
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రత్యేకతే వేరు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన కమ్ అండ్ సే ‘జీ’డే రూ.1137 కోట్ల భారీ ప్రచారానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.
చిన్న చిన్న క్రియేటివ్ మూమెంట్స్‌తో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఇన్‌స్టాలో సందడి చేస్తోంది. ఆత్మ , మనస్సు రెండింటినీ ఉత్తేజపరుస్తూ కొత్త అభిరుచిని కనుగొంది. ‘‘ఫైండ్ సారా ఎ న్యూ హాబీ" అనే ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌లో సారా టెండూల్కర్ తన ఖాళీ సమయంలో ఉత్తేజకరమైన మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే హాబీని ప్రదర్శించింది.
సారా రగ్ టఫ్టింగ్‌లో తన టాలెంట్‌ను పరీక్షించుకుంది. ఆకుపచ్చ రంగు నూలును ఎంచుకుని టఫ్టింగ్ ద్వారా పావ్ ప్రింట్ రగ్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. టఫ్టింగ్ పూర్తైన తరువాత జిగురుతో అంటించింది కూడా. రగ్ టఫ్టింగ్ పూర్తి చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట్ సందడిగా మారింది.
చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
రగ్ టఫ్టింగ్ అంటే ఏమిటి
టఫ్టింగ్ అనేది ఒక టెక్స్‌టైల్ టెక్నాలజీ. టఫ్టింగ్ గన్‌ను ఉపయోగించి నూలుతో కాన్వాస్ మీద కుట్టడం. వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల, టఫ్టింగ్ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, నూలు చిక్కుకుపోవడం, లేదా కాన్వాస్ చిరిగిపోవడం వంటివి జరగవచ్చు. టఫ్టింగ్ తర్వాత, రగ్గును శుభ్రపరచడం, అంచులు కత్తిరించడం, ఇతర మెరుగులు పెట్టడం కూడా ముఖ్యమైనవి. ఇందులో విభిన్న అల్లికలు, మోడల్స్ ఉంటాయి.
టఫ్టింగ్ ప్రక్రియ ఒక ఫౌండేషన్ ఫాబ్రిక్‌ను ఫ్రేమ్‌పై గట్టిగా సాగదీయడంతో ప్రారంభమవుతుంది. ఆపై ఒక డిజైన్ ఫాబ్రిక్‌పైకి మారుస్తారు. కావలసిన డిజైన్స్ కట్స్ చేస్తారు. చివరగా, రగ్ వెనుక భాగంలో రబ్బరు పాలు జిగురుతో అంటిస్తారు. టఫ్టింగ్‌కు అవసరమైన కొన్నిప్రాథమిక సాధనాల్లో టఫ్టింగ్ గన్, నూలు, టఫ్టింగ్ ఫ్రేమ్,బ్యాకింగ్ ఫాబ్రిక్, అంటుకునే, చెక్కే సాధనాలు, షీరింగ్ కోసం కత్తెర తదితర టూల్స్ అవసరం.
ఇదీ చదవండి: ఒకే ఒక్క టిప్‌తో స్లిమ్‌గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం