Palnadu
-
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పనిచేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం, లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. కేవలం నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్‌వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన సతీమణి ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధా, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొనడంతో ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసంమైంది. కారులోని ఇరువురికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
పొట్టకూటి కోసం వచ్చి అనంత లోకాలకు..
సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇరువురు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు ఢీకొని కూలీ మృతి.. మరొక వ్యక్తికి తీవ్రగాయాలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్‌లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం జరిగిన నియోజకవర్గస్థాయి మహానాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా రేషను పంపిణీ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్ తెనాలి: రాష్ట్రప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే సరకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ముగ్గురికి గాయాలు నాదెండ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు, గణపవరం పరిధిలో జాతీయ రహదారిపై భారత్‌గ్యాస్ గోడౌన్ వద్ద గణపవరం నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కారసాల సుబ్బారావు, నాగజ్యోతి, ఆటోడ్రైవర్ పల్లపు వెంకటేశ్వర్లు గాయాలపాలయ్యారు. నాగజ్యోతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, మిగతా ఇద్దరు క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయ జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి రామనామ సంకీర్తనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను ఆలయ పండితులు బొర్రా వెంకట అనంతచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రసన్నాంజనేయుని మాలధారులు వారి ఇళ్ల వద్ద నుంచి భజన కార్యక్రమాలతో గ్రామోత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని ఆలయం వద్దకు వచ్చి ఇరుముడులు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం.. ఆనందం
నరసరావుపేట: ప్రపంచానికి మనదేశం అందించిన గొప్ప విద్య యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పిలుపునిచ్చారు. రోజుకు 30 నిముషాలు యోగాకు కేటాయించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. జూన్ 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నెలరోజుల యోగాంధ్ర మాసోత్సవం బుధవారం సాయంత్రం స్థానిక డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో వందలాది మందితో యోగా చేయడం ద్వారా జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి నెలరోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 30 రోజుల పాటు యోగా సాధన చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారుతుందనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. భావోద్వేగాలు అదుపులో.. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా మానసిక బలహీనతలు, ఉద్వేగాలు, ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. యోగా సాధకులలో ఆత్మహత్యలు, అత్యాశతో అక్రమాలు చేయడం, దుర్బుద్ధితో వ్యవహరించడం కనిపించదన్నారు. యోగాంధ్ర వంటి సామూహిక యోగా కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగాసనాలు వేయడంపై శిక్షణ ఇచ్చిన ప్రముఖ యోగా ప్రచారకులు కూనంశెట్టి వెంకట జనార్ధన్, యోగా బోధకులు ఆనంద రాముడు, డైట్ అధ్యాపకుడుఅజయ్ కుమార్‌లను శాలువాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు సత్కరించి అభినందించారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జిల్లాలో యోగాంధ్ర లాంఛనంగా ప్రారంభం -
ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.39 నిమిషాలకు కూడా మద్యం విక్రయిస్తున్నారు. బార్‌కు ఉన్న ప్రధాన షట్టర్‌కు చిన్న షెట్టర్‌ను అమర్చి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మరో బార్ అండ్ రెస్టారెంట్లో ఏ క్షణాన కావాలన్నా మద్యం దొరుకుతుందన్న విషయం బహిరంగ రహస్యం. అర్ధరాత్రి దాటాక 2.53 నిమిషాలకు కూడా, పక్కన ఉన్న సన్న సందులో నుంచి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. బార్‌కు పక్కనే ఉండే మరొక బార్లో ‘మోడ్రన్’గా ఒక వాచ్‌మెన్‌ను పెట్టి 3.05 నిమిషాలకు కూడా విక్రయాలు జరుపుతున్నారు. అదే కొద్దిగా దూరంలో ఓల్డ్‌క్లబ్ రోడ్డు మూలన ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అసలు టైంతో పనే లేదు. ఎప్పుడు కావాలన్నా ఇంటికి వచ్చి వెళ్లినట్టే ఉంది పరిస్థితి. పట్నంబజారు(గుంటూరు తూర్పు): అర్ధరాత్రి సమయాల్లో సైతం షెట్టర్ కొడితే చాలు తలుపులు నిస్సంకోచంగా తెరుచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా సాగుతున్నా... అనధికారిక పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు అవుతున్నా.. పట్టించుకునే నాథుడు కాదు కదా.. కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుంటూరు నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మొత్తం 37 వైన్స్ దుకాణాలు, 64 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్నిచోట్లా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలు 24/7గా మారాయి. మద్యం మత్తులో గొడవలు దీంతోపాటు గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కూడా మందుబాబులకు 24 గంటలూ సేవలను అందిస్తోంది. వెస్ట్ పరిధిలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న పెద్ద బార్ అండ్ రెస్టారెంట్వారు కస్టమర్లను బార్ వెనుక గార్డెన్లో కూర్చొబెట్టి మరీ తాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బార్లో సైతం మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో అనేక వివాదాలు చెలరేగి అర్ధరాత్రి పూట దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. నందివెలుగు రోడ్డులోని ఉన్న రెండు బార్ల పరిస్థితి ఇక చెప్పా ల్సిన పనే లేదు. మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లు.. అనే చందంగా ముందుకు సాగుతున్నాయి. వైన్స్ దుకాణాలలో కంటే బార్లలో క్వార్టర్‌కు రూ.60 అధికంగా తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రూ.100కుపైగానే అధికంగా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా అధికారులు అర్ధరాత్రి వేళ బార్లు, వైన్స్‌ల్లో మద్యం అమ్మకాలు బహిరంగ రహస్యమే అన్నట్లు పరిస్థితి మారింది. ఈ విషయం పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటీకీ తమకేమీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మద్యం షాపులకు సంబంధించి కొంత మంది కూటమి నేతలు సిండికేట్‌గా ఏర్పడి వైన్స్ దుకాణాల వారి నుంచి రూ.12 వేలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్ద రూ.15వేలు చొప్పున వసూలు చేసి ఆయా పోలీసుస్టేషన్ అధికారులు, ఎకై ్సజ్ సిబ్బందికి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో ఆయా స్టేషన్ల మఫ్టీ పార్టీ కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్‌లో కొత్తగా అనధికారిక పర్మిట్ రూమ్‌కు రిబ్బన్ కట్ చేశారు. కొద్ది కాలం క్రితం వరకు పక్కనే ఉన్న బడ్డీకొట్లలో యథేచ్ఛగా తాగేవారు. ఇప్పుడు బహిరంగ మద్యపానం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేరుగా గోడ పగులకొట్టి మరీ పర్మిట్ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ పక్కనే ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంది. అదే క్రమంలో బైపాస్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీస్, పలు కళాశాలల విద్యార్థినులు ఇటుగానే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నిర్వాహకులు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌కు తెరలను అడ్డుకట్టి మరీ తాగించేస్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 2.34 నిమిషాల సమయంలో సైతం మందుబాబులు ఇక్కడి రోడ్డుపై యథేచ్ఛగా తాగేస్తున్నారు. దీంతోపాటు వెనుక భాగంలో, వైన్స్ ఉన్న డాబా పైభాగంలో అడ్డూ అదుపు లేకుండా పర్మిట్ రూములు పెట్టారు. ఈ క్రమంలోనే నందివెలుగు రోడ్డులో అనేక వివాదాల మధ్యన ఏర్పాటు చేసిన వైన్స్ కూడా పర్మిట్ రూమ్‌కు శంకుస్థాపన చేశారని స్థానికులు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ లోపల అనధికార పర్మిట్ రూమ్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో క్వార్టర్ మద్యానికి ఫోన్‌పేలో పంపిన నగదు రశీదు బహిరంగ మద్యపానంపై చర్యలు బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రోన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతున్నాం. బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు కోర్టుకు హాజరు పరుస్తున్నాం. పూర్తిస్థాయిలో కట్టడిపై దృష్టి సారిస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ డివిజన్ న్యూస్రీల్మద్యం మత్తులో చిత్తు 24/7 మద్యం అమ్మకాలు కాసుల కక్కుర్తిలో పాలకులు వంత పాడుతున్న అధికారులు గోడలు పగులగొట్టి...సమయపాలన పాటించకుంటే చర్యలు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలి. లేకుంటే తనిఖీలు నిర్వహించి, తగిన చర్యలు చేపడతాం. – అరుణకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
మల్లాదిలో నేడు హనుమజ్జయంతి
అమరావతి: మండల పరిధిలోని మల్లాది ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమత్ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త భవిరిశెట్టి హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకుడు పరుచూరి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 40 అడుగుల అభయాంజనేయస్వామి వారికి విశ్వక్సేన ఆరాధన అనంతరం పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ధ్యానాంజనేయస్వామివారికి పంచామృత స్నపన, సహస్రనామాలతో తమలపాకులతో ఆకుపూజలు నిర్వహించి విశేషాలంకారంతో భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో.. పుణ్యక్షేత్రమైన అమరావతిలో హనుమత్ జయంతి సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరాన వెలిసిన అభయాంజనేయస్వామి ఆలయంలో, మెయిన్రోడ్లోని కోదండ రామాలయంలోని అభయాంజనేయునికి ప్రత్యేక పూజలతో వాసవీ మహిళామండలి సభ్యులచే 108 సార్లు హనుమాన్‌చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఽఅర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు తెలిపారు. -
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. 17 మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 8 మిల్లీ మీటర్లు నమోదుకాగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 0.8 మి.మీ. కురిసింది. సగటు వర్షపాతం 4.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ. కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేబ్రోలు మండలంలో 7.8, ప్రత్తిపాడు 6.6, గుంటూరు పశ్చిమ 6.2, కొల్లిపర 6.2, ఫిరంగిపురం 5.6, కాకుమాను 5.4, పెదనందిపాడు 5.4, తాడేపల్లి 5.4, మంగళగిరి 5.2, తెనాలి 4.4, దుగ్గిరాల 2.8, పెదకాకాని 2.2, గుంటూరు తూర్పు 2, మేడికొండూరు 1.8, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. -
అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు
దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. అమ్మవారికి హుండీ కానుకల ద్వారా రూ. 31,30,423లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణం జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులకు తీర్ధప్రసాదం అందించారు. డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం కార్యాలయ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ఠసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామన్నారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: పెదకాకాని గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్‌దేవ్ పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116లను అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం మరియు వుయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం గరికపాటి వరుణ్ దేవ్ పై నగదుతో పాటు వెండి బిందె, వెండి గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. ఎండీయూ వాహనదారులను కాపాడండి గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డామని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమ ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామారావు, కోశాధికారి కె.డానీ, నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ ప‘రేషన్’
కుయ్ కుయ్ అంటూ ఇంటి వద్దకు వచ్చి రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాల సైరన్ ఇక మూగబోయింది. అమ్మా.. మీ ఇంటికి రేషన్ వచ్చింది.. రండి అని ఆప్యాయంగా పిలిచే ఆపరేటర్లను ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. ఇకపై సంచులు పట్టుకొని రేషన్ దుకాణాల చుట్టూ తిరగండంటూ కూటమి ప్రభుత్వం ప్రజలకు తిప్పలు తీసుకొచ్చింది. నరసరావుపేట టౌన్ : పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై రేషన్ కార్డుదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కల్పించారు. దీంతో పాటు పేదల బియ్యం నల్ల బజారుకు యథేచ్ఛగా తరలి వెళ్లనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు రేషన్ డీలర్‌షిప్‌లను హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే ఎండీయూ వాహనాల ద్వారా కొంత మందికి పంపిణీ చేసి మిగిలినవి అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఎండీయూ వాహనాలు తొలగించి పంపిణీ వ్యవస్థ పూర్తిగా డీలర్ల చేతికి అప్పగిస్తుండడంతో పేదల బియ్యం పక్కదారి పట్టడం ఖాయమనే చెప్పవచ్చు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనాలు తొలగించి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్లపాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే పల్నాడు జిల్లాలో 1289 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 402 ఎండీయూ వాహనాల ద్వారా సుమారు 6,34,893 మంది రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇకనుంచి కార్డు దారులకు తిప్పలు తప్పవనే అనుకోవాలి. 2027 వరకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ.. రేషన్ దుకాణాల వద్ద పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రతినెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాహనాలను తొలగించింది. ఎండీయూ వాహనాలకు మంగళం రేషన్ సరుకులు డీలర్లతో పంపిణీ ఇంటింటి రేషన్ పంపిణీని నిలిపిన కూటమి ప్రభుత్వం ఆందోళనలో కార్డుదారులు, ఎండీయూ వాహనదారులు -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పార్టీ కమిటీని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నాయుడు సాంబశివరావు(పెదకూరపాడు), పచ్చవ రవీంద్రబాబు (నరసరావుపేట), కూకుట్ల శ్రీనివాసరావు (సత్తెనపల్లి), తుర్లపాటి చౌదరయ్య (వినుకొండ), వీరంరెడ్డి అమరారెడ్డి (గురజాల), తాడి వెంకటేశ్వరరెడ్డి (మాచర్ల)ను నియమించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కొమరాల రమేష్ (పెదకూరపాడు), సాతులూరి సుజాతాపాల్ (నరసరావుపేట), మర్రి సుబ్బారెడ్డి (సత్తెనపల్లి), గిలుగు వెంకటనర్సింహారెడ్డి (గురజాల), పోతిరెడ్డి కోటిరెడ్డి (మాచర్ల) నియమితులయ్యారు. కోశాధికారిగా నరసరావుపేటకు చెందిన అన్నా చంద్రమోహన్‌ను నియమించారు. సెక్రటరీ ఆర్గనైజర్లుగా షేక్ సుభాని, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (పెదకూరపాడు), షేక్ మహమద్ గౌస్, పల్లపు అంజయ్య (నరసరావుపేట), గంటా ఏసుబాబు, కోవూరి నరసయ్య(సత్తెనపల్లి), పీపాల సాయిబాబు, తలారి ఆంజనేయులు (వినుకొండ), పసుపులేటి నరసింహారావు, లంజెపల్లి అంకారావు(గురజాల), ఏరువ ప్రతాపరెడ్డి, వెలిదండి గోపాలరావు(మాచర్ల) నియమితులయ్యారు. సెక్రటరీ యాక్టివిస్టులుగా గాదే వెంకటేశ్వరరెడ్డి, సందెపోగు పున్నారావు(పెదకూరపాడు), గొర్రెపాటి అచ్యుతరావు, గెల్లి చినకోటిరెడ్డి (నరసరావుపేట), షేక్ మహబూబ్ కమాల్‌బాష, జొన్నలగడ్డ ఆనంద్(సత్తెనపల్లి), ముండ్రు జీవప్రసాదు, చీరపురెడ్డి రామకృష్ణారెడ్డి (వినుకొండ), షేక్ దస్తగిరి, కొమెర వెంకటేశ్వర్లు(గురజాల), మంది పెదముల్లుస్వామి, మున్నా మురళి (మాచర్ల), అపీషియల్ స్పోక్పర్శన్లుగా ఏకుల అన్నపాములు (పెదకూరపాడు), రాపోలు శ్రీనివాసరావు (నరసరావుపేట), దార్ల ఏడుకొండలు (సత్తెనపల్లి), మండవ నాగభూషణ ప్రసాదు (వినుకొండ), చింతా వెంకటరామారావు(గురజాల) నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం నరసరావుపేట: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన ఇరువురిని పల్నాడు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మద్దం శ్రీనివాసరావును గ్రీవెన్స్‌సెల్‌కు, ఇండూరి నరసింహారెడ్డిని బూత్ కమిటీ వింగ్‌కు అధ్యక్షులుగా నియమించారు. -
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్‌లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో శంకరమఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. దేవాలయాల్లో పోలీసుల తనిఖీలు నరసరావుపేట: భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం భక్తుల భద్రత కాంక్షిస్తూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ లోకల్ పోలీసులు ఉదయం నుంచి నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వాటిలో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వివరాలు, భద్రత, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పని తీరు గురించి పూర్తిగా తనిఖీచేసి ఆలయ యాజమాన్యంకు తగిన సూచనలు చేశారు. అనుమానితులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిద్రకు వచ్చే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా అనుమానితులు ఉంటే అట్టి సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియపర్చాలని కోరారు. అనధికారికంగా ఏమైనా వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే తమకు తెలియపర్చాలని సూచించారు. శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహు తి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం దుగ్గిరాల:దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో ఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళ వా రం చండీహోమం నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. -
రక్తదానానికి ఉద్యోగులు సహకరించాలి
నరసరావుపేట: ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి కనీసం 50 మంది రక్తదానం చేయాలని, దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ కోరారు. రెడ్‌క్రాస్ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మార్గదర్శకత్వంలో మంగళవారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన జేసీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి చేసే సర్జరీలలో రక్తం అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ప్రస్తుతం వేసవిలో రక్తం కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. దానిలో భాగంగానే మొదటి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ అభ్యర్థన మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, మండలాల వారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేశామని తెలిపారు. మొత్తం 43 మంది రక్తదానం చేయగా వారందరికీ డీఆర్ఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ, కేఎంఎన్వీ శ్రీనివాసగుప్తా, బత్తుల మురళి, డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ కలెక్టర్ కేఆర్‌సీసీ కుమార్, అడ్మిన్ ఆఫీసర్ ఎం.లీలాసంజీవకుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం -
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకలలో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపుఅచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్‌కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ఐసెట్‌లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరుఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్‌కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354మందివిద్యార్థుల్లో 338మంది ఉత్తీర్ణత సాధిం చారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఆమె తండ్రి నాగేశ్వరరావు గతంలో వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా గ్రూప్‌లో తబలా వాయిద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దకు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి స్రవంతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతోంది. రెండో కుమార్తె మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. ఎస్సెస్సీ పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసి, ఎటువంటి కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు కై వసం చేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
బ్యాంకర్లు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలి
నరసరావుపేట: బ్యాంకర్లు ఉదారంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేయాలని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు బ్యాంక్ అధికారులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించి డీసీసీ(డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటి), డీఎల్ఆర్సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ)పై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. పీఎంజేజేవై, పీఎం జనధన్ యోజన వంటి పథకాలలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ త్రైమాసికానికి జిల్లాలోని 310 బ్యాంకులలో సుమారుగా మార్చి చివరి నాటికి రూ.41,995.38 కోట్లు వ్యాపారం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజరు రాంప్రసాద్ వివరించారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద 5,31,755 మందికి రూపే కార్డులు మంజూరు చేశామన్నారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ క్రింద రూ.22910.84 కోట్ల ఇవ్వడం జరిగిందన్నారు. షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ కింద 8,30,687 మందికి రూ.10,683.56 కోట్లు ఇచ్చామని చెప్పారు. కౌలు రైతులు 3388 మందికి రూ.23.89కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఉన్నత చదువులకై 2024–25లో 1478 అకౌంట్‌దారులకు రూ.71.49కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ టి.మాధురి తొలుత సమావేశం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్ త్రైమాసిక నివేదికను వివరించారు. ఆర్బీఐ అధికారి అభిషేక్‌రాజ్, నాబార్డు డీడీఎంసీ శరత్‌బాబు, వివిధ బ్యాంకుల కో–ఆర్డినేటర్లు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు 50 శాతం తగ్గించాలి నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం, మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2023–2024లో జిల్లాలో వరుసగా 576, 612 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 2025లో ఏప్రిల్ నాటికి 263 ప్రమాదాలు జరిగాయన్నారు. 2024లో రోడ్డు ప్రమాదాలలో 380 మంది మృతిచెందగా, 2025లో నాలుగు నెలల కాలంలో 152 మరణాలు సంభవించాయన్నారు. జిల్లాలోని 34 బ్లాక్ స్పాట్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల సరళిని మెరుగ్గా అంచనా వేయడంలో తోడ్పడుతున్నాయన్నారు. డ్రైవింగ్ శిక్షణకు అనుమతి మంజూరుచేస్తూ రోడ్డుసేఫ్టీ నిర్వాహకులు దుర్గాపద్మజకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అమ్మకాలను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, రోడ్లు, భవనాలశాఖ ఎస్ఈ రాజానాయక్, జిల్లారవాణా అధికారి సంజీవ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి, డీఈవో చంద్రకళ పాల్గొన్నారు. ఎంపీ లావు, కలెక్టర్ అరుణ్‌బాబు -
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
నరసరావుపేట: సాక్షి మీడియా గుంటూరు జిల్లా ప్రతినిఽధి అశోక్వర్ధన్పై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలు యూనియన్ల జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్ వర్ధన్‌పై కారెంపూడిలో టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, యూట్యూబర్ అసోసియేషన్లకు చెందిన జర్నలిస్టుల ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల యూనియన్ల ప్రతినిధులు బి.ప్రసాదు, నంద్యాల జగన్మోహన్రెడ్డి, సీహెచ్.వి.రమణారెడ్డి, అనీల్‌కుమార్, కె.నాగమణి మాట్లాడారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా అక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రపంచానికి తెలియచేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిపై టీడీపీ గుండాలు దాడిచేయటం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. వెంటనే దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలే కాని ఉద్యోగ నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు మంచిది కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలుగచేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లవకుమార్‌రెడ్డి, పి.కోటిరెడ్డి, జి.సాంబశివారెడ్డి, గురజాల రిపోర్టర్ మల్లికార్జునరెడ్డి, సాక్షి మీడియా రిపోర్టర్ సుంకిరెడ్డి, నాగరాజు, షేక్ షాహిద్, షేక్ జిలాని, స్వామి, చలమయ్య, రాముడు పలువురు యూట్యూబర్లు పాల్గొన్నారు. -
క్రీడలతో దేహదారుఢ్యం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్దుర్తి: క్రీడల వలన దేహదారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతమైన శిరిగిరిపాడు గ్రామంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించటం సంతోషకరమన్నారు. గ్రామానికి చెందిన కళ్లం హర్షవర్థన్‌రెడ్డి (ఐఆర్ఎస్), కళ్లం రామాంజనేయరెడ్డిల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళల, పురుషుల వాలీబాల్ పోటీలు జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. మారుమూల ప్రాంతంలో సైతం జాతీయ స్థాయిలో పోటీలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన అంధుల క్రికెట్లో అజయ్‌కుమార్‌రెడ్డి జాతీయ స్థాయిలో రాణించగా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో నీలంరాజు బంగారు పతకాన్ని సాధించటం నియోజకవర్గానికే గర్వకారణమన్నారు. నీలంరాజుకు వెయిట్ లిఫ్టింగ్ పరికరాల కోసం రూ 1.61 లక్షలు అందించటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ప్రతి హైస్కూల్‌కు రూ.30వేలను మంజూరు చేసిందన్నారు. మాచర్లలో క్రీడా వికాసం పథకానికి రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయటం జరిగిందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల చైర్మన్ రవినాయుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారునాయక్, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు. కలుషిత ఆహారం తిన్న 20 మందికి అస్వస్థత ఈపూరు (శావల్యాపురం): పల్నాడు జిల్లా ఈపూరు మండలం పెదకొండాయపాలెం గ్రామంలో కలుషిత ఆహారం తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల కిందట గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఏర్పాటు చేసిన వంటలు తిన్న వీరంతా వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల సమాచారం మేరకు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, డీఎంహెచ్ఓ డి.రవికుమార్, తహసీల్దార్ నళిని, ఎంపీడీఓ ప్రభాకరరావులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి బాధితులతో మాట్లాడి సత్వరమే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ప్రశాంత్‌కుమార్, రాజశేఖర్ వైద్య ఆరోగ్య సిబ్బంది 70 కుటుంబాలను సర్వే చేసి విరేచనాలతో బాధపడేవారిని గుర్తించి వైద్యసేవలు అందించారు. అందరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. -
బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావుచిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు అన్నారు. బర్లీ పొగాకు ధరకు సంబంధించి ఈనెల 27న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహించనున్న కౌలు రైతుల దీక్షపై పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు కొనుగోలు సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బర్లీ పొగాకును కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలలో సిగరెట్ల తయారీలో ఘాటు వాసన కోసం నల్ల బర్లీ పొగాకు ఉపయోగిస్తారని చెప్పారు. అయితే పొగాకు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బర్లీ పొగాకును తక్కువ ధరకు కొంటూ రైతులను నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్థానిక రైతులు ఉత్తర భారత రైతు ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ పొగాకు కొనుగోలులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఐటీసీ కంపెనీతోపాటు అన్ని కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావస్తున్నా నేటి వరకు రైతుల వద్ద పొగాకును కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వ్యవసాయశాఖ వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు బర్లీ పొగాకును సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రితోపాటు వ్యవసాయ మంత్రి సైతం కంపెనీల చేత పొగాకు కొనిపిస్తామని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. ఇప్పటికై నా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సీఐటీయూ మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వ్యవసాయ కార్మి క సంఘం అధ్యక్షుడు సాతులూరి లూధర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, పలు సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
ప్రత్యేక అవసరాలు గల బిడ్డలు ఎందరికో తల్లిగా మారింది
మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్‌లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్‌లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్‌ఎంజెల్స్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికై నా, అనివార్య కారణాలతో సైక్లింగ్‌లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్‌లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం. -
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట: మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. సోమవారం కార్యాలయంలో నష ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియచేసే పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్ఓ ఏకా మురళి, డీఈఓ చంద్రకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జేసీ సూరజ్ గనోరే హాజరయ్యారు. దుగ్గిరాల మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక సోమవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ శంకర్ ప్రిసైండింగ్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ నుంచి ఎనిమిది మంది, జనసేన నుంచి ఒకరు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ప్రిసైండింగ్ అధికారి ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ సభ్యులంతా గైర్హాజర్ అయ్యారు. తుమ్మపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి మంచికలపూడి ఎంపీటీసీ సభ్యుడు మరీదు రాము పేరును ప్రతిపాదించారు. ఈమని–1 ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య బలపరిచారు. దీంతో మరీదు రాము ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రిసైండింగ్ అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించి ప్రమాణం చేయించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశం పట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్‌లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. గరుడ వాహనంపై గ్రామోత్సవం తెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. -
దౌర్జన్యమే గెలిచింది
ప్రజాస్వామ్యానికి అధికార కూటమి నిలువునా పాతరేసింది.. బలం లేని చోట ఎలాగైనా గెలవాలనే కుతంత్రంతో బెదిరింపుల తంత్రం.. ప్రలోభాల మంత్రం ఎంచుకుని బరిలోకి దిగింది. ఇందుకు తనిఖీల పేరుతో అధికారులు.. కేసుల బెదిరింపులతో ఖాకీలు పూర్తిగా సహకరించగా.. ఇక మిగతా పని టీడీపీ గుండాలు చూసుకున్నారు. ఎన్నికై న సభ్యులను కేంద్రాల్లోకి రానీకుండా దాడులకు దిగి, దౌర్జన్యం చేస్తూ భయానక వాతావరణం సృష్టించగా.. కవరేజీకి వెళ్లిన పాత్రికేయులపై సైతం విచక్షణ మరిచి దాడులకు పాల్పడ్డారు. ● మండల పరిషత్ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు ● అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా పదవులు ● వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను బెదిరించి ఓటు వేయించుకున్న వైనం ● మాట వినని వారిని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గుండాలు ● దౌర్జన్యాలకు సహకరించిన పోలీసులు ప్రజాస్వామ్యానికి టీడీపీ పాతర బలం లేకున్నా నరసరావుపేట, కారంపూడి వైస్ ఎంపీపీ స్థానాల్లో పోటీ నరసరావుపేట రూరల్: అధికార మదంతో కూటమి నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. మండల పరిషత్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడానికి ఆ పార్టీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచింది. అక్రమ కేసులు, దాడుల భయం చూపి లాక్కున ఒకరిద్దరు ఎంపీటీసీలను ముందు పెట్టి వైస్ ఎంపీపీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. అక్రమంగా పదవులను దక్కించుకొనే క్రమంలో కూటమి నేతలు నిబంధనలకు పాతర వేశారు. ఎంపీటీసీలను సైతం ఎన్నిక జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయాలకు రాకుండా గుండాలతో అడ్డుకున్నారు. మాట వినని ఎంపీటీసీలను కారంపూడి ఎంపీడీఓ కార్యాలయం గేటు బయటే కొట్టి మరీ తరిమేశారు. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించడం గమనార్హం. కారంపూడి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ గుండాల దురాగతాలను కవర్ చేయడానికి అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ టీవీ గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్ వర్ధన్‌పై పచ్చ గుండాలు దాడి చేశారు. అశోక్‌పై పిడుగుద్దులు గుద్దుతూ దాడి చేస్తుండగా పోలీసులు రక్షించారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట వైస్ ఎంపీపీగా సువార్తమ్మ నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మండల పరిషత్‌లో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బహిష్కరించింది. వైస్ ఎంపీపీ ఎన్నిక గతంలో రెండు సార్లు కోరం లేక వాయిదా పడిన విషయం తెలిసిందే. మూడవ సారి నిర్వహిస్తున్న ఎన్నిక కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించారు. కోరం లేక రెండు సమావేశాలు వాయిదా పడితే మూడవ సమావేశంలో హజరైన వారిలో ఒకరిని వైస్ ఎంపీపీగా ఎన్నుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ వైస్ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేశారు. పమిడిపాడు–1 ఎంపీటీసీ కంచేటి భార్గవి ప్రతిపాదించగా, ఉప్పలపాడు ఎంపీటీసీ కందుల దుర్గమ్మ బలపరిచారు. సువార్తమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కారంపూడిలో దౌర్జన్యకాండ... కారంపూడి మండలం వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో 14 ఎంపీటీసీ స్థానా లకు 14 వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుపొందారు. కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ–2గా కొనసాగుతూ మరణించడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యం అయింది. గత రెండు పర్యాయాలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు గైర్హాజరవడంతో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి మరొకసారి ఎన్నిక కమిషన్ సోమవారం నోటిఫికేషన్ ఇవ్వడంతో 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు హాజరు కాగా గాదెవారిపల్లి ఎంపీటీసీ కూనిరెడ్డి సైదారెడ్డి బలపరచగా ఒప్పిచర్ల చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఆమోదించగా మిగతా ఎంపీటీసీలు మద్దతుతో వైస్ ఎంపీపీగా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎస్.లింగమూర్తి అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను ఎన్నికలు జరుగుతున్న కారంపూడి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకొని దాడులు చేశారు. కారంపూడిలో భయానకవాతావరణం సృష్టించి టీడీపీ ఎన్నికల్లో గెలుపొందింది. ఉప సర్పంచ్‌గా ఏఎస్కేవీ రంగారెడ్డి ఏకగ్రీవం మండ్రువారిపాలెం ఉప సర్పంచ్‌గా ‘పాపసాని’ శావల్యాపురం: మండలంలోని ముండ్రువారిపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం జరిగినట్లు ఎన్నికల అధికారి ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో 10 మంది వార్డు సభ్యులకుగానూ 9 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. 4వ వార్డు సభ్యుడు పాపసాని వెంకటేశ్వర్లును ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. ఏఆర్ డీఎస్పీ గాంధీ, ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ పేరుమీనా సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): చాగంటివారిపాలెం గ్రామ ఉపసర్పంచ్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన అన్నపురెడ్డి శివకోటి వెంకటరంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం గ్రామ సచివాలయంలో జరిగిన ఉప ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడైన రంగారెడ్డిని 11వ వార్డు సభ్యురాలు నీలం కోటేశ్వరమ్మ ప్రతిపాదించగా, 1వ వార్డు సభ్యురాలు పుష్పలత బలపరిచారు. ఆ మేర ఉపసర్పంచ్‌గా రంగారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఈఓపీఆర్డీ ఎస్.రూపవతి ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాన్ని అందించి ప్రమాణస్వీకారం చేయించారు. బొప్పూడి ఉపసర్పంచ్‌గా అమీర్‌జాని చిలకలూరిపేట: మండలంలోని బొప్పూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన అప్పాపురం షేక్ అమీర్‌జాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుమారు ఆరునెలల కిందట ఉప సర్పంచ్‌గా ఉన్న నందిగం మేరి తన పదవికి రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి సర్పంచ్‌తో పాటు 12 మంది వార్డు మెంబర్లలో 9 మంది బలముంది. టీడీపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమీర్ జాని ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనను ఎన్నిక చేసినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం.సూర్యతేజ ప్రకటించారు. అమీర్జానిని సర్పంచ్, వార్డు సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు అభినందించారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఏస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 150 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ మధులత పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి ప్రతి రోజూ 24గంటలూ సేవలు అందజేసే కేబుల్ ఆపరేటర్లకు గత ఏడు నెలలుగా ఏపీ పైబర్ నెట్ సంస్థ ద్వారా ప్రతిరోజూ సిగ్నల్ అంతరాయం కలుగుతుంది. దీనికి అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బందితో పరిష్కారం చూపించాలి. సెటాప్ బాక్స్‌ల రెంటల్ చార్జీల గడువు ముగిసినా తమ నుంచి రూ.59 వసూలు చేయటం విడనాడాలి. పెట్టుబడి రూపంలో ఆర్థిక సహాయం చేసి సెటాప్బాక్స్లు, ఓఎల్‌టీలు, బ్యాటరీలు అందుబాటులో ఉంచాలి. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి. –బీవీవీ భాస్కరరెడ్డి, వెంకటరావు, అధ్యక్ష, కార్యదర్శులు, కేబుల్ ఆపరేటర్లు ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు లక్ష షరతులు విధిస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సిబిల్ స్కోర్ బాగుండాలని, ష్యూరిటీ చూపించాలని, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల బాకీలు ఉండకూడదని, డ్వాక్రాలోను సైతం పెండింగ్ ఉండరాదనే షరతులతో లబ్ధిదారులను వేధిస్తున్నారు. దీని వలన రుణాలు అందక ఎస్సీ వర్గీయులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లతో వెంటనే సమావేశం ఏర్పాటుచేసి లబ్ధిదారులకు సులభంగా రుణాలు మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వండి. – చింతిరాల మీరయ్యమాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులతో పాటు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. –నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ, వి.కోటానాయక్, ప్రజాసంఘాల నాయకులు -
ఈఏపీ సెట్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 3,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 22 కేంద్రాల పరిధిలో సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,588 మంది విద్యార్థుల్లో 3,347 మంది హాజరయ్యారు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఆయా కేంద్రాల పరిధిలో ఆన్లైన్ సీబీటీ పరీక్షలు సజావుగా జరిగాయి. -
చీకటి పువ్వు నాటికకు బహుమతుల పంట
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభావేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. భావోద్వేగాలకు మించిన రంగస్థల పోరాటాలు, సమకాలీన సమాజ సమస్యలపై ఆలోచనా త్మక సందేశాలు అందించిన ఈ నాటికలు కళాభిమానులను రంజింపజేశాయి. పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం కళాభిమానులు భారీగా తరలివచ్చి పండుగ వాతావరణాన్ని తలపింపజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా కేవీ మంగారావు, జెట్టి హరిబాబు, సుమ పమిడిగంటి వ్యవహరించారు. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయగా, కార్యక్రమానికి ఏవీ శివయ్య అధ్యక్షత వహించగా పరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, సీఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి మక్కెన నరసింహారావు, వేదిక అధ్యక్షులు డా. ముత్తవరపు సురేష్ బాబు, రోటరీ క్లబ్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కొత్త శివ, షేక్ షఫీ, ఆళ్ల హరిబాబు, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్‌బాషా, అంబటి బాలస్వామి, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చీకటి పువ్వు’ ఈ ప్రతిష్టాత్మక పోటీలో చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’(గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. కళాంజలి(హైదరాబాద్) వారి ‘రైతే రాజు’ నాటికకు జ్యూరీ ప్రదర్శనగా బహుమతి లభించింది. వ్యక్తిగత విభాగాల్లో.. చీకటి పువ్వు నాటికకు సంబంధించి ఉత్తమ నటిగా లహరి, ఉత్తమ నటుడు కె.సత్యనారాయణ, ఉత్తమ దర్శకుడు మంచాల రమేష్, ఉత్తమ సంగీతం సురభి నాగరాజు, ప్రత్యేక బహుమతి ఏపూరి శ్రీనివాస్‌లు అందుకున్నారు. నాన్న నేను వచ్చేస్తా : ఉత్తమ క్యారెక్టర్ నటిగా అమృత వర్షిణి, ప్రత్యేక బహుమతి ఎస్.కే.హసన్ అందుకున్నారు. చిగురు మేఘం: ఉత్తమ విలన్ కె.సరిత, ఉత్తమ సహాయనటి బి.నాగరాణి, ప్రత్యేక బహుమతి ప్రసాద్. రైతే రాజు: ఉత్తమ రచన కంచర్ల సూర్యప్రకాశ్, ప్రత్యేక బహుమతి తిరుమల. దొందు దొందే: ఉత్తమ హాస్యనటుడు జబర్దస్త్ ప్రకాష్, ఉత్తమ ఆహార్యం కె.కుమారి, ప్రత్యేక బహుమతి కె.కుమారి. బ్రహ్మ స్వరూపం: ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్, ప్రత్యేక బహుమతి వి.సి.హెచ్.కె. ప్రసాద్. ఇది రహదారికాదు నాటికకు ప్రత్యేక బహుమతిని చిరంజీవి దేవేష్ అందుకున్నారు. ముగిసిన చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్ నాటికల పోటీలు -
ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు
గుంటూరు లీగల్: ఈనెల 19 నుంచి జులై 5 వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో మోటార్ వెహికల్ ప్రమాదాల కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు చెప్పారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రతినిధులు, న్యాయవాదులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ప్రమాదాల కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కంపెనీ మెంబర్స్, కౌన్సెల్స్ పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పిటిషనర్‌ను, అతడి కౌన్సెల్‌ను కూడా పిలిపించి ప్రీ సిట్టింగ్ ద్వారా కేసును రాజీ చేయాలని ఆయన సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్కు పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో బార్ కౌన్సెల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్ పాల్గొన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు -
విద్యుత్‌షాక్‌తో రైతు దుర్మరణం
నాదెండ్ల: విద్యుత్ షాక్‌కు గురై రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చేకూరి హనుమంతరావు (70) తూబాడు రోడ్డులో తనకున్న వ్యవసాయ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో తన పొలానికి వెళ్లి ఇనుప గేటు తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చుట్టూ రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైరు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. దీంతో గేటు తీసే క్రమంలో షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న చంటి అనే వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో పొలానికి వెళ్లగా, విగతజీవిగా పడిఉన్న హనుమంతరావును చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు పట్నంబజారు: మహిళపై లైంగిక దాడితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 12న మధ్యాహ్నం సుద్దపల్లి డొంక ప్రగతీ నగర్ 7వ లైనుకు చెందిన మహిళ తల్లి ఇంటికి వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి అమ్మమ్మ రాహెలమ్మ రావడంతో ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి షాబాజ్ పరారయ్యాడు. మరుసటిరోజు 13వ తేదీన నిందితుడు షాబాజ్, ఆయన మేనమామ నాగూల్ మీరా, బంధువులు నాసర్ హుసేన్, హనీఫ్‌లు మహిళ ఇంటి వద్దకు వెళ్లి, జరిగిన విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతోపాటు కులం పేరుతో దూషించి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షేక్షాబాజ్ను సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ షేక్ అబ్దుల్ రహమాన్, సిబ్బందిని అభినందించారు. నిందితుడు షాబాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి గుంటూరు వెస్ట్: పేదల ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ఒక ప్రభుత్వ శాఖతో వీలుపడదని, అన్ని శాఖల మండల, జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక కూడా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. -
