SITHA APP మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం | Minister duddilla sridhar babu Farmally Launched The Sita App Logo | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం

Jun 10 2025 11:44 AM | Updated on Jun 10 2025 12:17 PM

Minister duddilla sridhar babu Farmally Launched The Sita App Logo

‘సీత’యాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ బాబు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా సాధికార తను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని, ఇప్ప టికే ఆ దిశగా ప్రయాణం మొదలైందని చెప్పారు. సోమవారం హైటెక్‌ సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌లో ‘షీ జాబ్స్‌’ఆధ్వర్యంలో రూపొందించిన ‘సీత’(షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌ SITHA)’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కుటుంబాల్లో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకుని నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఆ దిశగా ఇంటి నుంచే మొదటి అడుగు పడాలి. 

కేంద్ర గణాంక శాఖ భారత్‌లో పురుషులు, మహిళలు – 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86%, పట్టణాల్లో 89% మంది మహిళలు భాగస్వాములవుతున్నారు. మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తు న్న తెలంగాణ విజయగాథ ఇది’అని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ‘ఇందిరా మహిళా శక్తి మిషన్‌ 2025’కు శ్రీకారం చుట్టి, 17 రకాల వ్యాపారాల్లో వారిని పారిశ్రామిక వేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

మహిళా సంఘాలకు తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 31 జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకుల ప్రారంభానికి చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’అని వివరించారు. 

‘సీత’యాప్‌ మహిళల ఉత్పత్తు లకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. కార్య క్రమంలో ప్రముఖ సినీనటి శ్రీలీల, సినీ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్, షీ జాబ్స్‌ నిర్వాహకురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement