19 ఏళ్లకు వెదుక్కుంటూ వచ్చిన అదృష్టం, వేలమందికి విందు | Haryana Couple Celebrates Daughters Birth After 19 Years With Feast For Thousands | Sakshi
Sakshi News home page

19 ఏళ్లకు వెదుక్కుంటూ వచ్చిన అదృష్టం, వేలమందికి విందు

Aug 18 2025 4:23 PM | Updated on Aug 18 2025 5:33 PM

Haryana Couple Celebrates Daughters Birth After 19 Years With Feast For Thousands

హర్యానా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, లింగ నిష్పత్తితో చాలా  వెనుకబడి ఉన్న రాష్ట్రం.  ఈ ప్రాంతంలో లింగ నిష్పత్తి చాలా కాలంగా సామాజిక సవాలుగా ఉంది; 2024లో 1,000 మంది పురుషులకు 910 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంతో సహా అనేక కార్యక్రమాల అమలుపై ఎక్కువ దృ‍ష్టిపెట్టారు. అయితే ఇటీవల అక్కడ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 

హర్యానాలోని జింద్‌లోని తువా గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత ఆడబిడ్డ పుట్టడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.చుట్టుపక్కల 21 గ్రామాల నుండి 8 వేల మందితో గొప్ప విందును ఏర్పాటు చేశారు.సురేంద్ర , కృష్ణ దంపతులకు పెళ్లైన 19 ఏళ్లకు ఆడబిడ్డకు జన్మనించారు. పాపాయి  భూమి దేవి అని పేరు పెట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమ ఇంట్లో పాపాయి పారాడటంతో  వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు


 

ఇక తమకు పిల్లలు పుట్టరని భావించి, భర్త మేనల్లుడిని దత్తత తీసుకున్నారు.  ఆ వేళా విశేషమో ఏమో కానీ కానీ జూలైలో, ఎలాంటి వైద్య చికిత్స తీసుకోకుండానే అద్భుతం జరిగింది. సాధారణంగా అబ్బాయి పుట్టినపుడు నిర్వహించే బావిపూజను ఘనంగా నిర్వహించారు.   గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల 8 వేలమందికి విందును ఏర్పాటు చేశారు. తువా, తపా ఖాప్‌లతో సహా 25 ఖాప్‌ల నుండి సర్పంచ్‌లు నవజాత శిశువును ఆశీర్వదించడం విశేషం.  హర్యానా గ్రామీణ ప్రాంతంలో ఆలోచనలను మార్చే దిశగా ఒక అడుగుగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది ప్రశంసించారు. "మా కుమార్తె ఒక వరం, కొడుకు పొందే ప్రతి గౌరవానికి ఆమె అర్హురాలు ఈ సందేశాన్ని చాటాలనుకున్నాం అందుకే  ఈ విందు" అని  తండ్రి సంతోషంగా చెప్పారు.   మా సొంత బిడ్డ పుట్టడం  మా జీవితాల్లో  వర్ణించలేని ఆనందం.. అలాగని దత్తత కొడుకు మీద ప్రేమ ఏ మాత్రం తగ్గదు అంటూ తల్లి చెప్పింది.

ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్‌ కపుల్‌.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement