
ట్రాన్స్‌జెండర్
‘మాట్లాడితే నవ్వు. నడిస్తే నవ్వు. నా జీవితం నవ్వుల పాలైంది’ అంటూ నిరాశ చీకట్లో అనీ మంగుళూరు మగ్గిపోయి ఉంటే... ఎంతో మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది కాదు. భిక్షాటన స్థాయి నుంచి అయిదు ఆటోల యజమాని స్థాయికి ఎదిగిన అనీ ఇతరులకు ఉపాధి ఇవ్వడంతో పాటు ట్రాన్స్‌జెండర్ వృద్ధులకు అండగా ఉంది.
కర్నాటకలోని రాయచూర్‌లో పేదింట్లో పుట్టిన అజిబాబు మాటతీరు, నడక అమ్మాయిలను పోలి ఉండేవి. దాంతో స్కూల్ రోజుల నుంచి వెక్కిరింపులు, అవమానాలు కొత్త కాక΄ోయినా మంగుళూరులో డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ఎదుౖరైన చేదు అనుభవాలు తనకు చదువును దూరం చేశాయి. చదువును మధ్యలోనే వదిలేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చేరాడు.
జెండర్ చేంజ్ సర్జరీ తరువాత అనిబాబు అనీ మంగుళూరుగా మారింది. సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం అయింది. ఉద్యోగం దొరకడం గగనం అయింది. గత్యంతరం లేక భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అమ్మ ఇచ్చిన కొద్దిమొత్తంతో ఆటో కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టింది అనీ. ఆటో కొనడం తన జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. మరో మూడు ఆటోలు కొనేస్థాయికి, ఇతరులకు ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగింది.
అయినప్పటికీ ‘ఇక నాకు ఎలాంటి కష్టాల్లేవు’ అనుకోలేదు అనీ. కష్టాల్లో ఉన్న ట్రాన్స్‌జెండర్‌లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.అనీ నటి కూడా. ‘శివలీల’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే అనీ ఇప్పుడు జిమ్ ట్రైనర్‌గా మారింది.ట్రాన్స్ జెండర్ వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలనేది అనీ లక్ష్యం
ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది