హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
జిమ్ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!
జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యానికి మేలే.. కానీ జిమ్‌కి వెళ్లే ముందు మానసికంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నామా? లేదా! అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు తగిన మూల్యం తప్పదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్ చేసే క్రమంలో నియమావళిని తప్పక పాటించాలని, ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవల జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతి చెందిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పుడీ అంశాలు చెప్పుకోడానికి ఇదే ప్రధాన కారణం. సొంత ప్రయోగాలకు పోకుండా నిపుణుల సలహాల మేరకే వ్యాయామం చేయాలనేదే ఇందులోని ముఖ్య ఉద్దేశం. – సాక్షి, సిటీబ్యూరో ఈ మధ్యనే ఒక జాతీయ స్థాయి ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన యస్తిక (17) ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువును ఎత్తుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు వెయిట్స్ మెడపై పడి చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో.. షేర్ చేస్తున్నారు. కేవలం చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్, వ్యాయామ సమయాల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను సూచిస్తున్నారు. చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు జిమ్ పార్ట్నర్ తప్పనిసరి.. ప్రమాదకర వ్యాయామాలు చేస్తున్న సమయంలో జిమ్ పార్ట్నర్ను ఎంచుకోవడం తప్పనిసరి. ట్రైనర్ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విభిన్న వర్కవుట్లు చేసే క్రమంలో పార్ట్నర్ ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తారు. ముఖ్యంగా బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాల్లో, అధిక బరువులను ఎత్తుతూ వర్కవుట్లు చేసే సమయంలో భాగస్వామి సమన్వయం చేస్తారు. స్పాటర్ లిఫ్టింగ్ సమయంలో సహాయకారిగా ఉంటారు. టెక్నిక్స్‌తోనే సేఫ్.. వెయిట్ లిఫ్టింగ్ వంటి కఠిన వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం ప్రాథమిక నియమం. ఫామ్‌లో లేని సమయంలో ఎలాంటి బరువులూ ఎత్తే ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు జిమ్ టెక్నిక్స్ ప్రమాదాలు, గాయాల బారినుంచి సంరక్షిస్తాయి. శారీరక, మానసిక దృఢత్వమే హాస్పిటల్ బెడ్ పై కాకుండా వెయిట్ లిఫ్టింగ్ బెంచ్‌పై ఉండేందుకు ఉపకరిస్తుందని ఉమెన్ ఫిట్నెస్ ట్రైనర్ శ్వేత పేర్కొన్నారు. పరిసరాలను గమనించాలి.. వ్యాయామం చేస్తున్న సమయంలో చాలా మంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. వ్యాయామం చేసేటప్పుటు జిమ్ పరిసరాల్లో, ఇతరులు చేస్తున్న వ్యాయామ ప్రక్రియలను గమనిస్తుండాలి. లేదంటే పొరపాటున ఇతరులు చేసే వ్యాయామ పరికరాలు తగలడం, మీద పడటం, రాడ్స్ తగలడం వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రైనర్లు చెబుతున్నారు. ద్రవాలతో డీహైడ్రేషన్‌కు చెక్.. సాధారణంగా జిమ్ సెంటర్లన్నీ వెంటిలేషన్ తక్కువగా ఉండే పెద్ద పెద్ద హాల్స్‌లో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వ్యాయామం ద్వారా వచ్చే వేడి, మరో వైపు ఉబికివచ్చే చెమటలు. ఈ కారణాలతో శరీరం డీహైడ్రేట్ కావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అనువైన ద్రవాలు, పానీయాలు తీసుకోవడం కీలకం. లేదా ఇతర ప్రమాదాలకు డీహైడ్రేషన్ కూడా కారణమవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం.. జిమ్ కల్చర్‌లో క్రమశిక్షణ ప్రాథమిక నియమం. ఫిట్నెస్ వ్యాయామాల తరువాత జిమ్ ఎక్విప్మెంట్ వాటిని భద్రపరిచే ర్యాక్‌లో పెట్టడం ఇతరులను ప్రమాదాల నుంచి నివారిస్తుంది. జిమ్ ఫ్లోర్‌పై డంబెల్స్, వెయిటింగ్ బెల్స్ ఎక్కడివక్కడే ఉంచడం వల్ల కాలికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్కిప్ అయ్యి దానిపై పడితే తలకు బలమైన గాయాలు అయిన సందర్భాలూ కోకొల్లలు. జిమ్‌లో తగిలే గాయాలకు మరో ప్రధాన కారణం ‘వ్యాయామ క్రమశిక్షణ’ లేకపోవడమేనని ప్రముఖ ట్రైనర్ సంతోష్ హెన్రిక్ తెలిపారు. వార్మ్ అప్ తప్పనిసరి.. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. సమయం తప్పనిసరి.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆదరాబాదరా జిమ్‌కి వెళ్లడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరం. వ్యాయామాలు, ఫిట్నెస్ ప్రక్రియలను నిర్దేశిత సమయాల్లోనే చేయాలి. తక్కువ సమయంలో పూర్తి చేసి వెళ్లాలనే తొందరలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. జిమ్ పార్ట్నర్ కోసం త్వరగా ముగించడం, ఎక్కువ సేపు చేయడం కూడా ప్రమాదమే. మన స్థాయికి తగ్గట్టుగానే..వ్యాయామాల్లో ఎక్కువగా చేసే తప్పలు ‘సామర్థ్యానికి మించిన బరువులను ఎత్తడం’. అధిక బరువులను ఓ క్రమ పద్ధతిలో రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సూచన. ఎంత ఎత్తగలరో అంతే ఎత్తండి అని ప్రతి ట్రైనర్ చెబుతుంటారు. అనివార్యకారణాల వల్ల కొన్ని రోజులు జిమ్‌కు వెళ్లని పక్షంలో.. తిరిగి మునుపటి బరువులు ఎత్తడం సరికాదు. దీనివల్ల కండరాలకు గాయాలయ్యే ప్రమాదం ఉందని బంజారాహిల్స్‌లోని ఓ జిమ్ ట్రైనర్ రవి చెబుతున్నారు. వ్యాయామాలు చేసేవారు తమతోపాటు తప్పనిసరిగా టవల్ వెంట తీసుకెళ్లాలి. ఇది ఆరోగ్య రక్షణకు, ప్రమాదాల నివారణకు సహకరిస్తుంది. వ్యాయామాల సమయంలో పట్టే చెమట వల్ల బరువైన వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గాయాలు కావొచ్చు. టవల్‌తో చెమటను తుడుచుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు తొలగిపోయి చర్మానికి రక్షణ చేకూరుతుంది. -
National Safety Day 2025: భద్రంగానే ఉంటున్నామా..?
మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య, నియమాలు, ట్రాఫిక్ నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది భారతదేశం (India) 54వ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌తో దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. అలానే ఈ ఏడాది విక్షిత్ భారత్ భద్రత, సంక్షేమం కీలకం అనే థీమ్‌తో ప్రజలను చైతన్యపరిచేలా అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా మన దేశంలోని భద్రత ఏ విధంగా ఉందో చూద్దాం. నిజంగా మహిళలు, పిల్లలు భద్రంగా ఉంటున్నారా..?. మనమంత సేఫ్టీకి చేరువలో ఉన్నామా..? అంటే..మన దేశంలో భద్రత అనే పదమే భారంగా కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న ఘోరాలు, నేరాలు చూస్తుంటే సేఫ్టీకి చోటుందా అనే సందేహం కలుగకమానదు. మన భారతీయ సంస్కృతి స్త్రీని యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కీర్తిస్తూ సముచిత స్థానాన్ని ఇచ్చింది. మన వేదాలు, పురాణాలు కూడా స్త్రీకి పెద్దపీట వేసి మరీ గౌరవించాయి. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే హృదయ ద్రవించిపోతోంది. గొప్ప నాగరికులం, ఏఐ టెక్నాలజీతో పరుగులు పెట్టే కాలంలో ఉన్నామంటూ భుజాలు ఎగరేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన సమాజంలో చిన్నారులు, మహిళలు ఎంతటి అభ్రతా పరిస్థితుత్లో జీవిస్తున్నారో చూస్తే ఇదేనా అభివృద్ధి అనే భావం కలుగుతుంది. ప్రతి ఏడాది జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) పేరుతో వారోత్సవాలు నిర్వహించుకుంటూ చేతులు దులిపేస్తుకుంటున్నాం. అసలు మన చుట్టుపక్కల ఉన్న బాలికలు, అభంశుభం తెలియని పసి పిల్లలు హింసకు, లైగింక వేధిపులకు గురవ్వుత్ను ఘటనలు మీడియాలోనూ, పేపర్లో వస్తున్నా..ఆ..! ఇది కామన్ అన్నట్లు తేలిగ్గా తీసుకుంటున్నాం. మన పిల్లలు సేఫ్‌గా ఉన్నారు కదా అన్న ధీమా కొందరిది. నిజానికి ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023/24లో 177 దేశాల సరసన భారత్ 128కి పడిపోయింది. అంటే మన దేశంలో మహిళలకు భద్రత అనే మాటకు ఆస్కారం లేదనే కదా అర్థం. మహిళలు, చిన్నారులపై జరిగిన ఘటనలు చూస్తే..ప్రేమోన్మాదుల చేతిలో బలైన అమ్మాయిలు..ముఖ్యంగా అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో నిరుడు హైదరాబాద్‌లోని గోపన్నపల్లిలో యువతి ప్రాణం తీశాడొక దుర్మార్గుడు. ఏపీలోని బద్వేలులోనూ గతేడాది ఒక ఇంటర్ విద్యార్థిని అలాగే బలైపోయింది. ప్రేమను నిరాకరించిందని బాపట్ల జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఇటీవల బాలికతో పాటు ఆమె కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. అదే కారణంతో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సైకో మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి, కత్తితో పొడిచి ఉసురు తీసేందుకు యత్నించాడు. ఇలా ప్రేమోన్మాదుల చేతుల్లో రోజూ ఎందరో అమాయక చిట్టి తల్లులు బలైపోతున్నారు. కరడుగట్టిన పితృస్వామ్య భావజాలమే దేశీయంగా మహిళా సాధికారతకు ప్రధాన ప్రతిబంధకమవుతోందనేది కొందరి నిపుణుల వాదన. సర్కారీ లెక్కల ప్రకారం 2014లో ఇండియాలో మహిళలపై నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్లలో అవి 31శాతం మేర ఎగబాకాయి. నిపుణులు చెబుతున్న కారణాలు..ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అశ్లీల చిత్రాలు, వీడియోలకు తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో మనుషుల్లో పశుప్రవృత్తి కోరలు చాస్తోందంటున్నారు నిపుణులు. ఆడ పిల్లల్ని వేధించడాన్ని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని హీరోయిజంగా చూపిస్తున్న సినిమాలు, వెబ్‌సీరిస్ యువతను దారితప్పిస్తున్నాయని చెబుతున్నారు.స్త్రీలను ఆటబొమ్మలుగా చిత్రీకరించే పెడపోకడలు పెరిగిపోతుండటంతో పనిప్రదేశాలూ బహిరంగ స్థలాలు.. ఇలా అన్నిచోట్లా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిలపై రోత వ్యాఖ్యల వెల్లువెత్తుతూనే ఉంటున్నాయని చెబుతున్నారు. అలాగే నవతరం నైతిక విద్యకు దూరమవుతున్న కొద్దీ దేశ భవిష్యత్తుపై చీకట్లు ముసురుతాయని హెచ్చరిస్తున్నారు. పాఠశాల దశ నుంచి పసి మనసులు కలుషిత కాకుండా కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. తెలిసో తెలియకో లేదా పురుషాధిక్య ఆలోచనలతోనో ఇళ్లలో అబ్బాయిలను అతిగా ముద్దు చేసే ధోరణులు లింగ వివక్షను పెంచి పోషిస్తున్నాయి. మహిళల పురోగతికి అవే గొడ్డలిపెట్టు అవుతున్నాయి. తల్లిదండ్రుల మద్దతుతో ఎందరో అమ్మాయిలు నేడు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనూ వెన్నుతట్టి ముందుకు నడిపించే అలాంటి వాతావరణం ప్రతి కుటుంబంలోనూ నెలకొనాలని అంటున్నారు నిపుణులు. భద్రతకు భరోసా ఇచ్చేలా జీవిద్దాం..ప్రతి తల్లి కూడా తమ కొడుకు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే కప్పి పుచ్చే యత్నం చేయకుండా దండించడమో లేదా శిక్షించడమో చేసి మార్పు తెవాలే గాని మగాడని వెనకేసుకొచ్చే యత్నం చేయకూడదు. అలాగే పోలీసులు మహిళలపై జరిగే అమానుష ఘటనలపై సత్వరమే స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా మద్దతిస్తే..బాలికలు, మహిళల భద్రతకు ఢోకా ఉండదని చెబుతున్నారు సామాజిక నిపుణులు. సేఫ్టీ దినోత్సవం పేరుతో ఐక్యతతో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొందాం అంటూ మాటలు కాదు..అలాంటి ఘోరాలు జరిగినప్పుడూ గొంతెత్తి నినదిద్దాం. ఆ తప్పు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పూనుకునేలా చేద్దాం. మహిళల, బాలికలకు భద్రత అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా భరోసా కల్పిద్దాం. చదవండి: వయసుతో ముసిరే సమస్యలు.. -
ప్రొటెక్షన్ ప్లీజ్...హెల్త్ చూస్తుంది
