
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తప్పుడు సమాచారం
ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాలతో మహిళలకు అనారోగ్య సమస్యలు
‘ఎవర్‌టీన్ మెన్‌స్ట్రువల్ హైజీన్ సర్వే’లో వెల్లడి ‘ఎవర్‌టీన్ మెన్‌స్ట్రువల్ హైజీన్ సర్వే’లో వెల్లడి
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తప్పుడు సమాచారం
ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాలతో మహిళలకు అనారోగ్య సమస్యలు
‘ఎవర్‌టీన్ మెన్‌స్ట్రువల్ హైజీన్ సర్వే’లో వెల్లడి
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగామ్, వా ట్సాప్ తదితర వేదికలపై లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చాలామంది నిపు ణులు సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. డాక్టర్లు సైతం తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ సమాచారం ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ల ముసుగులో కొందరు మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్న సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది.
భారత్‌లో నెలసరికి (పిరియడ్స్) సంబంధించిన వివరాలు, సలహాల కోసం మహిళలు సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం మహిళల నెలసరి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు వెల్లడయ్యింది. అందుకే మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బుధవారం ‘మెన్‌స్ట్రువల్ హైజీన్ డే’(Menstrual Hygiene Day). ఈ నేపథ్యంలో మహిళల నెలసరి ఆరోగ్యంపై ఇటీవల ‘ఎవర్‌టీన్ మెన్‌స్ట్రువల్ హైజీన్ సర్వే’నిర్వహించారు. సర్వేలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 1,152 మంది మహిళలను ప్రశ్నించారు. వీరిలో 72.4 శాతం మంది 19 నుంచి 35 ఏళ్లలోపువారే ఉన్నారు. 76.6 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
ఈ సర్వేలో ఏం తేలిందంటే.
నెలసరికి సంబంధించిన సోషల్ మీడియాలో తగినంత సమాచారం అందుబాటులో ఉన్నట్లు 71.6 శాతం మహిళలు నమ్ముతున్నారు.
ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. పిరియడ్స్ గురించి ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తున్నారు. నెలసరి శుభ్రతపై వారు చక్కటి అవగాహన కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు.
మెన్‌స్ట్రువల్ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం 11.5 శాతం మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు.
తప్పుదోవ పట్టించే లేదా ప్రమాకరమైన సమాచారం సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీనవల్ల తాము శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు మహిళలు చెప్పారు.
పిరియడ్స్ ఆలస్యం కావడం అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్(పీసీఓడీ)కు సంకేతమని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. (పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్)
నెలసరి సమయంలో నొప్పి అధికంగా ఉంటే నిమ్మరసం లేదా కాఫీ తాగాలన్నది కొందరి సలహా. కానీ, అలా చేస్తే నొప్పి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. (వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా)
నెలసరి వచ్చినప్పుడు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఆ సమయంలో వ్యాయామం చేస్తే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి.
నెలసరిలో విడుదలయ్యే రక్తం అపవిత్రమైందని, ఆ సమయంలో దేవాలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లో పచ్చళ్లు కూడా ముట్టుకోవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికే సమాజంలో పాతుకుపోయింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి మూఢవిశ్వాసాలను మరింత పెంచేస్తున్నారు. కొత్తకొత్తవి జోడిస్తూ మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు.
పీరియడ్స్ వచ్చినప్పుడు ఫలానా ఆహారం తీసుకోవాలని లేదా తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నెలసరి సమయంలో భాగస్వామితో కలిస్తే గర్భం రాదు అనేది తప్పుడు అభిప్రాయమేనని నిపుణులు అంటున్నారు.
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో కచి్చతత్వం, వాస్తవాలతో కూడిన, నిర్ధారించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాన్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ చిరాగ్‌పాన్ సూచించారు.
నెలసరి శుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు 87.8 శాతం మంది చెప్పారు. 5.7 శాతం మంది డిస్పోజబుల్ పిరియడ్ ప్యాంటీస్, 4.7 శాతం మంది మెన్‌స్ట్రువల్ కప్స్, 1.6 శాతం మంది టాంపోన్స్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.