
ఇటీవలి కాలంలో భర్తలపై భార్యల హత్యాకాండలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అలాగే మహిళపై హింసకు వ్యతిరేకంగా, రక్షణకోసం తీసుకొచ్చిన గృహహింస చట్టం, 498ఏ చట్టాలు దుర్వినియోగ మవు తున్నాయనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు బాధితులుగానే ప్రపంచానికి తెలిసిన మహిళా లోకం ఎందుకు తిరగబడుతోంది? ఎందుకు ఇలా వికృతంగా మారుతోంది అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక మహిళ స్టోరీ నెటిజన్లను తీవ్రంగా కదిలిస్తోంది. అదేంటో తెలుసుకుందామా!
రెడ్డిట్‌లో మర మహిళ పోస్ట్ ప్రకారం ఈ స్టోరీలోని మహిళది ప్రేమ వివాహం , ఇద్దరు పిల్లలు. చక్కగా సజావుగా సాగుతున్న కాపురమే. కానీ ఆమె భర్తతో జరిగిన చిన్న గొడవ , ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆమె క్షణికావేశాన్ని తండ్రి , సోదరుడు వాడుకున్నారు. భర్త మీద వరకట్నం, గృహ హింస కింద కేసు నమోదు చేయమని ఆమెను బలవంతం చేశారు. ఈమె కూడా మరేమీ ఆలోచించకుండా భర్తపై తప్పుడు కేసు పెట్టింది. విచారణల అనంతరం నాలుగేళ్లకు ఇరువురూ విడి పోయారు. కానీ భర్తతో విడిపోయే దాకా ఆమెను రెచ్చగొట్టిన సొంత తల్లిదండ్రులు, సోదరుడు, భార్య ఇప్పుడు ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పడుగానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. అసలు విషయం తెలిసి వచ్చి.. తప్పు చేశానని పశ్చాత్తాపడింది. భర్తకు క్షమాపణ చెప్పాలని ఆలోచించింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 37 ఏళ్ళ వయసులో ఆమె భర్త మళ్లీ వివాహం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు
“నా భర్త వద్దకు వెళ్లి అతనిపైనా, అతని కుటుంబంపైనా పెట్టిన అన్ని కేసులకుగాను క్షమాపణ చెప్పాలని అనుకున్నాను. కానీ అతను వివాహం చేసుకున్నాడు. జీవితంలో పూర్తిగా ఫెయిలయ్యాను” అని ఆ మహిళ రాసుకొచ్చింది. దీనిపై నెటిజనులు మిశ్రమంగా స్పందించారు. జరిగిన విషయంపై మహిళకు సానుభూతి తెలిపారు. ‘ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది, ధైర్యంగా ఉండండి’ అని ఒకరు ధైర్యం చెబితే, మరొకరు అన్యాయంగా కష్టాలు పడ్డ భర్తపై సానుభూతి వ్యక్తం చేశారు.
‘మీకు తోడు నీడగా, కంఫర్ట్ జోన్‌గా ఉండాల్సిన భర్తను చాలా బాధపెట్టారు. గాయపరిచారు. పగవాళ్లకి కూడా మీ భర్తలాంటి కష్టం రాకూడదు’ అని మరొకరు కమెంట్ చేశారు. బంధువులు కాదు రాబందులు అంటూ ఒకరు, తల్లిదండ్రులు తోబుట్టువులను తప్పుబట్టారు. దగ్గరి బంధువులెవరైనా ఇంత మోసపూరితంగా ఎలా ఉంటారు అసలు? అంటూ మరి కొందరు వారి కుటుంబ సభ్యులను నిందించారు.
చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
“భారతీయ భర్తలూ/పురుషులూ : ఇటువంటి మోసగాళ్లనుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్న ఒక యూజర్ వ్యాఖ్య వైరల్‌గా మారింది.
తప్పుడు కేసులు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 మహిళలపై నేరాలను పోలీసుల డేటా ప్రకారం, మొత్తం 34,662 కేసులు తప్పుడు కేసులుగా తేల్చారు. ఇందులో భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత్వం కింద 7,076 కేసులు, అత్యాచారం కేసులు 4,340 మరియు మహిళలపై దాడి కింద 6,821 కేసులు ఆమె నమ్రతను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉన్నాయి. అలాగే, కిడ్నాప్ మరియు అపహరణ కింద 8,588 కేసులు కూడా తప్పుడు కేసులుగా ముగిశాయి.
ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!