కుటుంబ ఆరోగ్యాన్నే కాదు సమాజ ఆరోగ్యాన్నీ రెప్పవేయకుండా కనిపెట్టుకోగలదు స్త్రీ! ఆ ఓపిక, శ్రద్ధ మెడిసిన్ డిగ్రీతో వచ్చినవి కావు.. డీఎన్ఏలో భాగమై వచ్చినవి!వాటి బలంతోనే డాక్టరమ్మగా అలుపులేని సేవలందిస్తోంది.. దేశ ఆరోగ్య నాడి లయ తప్పకుండా చూసుకుంటోంది! కానీ ఆమె సహనాన్ని బలహీనతగా తీసుకుని.. వైద్యరంగంలో ఆమె భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు! అది ప్రభుత్వ వైద్యరంగంలో స్త్రీల ప్రవేశానికి అడ్డంకిగా మారకముందే మేలుకుని.. నాయకత్వ హోదాల్లో మహిళలకు అవకాశాన్ని ఇచ్చి.. భద్రతను కల్పిస్తే... హెల్త్‌కేర్ సెక్టార్లో సాధికారత సాధ్యం కాదు తథ్యం!→ ఆనందిబాయీ జోషీ ఆమె బాల్యవివాహ బాధితురాలు. వైద్య సదుపాయాల్లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అప్పుడనుకుంది.. మెడిసిన్ చదవాలని! చదివింది.. అదీ అమెరికా, పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజ్‌లో. అలా చేతిలో మెడిసిన్ డిగ్రీ, మెడలో స్టెత్, దేశ తొలి మహిళావైద్యురాలిగా సొంతగడ్డ మీద అడుగుపెట్టింది. ఆవిడే డాక్టర్ ఆనందీబాయి జోషీ. మన సమాజం ఆమెను ప్రశంసించక పోగా.. తీవ్రంగా విమర్శించింది. వివక్షకు గురైనా వెరవక వైద్యసేవలందించింది. దురదృష్టం.. పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. → డాక్టర్ కాదంబినీ గంగూలీ మన దేశ తొలి మహిళావైద్యుల్లో మరో డాక్టర్.. కాదంబినీ గంగూలీ. యూరప్‌లో శిక్షణ పొందిన ఆమె మెడికల్ కెరీర్ అంతా దేశంలోని మహిళల ఆరోగ్యం, మాతా.. శిశు మరణాలను అరికట్టే ప్రయత్నానికే అంకితమైంది. → ఇంకా.. ∙మేరీ పూనెన్ ల్యుకోస్ మన తొలి మహిళా గైనకాలజిస్ట్ మేరీ పూనెన్ లుకోస్, దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ సాగడానికి శ్రమించిన కమల్ రణదివే.. వీళ్లంతా స్వాతంత్య్రానికి పూర్వమే తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచారు. వీళ్ల స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం.. దేశంలో క్యాన్సర్ చికిత్సలో సమర్థమైన మార్పులకై కృషి చేసిన డాక్టర్ వి.శాంత, రేడియాలజిస్ట్ డా. కె.ఎ.దిన్షా, కార్డియాలజిస్ట్ డా.పద్మావతి అయ్యర్, డా. నీలమ్ క్లేర్, డా. అజితాచక్రవర్తి, డా. శశి వాధ్వా, డా. కామినీ రావు, డా. ఇందిరా హిందుజా లాంటివాళ్లెందరో వారి వారి విభాగాల్లో రాణించారు. మహిళలకు ఆరోగ్యం పట్ల స్పృహ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పాజిటివ్ నోట్ చూస్తుంటే వైద్యరంగంలో మన మహిళలు ఎంతో ముందుకెళ్లారనే భావన కలుగుతుంది. కానీ అధ్యయనం (2021 ప్రకారం) చేసి లెక్కలు తీస్తే ఆ సంఖ్య 29 శాతమే అని తేలింది. బోర్డ్ మెంబర్స్‌గా ఉన్నది 17 శాతమే. నర్సింగ్సేవల్లో మహిళల సంఖ్య 80 శాతం. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌లో 54 శాతం ప్రైవేట్ వైద్యరంగానిదే వాటా! అందులో కూడా నాయకత్వ హోదాల్లో ఉన్న మహిళల సంఖ్య 30 శాతానికి మించిలేదు. అంతర్జాతీయ స్థాయిలో.. హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్స్ గా రాణిస్తున్న అను ఆచార్య, కిరణ్ మజుందార్ షా, మీనా గణేశ్, డాక్టర్ నందితా షా, నాన్కీ లఖ్విందర్‌సింగ్, నటాషా పూనావాలా, సునీతా మహేశ్వరి, సమీనా హమీద్, సౌమ్య స్వామినాథన్, డాక్టర్ వి. శాంత సహా తెలుగు వనితలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి లాంటి వాళ్లెందరి పేర్లో వినిపిస్తాయి. వీళ్లంతా తమ రంగాలలో తమ ముద్రను చూపించుకుంటున్నారు.ప్రమాదం అంచున... జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన శారీరక హింసకు గురవుతున్నారు. ఇది హెల్త్‌కేర్ సెక్టార్లోకీ విస్తరించి మహిళావైద్యులు, నర్సుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది. దీనికి ఉదాహరణ ఇటీవలి కోల్‌కతా కేజీ కర్ ఆసుపత్రి పీజీ స్టూడెంట్ హత్యాచారమే! ఈ దారుణాలకు కారణం ఆయా విభాగాల్లో నాయకత్వ హోదాలో మహిళల సంఖ్య కనీసం 30 శాతం కూడా లేకపోవడమే. పైస్థాయిలో ఎక్కువమంది మహిళలున్న చోట పనిప్రదేశం భద్రంగా ఉంటుంది. భరోసా పెరుగుతుంది. మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది.ముంబై.. దిక్సూచీ... ఈ విషయంలో ‘దిలాసా క్రైసిస్ సెంటర్’ను ఏర్పాటు ద్వారాదేశానికి మార్గదర్శిగా నిలిచింది ముంబై! ఇది మహిళల మీద హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాన్నెలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సహాయం పొందాలి, ఎలా సహాయం అందించాలి వంటి వాటి మీద ఆసుపత్రుల్లోని సిబ్బందికి శిక్షణనిచ్చింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో వైద్యరంగంలోని మహిళలదే కీలకపాత్ర. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం శూన్యం. అది గ్రహించి ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రైవేట్ రంగం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచి, వచ్చే మహిళా దినోత్సవానికల్లా వైద్యరంగంలో మహిళల విజయగా«థను చెప్పుకునే అవకాశాన్నిస్తాయని ఆశిద్దాం! మహిళలతోనే భరోసానేను మహిళా బాస్‌ల కిందే పనిచేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా వారితో షేర్ చేసుకుంటాను. వెంటనే స్పందిస్తారు. నేను కూడా నా కింది ఉద్యోగుల విషయంలో అలాగే ఉంటాను. మన బాసులుగా కానీ, కొలీగ్స్‌గా కానీ మహిళలే ఉంటే ఇలాంటి భరోసా వస్తుంది. అయితే అవకాశాలను వెదుక్కుంటేనే మహిళా శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే ఆటోమేటిగ్గా పని ప్రదేశం విమెన్ ఫ్రెండ్లీగా మారుతుంది. – డాక్టర్ మౌనిక నేలపట్ల అసిస్టెంట్‌ప్రొఫెసర్, జనరల్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, కామారెడ్డిమేము వారధులంఒక రకంగా మేము ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలాంటి వాళ్లం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి ఆరోగ్యసంరక్షణలో మా పాత్ర ముఖ్యమైనది. వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి కాబట్టి.. భద్రత, రక్షణ వంటి వాటిలో ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అవమానాలూ ఎదురవుతుంటాయి.– జంగం రమాదేవి, ఆశ వర్కర్,పాల్వంచ, కామారెడ్డి జిల్లా. -
అ‘టెన్’షన్ ప్లీజ్...కేర్ తీసుకోండి
ఆమె ఆరోగ్యమే ప్రపంచ భాగ్యంమహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలపై అవగాహనపెరుగుతోంది. మహిళా దినోత్సవాలలో ‘మహిళల ఆరోగ్యం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఇరవైలలో...మున్ముందు ఆరోగ్యాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకేందుకు తగిన వ్యాయామాలు చేయాలి. పాల వంటి క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ మున్ముందు ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి → శబ్దకాలుష్యం నుంచి మీ చెవులను కాపాడుకోండి. ఎక్కువ శబ్దంతో వినకుండా మీరు రేడియో, టీవీ, మొబైల్... ఏది వింటున్నా వాల్యూమ్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి → రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుని దాన్ని క్రమబద్ధం చేసుకోండి → ఆటల్లో, వ్యాయామాల్లో గాయాలు కాకుండా చూసుకోండి. ఇవ్వాళ్టి గాయాలు భవిష్యత్తులో గండాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడండి → మనం ఏమి తింటున్నామనే విషయంపై దృష్టి సారించండి. ఇవ్వాళ్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే... భవిష్యత్తులో మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులని గుర్తుంచుకోండి → వయసు పెరిగేకొద్దీ నిద్ర తగ్గే అవకాశముంది కాబట్టి వీలైనంత వరకు కనీసం తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపొండి. ముప్ఫైలలో...ఈ వయసులో కనిపించే కొద్దిపాటి మార్పులపై దృష్టిసారించండి. → మీ బరువును గమనించండి. మీరు బరువు పెరుగుతున్నారంటే జీవక్రియలు మందగించాయని అర్థం. మొదట్లో కొద్దిగానే పెరిగినట్లు కనిపిస్తున్నా జీవక్రియలు చురుగ్గా జరిగేలా చూస్తూ వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించండి. → చర్మాన్ని రక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. కనీసం 15 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండటం చాలా అవసరం. అది క్యాన్సర్‌తో సహా పలు చర్మ సమస్యలను కాపాడుతుంది → ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండండి. ఒత్తిడి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు కలుగుతాయి → ఈ వయసులోనే క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలూ, మెడికల్ చెక్అప్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది → ప్రెగ్నెన్సీతో వచ్చే ముప్పులను గుర్తుంచుకోండి. ఎందుకంటే... 35 ఏళ్లు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీలతో బిడ్డకు ఎన్నో రకాలుగా ముప్పు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వయసులో గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే తప్పనిసరిగా ఆబ్స్టేట్రీషియన్ను సంప్రదించండి. నలభైలలో...వయసు తాలూకు సంధి దశ అయిన ఈ ఈడులో కనిపించే మార్పులకు సిద్ధంకండి.→ మెనోపాజ్‌కు ముందుగా కనిపించే ‘పెరీ–మెనోపాజ్’ మార్పులను గమనిస్తూ ఉండండి. ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గడం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్ల మాదిరిగా వస్తున్నాయా, నిద్ర పట్టడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయా, త్వరగా చిరాకుపడటం వంటి మార్పులు కనిపిస్తుంటే పాప్ స్మియర్ పరీక్షతోపాటు పెల్విస్ పరీక్షలు చేయించుకోండి → రొమ్ముక్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్ష మామోగ్రామ్ కూడా చేయించుకోండి → తీసుకుంటున్న ఆహారంపై దృష్టి నిలపండి. మీ జీవక్రియల వేగానికి తగినట్లుగా ఆహారం అందేలా... కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటున్నారా అన్న విషయాన్ని గమనించుకోండి ∙కంటి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చాలారకాల కంటి సమస్యలు ఈ వయసులోనే బయటపడతాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ 40లలోనే కళ్లజోడు ధరించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించండి → మీ కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే కొలనోస్కోపీకి ΄్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబ ఆరోగ్య చరిత్రలో జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారి లో ఎంత త్వరగా సమస్యను కనుగొంటే అంత ఎక్కువ ప్రయోజనమని తెలుసుకోండి → రక్తంలో చక్కెర మోతాదులెలా ఉన్నాయో చూసుకోండి. చాలావరకు 40 ల లోనే టైప్–2 డయాబెటిస్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది చాలామందిలో ఎలాంటి లక్షణాలూ లేకుండానే వచ్చేందుకు అవకాశమున్నందున ఒకసారి మీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.యాభైలలో...మీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మెనోపాజ్ కోసం సిద్ధం కండి. 51 అన్నది చాలామందికి మెనోపాజ్ వచ్చే సగటు వయసు ∙చురుగ్గా ఉండండి. చురుకుదనం తగ్గిపోయే ఈ వయసులో చురుకుదనాన్ని పెంచుకోవడం వల్ల మున్ముందు చాలాకాలం పాటు మరింత ఆరోగ్యంగా ఉండగలరు → ఒకసారి మొత్తం దేహానికి సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకోండి. వీలైతే మీ యాభైలనుంచి ప్రతి రెండేళ్లకోమారు అన్ని బేసిక్ హెల్త్ పరీక్షలూ చేయించుకుంటూ ఉండటం మంచిది. → ఒకసారి ఈసీజీ తీయించుకోండి. సాధారణంగా గుండెజబ్బులు కనిపించేది ఈ వయసులోనే కాబట్టి ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని, మీకు ఎలాంటి గుండెజబ్బులూ లేవని నిర్ధారణ చేసుకుని ఆనందంగా ఉండండి.అరవైలలో...ఈ వయసు... ఆరోగ్యానికి సంబంధించిన మరో దశకు మొదటి మెట్టు.→ ఆహారంలో మరింత పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వయసులో ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల పెద్దపేగుల్లో కండపెరగడం, ఇతరత్రా పెద్దపేగు సమస్యలను రాకుండా నివారించవచ్చు → నడక వంటి వ్యాయామాలు చేయండి. ఈ వయసులో చేసే వ్యాయామాలన్నీ దేహానికి మరింత ఎక్కువ శ్రమ కలిగించనివీ, మరీ తీవ్రమైనవి కాకుండా ఉండేవి అవసరం. వారంలో కనీసం 150 నిమిషాల పాటు దేహానికి మంచి కదలికలు ఉండే వ్యాయామం దొరికేలా చూసుకోండి. దీనివల్ల మీలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కనీసం 15 శాతం తగ్గుతాయి → ఈ వయసులో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ, మామోగ్రామ్ పరీక్షలూ చేయించుకోండి. బరువు పెరగకుండా చూసుకోండి. పెరుగుతున్న బరువు క్యాన్సర్‌తో సహా అనేక అనారోగ్యాలకు హేతువని గుర్తుంచుకోండి → పెద్ద వయసులో తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ, నిమోనియా వంటివి. → పెద్దవయసులో తీసుకోవల్సిన వ్యాక్సినేషన్ల గురించి తెలుసుకుని, వాటిని తీసుకోవడం వల్ల ఆ వయసులో అవి సోకకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు వాటిని తట్టుకునేంత సామర్థ్యం వయసు పైబడ్డాక ఉండకపోవచ్చు.డెబ్భైలలో...వయసు పెరగడాన్ని గమనించుకుంటూ... ఆ ఈడుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోండి.→ ఈ వయసులో బాధలను దరిజేరనివ్వకండి. సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమివ్వండి. మోకాళ్లు అరగడం వంటివి ఈ వయసులో సాధారణంగా కనిపించే సమస్యలు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్స్ వంటివి ఈ వయసులోనే చేయించుకోండి. మరింత వయసు పెరిగితే అంతగా సాధ్యం కాకపోవచ్చు → ఈ వయసులో కళ్ల సమస్యలు మామూలే. సాధారణంగా క్యాటరాక్ట్ వంటివి ఈ వయసులో కళ్లకు వచ్చే సమస్యలు. వీలైనంత త్వరగా కాటారాక్ట్ సర్జరీ చేయించుకుని సుదీర్ఘకాలం పాటు మీ కళ్లతో ప్రపంచాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేయండి.డాక్టర్ కె. ఉషారాణిసీనియర్ ఫిజీషియన్ ఇలా ప్రతి పదేళ్ల కాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, పది పదుల ఏళ్ల పాటు పదిలంగా ఉండండి. -
PMEGP : సబ్సిడీతో పాడి పథకం, లోన్ ఎలా పొందాలి?
