
పుణ్యకార్యాలు, శుభకార్యాలు, ఆచారాలు, ప్రయాణాలు ఇలా అనేక కారణాలతో పీరియడ్స్ లేదా నెలసరిని వాయిదా (delay period pills) వేయడానికి కొన్ని మందులు వాడతారు. అయితే ఋతుచక్రాన్ని వాయిదా వేసే మాత్రలవల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే పీరియడ్స్ సురక్షితంగా ఆపడం ఎలాగో తెలుసుకోవాలి. వీటివల్ల తలెత్తే ప్రమాదాలను కూడా ముందు అర్థం చేసుకోవాలి.
రీబూటింగ్ ద బ్రెయిన్ అనే ఇనస్టా పేజ్‌లో డాక్టర్ వివేకానంద్,డాక్టర్ శరణ్ శ్రీనివాసన్‌తో ఇటీవల ఒక హృదయ విదారకమైన కథను పంచుకున్నారు. దీని ప్రకారం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి పీరియడ్ ఆలస్యానికి మందులు వాడి ప్రాణాలు కోల్పోయింది. ఒక పూజ కోసం మాత్రలు తీసుకోవడం ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఆమె పూజ అయితే పూర్తి చేసింది కానీ కాళ్ళు ,తొడ నొప్పి, తీవ్రమైన అసౌకర్యం లాంటి లక్షణాలతో ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. అస్పత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు పట్టుబట్టినప్పటికీ, తల్లి మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయువతి ప్రాణాలు కోల్పోయింది. క్లిష్టమైన క్షణాల్లో జాప్యం కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందంటూ బాధాకరమైన జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
అసలేంటీ పిల్స్
మెన్‌స్ట్రువల్ సైకిల్‌ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నియంత్రిస్తాయి. నెలసరిని వాయిదా వేసే మాత్రలు హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క సింథటిక్ రూపమైన నోరెథిస్టెరాన్‌ను కలిగి ఉంటాయి.
వీటి వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలు
- వికారం లేదా జీర్ణ సమస్యలు: తేలికపాటి కడుపు నొప్పి లేదా ఉబ్బరం
- రొమ్ములో నొప్పి,హార్మోన్ల మార్పులు వాపు లేదా అసౌకర్యానికి కారణం కావచ్చు
- తలనొప్పి , తలతిరగడం: తరచుగా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరగవచ్చు.
- చిరాకు, ఆందోళన లేదా తేలికపాటి నిరాశలాంటి మానసిక స్థితిలో మార్పులు సంభవించవచ్చు
- ఎక్కువ కాలం తీసుకుంటే అధిక రక్తస్రావం.
అరుదైన తీవ్రమైన ప్రభావాలు
- రక్తం గడ్డకట్టే ముప్పు రావచ్చు. ముఖ్యంగా గడ్డకట్టే రుగ్మతలు, ఊబకాయం లేదా ధూమపాన అలవాట్లు ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువ.
దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అలెర్జీ సమస్యలు రావచ్చు. ఇలాంటివి సంభవిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరం కావచ్చు.
ఈ మాత్రలను గర్భనిరోధకంగా ఉపయోగించకూడదు. ఇవి గర్భధారణను నిరోధించవు.
సుదీర్ఘ కాలం..సాధారణంగా 5–14 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు.
సాధారణం ఈ మందు వాడటం అపివేసిన తరువాత ఈ ప్రభావాలు తగ్గిపోతాయి. అలాగే సాధారణంగా ఋతుస్రావం 2–4 రోజుల్లో తిరిగి ప్రారంభమవుతుంది. కానీ పక్షంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం
ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్టు, లాపరోస్కోపిక్ సర్జన్ డా. పూజిత సురానేని ఏమంటారంటే..
ప్రిమోలుట్ఎన్ (నోరెథిస్టెరాన్ అధిక రక్తస్రావం, బాధాకరమైన పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ , ఎండోమెట్రియోసిస్ వంటి ఋతు రుగ్మతల చికిత్సలో వాడతారు. ఈ ఔషధం కృత్రిమంగా పెరిగిన ప్రొజెస్టెరాన్ స్థాయిలను నిర్వహించడం ద్వారా ఋతుస్రావాలను వాయిదా వేస్తుంది. అయితే దీన్ని ఋతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి తరచుగా లేదా సాధారణం ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే ఇది సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో పీరియడ్ సైకిల్‌ను ప్రభావితం చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా అధిక రక్తస్రావానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, పదేపదే వాయిదా వేయడం వల్ల తలనొప్పి, రొమ్ము నొప్పి, వికారం వంటి ప్రతికూల ప్రభావాల ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక వాడకంతో, రక్తం గడ్డకట్టడం, కాలేయ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా థ్రాంబోసిస్, కాలేయ వ్యాధి లేదా తీవ్ర రక్తస్రావం చరిత్ర ఉన్న మహిళల్లో విరుద్ధంగా ఉంటుంది. అందుకే వీటిని వాడేముందు నిపుణులైన గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలని కోరుతున్నారు.
చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!