ప్రజా రవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్ర
నరసరావుపేట: శిక్షణ తీసుకున్న డ్రైవర్లు ప్రమాదరహితంగా వాహనాలను నడుపుతూ ఇంధన పొదుపు డ్రైవర్లుగా మెలగాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న 19వ బ్యాచ్ డ్రైవర్లకు సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్రని, వారు శారీరకంగా, మానసికంగా ధృఢంగా వుండాలని సూచించారు. చెడు అలవాట్లకు స్వస్తి పలికి సేవా దృక్పధం అలవర్చుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించి ప్రమాదాలు నివారించాలని వెల్లడించారు. డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు పి.బొల్లయ్య, షేక్ సుభాని పాల్గొన్నారు. పీటీడీ జిల్లా అధికారి మధు శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు ప్రదానం -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పీజీఆర్ఎస్కు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి 72 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు చెందిన ఫిర్యాదులు ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. వచ్చిన వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే... జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పీజీఆర్ఎస్కు 72 ఫిర్యాదులు -
నగలు చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు
చిలకలూరిపేట: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఇరువురు నిందితులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని డైక్మెన్ కాలనీకి చెందిన పేదాల రాముడు, మదర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న బీరా సిద్దు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన యలగాల హనుమాయమ్మ ఈ నెల ఆరోతేదీన ఇంటికి తాళం వేసి సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 11వ తేదీ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో పరిశీలించగా 42 సవర్ల బంగారు నగలు, 59.40 గ్రాముల వెండి వస్తువులు, రాగి బిందెలు, చెంబులు, ఇత్తడి సామగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ. 34లక్షలు ఉంటుంది. రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు, ఎస్ఐ జి.అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నిందితులను చిన పసుమర్రు గొర్రెల మండి వద్ద అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకోవడంపై పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐలు డి.రోసిరాబు, జి.సుబ్బారావు, హెచ్‌సీలు కె.దేవరాజు, జె.శ్రీధర్, పీసీలు ఎం.యిర్మియా, బి.అశోక్, ఎం.రత్నకిషోర్ పాల్గొన్నారు.రూ. 34లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం -
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటకు చెందిన పలువురిని నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యా లయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూత్ వింగ్ అధ్యక్షుడిగా కోటపాటి శ్రీ మణింద్రరెడ్డి, మహిళా విభాగానికి బొబ్బిలి శ్రీలక్ష్మి, రైతు వి భాగానికి కొబ్బరి పూర్ణచంద్రరావు, బీసీ సెల్‌కు మర్రిపూడి రాంబాబు, ఎస్సీ సెల్‌కు కుక్కల పౌ లయ్య, ఎస్టీ సెల్‌కు మొగిలి ఆంజనేయులు, మై నార్టీ సెల్‌కు షేక్ సిలార్బాష, క్రిస్టియన్ మైనార్టీసెల్కు దార్లపాటి మేరి బ్లెస్సీనా, స్టూడెంట్ వింగ్‌కు యర్రంరెడ్డి విజయ మనోహరరెడ్డి, పంచాయతీరాజ్ వింగ్‌కు ముండ్రు హరినారాయణ, మున్సిపల్ వింగ్‌కు మాగులూరి రమణారెడ్డి, ఆర్టీఐ వింగ్‌కు జీనేపల్లి హనుమంతరావు నియమితులయ్యారు. అదేవిధంగా వలంటీర్ల వింగ్ అధ్యక్షుడిగా పోలుబోయిన మధు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా షేక్ ఖాదర్‌బాష, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మిట్టపల్లి శేఖర్, చేనేత వింగ్ అధ్యక్షుడిగా గుణదల శ్రీనివాసరావు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడిగా షేక్ వలి, అంగన్వాడీ వింగ్ అధ్యక్షులుగా జొన్నలగడ్డ హెల్డా ఫ్లోరెన్స్, లీగల్‌సెల్ అధ్యక్షుడిగా వై.సీతారామిరెడ్డి, కల్చరల్ వింగ్ అధ్యక్షులుగా కంచర్ల విజయలక్ష్మి, సోషల్ మీడియా వింగ్‌కు బూదాల కల్యాణ్, ఐటీ వింగ్‌కు వీరంరెడ్డి నాగిరెడ్డి, దివ్యాంగుల విభాగానికి గంటా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ల వింగ్‌కు డాక్టర్ దొండేటి వసంతరాయ, పబ్లిసిటీ వింగ్‌కు గానుగపంట ఉత్తమరెడ్డి, బూత్ కమిటీ వింగ్‌కు పఠాన్ హిదాయిత్ ఖాన్, ఇంటలెక్చ్యువల్ ఫోరమ్ అధ్యక్షుడిగా పల్లెర్ల మల్లికార్జునరెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు జిల్లా నాయకుల నియామకం నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో వివిధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ స్టేట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా సత్తెనపల్లికి చెందిన రాజారపు శివనాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా పెదకూరపాడుకు చెందిన షేక్ బాజి, రాష్ట్రపంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నరసరావుపేట రొంపిచర్ల మండలానికి చెందిన పడాల చక్రారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శిగా సత్తెనపల్లికి చెందిన పాలూరి రాజశేఖరరెడ్డి నియమితులయ్యారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని రూ.8లక్షలు మోసం
నేను సత్తెనపల్లిటౌన్లో పాత బండ్లు కొనుగోలు, అమ్మకాలు వ్యాపారం చేస్తుంటాను. నా పెద్ద కుమారుడు సైదా బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసి ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో మా షాపునకు ఎదురుగా చికెన్‌షాప్ నిర్వహిస్తున్న జ్యోతి ద్వారా కర్నూలుకు చెందిన తిరుమలేసురెడ్డితో పరిచయం ఏర్పడింది. అతను తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నాడని, తనకు తెలిసిన అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాడని, నీ కుమారుడికి డిలైట్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నాకు ప్రధానమంత్రి రుణం ఇప్పిస్తానంటూ నా వద్ద నుంచి రూ.8లక్షలు తీసుకున్నారు. నా కుమారుడికి ఉద్యోగం పేరుతో ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ సెల్‌ఫోన్‌కు పంపించారు. దానిని తీసుకొని నా కుమారుడు సైదా కంపెనీ వద్దకు వెళ్లగా అవి ఫేక్ అని, ఆ కాగితాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని కంపెనీవారు చెప్పారు. దీంతో తమను వారిద్దరూ మోసం చేశారని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా నాపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –షేక్ యలవర్తిపాటి బాజీ, ములకలూరు, నరసరావుపేట మండలం వరకట్నం కోసం వేధిస్తున్నారు నాకు అచ్చంపేట గ్రామానికి చెందిన వేపూరి వెంకటేశ్వర్లుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి నా భర్త, అత్త వరకట్నం తీసుకురావలసిందిగా పలుమార్లు వేధిస్తున్నారు. నా భర్త చీటికీమాటికి కొడుతూ ఉండటంతో నేను తల్లి ఇంటి వద్ద ఉంటున్నాను. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తూ కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –ఓ మహిళ, పాతగణేశుని పాడు, పిడుగురాళ్ల మండలం ● -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్‌ను దళితుడని ఇబ్బందులకు గురిచేసిన యశ్వంత్ నాయుడుతోపాటు అతనిపై దాడికి పాల్పడిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్, జగ్గా కిరణ్‌లను కఠినంగా శిక్షించాలని కోరారు. తిరుపతి విద్యానికేతన్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న జేమ్స్‌ను అతని కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన యశ్వంత్ నాయుడు హేళన చేశాడన్నారు. దళితుడని, ఒరేయ్ అంబేడ్కర్ అని రకరకాలుగా మాటలతో హింసిస్తుండగా, జేమ్స్ ఖండించాడని తెలిపారు. మరొక సారి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించాడన్నారు. దీనినిపై పగ పెంచుకున్న యశ్వంత్ నాయుడు అతనిపై దాడి చేసి హింసించి నానా విధాలుగా పరుష పదజాలంతో తిట్టడంతో పాటు, కాళ్ళు చేతులు కట్టి వేసి కత్తితో హత్యాయత్నం చేశారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే తీసుకోకుండా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవస్థలను పాడు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీల కోసం పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వ్యక్తుల భరతం పడతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, కిడ్నాప్, పరువు నష్టం కేసుల సెక్షన్లు అమలు చేస్తూ కేసు నమోదు చేసి జేమ్స్‌కు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ -
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెనన్స్ టెక్నికల్ పర్సన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు, నాయకులు కె. శ్రీనివాసరావు, బి. ముత్యాలు, పి. దీవెనరావు, బాబూరావు, డి. కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అభివృద్ధి వదిలి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకున్న ప్రభుత్వం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలిపెట్టి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకుందని గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలె, ఐఏఎస్, ఐపీఎస్‌లపై కేసులు పెట్టి అరెస్టు చేసి , వేధించడం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలుచేయాలని ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ కోరుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క ఏడాదిలోనే ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారగా ప్రతిపక్షం గ్రాఫ్ పెరుగుతుందన్నారు. జగన్ వద్ద పని చేసిన ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిలకు ఏమాత్రం సంబంధం లేని మద్యం కేసులో ఇరికించి తమకు ఇష్టమొచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. సిట్ పేరుతో పోలీసులే పచ్చచొక్కాలు వేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిన వారిని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌తోపాటు అతని సొంత మనుషులను అరెస్టు చేయాలని, బిగ్‌బాస్ తాడేపల్లి వరకు వెళతామని కొన్ని చానళ్లలో చెబుతున్నారన్నారు. 2010 నుంచి పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జగన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించారని గుర్తు చేశారు. దీంతో 40 శాతం శాశ్వత ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు రెండు శాతానికి పడిపోయిందన్నారు. ఇప్పుడు కూడా టీడీపీకి అదే జరగనుందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న మద్యం బ్రాండ్లనే కూటమి ప్రభుత్వం ధర పెంచి అమ్ముతుందని ఆరోపించారు. అప్పుడు మద్యం వ్యాపారంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సంబంధం లేకుండా అమ్మకాలను ప్రభుత్వం తరఫున నిర్వహించిందన్నారు. ఇప్పుడు మద్యం దుకాణాలు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల ప్రమేయంతోనే నిర్వహిస్తున్నారని, వారి అనుమతితోనే మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వారు నేర్పిన విధానాలే వారికి గుణపాఠాలు అవుతాయన్నారు. ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గురజాల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. రోజురోజుకు తగ్గుతున్న ప్రభుత్వ గ్రాఫ్ ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు మద్యం కుంభకోణమంటూ కేసు పెట్టి ఐఏఎస్‌లపై వేధింపులు జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు విలేకర్ల సమావేశంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి -
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్‌లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. హెచ్ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం బాపట్ల: హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బదిలీల నుంచి మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించాలని వైఎస్సార్ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ ఆదివారం ఓప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 2017 ఆగస్టులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో స్థాన చలనం పొందిన వారిని ప్రస్తుత బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ విభాగంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాకుండా, అకడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా మే 31 నాటికి లాంగ్ స్టాండింగ్‌గా పరిగణించి బదిలీల్లో చేర్చుతున్నారని తెలిపారు. కేలండర్ ఇయర్స్ కాకుండా విద్యా సంవత్సరాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా 60 ఏళ్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సైతం బదిలీల్లో స్థాన చలనం పొందనున్నారని, ఇది వారికి తీవ్ర అన్యాయం కలిగించే విషయమన్నారు. ఒక అకడమిక్ ఇయర్లో 9 నెలలు పనిచేస్తే ఒక ఏడాదిగా పరిగణిస్తున్న విద్యాశాఖాధికారులు, 59 ఏళ్ల 10 నెలలు వయస్సు నిండిన వారిని 60 ఏళ్ల వయసు నిండిన వారితో సమానంగా పరిగణించకపోవడంతో అనేకమంది ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. 60 ఏళ్లకు చేరువలో ఉన్న వయోధిక ఉపాధ్యాయుల వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరారు. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్‌నెస్‌లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్పీ ఆనంద్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి 2 జూన్ వరకు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఏక్విపైడ్ పోటీలు జరుగుతాయి.కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, జి.రమేష్, కత్తి పవన్‌కుమార్, ఎం.రాహుల్‌గౌతమ్, సయ్యద్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సురేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపికై న జట్ల వివరాలు ఇలా.. సబ్ జూనియర్: 43 కేజీలు కత్తి పల్లవి (గురజాల), 53 కేజీలు కె.కార్తిక్ (గురజాల), 66 కేజీలు ఎం.వినయ్ వెంకట శివ(సత్తెనపల్లి) జూనియర్ విభాగం: 53 కేజీలు ఎం.సాయి గగన్ (సత్తెనపల్లి),74 కేజీలు ఎన్. శరత్(కంకణాలపల్లి), 74 కేజీలు పి.శ్రీహర్ష రమేష్ చౌదరి (కంకణాలపల్లి), 83 కేజీలు పసుపులేటి వంశీ కృష్ణ (సత్తెనపల్లి),120 కేజీలు ఎల్. శివనాగేశ్వరరావు(గుడిపుడి) ఎంపికయ్యారు. -
దేవుని దృష్టిలో అంతా సమానమే..