సబ్సిడీతో పాడి పథకం మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎం΄్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్.మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటివివరాలను ‘‘ఓనర్‘షిప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్. పీఎమ్ఈజీపీ (PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రాగ్రామ్) స్కీమ్... పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ పొందించిన పథకం ఇది. ఇందులో 35 శాతం సబ్సిడీతో రూ. 10 లక్షల నుంచి కోటి వరకు రుణ సహాయం అందుతుంది. దీనికి అయిదు ఎకరాల సొంత లేదా రిజిస్ట్రేషన్ లీజు కలిగిన భూమి ఉండాలి. గ్రామం, పట్టణం.. ఎక్కడైనా ఈ పరిశ్రమను పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ లభిస్తుంది.ఇలా దరఖాస్తు చేసుకోవాలి...పద్ధెనిమిదేళ్లు్ల పైబడి.. 730 సిబిల్ స్కోర్ దాటినవారు ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఏరియాపాపులేషన్ రి΄ోర్ట్, టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణతా సర్టిఫికెట్, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, భూమికి సంబంధించిన పట్టా, పాస్‌బుక్ కాపీలను జతచేస్తూ పీఎమ్ఈజీపీ ఆన్లైన్ ్ర΄÷ఫైల్‌ను నింపాలి. అది సంబంధిత కేవీఐబీ లేదా కేవీఐసీకి వెళ్తుంది. వాళ్లు అప్రూవ్‌చేసి ఆ దరఖాస్తును బ్యాంకులకు పంపుతారు. బ్యాంక్‌ల నుంచి పిలుపు రాగానే వారు సూచించిన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించాలి. బ్యాంక్‌లు వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. మళ్లీ అది కేవీఐబీ లేదా కేవీఐసీకి వస్తుంది. తర్వాత 15 రోజులు ఆన్లైన్ ట్రైనిం ఉంది., సంబంధిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది పాస్ అయితేనే రుణం విడుదల అవుతుంది. అప్పుడే సబ్సిడీనీ శాంక్షన్ చేయించుకోవాలి. దాన్ని మూడేళ్ల వరకు బ్యాంక్‌లోనే డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల తర్వాత దాన్ని బ్యాంక్ వాడుకుంటుంది. ΄÷ందిన సబ్సిడీకి వడ్డీ ఉండదు. ఈ మొత్తం రుణానికి బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు అడగదు. అందిన రుణంలోని కొంత మొత్తంతో షెడ్డును నిర్మించి, ఇంకొంత మొత్తంతో గేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువైద్యనిపుణులు సర్టిఫై చేసిన ఆరోగ్యకరమైన గేదెలకు మాత్రమే బ్యాంక్ అనుమతిస్తుంది. కొన్నచోటు నుంచి రసీదు తీసుకోవాలి. షెడ్డును కూడా ప్రభుత్వ సూచనల మేరకు.. గాలి వెలుతురు ధారాళంగా సోకేలా, నీటి సౌలభ్యం, డ్రైనేజీ వసతులు ఉండేలా నిర్మించాలి. అధికంగా పాలనిచ్చే సూడి గేదెలను మాత్రమే కొనాల్సి ఉంటుంది. నాణ్యమైన పాల ఉత్పత్తి, వేరొక జాతి పశువులతో కలపని పూర్తిస్థాయి దేశీ పశు అభివృద్ధే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇదేకాకుండా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నుంచి అందుతున్న పశుజాతి అభివృద్ధి (Breed Multiplication Farm) పథకమూ ఉంది. దీనికి రూ. 4 కోట్ల రుణం అందుతోంది. అందులో సగం అంటే రూ. 2 కోట్లకు సబ్సిడీ ఉంటుంది. పది శాతం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అంటే రూ.4 కోట్ల ప్రాజెక్ట్‌కు రూ. 40 లక్షలు సొంత పెట్టుబడి ఉండాలి. మిగిలిన కోటీ అరవై లక్షలకు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు. అయితే దీనికి పూచీకత్తు తప్పనిసరి. అయిదు ఎకరాల భూమిలో ప్రాజెక్ట్ ఉండాలి. పదేళ్ల పైబడి లీజుకు రిజిస్ట్రేషన్ చేయించాలి. సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో ఎన్డీడీబీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ స్క్రూటినీ అనంతరం పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన తర్వాతప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి. అయిదు ఎకరాల భూమిలో పాడికి అవసరమైన పచ్చగడ్డిని పండించాలి. దేశీ పశు అభివృద్ధి ప్రణాళికతో తయారైన, ప్రభుత్వం సప్లయ్ చేస్తున్న దాణాను కూడా సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు. ఈ పథకం ద్వారా చాలామంది పాడి రైతులు తాము లాభపడటమే కాక మరికొంత మందికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇది మహిళా రైతులకు మరింత ప్రోత్సాహకరం. – బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్నిర్వహణ : సరస్వతి రమ మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com -
వరకట్న నిషేధ చట్టం ముస్లింలకు వర్తిస్తుందా? లేదా?
నాకు పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది. మేము ముస్లిమ్స్. పెళ్లి సమయంలో నా భర్త తరపు వాళ్లు కోరిన మొత్తాన్ని ఇచ్చాము. మేమిద్దరమూ ఉద్యోగులమే... నెలకు చెరొక లక్ష జీతం. ఇప్పుడు మేము విడిపోవాలని అనుకుంటున్నాం. అయితే నేను కేసుపెడితే కట్నం ఇచ్చినందుకు మమ్మల్ని కూడా జైల్లో పెడతారు అని నా భర్త బెదిరిస్తున్నాడు. వరకట్న నిషేధ చట్టం ముస్లింలకు వర్తించదు అని అంటున్నాడు. అది నిజమేనా? దయచేసి వివరణ ఇవ్వండి. –షేక్ కవిత, తిరుపతి వరకట్న నిషేధ చట్టం అన్ని మతాల వారికి వర్తిస్తుంది. కొందరు ‘మెహర్’ను విడాకులతో పొరబడుతుంటారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం ఇచ్చినా తీసుకున్నా రెండు నేరాలే. కానీ, కట్నం ఇచ్చినవారు ఒత్తిడికి లోనై ఇస్తారు కాబట్టి, కట్నం ఇచ్చిన వారికి శిక్షపడే ప్రమాదం తక్కువే. అలా కట్నం ఇచ్చిన వారందరినీ శిక్షిస్తూ పోతే వరకట్న నిషేధ చట్టం ఉద్దేశ్యానికే అర్థం లేకుండా పోతుంది. మీ విషయంలో మీ భర్త కూడా ఒప్పుకుంటే సామరస్యంగా విడిపోయి ఎవరి జీవితం వారు చూసుకోండి. పిల్లలు ఉంటే, మీ భర్త కూడా పిల్లల మెయింటెటెన్స్ పంచుకోవాల్సి వస్తుంది.చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?-శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు సందేహాల నివృత్తికోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
ప్రతి మహిళా సెలిబ్రిటీనే : మిసెస్ ఇండియా తెలంగాణ మిటాలీ
సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని మిసెస్ మిటాలీ అగర్వాల్ తెలిపారు. సెపె్టంబర్లో జరగనున్న మిసెస్ ఇండియా ఫ్యాషన్‌లో పాల్గొంటానని, ఈ పోటీల్లోనూ విజేతగా నిలవడానికి సన్నద్ధమవుతున్నానని ఆమె తెలిపారు. నగరంలోని కూకట్పల్లి వేదికగా వనితల కోసం ఏర్పాటు చేసిన విరజ ఫ్రిల్స్ ఉమెన్స్ వేర్ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు.సాధికారతతో మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ప్రతి మహిళా ఒక సెలిబ్రిటీనే అని మిటాలీ అన్నారు. విరజ ఫ్రిల్స్ వేదికగా స్మార్ట్ క్యాజువల్స్, బిజినెస్ క్యాజువల్స్తో పాటు మహిళల సరికొత్త స్టయిల్ కోసం లేటెస్ట్ ట్రేడింగ్ కలెక్షన్అందుబాటులో ఉందని నిర్వాహకులు అనుషా నామా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మిసెస్ మిటాలీ అధునాతన వ్రస్తాలంకరణతో అలరించారు. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి! ఆకట్టుకుంటున్న టోపోగ్రఫీ బంజారాహిల్స్: రోడ్ నెం.10లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్ర కళాకారులతో పాటు భారతీయ కళాకారుడు, టోపోగ్రఫీస్ ఆఫ్ టెంట్స్ టెర్రకోట అండ్ స్టైమ్ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఔత్సాహిక కళాకారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సృష్టి ఆర్ట్ గ్యాలరీ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గోతేజంత్రం భాగస్వామ్యంతో టోపోగ్రఫీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు ఆర్నాల్డో డ్రెస్ గోన్జాలెజ్, స్వెన్ కహ్లర్ట్తో పాటు భారతీయ చిత్రకారుడు సుధాకర్ చిప్పా వేసిన పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచారు. విభిన్న కళాత్మక భాషలు, జీవిత అనుభవాలను ఈ చిత్రాల్లో కళ్లకు కట్టారు. నెలా 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు ఆలోచనాత్మక రీతిలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. -
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా శారీ రన్లో పాల్గొని తిరిగి పీపుల్స్ ప్లాజా చేరుకున్నారు. సుప్రసిద్ధ బ్రాండ్ తనైరా, ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. తనైరా శారీ రన్ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్ నారాయణ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఉత్సాహంగా సాగిన శారీ రన్లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు మూడు వేల మందికిపైగా రన్లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్ పాయింట్లో సెల్పీలు, గ్రూఫ్ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్ అప్ ఫిట్నెస్, జుంబా చేయించారు. -
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్ -
చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఆమె ప్రసగించడం పలువురి ప్రశంసలందుకుంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు నీతా ముఖ్యంగా తాను చిన్నపుడు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు కోవాలని భావించడం, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కోరిక నెరవేరకపోవడం, ఇపుడు అక్కడి కీలకోపన్యాసం చేయడంతో తన తల్లి ఎంతో సంబర పడిపోయిన వైనాన్ని షేర్ చేశారు. తాజాగా తన చిన్నకోడలు రాధిక అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి చెప్పుకొచ్చారు. అనంత్ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటాడు, ఊబకాయంతో ఫైట్ చేస్తున్న తీరు ,రాధికతో ప్రేమను గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో, అతనికి రాధిక లాంటి భార్య దొరకడం సంతోషం అన్నట్టు నీతా మాట్లాడారు. అనంత్ మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటాడు. జీవితాంతం ఊబకాయంతో పోరాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉంటాడు. అలాగే తన జీవిత భాగస్వామి రాధికను కలవడం ద్వారా మరింత ఉత్సాహంగా మారాడు. వాళ్లిద్దరినీ అలా జంటగా చూడముచ్చటగా, అద్భుతంగా మ్యాజిక్‌లా ఉంటారంటూ చిన్న కోడల్ని కొనియాడారు.At the Harvard India Conference, Mrs. Nita Ambani speaks from the heart about her youngest son Anant - his journey through challenges, his positivity and spirituality, and finding his soulmate in Radhika! pic.twitter.com/yQNeMMFyZJ— Reliance Industries Limited (@RIL_Updates) February 18, 2025కాగా గత ఏడాది జూలై 12న అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ నివాసం, యాంటిలియా, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం ఆరు రోజుల పాటు ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్, అనంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అనంత్ రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగా రాధిక న్యూయార్క్‌లో చదువుకుంది. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటున్న ఒక ఫోటో వైరల్ కావడంతో వీరి ప్రేమ వ్యవహారం బైటపడింది. ఆ తరువాత అనంత్ సోదరి ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో కూడా రాధిక కనిపించారు.అయితే రాధిక తనకు దొరకడం అంటే 100 శాతం అదృష్టవంతుడిని అంటూ అనంత్ అంబానీ గతంలో తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పటికీ రాధికను కొత్తగా కనిసినట్టు అనిపిస్తుంది రాధికను చూసినప్పుడు తన హృదయంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలొస్తాయంటూ చాలా భావోద్వేగంతో అనంత్ చెప్పిన సంగతి తెలిసిందే. -
మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌ను గుర్తు చేసుకుని భావోద్వాగానికి లోనయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. 'మదర్స్ ప్రైడ్' అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో నీతా అంబానీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న 50 సెకన్ల వీడియో కూడా ఉంది.బోస్టన్‌లో జరిగిన సమావేశంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. తన ప్రసంగానికి ముందు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం తనకు లభించడం పట్ల తన 90 ఏళ్ల తల్లి ఎంత గర్వ పడిందో, ఎంతగా చలించిపోయిందో వివరించారు. చిన్నతనంలో హార్వర్డ్‌లో చదవాలని నీతా అంబానీకా చాలా కోరికగా ఉండేదట. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు అదే హార్వర్డ్ వేదికపై ఆమె ప్రసంగించే అవకాశం దక్కడంతో నీతా తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఇదే విషయాన్ని తన కోడళ్లు శ్లోకా మెహతా, రాధిక మర్చంట్లను ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పి ఎంతో సంతోషడిపోయింది, చాలా భావోద్వేగానికి గురైంది అంటూ నీతా అంబానీ చెప్పారు. తనను ఆహ్వానించి తల్లిని సంతోషపెట్టినందుకు హార్వర్డ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు నీతా. Mother's Pride: in an inspiring and heart-warming moment, Reliance Foundation Founder & Chairperson,Mrs. Nita Ambani shares how her mother felt proud that the same Harvard they aspired for but could not send young Nita because of financial constraints, has today invited her to… pic.twitter.com/R7as81bX9E— Reliance Foundation (@ril_foundation) February 17, 2025 అలాగే నీతా అంబానీ రాపిడ్ ఫైర్ అనే మరో విభాగంలో నీతా అంబానీ చాలాచక్కగా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె భర్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం హాజరైన వారిని ఆకట్టుకుంది, ప్రేక్షకుల నుండి హర్షధ్వానాలు వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ జీ దేశానికి గొప్పవారైతే, తన భర్త ముఖేష్ నా ఇంటికి మంచివారు అంటూ సమాధానమిచ్చారు. ఘఇదీ చదవండి: ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి? -
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్‌కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్‌లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
శివాజీ జయంతి : మహిళామణుల బుల్లెట్ స్వారీ
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఉత్సవ కమిటీ తరపున అధ్యక్షుడు సుశీల్ బందపట్టే నేతృత్వంలో శివ శోభాయాత్ర నిర్వహించబడింది. ఆదివారం ఉదయం చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్దకు శోభాయాత్రలో పాల్గొనేందుకు మహిళలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మహా మండల్ తరఫున మహిళలకు కాషాయ రంగుతో కూడిన శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్ద సంబాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి బైకుల ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమై.. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చోక్, నవిపేట్, రాజువాడే చోక్, చిల్లర చౌపాడ్ తదితర మార్గాల గుండా షిండే జోక్ వరకు నిర్వహించారు. శివ జయంతి నిమిత్తంగా మహిళలు చీరలు, తలపై కాషాయరంగు తలపాగాలు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీధుల్లో మహిళల బైకు ర్యాలీని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కాగా షిండే చౌక్‌లో ఊరేగింపు ముగిసిన అనంతరం శివజన్మోత్సవ సన్ మధ్యవర్తి మహా మండల్ వారు మహిళలచే హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ నామస్మరణలతో పరిసరాలు దద్దరిల్లాయి. ప్రతి సంవత్సరం శివ జయంతి నిమిత్తంగా వివిధ తరహాలో శోభాయాత్ర చేపట్టాలని మహిళలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పద్మాకర్ కాలే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుశీల్ బందుపట్టే, పురుషోత్తం భరడే, ప్రకాష్ ననార్వే, అంబదాస్ షెలేక్ దేవిదాస్ గులే, మహేష్ హనీమే చాల్లే, బాలాసాహెబ్ పూనేకర్ తదితరులతోపాటు శివ దినోత్సవం మధ్యవర్తి మహా మండల్ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే! -
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
పిల్లల కోసం రెక్కలు తొడుక్కుంది
మలేసియాలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌కు 350 కిలోమీటర్లు. ట్రైన్ లో నాలుగ్గంటలు. విమానంలో గంట. వివిధ కారణాల రీత్యా పెనాంగ్‌లో నివాసం ఉంటున్న రేచల్ కౌర్(Racheal Kaur) కౌలాలంపూర్‌లోని తన ఉద్యోగానికి రోజూ విమానంలో వెళ్లి వస్తోంది. ‘టీనేజ్ పిల్లలు ఉన్నారు... వారికి తల్లి అవసరం ఎక్కువ’ అంటోంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా తల్లులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన సమయం గురించి ఈ భారతీయ తల్లి కథనం గుర్తు చేస్తోంది.పిల్లల పెంపకం, కెరీర్... ఈ రెండు కత్తిమీద సామే వర్కింగ్ ఉమెన్‌కు. పిల్లలకు పూర్తిసమయం ఇస్తున్నామా లేదా అనేది ఒక ఆందోళనైతే వృత్తిలో ముందుకుపోగలమా లేదా అనేది మరో ఆందోళనగా ఉంటుంది. వీటిమధ్య నలగడం కంటే శక్తికి మించి ఎంతమేరకు చేయగలమో అంతమేరకు చేసి తృప్తిపడుతున్న తల్లులూ ఉన్నారు.మలేసియాలో స్థిరపడ్డ మన పంజాబీ రేచల్ కౌర్ కథ అలాంటిదే. ఆమె తన పిల్లల కోసం బహుశా ఏ తల్లీ చేయని పని చేస్తోంది. అదేంటంటే రోజూ విమానంలో పనికి వెళ్లి విమానంలో రావడం! చాలామంది ఇది పిచ్చా... వెర్రా... అని ఆశ్చర్యపోతారుగాని నాకు ఇదే బాగుందని రేచల్ అంటోంది.ఇల్లు ఒకచోట.. పని ఒకచోట!రేచల్ కౌర్ తన భర్త జగ్జిత్ సింగ్ ఇద్దరు పిల్లలతో మలేసియాలోని పెనాంగ్‌లో ఉంటోంది. ఆమె ఉద్యోగం కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎందుకంటే ఆమె ఎయిర్ ఏసియాలో బిజినెస్ మేనేజర్. ఈ రెండు చోట్ల మధ్య 350 కిలోమీటర్లు ఉంది. బస్సు మార్గం కష్టం. రైలు సులువు. కాని ఉద్యోగానికిపోయి వచ్చేంత వీలుగా రైళ్లు ఉండవు. ‘అందుకే నేను ఉద్యోగం కోసం కౌలాలంపూర్‌లో ఉంటూ వారానికి ఒకసారి వచ్చి వెళ్లేదాన్ని. కౌలాలంపూర్‌లో ఉండటానికి రూమ్‌కు, నా తిండికి బాగానే ఖర్చయ్యేది. దానిబదులు రోజూ వచ్చి వెళితే కేవలం లంచ్ ఖర్చు, చార్జీల ఖర్చు తప్ప మరే ఖర్చూ ఉండదనిపించింది. దాంతో విమానంలో వచ్చి వెళ్లాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది రేచల్ కౌర్.చార్జీల్లో రాయతీరేచల్ కౌర్ ఎయిర్ ఏసియాలో పని చేస్తుంది. ఆ సంస్థ వారు ఆమెకు రాయితీ ఇవ్వడం వల్ల రాకపోకల ఖర్చు బాగా తగ్గింది. ‘మా ఉద్యోగి ఉద్యోగాన్ని, ఇంటిని బేలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తే సహకరించడం మా బాధ్యత. ఇలా పని చేయాలని కోరుకునేవారికి మేము పూర్తి సహకారం అందిస్తాం’ అని ఎయిర్ ఏసియా ప్రతినిధులు రేచల్‌ను ప్రస్తావిస్తూ అన్నారు.ఉదయం 4 గంటలకు లేచిరేచల్ ఇల్లు పెనాంగ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బాగా దగ్గర. ‘నేను ఉదయాన్నే నాలుగు లేదా నాలుగుంపావుకు నిద్ర లేస్తాను. ఐదు గంటలకంతా రెడీ అయ్యి నా కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతాను. మా ఎయిర్ ఏసియా రోజువారీ విమానం బోర్డింగ్ టైమ్ 5.55 నిమిషాలు. నేను ఎయిర్‌పోర్ట్‌లో కారుపార్క్ చేసి సులభంగా బోర్డ్ చేయగలిగేంత సమయం ఉంటుంది. ఆరున్నరకు బయలుదేరిన విమానం ఏడున్నరకంతా కౌలాలంపూర్ చేరుతుంది. ఇంకో పదిహేను నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌లోని మా ఆఫీస్‌లో ఉంటాను’ అని చెప్పింది రేచల్. ‘ప్రతి రోజూ విమానంలో ఉదయంపూట కాసేపు ప్రార్థన చేసుకుంటాను. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ ముగిశాక మళ్లీ విమానం ఎక్కుతాను. ఏడున్నరకంతా ఇంట్లో ఉంటాను’ అంది రేచల్. 2024 ప్రారంభం నుంచి ఇలా రోజూ తిరుగుతున్నాను. వీకెండ్ రెండు రోజులు తప్పించి ఇప్పటికి 200 రోజులకు పైగా విమానంలో రోజూ వచ్చి వెళ్లాను’ అందామె.నా పిల్లల కోసం..‘నా కొడుక్కు 12 సంవత్సరాలు. నా కూతురికి 11 సంవత్సరాలు. వారు ఎదిగే సమయం. నేను వారానికి ఒకసారి కనపడితే వాళ్ల తిండి, హోమ్ వర్కులు, ఎమోషన్స్ ఎలా తెలుస్తాయి. వారికి నేను కావాలి. అందుకే ఈ మార్గం కష్టమైనా సరే ఎంచుకున్నాను. నా ఆఫీస్‌లోని కలీగ్స్ నన్ను అర్థం చేసుకుని సహకరిస్తారు. ఇంట్లో నా భర్త. అందుకే రోజంతా ఎంత కష్టపడినా ఇంటికి చేరి నా పిల్లల ముఖాలు చూసేసరికి నా కష్టమంతాపోతుంది.ఇంతకుమించి ఏం కావాలి’ అంటుంది రేచల్.టీనేజ్ వయసులో కూతురికైనా, కొడుక్కైనా తల్లి తోడ్పాటు ఉండాలి. తండ్రితో చెప్పుకోలేనివి వారు తల్లితో చెప్పుకుంటారు. ఏ కెరీర్లో ఉన్నా తల్లి ఈ సంగతిని మిస్ చేయకూడదని నిపుణులు అంటారు. రేచల్ ఉదంతం తల్లి బాధ్యతను గట్టిగా గుర్తు చేసేలా ఉంది. -
జింకల అమ్మ
కొన్ని బిరుదులు కోరుకోకపోయినా వస్తాయి. అనురాధరావు(Anuradha Rao)కు ‘డీర్ ఉమన్’ బిరుదు అలా వచ్చిందే. ‘జింక కనిపిస్తే కచ్చితంగా వేటాడాల్సిందే’ అన్నట్లుగా ఉండే ఆ దీవుల ప్రజలలో మార్పు తెచ్చింది అనురాధ. ఆమెకు జింకలు జంతువులు కాదు. కుటుంబ సభ్యులు. వాటితో ఆడుతుంది,పాడుతుంది. కబుర్లు చెబుతుంది. మేత నుంచి సంరక్షణ వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ఆమె డీర్ ఉమెన్.అండమాన్ నికోబార్ దీవులలో ఉంటున్న అనురాధరావుకు జింకలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ విశిష్ఠ అనుబంధమే ఆమెను ‘డీర్ ఉమెన్’(Deer Woman) అని పిలుచుకునేలా చేసింది. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు అనురాధ పూర్వీకుల్ని అండమాన్‌కు బందీలుగా తీసుకెళ్లారు. ఈ ద్వీపంలో ఆమె నాల్గవ తరం నివాసి.‘చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. బాల్యం నుంచి జింకలు అంటే ఇష్టం. అవి మా కుటుంబ సభ్యులలాగే భావించేదాన్ని. ఈ ద్వీపంలోని జింకలతో నాకు మంచి అనుబంధం ఉంది’ అంటుంది అనురాధ. ఆహారం ఇవ్వడం నుంచి సంరక్షణ వరకు జింకల పట్ల ఆమె ఎంతో చొరవ చూపుతుంది. జింకల గురించి ఆమె చూపుతున్న ప్రేమ మనుషులు, జంతువుల మధ్య పరస్పర నమ్మకాన్ని నెలకొల్పేలా ఉంది.‘ఒకప్పుడు మనుషులను చూడగానే జింకలు భయపడిపారిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాటి నమ్మకాన్ని చూరగొనడానికి చాలా ఓపికగా పనిచేశాను. వాటితో ఎంతో సమయం గడిపాను. వాటికి దగ్గరై వాటి మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నాను’ అంటుంది అనురాధరావు. జింకల సంక్షేమం పట్ల ఆమె అంకితభావం ద్వీపంపై బలమైన ప్రభావాన్ని చూపించింది. జంతువుల పట్ల దయగల ద్వీపంగా అండమాన్‌ను మార్చివేసింది. -
జ్ఞాపకాల గని
ఆ తరం ఈ తరం అనే తేడా లేకుండా అన్ని తరాలకు స్ఫూర్తినిచ్చే పేరు... రాజేశ్వరి ఛటర్జీ(Rajeshwari Chatterjee). కర్నాటక తొలి తరం మహిళా ఇంజినీర్(woman engineer)గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఆనాటి కుటుంబ పరిమితులు, కాలపరిమితులు అధిగమించి పెద్ద చదువులు చదువుకుంది. ఆమె చరిత్ర అంటే... మన దేశంలో కంప్యూటర్ సాంకేతికత తొలి తరం చరిత్ర. అనేకానేక పరిమితులు అధిగమించి విద్యాఉద్యోగాల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకున్న మహిళల చరిత్ర.ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఐఐఎస్సీ, బెంగళూరు) చైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేసిన తరువాత రాజేశ్వరి ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. విశ్రాంత జీవితంలోనూ విలువైన పనులెన్నో చేసింది. ఆర్కైవ్లకు ఉపయోగపడే పనులెన్నో చేసింది.‘ఆర్కైవ్ తొలినాళ్లలో ఆమె స్వచ్ఛందంగా సహాయం చేసింది. తన సహోద్యోగులు, విద్యార్థుల గురించి తెలుసుకోవడానికి మాకు సహాయపడింది. ఎన్నో వ్యక్తిగత ఫోటోలు సేకరించి ఆర్కైవ్కు బహుమతిగా ఇచ్చింది’ అని గుర్తు చేసుకున్నారు ఐఐఎస్సీ ఆర్కైవ్ అండ్ పబ్లికేషన్స్ సెల్ మాజీ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శరత్ అహుజా.బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో మొదటి మహిళా ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఛటర్జీ అత్యంత క్లిష్టమైన పనిని చేపట్టింది. ఐఐఎస్సీ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా ఆర్కైవల్ కలెక్షన్‌తోపాటు పూర్వవిద్యార్థుల పుస్తకాన్ని సంకలనం చేసింది.కంప్యూటర్ల హవా, ఇంటర్నెట్ ఊసులేని కాలంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా తన కాలానికి సంబంధించిన పరిమితులు అధిగమించింది.‘1949లో సెలవుల్లో ఎంఐటీకి వెళ్లినప్పుడు విశాలమైన గదుల్లో ఉంచిన తొలితరం కంప్యూటర్లలో ఒకదాన్ని చూశాను. మీ అరచేతిలో పట్టుకోగలిగే ఆధునిక లాప్టాప్లుప్రారంభరోజుల్లోని ఆ భారీ కంప్యూటర్ల కంటే ఎక్కువ పని చేయగలవని ఊహించగలరా?’ అని ఐఐఎస్సీ పూర్వ విద్యార్థుల పుస్తకంలో రాసింది. పీహెచ్డీ చేయాలనే రాజేశ్వరి కల రెండోప్రపంచ యుద్ధంతో భగ్నం అయింది. అయినప్పటికీ ఆమె తన ఆకాంక్షను వదులుకోలేదు. పరిశోధనను కొనసాగించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి, రసాయన శాస్త్రవేత్త రోషన్ ఇరానీల తర్వాత ఐఐఎస్సీ నుంచి స్కాలర్షిప్ పొందిన మూడో మహిళగా ఛటర్జీ గుర్తింపు పొందింది. -
ట్రెండ్‌సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్‌గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్‌ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్‌క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్‌గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్‌ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్‌ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్‌ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్‌ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్‌లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్‌లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
సిల్వర్ స్క్రీన్ క్వీన్ : తోపుడు బండిపై అనాథ శవంలా!
జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.ఆమె ఒక గ్లామర్ హీరోయిన్. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi). 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్ చోప్రా ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్రాజ్ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది. మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.విమ్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!విషాదకరమైన ముగింపుఅయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్‌కతాలో విమి టెక్సటైల్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం. ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
మహిళలూ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా?
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ముద్ర లోన్స్ఈ వారం స్కీమ్ ‘ముద్ర లోన్స్’.ప్రాథమిక అర్హతలు కలిగిన పేద, మహిళలందరూ స్వల్ప వ్యవధిలో సూక్ష్మ, చిన్నతరహా వ్యావపారాలు మొదలుపెట్టేలా ప్రత్సహించే పథకమే ‘ముద్ర లోన్స్’. 2015, ఏప్రిల్‌లో ప్రారంభమైన కేంద్రప్రభుత్వ పథకమిది. ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ద్వారా ప్రభుత్వమే రుణ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. రూ. 20 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. దీన్ని గ్రామీణ, వాణిజ్య, కో–ఆపరేటివ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి పొందదవచ్చు. ఈ రుణాలను మూడు విభాగాల్లో అందిస్తారు. శిశు: 50 వేల రూపాయల వరకు రుణం అందుతుంది. అతి చిన్న, వీథి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలకు అనుకూలమైనది. ఇందులో అత్యధికంగా 44 వేల 891 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించారు. కిశోర: దీనికింద రూ. 50 వేల నుంచి అయిదు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేదు. తరుణ: రూ. 5 లక్షల పైబడి పది లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. లబ్ధి పొంది, రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లిస్తున్నవారు అదనంగా మరో 20 లక్షల రూపాయల వరకు ‘తరుణ్ ప్లస్’ రుణాన్ని పొంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది ఇది. కనీస అర్హతలు: రుణాల్లో ఎగవేత రికార్డ్ ఉండకూడదు. క్రెడిట్ ట్రాక్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం. దరఖాస్తుతో ఆధార్, పాన్‌కార్డ్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపారానికి సంబంధించిన స్కిల్ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలయితే క్యాస్ట్ సర్టిఫికెట్‌నూ పెట్టాలి. తరుణ్ ప్లస్ లోన్‌కి ఐటీఆర్ కూడా పొందుపరచాలి. ఇదీ చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు వారందరూ అర్హులే! మంచి వ్యాపార ప్రణాళికతో బ్యాంకులను సంప్రదించాలి. బ్యాంకువారు.. మనం వ్యాపారం పెట్టాలనుకుంటున్న ప్రాంతం, వ్యాపార వృద్ధికి అక్కడున్న అవకాశాలను బట్టి ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తారు. తీసుకున్న రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సబ్సిడీ సదుపాయం లేదు. కానీ టాప్ అప్, సీసీ లోన్స్‌ను పొందే వీలుంటుంది. దీనికి వస్తు ఉత్పత్తి, మార్కెట్, సేవారంగాల్లో మంచి అవకాశాలున్నాయి. కూరగాయల అంగళ్లు, విస్తరాకుల తయారీ, పేపర్ కప్స్, సారీ రోలింగ్, లాండ్రీ, కిరాణా షాప్స్, కర్రీపాయింట్స్, పిండి మరలు, జిరాక్స్, ఇంటర్నెట్, డయాగ్నస్టిక్స్, స్టేషనరీ నుంచి ఆటో, క్యాబ్, ట్రాక్టర్, వరికోత మిషన్లు, జేసీబీల దాకా దేనికైనా రుణాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి వంటివాటి మీద MSME,DIC, బ్యాంకింగ్ రంగాల వారు అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలనూ చేపడుతోంది.-బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
పుస్తకాలు మా ఇంటి సభ్యులు
తల్లీ కుమార్తె కూచుంటే ఏం మాట్లాడుకుంటారు? మెట్టినింటి విషయాలో.. నగలో, చీరలో... అనుకోవచ్చు కొందరు. కానీ వారు పుస్తకాల గురించి మాట్లాడుకుంటారని తెలుసా? సుధామూర్తి, ఆమె కుమార్తె అక్షతా మూర్తి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి కుమార్తె చేత ఎందుకు పుస్తకాలు చదివించాలో, తామెలాంటి పుస్తకాలు చదివారో మాట్లాడుకున్నారు. ప్రేక్షకుల్లో నారాయణమూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ కూచుని విన్నారు. ‘పవర్ ఆఫ్ బుక్’... తమిద్దరి దగ్గరా న్నదని సుధా, అక్షత అన్నారు. వివరాలు..‘అమ్మా... నువ్వు పుస్తకాలు మా చేత ఎందుకు చదివించాలని పట్టుబట్టావ్? పుస్తకాలు నీ జీవితంలోకి ఎలా ప్రవేశించాయి?’ అని ప్రశ్నించారు అక్షతా మూర్తి.‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2025’ లో రెండు రోజుల క్రితం జరిగిన ‘మై మదర్ మైసెల్ఫ్’ అనే సెషన్లో అక్షతా మూర్తి తన తల్లి సుధామూర్తిని పుస్తకాలు, పెంపకం, వ్యక్తిత్వం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతూ తల్లీకూతుళ్లుగా తాము నడిచి వచ్చిన జీవితాన్ని మననం చేసుకున్నారు. కిక్కిరిసిన వేలాది ప్రేక్షకులతో పాటు అక్షత తండ్రి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, భర్త బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు ముందు వరుసలో కూచుని ఈ సెషన్ విన్నారు. సెషన్‌కు ముందు రిషి సునాక్ లేచి నిలబడి ప్రేక్షకుల వైపు చూస్తూ ‘నమస్తే’ అని అభివాదం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక కూతురి ప్రశ్నకు సుధామూర్తి సమాధానం చెప్తూ–సుధామూర్తి: మాది టీచర్ల ఫ్యామిలీ. మా తాత టీచర్. మా నాన్న మెడికల్ కాలేజీలోప్రోఫెసర్. అమ్మ టీచర్. నేనూ ఆ తర్వాత టీచర్నయ్యాను. మామగారు కూడా టీచరే. మా ఇంట్లో టీచరు కానిది నా భర్తగా వచ్చిన నారాయణమూర్తి ఒక్కడే. కాబట్టి అనివార్యంగా నేను చిన్నప్పటి నుంచి డబ్బుతో కాకుండా పుస్తకాలతో పెరిగాను. మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకైనా ఇచ్చే గిఫ్ట్ పుస్తకమే. అలా పుస్తకాలు అలవాటు చేశారు. పుస్తకాలంటే అజ్ఞానంతో పడిన తలుపులను తెరిచే తాళం చెవులు. అవి మనకు ఎన్నో నేర్పిస్తాయి. పుస్తకాలు చదవడం లేదా నేర్చుకోవడం ఎప్పుడైతే మానేస్తామో ఆ రోజు నుంచి జీవించడం మానేసినట్టు. అందుకే నా పిల్లలు కూడా పుస్తకాలు చదవాలని నేను పట్టుబట్టాను....సుధామూర్తిని అక్షత ఇంటర్వ్యూ చేస్తుండగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, నారాయణమూర్తి ప్రేక్షకుల్లో కూర్చుని వింటున్న దృశ్యం అక్షత: నువ్వు పట్టుబట్టడం వల్ల నేను, రోహన్ (సోదరుడు) నేటికీ లాభపడుతున్నాం. నీకు గుర్తుందా అమ్మా... మనింట్లో నీదో లైబ్రరీ ఉండేది. అందులో సాహిత్యం, చరిత్ర పుస్తకాలుండేవి. నాన్నదో లైబ్రరీ ఉండేది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలుండేవి. మీ ఇద్దరి లైబ్రరీలు– ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కనుక నా చదువులో పెద్ద రిఫరెన్సుగా ఉండేవి. స్కూల్లో ఏ ్రపాజెక్టు చేయాల్సి వచ్చినా ఉద్వేగంగా ఇంటికి వచ్చి పుస్తకాలు తిరగేస్తూ కూరుకుపోయేదాన్ని. అన్నట్టు నీకు సేవాభావం పుస్తకాల నుంచే వచ్చిందా?సుధామూర్తి: మా నానమ్మ ఊళ్లో మంత్రసానిగా ఉండేది. డబ్బుకు కాదు. సేవకోసం. కులం, మతం, జాతి.. పట్టింపు ఉండేది కాదు. వెళ్లి పురుడుబోసి వచ్చి తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేది. తగిన వైద్యం లేక స్త్రీలు పడే వేదన ఆమె చెప్తుంటే విని విని నాన్న గైనకాలజిస్ట్ అయ్యారు. మా చెల్లెలు (నంద) కూడా గైనకాలజిస్ట్ అయ్యింది. సేవ చేస్తే ఎంత తృప్తి ఉంటుందో నాకు తెలిసింది. మా నానమ్మకు 62 ఏళ్లు ఉన్నప్పుడు నాకు 12 ఏళ్లు. కన్నడ నేర్చుకోవాలని అంటే మూడు నెలలు స్ట్రిక్ట్ టీచర్‌గా పాఠాలు చెప్పాను. ఏ రోజైతే ఆమె తనకు తానుగా కన్నడం చదవడం నేర్చుకుందో వచ్చి నా కాళ్లకు ప్రణామం చేసింది గురువుగా. నేను షాక్ అయ్యాను. జ్ఞానం పంచినవారు గురువే చిన్నైనా పెద్దయినా. చాలా సంతోషం అనిపించింది. జ్ఞానం పంచడం కూడా సేవే అని తెలుసుకున్నాను.అక్షత: మీ నానమ్మ పేరు ఏమిటి?సుధామూర్తి: కృష్ణఅక్షత: నా చిన్న కూతురి పేరు అదేగా. కృష్ణ. (పెద్ద కూతురు అనుష్క). అమ్మా... నువ్వు మమ్మల్ని ఆదర్శంగా ఉండమని కూడా చెప్పేదానివి.సుధామూర్తి: ఒక మాటుంది.. ఇరవై ఏళ్ల వయసులో ఆదర్శంగా లేకపోతే హృదయం లేనట్టు. నలభై ఏళ్ల వయసులో ఆదర్శంగా ఉంటే బుర్ర లేనట్టు. కాని నేను ఈ వయసులో కూడా ఆదర్శంగానే ఉన్నాను. జీవితంలో ఆదర్శాలు ముఖ్యం. మీకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పేదాన్ని– జీవితంలో ఏదైనా కాకపోయినా ఆదర్శవంతంగా మాత్రం ఉండండి అని. ఆదర్శంగా ఉండటం అంటే. పార్శీ వారు చెబుతారు... ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడటం... ఏది మాట్లాడతామో అదే చేయడం. బుద్ధికీ, వాక్కుకీ, చేతకీ సారూప్యతే ఆదర్శం. ఒకటి చెప్పి ఒకటి చేయడం కపటం.అక్షత: నీకు ఇష్టమైన పుస్తకం ఏది?సుధామూర్తి: ముందు నువ్వు చెప్పు. అక్షత: నాకు సుఖాంతాలున్న పుస్తకాలు ఇష్టమే కాని పాత్రలు ఎన్ని విషమ పరీక్షలు ఎదురైనా తట్టుకుని నిలబడేట్టుగా ఉంటే ఇంకా ఇష్టం. చారిత్రక ఘట్టాలు, వ్యక్తులను తీసుకుని రాసే పుస్తకాలు ఇష్టం. నీకు?సుధామూర్తి: నా పుస్తకమే చెబుతాను– ‘మహాశ్వేత’. అది రాసినప్పుడు నేనుప్రోఫెసర్గా చేస్తున్నాను. ఒకరోజు ఎవరిదో పెళ్లికి నన్ను తప్పనిసరిగా ఆహ్వానించారు. ఆశ్చర్యంతో వెళ్లాను. భోజనం చేయాలని పట్టుబట్టారు. కారణం అడిగితే పెళ్లికొడుకు నా మహాశ్వేత నవలను చదివాడట. పెళ్లికూతురుగా తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడట. మీ నవల వల్లే తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిల వ్యధ అర్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఒక సింపుల్ పెన్ ఎంత మార్పు తేగలదో చూడటం. పవర్ ఆఫ్ బుక్ అంటే అది.అక్షత: పవర్ ఆఫ్ బుక్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. జీవితంలో ఉపయోగించడానికి పనికి వచ్చే ఆయుధం పుస్తకమే. సుధామూర్తి: కచ్చితంగా.అక్షత: థ్యాంక్యూ అమ్మా... ఇలా కూచుని మనం మాట్లాడుకున్నందుకు. సుధామూర్తి: అందరికీ థ్యాంక్స్. – జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి -
దులారి దేవి ‘గిఫ్ట్’తో నిర్మలా సీతారామన్ బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే కేంద్ర బడ్జెట్ 2025-26ను శనివారం (ఫిబ్రవరి 1, 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడు బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆఫ్-వైట్ చేనేత పట్టు చీరలో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చీర ను పద్మశీ పురస్కారాన్ని అందుకున్న మధుబని కళాకారిణి దులారి దేవి బహుమతిగా అందించారట. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళాత్మకతకు అద్దం పట్టిన ఈ చీర, ఆర్టిస్ట్ దులారి దేవి గురించి తెలుసుకుందాం పదండి!ఉదయం 11:00 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతూ పార్లమెంటులో సంప్రదాయ చీరలో కనిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, శతాబ్దాల నాటి కళను గౌరవిస్తూ ఎంతో సంక్లిష్టమైన మధుబని కళాకృతులతో తీర్చిదిద్దిన చీర అది. ప్రధానంగా మిథిలా కళా సంప్రదాయంలో పనిచేసే దులారి దేవి, అణగారిన దళిత మల్లా కులంలో జన్మించారు. బీహార్‌లోని మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఔట్రీచ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సందర్భంగా ఆమెకు ఈ చీరను బహూకరించారట. తాను ఎంతో కష్టపడి, జాగ్రత్తగా రూపొందించిన మధుబని ప్రింట్ చీరను నిర్మలా సీతారామన్‌కు అందజేసి బడ్జెట్ దినోత్సవం నాడు ధరించాలని దులారీ దేవి కోరారట. దీనిక మ్యాచింగ్‌గా ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్నారు.మధుబని కళబిహార్లోని మిథిలా ప్రాంతంలో మిథిలా పెయింటింగ్‌గా పేరొందిన కళ ఇది. ఇది సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి, పురాణాల వర్ణనల ద్వారా దుస్తులను రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక వర్ణనలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాకారిణి , చిత్రకారిణి చిన్న వయసులోనే.. అంటే పదమూడేళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెద్దగా చదువుకోలేదు కూడా. మధుబని కళాకారిణి మహాసుందరి దేవి ఇంట్లో గృహ సేవకురాలిగా పని చేస్తున్న సమయంలో దులారీ దేవి మధుబని కళను ఒంట పట్టించుకున్నారు. ఆ త రువాత మరో కళాకారిణి కర్పూరి దేవిని పరిచయంతో ఈ కళలోని మరిన్ని మెళకువలను నేర్చుకుని నైపుణ్యం సాధించారు. భర్తను కోల్పోవడం , గ్రామీణ జీవితంలోని కష్టాలు వంటి అనేక వ్యక్తిగత సవాళ్ల మధ్య మిథిలా ప్రాంతంలో ఈ కళతోనే జీవనోపాధి వెతుక్కున్నారు. తన కళను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ కళలో ఆమె చేసిన కృషి, సేవలకు గాను 2021లో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు వచ్చి వరించింది.మరోవైపు 2019లో మధ్యంతర బడ్జెట్ మొదలు, వరుసగా 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 1), 2024 (మధ్యంతర బడ్జెట్, జులై 23) ఇలా వరుసగా 7 సార్లు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇలా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా రికార్డ్ సాధించారు. అంతేకాదు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ,2019-20 బడ్జెట్లో భాగంగా 1372020-21లో 162 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె తాజా బడ్జెట్ ప్రసంగంలో 74 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం. -
ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యా
అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.ముంచెత్తే సవాళ్లుపదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.అంకిత భావందేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)సామాజికంగా ఉన్నతంగా!చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్‌ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్‌గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్‌లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు. -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మహిళల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంహించింది. 21 కోట్లకు పైగా మహిళా ఖాతాదారులున్న గణ తంత్ర దినోత్సవం సందర్బంగా ఎస్బీఐ మహిళల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 5,200 మంది మహిళా అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని బ్యాంకు ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని (MoRD) కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్, ఎస్బీఐ చైర్మన్ సీఎస్సెట్టి సంయుక్తంగా ప్రారంభించారనీ ఈ ప్రారంభోత్సవంలో SBI ఎండీ వినయ్ టోన్సే కూడా పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపింది.'మహిళా సాధికారత' లక్ష్యంలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 153 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలలో (RSETIలు) మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా కార్యక్రమం ద్వారా తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమంలో టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ సర్వీసెస్, వర్మికల్చరల్, అగర్బత్తి/కొవ్వొత్తుల తయారీ, తేనెటీగల పెంపకం, సాఫ్ట్ టాయ్ క్రియేషన్, జనపనార ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనుందిఅలాగే శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం, సొంత వెంచర్ ఏర్పాటు, మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడంపై మార్గదర్శకత్వ సలహాలు కూడా అందిస్తుంది. శిక్షణ పొందేమహిళల్లో ఉత్సాహం నింపేలా స్థానిక ప్రముఖులు , విజయవంతమైన వ్యవస్థాపకులు వారి అనుభవాలను తెలిపే అవకాశం కూడా ఉంటుంది.ఇది గ్రామీణ మహిళలను స్వావలంబన చేయడంతపాటు “వికసిత్ భారత్” వైపు ఒక అడుగు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సి.ఎస్. సెట్టి తెలిపారు.మహిళలను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా, దేశ నిర్మాణం విస్తృత లక్ష్యానికి దోహదపడుతూ ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మహిళలప్రయాణానికి మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు.ఎస్బీఐ చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా మహిళలు సాధికారత సాధించి స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిశైలేష్ కుమార్ సింగ్ అభిలషించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతలో ఎస్బీఐ నిబద్ధతను ఆయన ప్రశంసించారు.మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి , వ్యవస్థాపకతను పెంపొందించడంలో ఎస్బీఐ RSETIలు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్‌లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్‌ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్‌బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
National Tourism Day సోలో ట్రావెల్ సో బెటర్!
పర్యటనలకు మనదేశం పుట్టిల్లు. తీర్థయాత్రలు మన సంస్కృతిలో భాగం. పర్యటన... ఒక పాఠం... రచనకు అదే మూలం. జీవన వైవిధ్యత అధ్యయనానికి ఓ మాధ్యమం. పర్యటనలు ఒత్తిడి నుంచి సాంత్వన కలిగిస్తాయి.జీవితాన్ని కొత్తగా చూడడానికి కళ్లు తెరిపిస్తాయి.అణగారిన జీవితేచ్ఛను తిరిగి చిగురింప చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్‌తో టూర్లు... ఫ్యామిలీ టూర్లు... అలాగే... మహిళల సోలో ట్రావెల్స్ కూడా పెరిగాయి. మహిళలు ఒంటరిగా పర్యటనలు చేయడానికి సందేహించాల్సిన అవసరమేలేదిప్పుడు. ప్రపంచంలో మనుషులందరినీ కలిపే భాష ఇంగ్లిష్. మనదేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా ఇంగ్లిష్ భాష వస్తే చాలు. అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లేక΄ోయినప్పటికీ మనకు అవసరమైన సమాచారాన్ని అడగగలగడం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. సేఫ్టీ, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగిస్తే మహిళలు ఒంటరిగా ప్రయాణించినా సరే ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నారు రజని లక్కా.ఆత్మవిశ్వాసం ఉండాలి, కనీసం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించి తీరాలి. బిత్తర చూపులు చూస్తే మోసగించేవాళ్లు అక్కడిక్కడే ప్రత్యక్షమవుతారు. మరో తప్పనిసరి జాగ్రత్త ఏమిటంటే సహ ప్రయాణికులతో కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే పర్యటనను ఆస్వాదించాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సోలోగా పర్యటనకు వెళ్లిన వాళ్లు ఇంట్లో వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అయితే లైవ్ లొకేషన్స్ ఇతరులకు ఎవ్వరికీ షేర్ చేయవద్దు. సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం తాపత్రయపడి టూరిస్ట్ ప్లేస్‌లో ఫొటోలు తీసుకుని గంటకో పోస్ట్ పెడుతూ ఉంటే మన కదలికలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంటాయి. మనల్ని ఎవరైనా రహస్యంగా వెంటాడుతున్నట్లయితే చేజేతులా వారికి దారి చూపించినట్లవుతుంది. పర్యటన వివరాలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో షేర్ చేయాలనుకుంటే పర్యటన పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో ఒంటరిగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు జెన్నిఫర్. మనవాళ్లకు అడ్వెంచర్ టూర్లు చేయడం కంటే నియమాలను ఉల్లంఘించడంలో సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఫొటోగ్రఫీ నిషేధం అన్న చోట ఫొటోలు తీసుకుంటారు. సెక్యూరిటీ కళ్లు కప్పి నిషేధిత ప్రదేశాల్లోకి, డేంజర్ జోన్లలోకి దొంగచాటుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరం మాత్రమే కాదు నేరం కూడా. పర్యటనను ఆస్వాదించడం కూడా ఒక కళ. ఎప్పటికీ వన్నె తగ్గని కళ. (టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)మనదేశం ప్రపంచానికి ప్రతీక కశ్మీర్లో తప్ప సోలో ట్రావెలర్‌గా మరెక్కడా నాకు ఇబ్బంది ఎదురుకాలేదు. తమిళనాడు ప్రజలు సింపుల్‌గా ఉంటారు. 76 దేశాల్లో పర్యటించిన తరవాత నాకనిపించిందేమిటంటే... ప్రపంచంలో ఉన్నవన్నీ మనదేశంలో ఉన్నాయి. మనదేశంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం బొలీవియాను తలపిస్తుంది. మన దగ్గర ఎడారులు, హిమాలయాలు, బీచ్‌లు ఒక్కొక్కటి ఒక్కోదేశంలో ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్‌ను తలపిస్తాయి. ఆర్కిటెక్చర్ పరంగా తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ కోటలకు ప్రపంచంలో మరేవీ సాటి రావు.- పొనుగోటి నీలిమ, ట్రావెలర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదీ చదవండి: ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!ట్రావెల్ లైట్... ట్రావెల్ సేఫ్ ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా పర్యటించాను. ఏడు దేశాలు కూడా చూశాను. మనల్ని మనం మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది పర్యటన ద్వారానే. సోలో ట్రావెల్ అయితే మన అభిరుచికి తగినట్లు టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు పర్యటనలకు సౌకర్యాలు బాగున్నాయి. సోలో ట్రావెల్లో అన్నీ మనమే సమకూర్చుకోవడం కష్టం అనిపిస్తే టూర్ ΄్యాకేజ్లో వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో స్థానికులతో కలిసి΄ోతున్నట్లుగా ఉండాలి. మనల్ని మనం ఎక్స్΄ోజ్ చేసుకునే ప్రయత్నం చేయరాదు. ఆ ప్రదేశానికి సరి΄ోలని వస్త్రధారణ, మాటల ద్వారా ఇతరుల దృష్టి మన మీద సులువుగా పడుతుంది. ప్రమాదాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. సోలో ట్రావెల్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ విషయంలో మాత్రమే. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, డైరెక్టర్ సురక్షితంగా వెళ్లిరావచ్చు! ఒంటరి పర్యటనలు ఆస్వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. కెనడాలో మాంట్రియల్లో నేను ప్రయాణించిన టూరిస్ట్ బస్‌లో తొమ్మిది దేశాల వాళ్లున్నారు. అంతమందిలో ఇద్దరు మినహా అంతా సోలో ట్రావెలర్సే. అయితే వెళ్లే ముందు పర్యటనకు వెళ్లే ప్రదేశం గురించి ్ర΄ాథమిక వివరాలైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెంట్, జీపీఎస్ సౌకర్యాలున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ధైర్యంగా ఒంటరి ప్రయాణాలు చేయవచ్చు. భద్రంగా వెళ్లి, సంతోషంగా తిరిగి రాగలిన పరిస్థితులున్నాయి. – రజని లక్కా, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను,గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు! -
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది. -
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మరోసారి , ఫ్యాషన్ లుక్స్ విషయంలో తన శైలిని మరోసారి నిరూపించుకున్నారు. సందర్భాన్ని బట్టి తగ్గట్టు దుస్తులను ఎంపిక చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ధరిస్తుంటారు. ఐపీఎల్, బిజినెస్ ఈవెంట్స్‌లో అటు మోడ్రన్‌గానూ, ఇటు తనకు ఎంతో ఇష్టమైన చీర కట్టునే (traditional sarees) ఎంచుకుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జరిగిన ప్రత్యేక విందులో నీతా అంబానీ అందమైన 'జామేవర్' చీరలో అంతర్జాతీయంగా అందర్నీ ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె ధరించిన చీర విశేషాలపై భారీ ఆసక్తి నెలకొంది.రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, దాతగా తనను తాను అనేక సందర్భాల్లో నిరూపించుకుంటూనే ఉన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూనే ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్నారు. ఖరీదైన చీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ యాక్ససరీస్‌కు ఆమె వార్డ్ రోబ్ పెట్టింది పేరు. ముఖ్యంగా చీరల ఎంపికలో ఆమె తర్వాతే ఎవరైనా. స్టార్-స్టడెడ్ డిన్నర్లో ఈ విషయాన్నే మరోసారి నిరూపించుకున్నారు.ఈ చీరకు 1,900 గంటలు పట్టిందిడొనాల్డ్ ట్రంప్ విందులో, నీతా అంబానీ తరుణ్ తహిలియాని కలెక్షన్లోని అందమైన జామేవర్ చీరను ధరించారు. ఇంత ప్రత్యేకమైన చీరను నేయడానికి దాదాపు 1,900 గంటలు పట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా డిజైనర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీని ప్రకారం క్లాసిక్ ఆరి వర్క్ , ఫ్రెంచ్ నాట్స్‌తో కలబోతగా దీన్ని రూపొందించారు. ఈ చీరకు కాలర్డ్ బ్లౌజ్‌తో జత చేసి 60 ఏళ్ల నీతా తన రూపానికి మరింత అందాన్ని తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Tarun Tahiliani (@taruntahiliani) నీతా అంబానీ ధరించిన ఈ బ్లౌజ్ మధ్యలో వజ్రం పొదిగిన బ్రూచ్ మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఇంకా డైమండ్ స్టడ్స్, హెయిర్ స్టయిల్, మేకప్ అన్నీ సమానంగా, అందంగా అమిరాయి అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో కూడా నీతా అంబానీ చాలా స్పెషల్‌గా కనిపించారు. ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ కాంచీపురం చీరలోహుందాగా కనిపించారు. అలాగే 200 ఏళ్ల పురాతనమైన అరుదైన భారతీయ లాకెట్టును ధరించడం విశేషంగా నిలిచింది. పింక్, గ్రీన్ బోర్డర్‌తో కూడిన నలుపు రంగు పట్టుచీరను తమిళనాడులోని దేవాలయాల శిల్ప కళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దీనికి జతగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన మోడ్రన్ బ్లౌజ్‌ను ధరించారు. దీంతోపాటు 18వ శతాబ్దపు వారసత్వ భారతీయ ఆభరణాలతో ముస్తాబయ్యారు. దక్షిణ భారతదేశంలో తయారు చేసిన 200 సంవత్సరాల పురాతన, అరుదైన స్టేట్మెంట్ నెక్ పీస్ లో పచ్చలు, భారతీయ లాకెట్టు హైలైట్‌గా నిలిచింది. చిలుక ఆకారపు ఈ లాకెట్టులో పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన రత్నాలను పొదిగి తయారు చేశారట. -
కలల ముందు అలలు చిన్నవే!
ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గంధం క్వీని విక్టోరియా గుర్తింపు పొందారు. హైదరాబాద్ వాసి అయిన విక్టోరియా ఈ నెల 19న ‘సేవ్ అవర్ ఓషన్స్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా నవతరాన్ని ప్రోత్సహించడం కోసం ముంబయి సమీపంలోని మండ్వాజెట్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు తన కుమారుడు స్టీఫెన్ కుమార్‌తో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేశారు. తల్లీ కుమారుడు కలిసి ఓపెన్ స్విమ్మింగ్లోపాల్గొనడం దేశంలోనే మొదటిసారి. సప్తసముద్రాలను పిల్లలతో కలిసి ఈదుతా అంటూ తన కలల అలలను ‘సాక్షి’తో పంచుకున్నారు.హైదరాబాద్ బర్కత్‌పురలో ఉంటున్న గంధం క్వీని విక్టోరియా గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన కలల సాధనకోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ‘‘నా పిల్లల కలలకు ఓ మార్గం వేయాలనుకున్నాను. పిల్లలు చురుగ్గా ఉండాలంటే వారికి స్పోర్ట్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో భాగంగా వారిని స్కూల్ ఏజ్‌లో స్విమ్మింగ్‌లో చేర్చాను. నేనూ వారితోపాటు స్విమ్మింగ్‌లో చేరాను. పిల్లల కోసం నేర్చుకున్న స్విమ్మింగ్ నేను ఇంగ్లిష్ ఛానెల్ ఈదేంత వరకు వెళ్లింది. గుర్తింపు వచ్చింది.విమర్శలను పక్కన పెట్టి.. చాలా మంది విమర్శించారు. ఈ వయసులో స్విమ్మింగ్ అవసరమా? అన్నవాళ్లు ఉన్నారు. గుర్తింపు కోసం చేస్తున్న తపన అని, డబ్బులు ఎక్కువయ్యాయి అని.. ఒక్కొక్కరు ఒక్కో మాట. మాది మధ్య తరగతి కుటుంబం. పెళ్లితో ఆగిపోయిన ఇంటర్మీడియెట్ చదువును కొనసాగించాను. పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీతోపాటు బీఎడ్ చేశాను. మావారు అనిల్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పిల్లల పెంపకంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో నాకు వచ్చిన కుట్టుపనితో టైలర్‌గా మారాను. మా వారి సంపాదనకు తోడుగా బొటిక్‌లో వచ్చిన ఆదాయంతో నిలదొక్కుకున్నాం.పిల్లలు మాట విన్నారు... పిల్లలతోపాటు స్విమ్మింగ్‌లో చేస్తున్నప్పుడు నీటి కాలుష్యం గురించి అనేక ఆలోచనలు వచ్చేవి. స్విమ్మింగ్ పూల్స్ నుంచి నదుల్లో ఈత వరకు నా ప్రయాణం, అటునుంచి సముద్రాలను ఈదాలనే తపనను పెంచింది. దాంట్లో భాగంగా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు వచ్చింది. సముద్రాలలో ఉండే శక్తి అర్థమైంది. ఆ ఆనందంలో ఉండగా నా పిల్లల గురించి ఆలోచన చేశాను. నేను నా ప్రయాణంలో ముందుకు వెళుతున్నాను. కానీ, నా పిల్లలు వెనకబడి పోతున్నారా.. అని ఆలోచించాను. మా అమ్మాయి ఎలిజబెత్ క్వీన్, అబ్బాయి స్టీఫెన్ కుమార్‌లను కూర్చోబెట్టి వారితో చర్చించాను. ‘సప్తసముద్రాలను మీతో కలిసి ఈదాలని ఉంది’ అన్నాను. ఇద్దరూ నా మాటలతో ఏకీభవించారు. అయితే, ఆర్థిక సమస్యలతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మా అమ్మాయి ప్రస్తావించింది. ‘సముద్రాలను ఈదాలంటే ఖర్చుతో కూడిన పని. ముగ్గురంపాల్గొంటే డబ్బు సమస్యలను ఎదుర్కోవాలి. ముందు మీ ఇద్దరుపాల్గొనండి. తర్వాత నేనూ జాయిన్ అవుతాను’ అంది. దీంతో ‘సేవ్ అవర్ ఓషన్స్’ కాన్సెప్ట్‌తో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అబ్బాయి స్టీఫెన్ కుమార్‌తో కలిసి, ఈ నెల 19న అరేబియా సముద్రంలోని మాండ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వరకు 17.1/2 కి.మీ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి, రికార్డు నెలకొల్పాం.తల్లిదండ్రులకు అవగాహనఉదయం 7 గంటల 36 నిమిషాలకు స్విమ్మింగ్ చేయడం ్రపారంభిస్తే మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకున్నాం. చివరి 800 మీటర్ల స్విమ్మింగ్ మాత్రం గంటకు పైగా సమయం పట్టింది. తల్లిదండ్రులు స్పోర్ట్స్ నుంచి వారి పిల్లలను యాక్టివిటీస్‌కు దూరం పెడుతున్నారు. వీటివల్ల ఏం లాభం అనుకుంటున్నారు. కానీ, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎలా తోడ్పడతాయో గుర్తించడం లేదు. ఆ ఆలోచన కూడా కలిగించాలనేది మరో ఉద్దేశ్యం.డిజిటల్ ప్రపంచం నుంచి బయటకుసోషల్ మీడియా నుంచి, ఒత్తిడితో కూడుకున్న చదువుల నుంచి నా పిల్లలను బయటకు తీసుకు రావాలనుకున్నాను. అది క్రీడల వల్ల సాధ్యం అవుతుందని నమ్మాను. పిల్లలతో తల్లిదండ్రులు టైమ్ గడపాలంటే ఏదో ఒకటి ఇలాంటి యాక్టివిటీ పెట్టుకోవాలి అనుకున్నాను. ముందు పిల్లల ప్రపంచంలోకి నేను వెళ్లాను. ఇప్పుడు మా ప్రపంచం ఒకటే అయ్యింది. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 4 గంటలు స్విమ్మింగ్‌కి కేటాయిస్తాం. పోటీ ఉంటే మాత్రం మరో రెండు గంటల సమయం కేటాయిస్తాం. శరీరానికి కావల్సిన శక్తి కోసం పోషకాహారాన్ని ఇంట్లోనే తయారు చేస్తాను. టైలరింగ్ చేస్తాను. పిల్లలిద్దరూ డిగ్రీ చేస్తున్నారు. వాళ్లతో కలిసి ప్రపంచంలోని ఏడు మహా సముద్రాలను ఈదాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాం. ప్రతిరోజూ నాకు వచ్చే ఆదాయంలో కొంత ఈ ఇవెంట్స్ కోసం ΄÷దుపు చేస్తుంటాను. చివరి నిమిషంలో అమౌంట్ తక్కువ పడితే మా వారి సాయం, లోన్, స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తుంటాం. మొన్న జరిగిన ఈవెంట్‌కు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్, డ్రీమాక్సిజ్ సాఫ్ట్వేర్ కంపెనీ, నా దగ్గర బట్టలు కుట్టించుకునేవారు సాయం అందించారు. రాబోయే ఏప్రిల్‌లో సౌత్ ఆఫ్రికాలోని రాబిన్ ఐలాండ్‌లో స్విమ్ చేయడానికి సాధన చేస్తున్నాం. కొందరు ఈ వయసులో అవసరమా.. అని కామెంట్ చేస్తుంటారు. సముద్రాల్లో ఈదుతూ ఉంటే ఇంటిని వదిలేసినట్టేగా అని సెటైర్లు వేస్తుంటారు. ఏ స్త్రీ అయినా వారి వయసుకు సంబంధం లేకుండా సాహసాలు చేస్తోందంటే దాని వెనక ఎన్నో కలలు, లక్ష్యాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా క్వీని విక్టోరియా అనగానే తన ఇద్దరు పిల్లలతో కలిసి సప్త సముద్రాలను ఈదింది అనే గుర్తింపు, తల్లిగా తన విజయంలో పిల్లలను ఎలా భాగస్వామ్యం చేసింది.. అనే విషయాలు అందరికీ గుర్తుకు రావాలి. తల్లిదండ్రులు చేసే కృషిని పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకుంటారో కూడా మా ఈ ప్రయత్నం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను’ అని వివరించారు విక్టోరియా.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సెకండ్ హ్యాండ్ సంపన్నులు!
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్ సావెద్ర, అనీ కోల్... మిలియనీర్లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్ ఏంజిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించుకుంటారు.పిల్లలు సెకండ్‌హ్యాండ్ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్ సావెద్ర.రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అనీ కోల్ మిలియనీర్. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో. -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
వెటరన్... ఆపేదేలేదు!
వయసు పై బడడం అంటే కలల దారులు మూసివేయడం కాదు. గంభీర ఏకాంతవాసం కాదు. క్షణక్షణం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ‘వయసు పై బడింది’ అని ఎప్పుడూ భారంగా అనుకోలేదు ఈ మహిళలు. ‘ఈ వయసులో ఆటలేమిటీ!’ అనే నిట్టూర్పు వారి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. వెటరన్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతూ నిత్యోత్సాహానికి నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నారు...ఇటీవల గుంటూరులో ఏపీ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 6వ ఏపి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో... రేస్ వాక్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న శిరీషారెడ్డి, షాట్‌పుట్, జావెలిన్ థ్రో, జంప్స్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న ఎం.లక్ష్మి, పరుగులో మూడు బంగారు పతకాలు సాధించిన వి. విజయ... ఆత్మవిశ్వాసం, నిత్యోత్సాహం మూర్తీభవించిన మహిళలు.గుంటూరుకు చెందిన విజయకు పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు దివ్యాంగురాలు. ఇళ్లలో పనిచేస్తూ, ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తె కోసం మైదానంలో అడుగుపెట్టింది. ఒక జిమ్ ట్రైనర్ సూచన ప్రకారం వెటరన్ అథ్లెటిక్స్ కోసం సాధనప్రారంభించింది. పతకాలు సాధించడం ఇప్పుడామెకు పరిన్టిగా మారింది. క్యాన్సర్ బారిన పడినప్పుడు ‘ఇక నా పని అయిపోయింది’ అని నిరాశలోకి వెళ్లిపోలేదు శిరీష. ఆ మనోధైర్యానికి కారణం...క్రీడాస్ఫూర్తి. నెల్లూరు చెందిన 71 ఏళ్ల శిరీషా రెడ్డికి ఆటల్లో గెలవడం వల్ల వచ్చినవి పతకాలు మాత్రమే కాదు. అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం తాలూకు శక్తులు!విశాఖపట్టణానికి చెందిన 86 ఏళ్ల లక్ష్మి వయసు న్తికేళ్ల దగ్గరే ఆగిపోవడానికి కారణం ఆటలు! ‘ఆటలు ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి’ అంటున్న లక్ష్మి ఆరోగ్య రహస్యం... క్రమశిక్షణ. ఆ ఉక్కు క్రమశిక్షణకు మూలం... ఆటలు.‘విరమణ అనేది ఉద్యోగానికే. ఆటలకు కాదు’ అంటున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 76 సంవత్సరాల కోటేశ్వరమ్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకుంటోంది.వెటరన్ అంటే మాటలు కాదు... గెలుపు దారిలో విరామం లేకుండా ఉత్సాహమే శక్తిగా పరుగులు తీయడమే అని చెప్పడానికి ఈ వెటరన్ అథ్లెట్లు తిరుగులేని ఉదాహరణ.– మురమళ్ళ శ్రీనివాసరావు,సాక్షి, గుంటూరు– కె.ఎస్., సాక్షి, కావలి, నెల్లూరు జిల్లాక్యాన్సర్ నుంచి బయటపడి...గత 35 ఏళ్ళ నుండి క్రీడాసాధన చేస్తున్నాను. 2011లో క్యాన్సర్ సోకింది. కొంత కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొండి ధైర్యంతో దానిని సులభంగా జయించాను. 2021లో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆటలు ఆడడం కష్టమయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడు పదుల వయసులో ఎన్నో జాతీయ స్థాయి పతకాలు సాధించాను.– ఎల్. శిరీషా రెడ్డి, నెల్లూరుకష్టాల్లోనూ నవ్వడం నేర్చుకున్నాఆరు పదుల వయసు దాటినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. అందుకే అవి చుట్టుముట్టినప్పుడల్లా నవ్వుతోనే ఎదుర్కొంటాను. ఆ నవ్వుకు కారణం ఆటలు. పదకొండు అంతర్జాతీయ వెటరన్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహా మొత్తం పదకొండు పతకాలు సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాను. ఊపిరి ఉన్నంత వరకు పోటీల్లో పాల్గొంటాను.– వి.విజయ, గుంటూరు 86 = ఎనర్జిటిక్ఉదయించే సూర్యుడు అస్తమించే వరకు తన విధి నిర్వర్తిస్తాడు. పుట్టుకకు, మర ణానికి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా నడిపించాలనేది నా సిద్ధాంతం. నేను పూర్తి శాకాహారిని. ఎక్కడ పోటీలున్నా ఒంటరిగానే వెళతాను. క్రమశిక్షణకుప్రాణం ఇస్తాను.– ఎం.లక్ష్మి, 86, విశాఖపట్నంకావాలి... ఇలాంటి శక్తిఅంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఏనుగుల కోటేశ్వరమ్మ వయస్సు 76 ఏళ్లు. అయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసమాన క్రీడా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 125, జాతీయ స్థాయిలో 115, అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు సాధించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఆటలపై ఆసక్తితో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో న్ల్గొంటూ విజేతగా నిలుస్తోంది. లక్షల రూన్యలు ఖర్చు అయ్యే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో న్ల్గొనడానికి తనకు వచ్చే పింఛన్ నగదును దాచుకొని వాటితో క్రీడాపోటీల్లో న్ల్గొంటోంది.ఆటలే ఆరోగ్యం... మహాభాగ్యంసింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జన్న్ లలో బంగారు పతకాలు సాధించినప్పటికీ, స్వీడన్ లో సాధించిన కాంస్య పతకం సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్‌లో న్ల్గొన్న క్రీడాకారులతో పోటీపడి అన్నిరకాల ప్రీ పోటీల్లో విజేతగా నిలవడంతో చివరి పోటీల్లో న్ల్గొనే అర్హత రావడమే చాలా గొప్ప విషయం. రోజూ గ్రౌండ్లోప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అందువల్లనే ఆరోగ్య సమస్యలు లేకుండా హుషారుగా ఉంటాను. – ఏనుగుల కోటేశ్వరమ్మ -
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి : అంతలోనే కన్నతండ్రి కర్కశం
అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్‌కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ)52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్‌ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్‌తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్‌లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింతలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఉపనగరాల్లో 50 చోట్ల ఆణిముత్యం (పసిబిడ్డలకు పాలిచ్చే) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపనగర జిల్లా ప్లానింగ్ కమిటీ రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అవసరమైన స్ధల సేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరం, ఉప పనగరాల్లో పాలిచ్చే కేంద్రాలు ఎక్కడ లేవు దీంతో బాలింతలు, పసిపిల్లల తల్లులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పసిపిల్లల తల్లులు, బాలింతలకు ఊరట లభించనుంది. ఆణిముత్యం కేంద్రాల నిర్వాహణ మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా)కు చెందిన సుధార్ సమితి పర్యవేక్షించనుంది. 50 చోట్ల ఆణిముత్యం కేంద్రాలు నేటి ఆధునిక సాంకేతిక యుగంలో పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్నారు. వివాహానికి పూర్వమే కాక ఆ తరువాత కూడా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమించి ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా విధులకు లేదా రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులు, లేదా ఇతర పనులు నిమిత్తం వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలింతలు, పసిపిల్లల తల్లులకు మార్గమధ్యంలో పాలిచ్చేందుకు చాటు దొరకడంలేదు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాలంటే ఎవరైన ఆకతాయిలు దొంగచాటుగా తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేస్తారని భయం. దీంతో గత్యంతరం లేక కొందరు బస్టాపుల్లో లేదా దుకాణాల వెనక, నివాస సొసైటీ కాంపౌండ్లలో చాటు వెతుక్కుని తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇది వారికెంతో ఇబ్బందికరంగా, అసౌకర్యవంతంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఆణిముత్యం కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. 125 చదరపుటడుగుల ఒక్కో ఆణిముత్యం కేంద్రానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనుంది. అందులో తాగునీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్, వాష్ బేసిన్, ఒక బెడ్డు, మూడు కుర్చీలలు, శానిటరీ ప్యాడ్ మెషీన్, గాలి, వెలుతురు ఆడేందుకు వీలుగా విశాలమైన కిటికీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ కేంద్రాల బయట సీసీ టీవీ కెమరాలుంటాయి. దీంతో సౌకర్యంతో పాటు భద్రత కూడా లభిస్తుందని జిల్లా ప్లానింగ్ కమిటీ స్పష్టం చేసింది. -
గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సెస్, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 25 నుంచి 49 ఏళ్ల మధ్య వ్యవసాయ కూలీలుగా ఉన్న గ్రామీణ మహిళల్లో 32 శాతం గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ...Hysterectomy) శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని, ఈ శస్త్ర చికిత్సలు ప్రభుత్వ బీమా పథకాల ద్వారానే జరుగు తున్నాయని వెల్లడైంది. గర్భసంచి(Uterus) తొలగింపు శస్త్ర చికిత్సలవైపు గ్రామీణ మహిళలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?! ఏ అంశాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి?! గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?! అవగాహన అవసరం...దేశంలో బిహార్, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాల్లోని గ్రామాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు స్త్రీ వైద్య నిపుణులు. వారు చెబుతున్న విషయాలేంటంటే..ఖర్చుకు భయపడి...వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత శుభ్రత తక్కువ. దీనివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, రుతు సమయంలో వచ్చే నొప్పులను ఇంటిలో పనుల కారణంగా భరిస్తున్నారు. అయితే గర్భసంచి వాపు, సిస్టులు అనగానే క్యాన్సర్ అని భయపడుతున్నారు.సమస్య తీవ్రం అయినప్పుడు హాస్పిటల్‌కు రావడం, త్వరగా నయం కాకపోవడంతో పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసి వస్తుందని, దీనివల్ల ఇంటి పనులు, కూలి పనులకు ఇబ్బందులు వస్తాయని, తమ వెంట వచ్చేవారి పని కూడా పోతుందని, టెస్టులకు, మందులకు అదనపు ఖర్చు అని.. ‘గర్భసంచి తొలగించు కుంటే’ ఈ చికాకులన్నీ పోతాయనే ఆలోచనకు వస్తున్నారు. శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాల కోసం వెతుకుతున్నారు.గర్భసంచి సమస్యలను వాయిదా వేసుకుంటూ కూలి పనులు ఎక్కువ ఉండని వేసవి కాలాన్ని ఆపరేషన్‌కు కేటాయించుకుంటున్నారు. త్వరగా పెళ్ళిళ్లు అవడం, పిల్లలు పుట్టడం, త్వరగా గర్భసంచి తొలగించుకోవడం అనేది గ్రామాల్లో కూలి పనులకు వెళ్లే వారిలో తరచూ కనిపిస్తోంది.అత్యవసర అవగాహనశుభ్రతకు సంబంధించిన అవగాహన అత్యవసరం. అధిక రక్తస్రావం సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. హార్మోన్లకు, బలానికి వాడే మందులను అందజేయాలి.తప్పనిసరై గర్భసంచి తొలగించుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మధుమేహం, బలహీనత, ఎముకల సమస్యలు... వీటన్నింటి పైనా అవగాహన కల్పించాలి.ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా ఉండటమూ దేశ భవిష్యత్తుకు కొలమానమే. వ్యవసాయ కార్మికులుగా ఉన్న మహిళలు తరచూ పురుగు మందులకు గురి కావడం వల్ల కూడా అధిక రుతుస్రావాలు, ఫైబ్రాయిడ్లు, గర్భాసంచి లోపాలు, జననేంద్రియ సమస్యలకు కూడా గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్ట్గర్భసంచి తొలగించడం వల్ల అండాలు విడుదల కాక హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకలపై ప్రభావం పడి, త్వరగా కీళ్ల సమస్యలు వస్తాయి. చాలా మందిలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల గర్భసంచి వాపు వస్తుంది. ఫైబ్రాయిడ్స్, సిస్టులు వస్తుంటాయి. అయితే అవగాహన లేక క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో గర్భసంచి తీసేయమని కోరుతున్నారు.పాప్‌స్మియర్ స్క్రీనింగ్‌తో గర్భసంచి సమస్య ఏంటో ముందే తెలుసుకోవచ్చు. దానికి తగిన మందులు వాడితే సరిపోతుంది. 40 ఏళ్ల లోపు మహిళలకు గర్భసంచి తొలగించకపోవడమే మంచిది. హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్టులు, కుటుంబం మొత్తానికి స్త్రీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. – డాక్టర్ భానుప్రియ, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నిజామాబాద్అడ్డంకిగా భావిస్తున్నారుగ్రామీణ మహిళలు ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం మందులు వాడటం, పదే పదే వైద్యులను సంప్రదించడం వారికి కష్టంగా మారుతుంది. అందుకు గర్భసంచి తొలగించుకోవడం మేలేమో అనే ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. సర్జికల్‌గా వచ్చే మెనోపాజ్ వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, చిరాకు, హాట్ ప్లషెస్.. అన్నీ ముప్పైల్లోనే కనిపిస్తాయి. – డాక్టర్ మనోరమ, మధిర, ఖమ్మం జిల్లా – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమే వనమై...
ఎస్.పి గారి డ్యూటీ నేరాలను అరికట్టడం. భూమి మీద చెట్టు చేమా లేకుండా పోయేలా మనిషి వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మించిన నేరం ఉంటుందా? దానినీ అరి కట్టాలి కదా. కామారెడ్డి జిల్లా ఎస్పీగా శ్వేత పనిచేస్తున్న కాలంలో ఒక హరిత వనాన్ని పెంచడం తన కర్తవ్యం అనుకున్నారు. ఆరు ఎకరాల్లో ఎన్నో మొక్కలు నాటించారు. ఇప్పుడది అడవిని తలపిస్తోంది. హరిత రక్షక వనంగా నామకరణం చేసుకుంది.హరితహారం స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగారు అప్పటి కామారెడ్డి ఎస్పీ శ్వేత. కామారెడ్డిలో ఆరు ఎకరాల స్థలంలో 80 రకాలైనవి ఎన్నో మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు ఆమెతోపాటు పోలీసు సిబ్బంది నిరంతరం శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మూడేళ్ల కాలంలో ప్రతీ రోజూ ఎస్పీ శ్వేత అక్కడికి వెళ్లేవారు. జరుగుతున ్న పనులను పర్యవేక్షించేవారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ అక్కడే చేసేవారు. ఈ వనానికి ‘హరిత రక్షక వనం’ అని నామకరణం చేశారు.ఎనభై రకాల మొక్కలు...స్థానికంగా పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు నాటారు శ్వేత. రామ సీతాఫలం, బాదమ్, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, నేరేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మేడి, మునగ, నిమ్మ, ఉసిరి, వెలగ, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచఉసిరి, జిట్రేగి... మొదలైన రకాలకు సంబంధించి ఎన్నో మొక్కలు నాటారు.ప్రతీ మొక్కకు నీరందించడానికి డ్రిప్ ఏర్పాటు చేశారు. అక్కడ రెండు బోర్లు తవ్వించి వాటి ద్వారా నీటిని అందిస్తున్నారు. ‘హరిత రక్షక వనం’లో రెండు నీటి గుంతలు తవ్వించారు. అందులో నీరు నిల్వ ఉండేలా వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పై భాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను పెంచుతున్నారు. నీటిని నిల్వ చేయడం మూలంగా బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఇబ్బంది లేకుండాపోయింది.ఆ శ్రమ వృథా పోలేదు...‘హరిత రక్షక వనం’లో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు శ్రమించారు. ఆ మొక్కలను తమ ఇంటి పెరట్లో నాటిన మొక్కలలాగే చూసుకున్నారు. మొక్కల చుట్టు పెరిగే గడ్డిని తొలగించడం, నీరు మొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం, పనికిరాని చెత్తను తొలగించడంలాంటి పనులెన్నో చేసేవారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తే వారితో మొక్కలు నాటించేవారు. ఆ చెట్లకు వారి పేర్లతో నేమ్ప్లేట్లు ఏర్పాటు చేశారు. ‘చెట్లు అంటే....భూమాత రాసిన కవిత్వం’ అనేది భావుకతతో కూడిన మాటే కాదు బాధ్యతను గుర్తుకు తెచ్చే మాట.వృత్తిబాధ్యత, సామాజిక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ పచ్చటి వనాన్ని సృష్టించడం కష్టమేమీ కాదు అని నిరూపిస్తున్నారు శ్వేతలాంటి అధికారులు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డిమానసిక స్థైర్యాన్ని ఇచ్చారుశాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహరాల్లో బిజీగా ఉంటూనే రకరకాల సామాజిక అంశాలపై స్పందించేవారు శ్వేత. కరోనా కాలంలో పోలీసు సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని కలిగించి ఎంతో మందికి అండగా నిలిచారు. నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించారు. శారీరక« దారుడ్య పరీక్షలకు శిక్షణ ఇప్పించారు.ఇదీ చదవండి: గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్ అమ్మలాంటి చెట్లుకామారెడ్డి జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్థలం కనిపించి నాకు వనం పెంచాలన్న ఆలోచన వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు నిర్మించినపుడు అక్కడ వాతావరణం మారిపోతుంది. చల్లబడాలంటే సమాంతరంగా చెట్లు పెంచాలి. అందుకే 2017 దసరా రోజు నేను, అప్పటి కలెక్టర్ సత్యనారాయణ గారు ఇక్కడ మొక్కలు నాటాం. కామారెడ్డికి పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా వాళ్ళతో అక్కడ మొక్కలు నాటించాను. నాటడంతోపాటు మా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ వాటి సంరక్షణకు నిరంతరం శ్రమించారు. అక్కడి ఉసిరి చెట్టు దగ్గర మా అమ్మ ప్రతీ కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. నేను బదిలీ అయినా ఒక అమ్మలా ఆ చెట్టు గుర్తుకొస్తూ ఉంటుంది. – ఎన్. శ్వేత, ఐపీఎస్ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి! -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్‌ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
వాడో వికృత జీవి, చచ్చేదాకా జైల్లోనే!
అమాయకులైన మైనర్బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..! వివరాలు ఇలా ఉన్నాయిఅది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.వసాయ్ రైలు స్టేషన్లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది. తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. -
నిన్నటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ : మహిళా ఆర్జే ఆత్మహత్య? సీఎం దిగ్భ్రాంతి!
ఎపుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయింది. తనను తాను జమ్మూ కీధడ్కన్ అని పిలుచుకునే పాపులర్ ఆర్జే సిమ్రాన్ సింగ్ తన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సోషల్ మీడియాలో స్టార్లుగా ఎదిగి, లక్షల అభిమానులను సంపాదించుకుని, ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో జీవితంలో మరో ఉదయం లేకుండా చేసుకోవడం విషాదం.గురుగ్రామ్ అద్దె అపార్ట్మెంట్లో సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకొంది. రాత్రి పదిన్నర గంటలకు ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సిమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సిమ్రాన్ మనస్తాపంతో ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కానీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. మరోవైపు ఆర్జే సిమ్రాన్ చివరి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నెల (డిసెంబర్)13న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను పోస్ట్ చేసింది. 'బీచ్ ఒడ్డున అంతులేని ముసిముసి నవ్వులతో ఉన్న అమ్మాయి' అంటూ చాలా సంతోషంగా కనిపించింది. చక్కటి ఫోటోలను పోస్ట్ చేసింది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి గుండెల్లో రగిలిన బడబానలం ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపంజమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన యంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు. సిమ్రాన్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. View this post on Instagram A post shared by RJ SIMRAN (@rjsimransingh) సిమ్రాన్ ఆత్మహత్య వార్త దావానలంలా వ్యాపించడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. ఏమైంది, ఎందుకు ఇంత పనిచేసింది, అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నంత మాత్రాన, వారి జీవితాల్లో ఆనందం ఉన్నట్టు కాదు.. వాస్తవం మరోలా ఉంటుందనే విషయాన్ని ఆమె నిష్క్రమణ రుజువు చేసిందంటూ మూడో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం.