UNEP అంబాసిడర్‌, నటి లగ్జరీ కారు చూశారా? ధర ఏంత? | Bollywood Actress Dia Mirza Buys BMW iX Electric SUV Worth Rs 1.39 Crore, Check Out Other Details Inside | Sakshi
Sakshi News home page

UNEP అంబాసిడర్‌, నటి లగ్జరీ కారు చూశారా?

Jun 12 2025 2:30 PM | Updated on Jun 12 2025 3:41 PM

Bollywood Actress Dia Mirza Buys BMW iX Electric SUV Worth  Rs 1.39 Crore

బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) తన ఖరీదైన కార్ల లిస్ట్‌లో మరో  లగ్జరీ కారును జోడించింది.  లగ్జరీ కంపెనీ బీఎండబ్లయూ​కి చెందిన ఈ ఎలక్ట్రిక్‌   కార్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 635 కి.మీ. దూసుకుపోతుందట. మరీ దీని ఖరీదెంత?  ఆమె గ్యారేజీలో ఇంతకుముందున్న కార్ల లిస్ట్‌ ఏంటి?

బాలీవుడ్ ప్రముఖులు నెమ్మదిగా లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ  జాబితాలో ఇపుడు దియామీర్జా చేసింది.  భారత మార్కెట్లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా పేరొందిన,  రూ.1.39 కోట్ల (ప్రారంభధర) విలువైన BMW iX ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసింది.  దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్) అంబాసిడర్ దియా  గ్యారేజీకి సరిగ్గా సరిపోయేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్‌.

BMW  బ్రాండ్‌పై  దియాకు చాలా ప్రేమ ఉన్నట్టే కనిపిస్తోంది.  ఎందుకంటే ఆమె లగ్జరీ కార్ కలెక్షన్‌లో BMW X3,BMW X5 కూడా ఉన్నాయి. భారతదేశంలో BMW X3, ధర సుమారు రూ.45 లక్షలు. 2013లో గుర్గావ్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో BMW X1ని లాంచింగ్‌  ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ వెహికల్‌  ప్రౌడ్‌ ఓనర్‌గా ప్రకటించుకుంది.  ఇంకా గ్యారేజీలో   లెక్సస్ LX 570 , ఆడి Q7 వంటి ఇతర హై-ఎండ్ SUVలు కూడా ఉన్నాయి.  

చదవండి: ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?

దియా మీర్జా కొత్త EVలో 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్,14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను,కర్వ్డ్ డిస్‌ప్లే లాంటి  స్పెషల్‌  ఫీచర్స్‌తోపాటు,  ఎలక్ట్రోక్రోమిక్ పనోరమిక్ గ్లాస్ రూఫ్ , మెమరీ ,మసాజ్ సామర్థ్యాలను అందించే మల్టీ-ఫంక్షనల్ సీట్లు ఉన్నాయి.   195 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి దాదాపు 35 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, 50 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి 97 నిమిషాల్లో, 22 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి దాదాపు 5.5 గంటల్లో, 11 kW AC ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు 11 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జ్‌పై 425 కి.మీ ప్రయాణించగలదట.బ్లాక్ సఫైర్ మెటాలిక్ కలర్‌లో ఈ కారులో లోపలి భాగం కాస్టానియా చెస్ట్‌న,నలుపు రంగుల క్లాసిక్ డ్యూయల్-టోన్ షేడ్స్‌లో ఉంది  ఈ కారు. 

రితేష్‌ దేశ్‌ముఖ్‌,నుష్రత్ భరుచ్చా ,ఇబ్రహీం అలీ ఖాన్ వంటి  నటులతోపాటుగా , కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా  ఈ లగ్జరీ కారు  సొంత చేసుకున్నారు. 

ఇదీ చదవండి: To day recipes : మోకాళ్ల నొప్పులకు బెస్ట్‌ ఇది, మరి జీర్ణశక్తికి!

 

Advertisement
 
Advertisement
Advertisement