
సాక్షి, హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్‌లో ప్రత్యేక బ్రంచ్ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్ హోటల్ లోని ఫీస్ట్ రెస్టారెంట్‌లో విత్ లవ్ మమ్స్ కిచెన్ థీమ్‌తో ప్రత్యేక బ్రంచ్. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్‌డే ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
హైటెక్ సిటీలోని ది వెస్టిన్ హోటల్‌లో సీజనల్ టేస్ట్స్ రెస్టారెంట్‌లో కాంటినెంటల్, నార్త్ ఇండియన్, ఇటాలియన్ వంటకాలతో ప్రత్యేక డైనింగ్ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో మదర్స్ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్ డే థీమ్‌తో పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.
కాలిఫోర్నియా ఆల్మండ్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్ గిఫ్ట్ ప్యాక్స్‌ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్‌లైన్ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పలు వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.