రెవరెండ్ పిల్లి అంథోని దాస్ అచ్చంపేట: దేవుని దృష్టిలో అందరూ సమానమేనని నెల్లూరు మేత్రాసనం మహా ఘన రెవరెండ్ పిల్లి అంథోని దాస్ తెలిపారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు పునఃప్రతిష్ట వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన జూబిలీ ఆరంభ కృతజ్ఞతార్చన సమష్టి దివ్య పూజాబలి గీతాంజలి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్మనీ నుంచి ఇక్కడకు వచ్చిన స్వామి అర్లానంద 130 సంవత్సరాల కిందట తాళ్లచెరువు గ్రామాన్ని సృష్టించడం గొప్ప విషయమని తెలిపారు. ఇక్కడ నివసించే వారందరికీ క్రైస్తవ మతాన్ని ప్రబోధించి, 1950లో బాలఏసు మందిరాన్ని నిర్మించడం అద్భుతమని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెంది నేడు మహా దేవాలయంగా పునఃప్రతిష్ట జరుపుకోవడం ఆనందించదగిన విషయం అన్నారు. దేవాలయం నిర్మించి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రామస్తుల సమష్టి కృషితో వజ్రోత్సవ జూబిలీ వేడుకలతో పాటు దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడం అభినందనీయమని తెలిపారు. జూబిలీ వేడుకలు అంటే ఇచ్చి పుచ్చుకోవడం, పరస్పరం అభినందించుకోవడం, గౌరవభావం కలిగి ఉండటం, ప్రేమ, దయ, జాలి కలిగి ఉండి అందరూ సమానమేనని తెలుసుకోవడమని వివరించారు. కార్యక్రమంలో 50మంది ఫాదర్స్, మరో 50మంది కన్య సీ్త్రలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గురువులు సందేశాన్ని ఇచ్చారు. దేవాలయం విచారణ గురువులు పుట్టి అంథోనిరాజు ఆధ్వర్యంలో ప్రారంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. మూడు వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉత్సవ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. -
ఎల్ఐసీ పాలసీలపై జీఎస్టీని తీసి వేయాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తీసి వేయాలని, పాలసీదారులకు బోనస్‌ను పెంచాలని ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్లో గల మాడా విశ్వేశ్వరరావు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన లియాఫీ ఏజెంట్ల యూనియన్ మచిలీపట్నం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలసీదారులకు లోన్‌పై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్లు అందరికీ మెడి క్లైమ్ను కుటుంబ సమేతంగా కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్స్యూరెనన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నంత కాలం కలిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో దిగువ తరగతి వారికి రూ. లక్ష పాలసీ ప్రవేశ పెట్టాలని మేనేన్మెంట్ను ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి బ్రాంచి అధ్యక్షుడు మంచాల రమేష్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అని, ఎల్ఐసీని బలోపేతం చేయడంలో కీలకమని తెలిపారు. ఏజెంట్లు అభివృద్ధికి సంస్థ కృషి చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ నాయకులు రవీంద్రరెడ్డి, అలిమియా, జగన్నాథం, రఘు, శ్రీనివాసరెడ్డి, మారుతి, సత్తెనపల్లి బ్రాంచి ఎల్ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ పాలసీదారులకు బోనస్ పెంచాలి -
తెలుగు పలుకుబడులకు చిరునామా చేరెడ్డి
అద్దంకి: తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం చేరెడ్డి మస్తాన్‌రెడ్డి కవిత్వంలో కనిపిస్తాయమని సాహిత్యవేత్త గాడేపల్లి దివాకరదత్తు అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు కళాక్షేత్రంలో 2025 సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు గాడేపల్లి దివాకరదత్తు అధ్యక్షత వహించారు. దేవపాలన మాట్లాడుతూ చేరెడ్డి రచనలు ప్రాచీన కావ్యాలను తలపిస్తుంటాయని అభినందించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ పద్య సాహిత్యానికి చేరెడ్డి గౌరవాన్ని చేకూర్చారని చెప్పారు. పద్య కవులను ప్రోత్సహించడంలో చేరెడ్డి పాత్ర గొప్పదని వివరించారు. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ‘మహాభారతం.. కవిత్రయ శైలి’ అనేది గొప్ప పరిశోధన అని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి సాహిత్య పురాస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.5వేలు, పట్టుబట్టలు, సన్మాన పత్రం, జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో వారణాశి రఘురామశర్మ, చుండూరి మురళీ సుధాకర్‌రావు, కడియం పాపారావు, కె. సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్. రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. పుట్టంరాజు సాహిత్య పురస్కారం అందజేత -
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, వాహనాలు, నగర శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లు కూడా పాల్గొన్నాయి. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి, వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీచేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. ఖాళీ ప్రదేశాలు, శివారు నగర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై దాడులు నిర్వహించారు. అనంతరం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
రూ.లక్షలు జరిమానా.. సహకరిస్తే మాఫీ
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025సజావుగా జేఈఈ అడ్వాన్స్డ్ గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ప్రవేశానికి ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఆన్లైన్ పరీక్షలు సజావుగా జరిగాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాలతోపాటు నరసరావుపేటలోని ఒక పరీక్ష కేంద్రం పరిధిలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచి తల్లిదండ్రులు విద్యార్థులను వెంట పెట్టుకుని పరీక్ష కేంద్రాలకు వచ్చారు. ఎన్టీఏ విధించిన నిబంధనల ప్రకారం విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.ఇరువురి మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి పమిడిపాడులో ఘటన నరసరావుపేట రూరల్: స్వల్ప వివాదం నేపద్యంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పమిడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఫిరంగుల కోటేశ్వరరావు(40), కోట్ల అంజిలు ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. అంజికి చెందిన గొర్రెల కారణంగా తమ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని కోటేశ్వరరావు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై ఆదివారం పోలేరమ్మ ఆలయం వద్ద ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై పెద్దల వద్ద మాట్లాడుకుందామని ఇద్దరు బయలుదేరారు. ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో వీరిమధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో కోటేశ్వరరావు నెట్టడంతో అంజి పక్కకు పడిపోయాడు. కిందపడిపోయిన అంజి సమీపంలోని కర్రను తీసుకుని కోటేశ్వరరావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ కిశోర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి ఎస్పీగా తుషార్ డూడీ నగరంపాలెం: గుంటూరు జిల్లా ఇన్చార్జి ఎస్పీగా తుషార్ డూడీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలసి వారం రోజులు సెలవుపై స్వస్థలం తమిళనాడు వెళ్లారు. ఈనెల 25న తిరిగి విధుల్లో చేరనున్నారని జిల్లా పోలీస్ కార్యాలయ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. అయితే గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్‌డూడీ విధులు నిర్వర్తించిన విషయం విదితమే. హనుమత్ జయంత్యుత్సవాలు ప్రారంభం నగరంపాలెం: గుంటూరు కొత్తపేట (నాజ్ కూడలి)లోని శ్రీఆంజనేయ స్వా దేవస్థానంలో ఆదివారం హనుమత్ జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ఉదయం విశేష పూజా, పంచామృత అభిషేకం ప్రత్యేక పూల అలంకరణ నిర్వహించారు. రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అఖండ దీపారాధన, అంకురార్పణ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై, స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీ హనుమాన్ దీక్షా సమాజం ఆధ్వర్యంలో జరగ్గా, దేవస్థానం సహాయ కమిషనర్ టి.సుభద్ర పర్యవేక్షించారు. దీక్షా సమాజం అధ్యక్షుడు తిరువళ్ళూరు వెంకటసుబ్బారావు, సభ్యులు నాగేశ్వరరావు, ప్రసాద్, రమేష్, వెంకటరమణ, మారుతి, సుబ్రమణ్యం, బాపిరాజు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: బలం లేక పోయిన వైస్ ఎంపీపీ పదవి పొందేందుకు కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. పోలీసుల బెదిరింపులకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు తలొగ్గకపోవడంతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీకి చెందిన బార్‌పై ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో మద్దతు తెలిపితే కేసు మాఫీ చేస్తామంటూ కూటమి నేతలు రాయబేరం నడుపుతున్నారు. మరో వైపు అధికారపార్టీ బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నరసరావుపేట మండల పరిషత్‌లో వైఎస్సార్ సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. మండలంలోని ఎన్నిక జరిగిన 17 ఎంపీటీసీ స్థానాలకు 17 స్థానాలను వైఎస్సార్ సీపీ గెల్చుకుంది. ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. వైస్ ఎంపీపీగా ఉన్న అల్లూరివారిపాలెం ఎంపీటీసీ వెంపాటి శ్రీలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఈ పదవి కోసం ఈనెల 19వ తేదీ సోమవారం ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి ఐ.మురళి ప్రకటించారు. రెండుసార్లు వాయిదా వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం మార్చి 27వ తేదీన మండల పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా వైస్ ఎంపీపీ సాధించేందుకు ఎంపీటీసీలపై బెదిరింపులు, ప్రలోభాలకు కూటమి ప్రభుత్వం పాల్పడింది. పోలీసులను ఉపయోగించి ఎంపీటీసీ సభ్యులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యులు చేజారకుండా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన కృషి ఫలించింది. కూటమి నేతలు, పోలీసుల ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశంలో కూటమికి నలుగురు మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చివరకు నకిలి ఎంపీటీసీ సభ్యులతో అధికార పార్టీ చేసిన కుట్రలు భగ్నమయ్యాయి. పోలీసులతో ఎంపీటీసీ సభ్యులను అపహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎన్నికను బహిష్కరించింది. దీంతో వైస్ ఎంపీపీ ఎన్నికకు కోరం లేకపోవడంతో 27, 28 తేదీలలో రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది. నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయం అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూబిలీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవరోజు ఆదివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు రెవ.ఫాదర్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించిన దేవాలయ ప్రహరీ, గుహ, విశ్వాస స్థూపం, దేవాలయ ప్రధాన ద్వారాలను ప్రారంభించారు. ఏసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలను పునఃప్రతిష్టించారు. అనంతరం వాక్యసందేశం అందిస్తూ.. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నంబూరు శంకరరావును సాదరంగా ఆహ్వానించారు. పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య, వివిధ జిల్లాల పీఠాధిపతులు, విచారణ గురువులు, చర్చి ఫాదర్లు శంకరరావును దుశ్శాలువాలతో సత్కరించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసం ఉంచాలని, సన్మార్గంలో నడవాలని సూచించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకుడు జడ్పీటీసీ తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి, పార్టీ కన్వీనర్ చిల్కా చంద్రయ్య, తాళ్లచెరువు సర్పంచ్ కిక్కురు అర్లారెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి, సుంకర శ్రీనివాసరెడ్డి, ఆర్ఎంపీ సమరం, గ్రామ కన్వీనర్ బాలశౌర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును ఆశీర్వదిస్తున్న పీఠాధిపతులు భాగ్యయ్యన్యూస్రీల్ నేడు నరసరావుపేటలో ఎన్నిక గతంలో కోరం లేక రెండుసార్లు వాయిదా బలం లేకపోయినా బరిలోకి టీడీపీ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలకు బెదిరింపులు, అక్రమ కేసులు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కుమారుడి బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు రూ.36 లక్షలు జరిమానా.. సహకరిస్తే మాఫీ చేస్తామంటూ ఆఫర్ అజ్ఞాతంలోకి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎన్నిక జరగకుండా కూటమి కుట్ర : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం 19వ తేదీ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి మురళి ప్రకటించారు. ఇందుకోసం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. ఈసారి ఎలాగైనా వైస్ ఎంపీపీ పదవిని సాధించేందుకు కూటమి నాయకులు అక్రమ మార్గాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. అక్రమ కేసులతో ఎంపీటీసీ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ పెదతురకపాలెం నాయకుడు షేక్ నూరల్ అక్తాబ్ తల్లి షేక్ మహబూబ్‌బీ పెదరెడ్డిపాలెం ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. వైస్ ఎంపీపీ ఎన్నిక నేపధ్యంలో అక్తాబ్ నరసరావుపేటలో నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్‌పై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. సుమారు రూ.36 లక్షల జరిమానా విధించారు. ఎన్నికలో తమకు సహకరిస్తే కేసును మాఫీ చేస్తామని కూటమి నాయకులు బేరసారాలకు దిగుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అక్తాబ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. మరో వైపు కూటమి నాయకులు, పోలీసుల బెదిరింపులతో వైఎస్సార్ సీపీ ఎంపీటీపీ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
కల్యాణ వైభోగమే..!
తెనాలిటౌన్: శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహారణ, ఎదురుకోలోత్సవం వంటి కార్యక్రమాలను దేవస్థాన అర్చకులు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం వైభోవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైకుంఠవాసుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీ భావాన్నాఋషి స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలివచ్చి వైకుంఠపురంలో స్వామివారికి సమర్పించారు. ముత్తయిదువులు, పద్మశాలీయ సంఘీయులు వేడుకలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ మంతెన అనుపమ పర్యవేక్షించారు. కల్యాణ మహోత్సవంలో డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల శ్యామ్‌ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. -
పేదల ఆస్పత్రిలో ఫీజులు!
ఉచిత సేవలు అందించలేరా..? గుంటూరు మెడికల్: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆధునిక చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉంది... శరీరంలో ఏ భాగంలో ఉంది.. ఎంతమేరకు వ్యాప్తి చెందింది.. క్యాన్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పెట్ సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను ప్రైవేటు క్యాన్సర్ సెంటర్లో చేసినందుకు సుమారు రూ.25 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పెట్‌సీటీ పరీక్షను ఉచితంగా అందించాలనే ఆశయంతో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఖరీదు చేసే పెట్‌సీటీ మెషిన్‌ను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు మంజూరు చేసింది. త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేలా వేగవంతంగా సివిల్, ఎలక్రిక్టల్, ఇతర పనులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్సీటీస్కాన్ వైద్య పరికరం అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతివారు ఎంతో సంతోషపడ్డారు. గతంలో ఈ పరీక్ష కోసం రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడేవారు. వైద్య పరికరం రాకతో సంతోషపడుతున్న తరుణంలో పిడుగులాంటి వార్త చెవిని పడింది. శనివారం గుంటూరు జీజీహెచ్‌లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం( హెచ్‌డీఎస్) జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, హెచ్‌డీఎస్ సభ్యుల సమక్షంలో పెట్ సీటీ పరీక్షకు సుమారు రూ.7వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై రోగులు, సహాయకులు మండిపడుతున్నారు. రోగులు, సహాయకుల ఆగ్రహం నాట్కో ట్రస్ట్ వారు ప్రతి ఏడాది సుమారు రూ.కోటి వ్యయం చేసే మందులు ఉచితంగా క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో నేడు ఆస్పత్రిలో ఎందరో దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య పరీక్ష పేరుతో రూ.7వేలు ఫీజు తీసుకోవటం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రాణాలు తీసే క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు ఆర్థిక ఇబ్బంది పడేలా ఫీజులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరీక్షకు ఫీజు తీసుకోవాలనే విషయమై పునరాలోచించాలని పలువురు రోగులు కోరుతున్నారు. పెట్ సీటీ స్కానింగ్‌కు యూజర్ చార్జీలు ఒక్కో రోగి వద్ద రూ.7వేలు వసూలుకు రంగం సిద్ధం హెచ్‌డీఎస్ సమావేశంలో యూజర్ చార్జీలకు ఆమోదం క్యాన్సర్ రోగులపై తీవ్ర భారం జీజీహెచ్ వర్గాలపై తీవ్ర విమర్శలు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని వీసీ సుమారు రూ.45 కోట్లతో క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జూలై 1న నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. గతంలో కేవలం రేడియేషన్ ఆంకాలజీ వైద్యసేవలు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌లో లభించేవి. నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్మించాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య విభాగాలు రావటంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ.2కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5 కోట్లు ఖరీదు చేసే సీటీ స్టిమ్యూలేటర్ వంటి వైద్య పరికరాలను ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు ఇచ్చింది. దాంటోపాటుగా పెట్ సీటీ పరికరాన్ని సైతం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత పెట్ సీటీ వైద్య పరికరం నేడు నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు వచ్చింది. వైద్య పరికరం వచ్చిందన్న ఆనందం కన్నా వైద్య పరీక్ష చేయించుకునేందుకు రూ.7వేలు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారనే బాధే నేడు ఎక్కువ మంది రోగుల్లో నెలకొంది. -
సందేశాత్మకం.. హాస్యభరితం
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మనిషికి ప్రాణం ఎలాగో.. జీవితంలోనూ కళలు అంతే ముఖ్యమని..సంస్కృతి, సంప్రదాయాలకు అవే మూలమని డాక్టర్ చెరుకూరి తేజస్వి చెప్పారు. చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఉభయ తెలుగురాష్ట్రాల స్థాయి 9వ ఆహ్వాన నాటికల ముగింపు పోటీలను ఆదివారం ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక సీఆర్ క్లబ్ ఆవరణలో స్వర్గీయ నాగభైరు సుబ్బారావు కళా ప్రాంగణంలో మూడోరోజు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి భారీవర్షం కారణంగా చివరి ప్రదర్శన దొందు–దొందే నాటిక నిలిచిపోగా, దాన్ని మరుసటి రోజు తొలి ప్రదర్శనగా వేశారు. దీంతో ముగింపురోజు నాలుగు ప్రదర్శనలు అయ్యాయి. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, క్లబ్ కోశాధికారి మక్కెన నరసింహారావు, ప్రజానాట్యమండలి నాయకుడు నూతలపాటి కాళిదాసు, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి ఏవీ శివయ్య, ఆళ్ల హరిబాబు, కొత్త శివ, కేవీ మంగారావు, సత్యానందం, ఉమర్ తదితరులు పాల్గొన్నారు. నవ్వించిన ‘దొందూ–దొందే’ లోపం లేని వాడు లోకంలోనే లేడని మనలోని లోపాల్ని కాదు ప్రేమను పంచినపుడే జీవితం సంతోషంగా ఉంటుందని చాటింది భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి ‘దొందు–దొందే’ నాటిక. భారీపొట్టతో 40 ఏళ్లుదాటినా సంబంధాలు రాని ఓ యువకుడు తన లోపాన్ని పెళ్లికి ముందే భాగస్వామికి తెలియజేయాలని కుటుంబ సభ్యులతో చెబుతాడు. రేచీకటి ఉన్న యువతి తో అసలు విషయం చెప్పకుండా పెద్దలు వైభ వంగా వివాహం చేస్తారు. తొలిరాత్రి విషయం బహిర్గతం కావడంతో నూతన దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకుల కావాలంటారు. ఇరు కుటుంబాల్లో గందరగోళం మొదలవుతుంది. మనిషిలోని లోపాల్ని బలహీనతలుగా కాక, సహనం, ప్రేమతో చూసినపుడే జీవితాన్ని సాఫీగా ముందుకు సాగించడం సాధ్యమ వుతుందని తెలిపే సందేశంతో నాటిక ముగుస్తుంది. స్వీయరచనకు డేవిడ్‌రాజు దర్శకత్వం వహించారు. ●అదేవిధంగా కార్పొరేట్ హాస్పటళ్ల ధనార్జనపై అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’, పాశ్చాత్య మోజుతో భారతీయ సంస్కృతిని వీడకు అనే సందేశంతో ది అమోచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ వారి ‘ఆలీతో సరదాగా’, అతి గారాబం వల్ల కలిగే కష్టనష్టాలపై గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నాన్న నేనొచ్చేస్తా’ నాటికలు అలరించాయి. ముగిసిన తెలుగు రాష్ట్రాలస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
తెనాలి అర్బన్: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంటే బ్యానర్లు పెట్టుకుని రోడ్లపై తిరగడం కాదని, ఉద్యోగులంతా ప్రజలకు మెరుగైన సేవలందించడమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం శివాజీ చౌక్ నుంచి మార్కెట్ వరకు నిర్వహించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు తమకు నూతన పింఛన్లు, రేషన్‌కార్డులపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పనిసరిగా వారానికి ఒకసారి ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పలువురు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఆరోగ్యాధికారిణి డాక్టర్ కె.హెలెన్ నిర్మల, హౌసింగ్ ఈఈ భాస్కర్, పెద్దసంఖ్యలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ -
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
నరసరావుపేట: సిబ్బంది పని చేసే చోట పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యం మెరుగవుతుందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతి మూడో శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, ఆర్ఐలు గోపీనాథ్, కృష్ణ, యువరాజ్, పోలీస్ సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసుస్టేషన్లలో శ్రమదాన కార్యక్రమాలు జరిగాయి. పిచ్చి మొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించి, ప్రజలకు శుభ్రతపై అవగాహన పెంచారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా సేవలు
నరసరావుపేట: పల్నాడు జిల్లా ప్రభుత్వ హాస్పిటళ్ల పర్యవేక్షణాధికారి (డీసీహెచ్ఎస్)గా నియమితులైన డాక్టర్ ఎం.ప్రసూన శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం అందుకున్న కలెక్టర్.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్యకలాపాలన్నీ సక్రమంగా నడిచేలా చూడాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డాక్టర్ ప్రసూన స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చర్మ వ్యాధుల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ బీవీ రంగారావు గుంటూరు జిల్లాకు బదిలీ అయిన విషయం విదితమే. అప్పటి నుంచి పల్నాడుకు ఆయనే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. క్రీడాసామగ్రి అందజేత నరసరావుపేట: వేసవి క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. వేసవి సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న 50 ఉచిత శిక్షణ శిబిరాల ఇన్చార్జులకు శనివారం కలెక్టరేట్లో క్రీడా సామగ్రిని అందజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయస్థాయి వరకు క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా క్రీడాధికార సంస్థ కోచ్ నరసింహారెడ్డి, క్యాంపు శిబిరాల ఇన్చార్జులు, విద్యార్థులు పాల్గొన్నారు. పచ్చదనం పెంపునకు చర్యలు నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర‘ కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం ‘బీట్ ద హీట్ ‘థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పాల్గొన్నారు. పచ్చదనంతోనే ఎండ నుంచి ఉపశమనం పొందేలా కలెక్టరేట్ కాంపౌండ్‌లో మొక్కలు నాటారు. చల్లదనాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. మొక్కలతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నకరికల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిమి బడే సాహెబ్ (69) పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. గ్రామశివారులో ఇటుక బట్టీల వద్ద రోడ్డు దాటుతుండగా చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆతనికి తీవ్రగాయాలు కాగా, నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
గుంటూరు మెడికల్ : పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమైన గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యాధి లక్షణాలు క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు. బాధితులు రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ఐబీడీ వ్యాధిపై అవగాహన అవసరం అంటున్న వైద్యులు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు రేపు వరల్డ్ ఐబీడీ డే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. -
ఆసియా పోటీల్లో పతకాలతో షానూన్
డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన మరో యువతి మదిర షానూన్ రాణించింది. జూనియర్స్‌లో 47 కిలోల కేటగిరీలో తలపడిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే రజత పతకం, మూడు కాంస్య పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 100 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 42.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 110 కిలోల బరువులనెత్తిన షానూన్ డెడ్‌లిఫ్ట్‌లో రజతం, స్క్వాట్, బెంచ్‌ప్రెస్, ఓవరాల్ ప్రదర్శనలో మూడు కాంస్య పతకాలను అందుకుంది. ఆసియన్ యూనివర్సిటీ కప్– 2025లో పాల్గొన్న షానూన్ నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. రెండు ఈవెంట్లలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలను గెలుచుకుంది. -
మేరా భారత్ మహాన్
గుంటూరు మెడికల్: ఉగ్ర దాడులతో భారత్‌ను భయపెట్టాలని పాకిస్థాన్ చూసింది కానీ చివరకు తోక ముడిచిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడంతోపాటు కాల్పులను దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ నుంచి బయలుదేరి ఏసీ కాలేజీ, శంకర విలాస్ బ్రిడ్జి మీదుగా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదంపై తిరుగులేని విజయం సాధించామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయం భారత సైన్యం, ఎన్డీఏ విజయంగా పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ షజీల, కూటమి ప్రభుత్వ నేతలు పాల్గొన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థుల సంఘీభావం కళాశాల, పాఠశాలల విద్యార్థులు 75 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని, పెద్దఎత్తున తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలిపారు. బీజేపీ నేతలు నూకల మధుకర్ జీ, బిట్ర వెంకట శివన్నారాయణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. అమర వీరులకు సంఘీభావంగా తిరంగా యాత్ర -
నవతరానికి పుస్తక పఠనం అవసరం
నగరంపాలెం: నవతరానికి పుస్తక పఠనం అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ ఐదో వీధిలోని గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీసు ఆర్గనైజేషన్ ప్రాంగణంలో శనివారం ఏపీ అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సంబరాల్లో భాగంగా కవితా స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు. సాహితీవేత్త భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను నవతరం చదవడం అవసరమని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ సమితి అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఛాయారాజ్, ఎండ్లూరి సుధాకర్, నూతలపాటి గంగాధరం, పఠాభీల కవిత్వాన్ని ఈ తరం సులభంగా చదువుకునేలా అందిస్తున్న అరసం కృషి మరువలేనిదని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకాలు కవి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఉన్నాయని తెలిపారు. అనంతరం యుద్ధం– శాంతి అంశంపై కవితా గోష్టి నిర్వహించారు. బండికల్లు జమదగ్ని, మేడిశెట్టి సుభద్ర, హేమలత, ఎం.లలితకుమారి హజరయ్యారు. జనసాహితి దివికుమార్, రచయిత్రి మందరపు హైమావతి, అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్
తెనాలి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. అద్దె భవనాల్లో నడుస్తున్న సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మిస్తూ వచ్చింది. పనులు చాలా వరకు పూర్తికాగా, అక్కడక్కడా తుది దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్ని ఆపేసింది. అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవడం లేదు. ప్రజల చెంతకు వైద్య సేవలు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలు నివసించే ప్రాంతంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అప్పటికే పట్టణ ముత్యంశెట్టిపాలెంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు అదనంగా అయితానగర్, సుల్తానాబాద్, కొత్తపేట, మారీసుపేట, పాండురంగపేటలో ఏర్పాటుచేసింది. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంది, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి, సత్వరమే రోగుల సేవల్ని ఆరంభించింది. ప్రత్యేకంగా లేబరేటరీని కూడా సమకూర్చింది. ప్రతి పట్టణ ఆరోగ్యకేంద్రంలో 60 రకాల వైద్య పరీక్షలకు అవకాశం కల్పించింది. వివిధ వ్యాధులకు మొత్తం 178 రకాల మందులను అందుబాటులో ఉంచింది. దీనితో తెనాలి ప్రజలకు ప్రతి చిన్న అనారోగ్యానికి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. సమయం ఆదా కావడం, రవాణా చార్జీల భారం తగ్గడంతో ప్రజలు సంతోషించారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు నాంది ఆర్బన్ హెల్త్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంకట్టింది. ఒక్కో సెంటర్‌కు రూ.1.10 కోట్లు చొప్పున పట్టణంలోని ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లకు రూ.5.50 కోట్లను కేటాయించింది. పట్టణంలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం, అయితానగర్–నేలపాడు రోడ్డు, సుల్తానాబాద్‌లో నిర్మాణం పూర్తయింది. ప్రైవేటు భవనాల్లోంచి ఆయా కేంద్రాలను శాశ్వత భవనాల్లోకి మార్చారు. నాటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా వైద్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజల కూడా సంతృప్తిని వ్యక్తంచేశారు. పనులు పెండింగ్ పట్టణంలో ఏర్పాటైన అయిదు అర్బన్ హెల్త్ సెంటర్లలో మూడింటికి శాశ్వత భవనాలు నిర్మాణం పూర్తయింది. చంద్రబాబునాయుడు కాలనీ, ఆలపాటినగర్‌లో తుదిదశలో ఉన్నాయి. అప్పట్లో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటంతో ఆ పనులు పెండింగులో ఉండిపోయాయి. ● చెంచుపేట పరిధిలోని ఆలపాటినగర్లోని ఆరోగ్య కేంద్రం భవనం పనులు దాదాపు 90 శాతం పూర్తయింది. ఫ్లోరింగ్, ర్యాంప్, ఇతర చిన్న, చిన్న పనులు మాత్రమే నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.10లక్షల ఉంటుందని అధికారుల అంచనా. ● చంద్రబాబునాయుడు కాలనీలో గ్రౌండ్ ఫ్లోరింగ్, రంగులు, టాయిలెట్స్ నిర్మాణం వంటి రూ.20లక్షల పనులు పెండింగులో ఉండిపోయాయి. ప్రైవేటు భవనాల్లో అవస్థలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు. భవనాలకు తాళాలు వేసి అధికారులు అలాగే ఉంచారు. వైద్య కేంద్రాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో అరకొర వసతులోనే కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తిచేసి ప్రజలకు సెంటర్లను అందుబాటులోకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. అర్బన్ హెల్త్ కేంద్రాల నిర్మాణం పూర్తికి చొరవ చూపని పాలకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.5.50 కోట్లతో ఐదు సెంటర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మూడు కేంద్రాలు మిగిలిన రెండు కేంద్రాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ ఆరంభించని చివరి దశ పనులు పెండింగ్ పనుల పూర్తికి సన్నాహాలు పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీ, ఆలపాటి నగర్‌లోని ఆర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి గురించి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక అడిగారు. మంత్రి ఆదేశాలతో నిర్మాణ పనులను పూర్తిచేసి, ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తాం. – ఆకుల శ్రీనివాసరావు, ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్, తెనాలి -
పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే రావాలి
నరసరావుపేట: జిల్లాలో ఎస్ఎస్సీ, ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. శనివారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షలకు 4766 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియేట్, ఎస్ఎస్సీ పరీక్షలు జిల్లాలోని పది సెంటర్లలో మొత్తం 1464 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశామని, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటుచేసినట్లు జేసీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్‌గా ప్రకటించినందున విద్యార్థులు, పరీక్ష సిబ్బంది తమ వద్ద ఎటువంటి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కేఎంఏ హుస్సేన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ అధికారులతో సమన్వయ సమావేశం -
పవర్ఫుల్ ఉమెన్
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈనెల 12న ముగిసిన ఆసియా సబ్ జూనియర్, జూనియర్ ఎక్విప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జూనియర్స్ 84 కిలోల విభాగంలో తలపడిన షేక్ షబీనా నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 190 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 85 కిలో లు, డెడ్ లిఫ్ట్‌లో 180 కిలోలు, ఓవరాల్‌గా 455 కిలోల బరువులనెత్తి నాలుగింటిలోనూ బంగారు పతకాలను కై వసం చేసుకోవడం విశేషం. ఇదే వేదికపై ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లో నూ కేఎల్ యూనివర్సిటీ తరఫున పాల్గొన్న షబీనా మరో నాలుగు బంగారు పతకాలను సా ధించింది. స్ట్రాంగ్ ఉమెన్ పోటీలో మూడో స్థానంలో నిలిచింది. రెండు ఈవెంట్లలో కలిపి ఎనిమిది బంగారు పతకాలను షబీనా సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట షబీనాకు అంతర్జాతీయ పోటీల్లో పతకాల సాధన కొత్త కాదు. 2024 మేలో హాంకాంగ్‌లో జరిగిన ఆసియన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ కమ్ ఆసియన్ యూనివర్సిటీ కప్–2024 పోటీల్లోనూ మెరిసింది. జూనియర్ విభాగంలో పోటీ పడిన షబీనా స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో బంగారు పతకాలను సాధించింది. మూడు విభాగాల్లోనూ కలిపి టోటల్లోనూ మరో పతకంతో మొత్తం నాలుగు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. 2023మేలో కేరళలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. తమిళనాడులో జరిగిన జాతీయ పోటీల్లో ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించిన చరిత్ర ఉంది. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు, రజత పతకం సాధించింది. ఆసియా పోటీల్లో వరుసగా మూడేళ్లు నాలుగేసి బంగారు పతకాలను గెలుచుకోవడం విశేషం. కేవీఐకే అకాడమీలో సాధన 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయిరేవతి, పూసపాటి శివరామకిరణ్రాజు శిక్షణలో స్థానిక కేవీఐకే అకాడమీలో షానూన్ సాధన చేస్తోంది. పట్టణా నికి చెందిన మదిర ప్రభుదాస్, మదిర నయోమి కుమార్తె షానూన్. కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కోవిడ్ సమయంలో ఫిట్నెస్ కోసం ఆమెను కేవీఐకే అకాడెమీలో చేర్పించారు. తనలోని టాలెంట్‌ను గుర్తించిన కోచ్ ప్రోత్సాహంతో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలను సాధిస్తోంది. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి యువతుల సత్తా ఆసియా పోటీల్లో మెరిసిన బంగారాలు షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణ పతకాలు మదిర షానూన్కు నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు -
పల్నాడు
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025రేపటి నుంచిఆక్రమణల తొలగింపు వినుకొండ: వినుకొండలోని శివయ్య స్థూపం సెంటరులో ఆక్రమణలను ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు పొన్నూరు: పొన్నూరులోని గాంధీ బొమ్మ సెంట ర్, గుంటూరు బస్టాఫ్ల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలను శనివారం ఏర్పాటుచేశారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ప్రారంభించారు. శంకరమ్మ తల్లి తిరునాళ్ల చెరుకుపల్లి: మండల పరిధిలోని బలుసులపాలెం గ్రామంలో వేంచేసియున్న శంకరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2025ను నిర్వహిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 41,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 34,148, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 7,106, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలను కలుపుకుని మొత్తం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షల జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 41,319 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41,319 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 25,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 21,551, అగ్రికల్చర్, ఫార్మసీ 4,100, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 41 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 11,126 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 9,198, అగ్రికల్చర్, ఫార్మసీ 1,912, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 16 మంది ఉన్నారు. –బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల పరిధిలో మొత్తం 4,501 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 3,399, అగ్రికల్చర్, ఫార్మసీ 1,094, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి. 7న్యూస్రీల్నిముషం ఆలస్యమైనా నో.. ఎంట్రీ ఏపీ ఈఏపీ సెట్‌కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిముషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిముషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 41,319 మంది విద్యార్థులు మూడు జిల్లాల్లో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు నిముషం ఆలస్యమైనా నో... ఎంట్రీ -
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
గుంటూరు మెడికల్ : పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమైన గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యాధి లక్షణాలు క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు. బాధితులు 40 ఏళ్ల లోపు వారే రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ఐబీడీ వ్యాధిపై అవగాహన అవసరం అంటున్న వైద్యులు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు రేపు వరల్డ్ ఐబీడీ డే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. -
జులై 5న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, రెవెన్యూ, మోటర్ వాహన ప్రమాదాలు, చెల్లని చెక్కు, మనోవర్తి, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరారు. సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లైతే ఫీజు వాపస్ చేస్తారని తెలిపారు. జెడ్పీలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీట్ ది హీట్ నినాదంతో పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. వేసవిలో ఎండల తీవ్రత, వడగాలలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీ తెనాలిఅర్బన్: స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ మార్కెట్లో శనివారం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసి ఫ్లెక్సీ వివాదస్పదంగా మారింది. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో పలువురు జనసేన పార్టీ నాయకులు కమిషనర్ బండి శేషన్నను ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ ఆయనను హెచ్చరించారు. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ● గుంటూరు, పల్నాడు జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ● ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఆన్లైన్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. గత జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో జరిగిన మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం జరగనున్న అడ్వాన్స్‌డ్‌కు హాజరు కానున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల పరిధిలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లు జరగనున్నాయి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులో పొందుపర్చిన నియమ, నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. పలు రైళ్లు రద్దు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్ పరిధిలో గ్రూప్–డీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ–గుంటూరు (57201), గుంటూరు–మాచర్ల(57203), మాచర్ల–నడికుడి(57206), నడికుడి–మాచర్ల(57205), మాచర్ల–గుంటూరు(57204), గుంటూరు– విజయవాడ(57202) రైళ్లు ఈనెల 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. కాచిగూడ–నడికుడి(67779), నడికుడి–కాచిగూడ(67780) రైలు ఈనెల 18, 19 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. -
అప్పుడేం జరిగిందో గుర్తులేదా?: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్సీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్ జగన్‌ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్‌రెడ్డి చెప్పారు.మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి హెచ్చరించారు. -
క్యాన్సర్ రోగులకు శుభవార్త
● జీజీహెచ్‌లో రూ. 18 కోట్లతో పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ● తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందించేందుకు నాట్కో ట్రస్టు చైర్మన్ వి.సి.నన్నపనేని సుమారు రూ. 50 కోట్లతో గుంటూరు జీజీహెచ్‌లో వంద పడకలతో ఐదంతస్తుల క్యాన్సర్ వార్డు నిర్మించారు. తాజాగా రూ. 20 కోట్లతో మరో క్యాన్సర్ భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లాది విలువైన క్యాన్సర్ మందులను సైతం నాట్కో ఫార్మా వారు ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా సుమారు రూ. 18 కోట్లతో ప్రభుత్వం వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందజేసింది. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు క్యాన్సర్ సోకుతుందా, లేక అక్కడే ఉందా, అనే పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయించేందుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరికరం అందుబాటులోకి రావడం ద్వారా పేద క్యాన్సర్ రోగులకు మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నాట్కో ట్రస్టు వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్టు కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్‌లు తెలిపారు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్ అడ్డగింత
ప్రత్తిపాడు: కేంద్ర మంత్రి పెమ్మసానికి నీటి ఎద్దడి సెగ తగిలింది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండంటూ గ్రామస్తులు, మహిళలు రోడ్డెక్కి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం తిమ్మాపురంలో గిడ్డంగి ప్రారంభోత్సవానికి గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గ మధ్యలో కోయవారిపాలెంలో గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై కాన్వాయ్‌ను స్థానిక మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, చెరువు కూడా అడుగంటిందని, కొద్ది రోజులుగా సురక్షిత మంచి నీటికి దిక్కులేకుండా పోయిందంటూ గ్రామస్తులు సమస్యను ఏకరువు పెట్టారు. అడుగంటిన రక్షిత మంచినీటి చెరువు నీటిని తీసుకువచ్చి మంత్రికి చూపించారు. అంతేకాకుండా చెరువులు నింపుకొనేందుకు కాలువల్లో నీళ్లు రావడం లేదని తెలిపారు. ఒక వేళ నీళ్లు వదిలినా కాలువలు పూడిపోయి ఉన్నాయని చెప్పారు. నీళ్లు చెరువు వరకు వచ్చే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనికి ఒక్కసారి వచ్చి అడుగంటిన మా చెరువు దుస్థితిని చూడాలని మహిళలు, స్థానికులు పట్టుబట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని వెంటనే గ్రామంలోనికి ఐదు పెద్ద వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలువ మరమ్మతులకు తన నిధుల నుండి రూ.రెండు లక్షలు కేటాయిస్తానని చెప్పారు. రేపటి నుంచే పనులు ప్రారంభించుకోవాలని, కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారని స్థానికులు వివరించారు. ఇంతలో స్థానిక పెద్దలు, పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పడంతో కాన్వాయ్ ముందుకు సాగింది. కొద్దిరోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన గ్రామంలోనికి వచ్చి చెరువు చూస్తే సమస్య అర్థమవుతుందని మహిళల వినతి వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగిన మంత్రి -
డొంకరోడ్లో అస్తిపంజరం కలకలం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులు గుట్టుచప్పుడు వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఘటనలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ కేసులను నీరు గారుస్తున్నారనే విమర్శలు తరచు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వడ్డేశ్వరం – ఇప్పటం బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున ముళ్లపొదల్లో గుర్తుతెలియని అస్తిపంజరం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఎముకల గూడును అక్కడి నుంచి తరలించారు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో ముళ్లపొదల్లో మూడు నాలుగు నెలల క్రితం మృతదేహాన్ని పడవేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం పోలీసులు బయటకు తీసిన అస్తిపంజరం పురుషునిదా? లేదా మహిళదా? అనేది నిర్ధారించడానికి కూడా వీలులేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహంపై దుస్తులు ఉంటే వాటికి సంబంధించి మగవారు అయితే షర్ట్ బటన్లు, ప్యాంట్ బకిల్స్, జిప్ లాంటివి లభించేవి. ఆడవారు అయితే హెయిర్ పిన్స్ కానీ, జాకెట్ హుక్స్ కానీ ఉండేవి. ఎవరైనా చంపి ఆధారాలు లభించకుండా దుస్తులను తీసివేసి ఆ మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సబ్ డివిజన్లో పెరిగిన హత్యలు మహిళదా, పురుషుడిదా అని నిర్ధారించలేని పరిస్థితి గుట్టుచప్పుడు కాకుండా ఎముకలను తొలగించిన పోలీసులు హత్య కేసులు పెరుగుతున్నా ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం ఈ మధ్యకాలంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో వేశ్యలు, ట్రాన్స్‌జెండర్స్ ఎటువంటి జన సంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గొడవలు ఏర్పడినపుడు, ఆధిపత్య పోరు వచ్చినప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్‌లోని కొలనుకొండలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో గుంటూరు చానల్ ఒడ్డున ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పెదవడ్లపూడి – కాజ మధ్య పొలాల్లోని బీటీ రోడ్లో ఓ ట్రాన్స్‌జెండర్ తన ప్రియుడి కోసం మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంఘటనలు జరిగినా తాడేపల్లి పోలీసులు మాత్రం అస్తిపంజరం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎటువంటి విచారణ చేయకుండా ఆ అస్తిపంజరాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చురీకి తరలించారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల గూడుకు పోస్ట్‌మార్టం చేయలేమని చెప్పడంతో పోలీసులు గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. -
జానపాడు ఆర్ఓబీకి శంకుస్థాపన
పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు హాజరై ప్రారంభించారు. సుమారు రూ.50.5 కోట్ల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నట్లు వారు పేర్కొన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. వెంకటపాలెం యూపీ స్కూల్లో చోరీ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం యూపీ స్కూల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం జానకీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఇటీవల ప్రధానమంత్రి రాక నేపధ్యంలో వసతి కోసం పోలీసులకు పాఠశాలను ఇచ్చామని, కార్యక్రమం అనంతరం ఆఫీసు గదిలో ఉన్న రూ.20 వేల పెద్ద సౌండ్ బార్, రూ.3 వేల చిన్న సౌండ్ బాక్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం తెనాలి: స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 11 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెల లో నిర్వహించిన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. నిత్యాన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలను అందచేశారు. హిందూపూర్‌కు చెందిన బి.నవీన్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ శీనానాయక్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందచేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన శీలం సాయి ఫణీంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం సమర్పించింది. -
పీజీఆర్ఎస్కు వెల్లువెత్తిన అర్జీలు
● పిడుగురాళ్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే పిడుగురాళ్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు వెల్లువెత్తాయి. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గురజాల నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని విచ్చేశారు. ప్రజలు పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. మండలంలోని కరాలపాడు గ్రామంలోని శ్మశాన వాటికకు దారి లేదని, వాగులో నుంచి నడుచుకుంటూ శ్మశానవాటికకు వెళ్లాల్సి వస్తుందని, దారి చూపించాలని కరాలపాడు గ్రామానికి చెందిన ఇందిర అర్జీ అందజేశారు. అదేవిధంగా పిడుగురాళ్లలోని బైపాస్ పక్కన స్థలం కొనుగోలు చేస్తే, పక్క స్థలం వారు రెండు సెంట్లు ఆక్రమించకున్నారని, పరిశీలించి న్యాయం చేయాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అర్జీని అందజేశారు. అదేవిధంగా పొలాలు, స్థలాల ఆక్రమణలు, ఏళ్ల తరబడి అడంగల్, ఆన్లైన్ ఉన్నా పాస్ పుస్తకాలు ఇవ్వపోవడం, రెవెన్యూ సంబంధిత సమస్యలతోపాటు, పెన్షన్లు, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగటం లేదంటూ పలువురు అర్జీలు అందజేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖ, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అర్జీలు అధిక సంఖ్యలో వచ్చాయి. వీటన్నిటిని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి, పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. దుర్గమ్మకు వెండి పంచపాత్ర ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్రను సమర్పించారు.సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది. 50 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. సాక్షి, నరసరావుపేట: గురజాల పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో సిబ్బంది కొరత భారీగా ఉంది. పిడుగురాళ్ల, దాచేపల్లి లాంటి స్టేషన్లు కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా మిగిలిన వాటిలో కేటాయించిన సిబ్బందిలో కనీసం సగం మంది పోలీసులు సైతం ఉండని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాల ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సబ్ డివిజన్ పరిధిలో వైఎస్సార్ సీపీ సానుభూతిపర గ్రామాలు, ప్రజలపై కూటమి నేతలు మూకుమ్మడి దాడులు చేస్తూ భయానక వాతావరణం నెలకొల్పారు. అడ్డుకోవాల్సిన పోలీసులు మిన్నకుండి.. సిబ్బంది లేని కారణంగా తామేమి చేయలేకపోతున్నామంటూ చేతులెత్తేస్తున్నారు. ఉన్న అరకొర సిబ్బందిని తమ రాజకీయ కక్షసాధింపుల కోసం అధికార పార్టీ వినియోగిస్తోంది. కక్ష సాధింపులకే సరి గురజాల సబ్ డివిజన్ పరిధిలోని వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటాడి మరీ అరెస్టులు చేయడానికి పోలీసులను వినియోగిస్తున్నారు. దీంతో ఆయా స్టేషన్లలో వందలాది కేసులు పెండింగ్‌లో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ డివిజన్ పరిఽధిలో ఏడాది కాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చి రాత్రికి రాత్రి ఇళ్లను దోచేసి పారిపోతున్నారు. వీరిని గుర్తించి ఆయా రాష్ట్రాలకు వెళ్లి నగదు, బంగారు రికవరీ చేయాల్సి రావడం తలకు మించిన భారం కావడంతో ఆయా కేసులు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోవైపు తెలంగాణతో మూడు అంతర్రాష్ట్ర సరిహద్దులు ఈ సబ్‌డివిజన్ పరిధిలోనే ఉండటం గమనార్హం. డిప్యుటేషన్లపై ఇతర ప్రాంతాలకు.. జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీసు సబ్ డివిజన్లు ఉండగా దాదాపుగా పోలీసు సిబ్బంది అంతా నరసరావుపేట సబ్ డివిజన్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతుంటారు. నరసరావుపేట పట్టణ పరిధిలో మూడు స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఇతర ప్రాంతాలతో పోల్చితే అధిక అలవెన్స్‌లు దక్కుతాయి. మరోవైపు తమకు, తమ పిల్లలకు విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నది వారి వాదన. మరోవైపు యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట టౌన్, రూరల్ స్టేషన్లకు రావడానికి సిబ్బంది ఉత్సాహం చూపుతారు. గురజాల సబ్ డివిజన్ పోవడమంటే పనిష్మంట్ లాగా సిబ్బంది భావిస్తారు. సాధారణ బదిలీలలో భాగంగా గురజాల సబ్ డివిజన్‌కు కేటాయించినా తమకు తెలిసిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడితో నరసరావుపేట సబ్ డివిజన్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు గురజాల సబ్‌డివిజన్‌కు కొత్తగా సిబ్బందిని కేటాయించాల్సిందిపోయి ఉన్న అరకొర సిబ్బందిని సైతం డిప్యూటేషన్లపై పంపడం వల్ల సమస్య తీరకపోగా మరింత ముదురుతోందన్న వాదన పోలీసు శాఖలో వినిపిస్తోంది. గతంలో మాచర్ల లాంటి ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి జంగిల్ అలవెన్స్ పేరుతో కొంత చెల్లించేవారు, ప్రస్తుతం ఆ అలవెన్స్ రాకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. గురజాల సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం సిబ్బంది లేక ఇబ్బంది 7న్యూస్‌రీల్ ఆయా పోలీస్ స్టేషన్లలో భారీగా వేధిస్తున్న సిబ్బంది కొరత అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా మాచర్ల, గురజాల గుర్తింపు రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న కూటమి నేతలు వెనుకబడిన ప్రాంతం, విద్యాసంస్థలు, వంటి వసతులలేమి మరో కారణం డిప్యూటేషన్ల ద్వారా నరసరావుపేట, చిలకలూరిపేట సర్కిళ్లకు వెళ్తున్న వైనం నెలన్నరగా గురజాల డీఎస్పీ పోస్టు ఖాళీ రెండు నెలలుగా సెలవుపైనే మాచవరం ఎస్ఐ పెండింగ్‌లో వందలాది కేసులు డీఎస్పీ పోస్టు సైతం ఖాళీనే... గురజాల సబ్ డివిజన్లో ఓ వైపు పోలీసు సిబ్బంది కొరత వేధిస్తుంటే మరోవైపు ఏకంగా డీఎస్పీ పోస్టు నెలన్నరగా ఖాళీగా ఉంది. ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన జగదీష్‌పై కూటమి నేతలు, కొంతమంది పోలీసు అధికారులు పట్టుబట్టి వేటు వేయించారనే ప్రచారముంది. ప్రస్తుతం సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతురావు ఇన్చార్జిగా ఉన్నారు. మరోవైపు మాచవరం ఎస్ఐ పోస్టు మార్చి 5వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం అక్కడ దాచేపల్లి ఎస్ఐ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మాచర్ల టౌన్ పోలీసుస్టేషన్లో 45 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. వారే రాత్రి పూట గస్తీలు, స్టేషన్లో ఉండాల్సిన సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్‌గా పనిచేయాల్సి వస్తోంది. గురజాల సర్కిల్ పోలీసుస్టేషన్లో 50 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మాచర్ల రూరల్ పోలీసుస్టేషన్లో 16 మందికి గాను కేవలం ఎనిమిది మంది. మాచవరం పోలీసు స్టేషన్లో 25 మంది సిబ్బందిగాను కేవలం 15 మంది. వెల్దుర్తి పోలీసుస్టేషన్లో 35 మంది సిబ్బంకి గాను 21 మంది పనిచేస్తున్నారు. రెంటచింతల పోలీసుస్టేషన్లో రెండు ఏఎస్ఐ, మూడు హెడ్‌కానిస్టేబుల్స్, రెండు కానిస్టేబుల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
చేయి తిరిగేలా క్రీడా శిక్షణ
తెనాలి: పట్టణ పరిధి చెంచుపేటలోని అమరావతి కాలనీలో డీఎస్ఏ స్టేడియానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో సకల వసతులు సమకూరిన విషయం తెలిసిందే. చేపట్టిన నిర్మాణాలు, దాతల సహకారంతో అందిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో క్రీడలకు సంసిద్ధం చేశారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శాప్’ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచింది. తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు సంస్థ యాజమాన్యం ఇందుకు సహకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అకాడమీని పక్కన పెట్టారు. ఉదయం, సాయంత్ర వేళల్లో... ప్రస్తుతం వేసవిలో శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్‌లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో తెనాలికి గల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శిబిరం నడుస్తోంది. 23 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు అండర్–14, అండర్–17, సబ్‌జూనియర్ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ఆడినవారూ ఉన్నారు. కొత్తగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారూ వస్తున్నారు. రోజూ ఉదయం 6–8 గంటలు, సాయంత్రం 4–7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం హ్యాండ్‌బాల్ కోచ్ నాగరాజు సెలవులో ఉండటంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్), పాటియాలలో శిక్షణ పొందుతున్న హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు పి.కాలేబును కోచ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఫిట్నెస్, క్రీడలో టెక్నిక్స్, స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే శిబిరాన్ని అవసరమైతే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) ఆధ్వర్యంలోని తెనాలి స్టేడియంలో హ్యాండ్‌బాల్ కోచ్‌గా నన్ను నియమించారు. నా పర్యవేక్షణలో వేసవి క్రీడాశిబిరం నడుస్తోంది. గతంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాను. ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకుంటూ నాకున్న అనుభవంతో వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నా. క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. – పి.కాలేబు, కోచ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచితంగా తర్ఫీదు ‘శాప్’, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో తెనాలి క్రీడాస్టేడియం ఇప్పుడు శిక్షణకు వేదికగా నిలిచింది. వేసవి సెలవుల్లో ఇండోర్, అవుట్డోర్ ఆటల్లో చిన్నారులు సాధన చేస్తున్నారు. హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచిన ఈ స్టేడియంలో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఎన్ఐఎస్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. -
విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం
పర్చూరు(చినగంజాం): విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం పర్చూరు నెహ్రూనగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నెహ్రూనగర్ కాలనీకి చెందిన నల్లబోతుల రాజాకు చెందిన పూరింటిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుంది. దాంతో పూరిల్లు పూర్తిగా తగులబడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇంటిలోని నగదు, వెండి ఆభరణాలు, విలువైన కాగితాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, సకాలంలో అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి అదుపులోనికి తీసుకొని వచ్చారు. సుమారు రూ.లక్షపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రూ.లక్షకు పైగా నష్టం -
హెచ్ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై కళాజాత బృందాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించి హెచ్ఐవీ బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. పది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై జరుగనున్న కళాజాత బృందాల కార్యక్రమాలను గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులకు సైతం హెచ్ఐవీ గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పడంలో కళాజాత బృందాల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ డి.శ్యామ్సన్, జిల్లా సూపర్వైజర్ జ్యోతుల వీరాస్వామి, కొత్తపేట మహిళ మండలి, సిరి మహిళ సాధికారిత మండలి, మాధురి మహిళ సొసైటీ, లింక్ వర్కర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారు తీరుతో గందరగోళంగా పాఠశాల విద్య
లక్ష్మీపురం: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను జీవో నెం. 19, 20, 21ల ద్వారా 9 రకాలుగా విభజించి వేల సంఖ్యలో ఉపాధ్యాయులను మిగులుగా చూపించి పాఠశాల విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రఘునాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేట జిల్లా సీపీఐ కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఉన్న జీవో నెం.117 అనేది ఉన్నత పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. దాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు జివోలు దాంతోపాటు ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీల ప్రమోషన్లను గండి కొట్టేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు .ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మూడు రకాలుగా విభజించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్టీయూ ప్రధాని కార్యదర్శి కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ బదిలీల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెచ్చి ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వర రావు, రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ ప్రకాష్ రావు ఆయా సభ్యులు అడిగిన విషయాలను వివరించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
కార్మికులకు మెరుగైన వసతులు కల్పించండి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి ఆయా గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. రాజధాని నిర్మాణాలలో పనిచేసేంందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు కల్పిస్తున్న సదుపాయాలను ఆమె గురువారం క్యాంపులకు వెళ్లి తనిఖీ చేశారు. మొదట తుళ్ళూరులోని ఆర్వీఆర్ సంస్థ క్యాంపును పరిశీలించారు. ఎండ అధికంంగా ఉండటంతో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. కార్మికులకు భోజన వసతి తదితరాలపై ఆరా తీశారు. కార్మికుల కుటుంబ సభ్యులు వచ్చినపుడు నివసించేందుకు కూడా ప్రత్యేక వసతి కల్పించాలని, వారి పిల్లలు చదువుకునేందుకు సమీప విద్యా సంస్థలకు వెళ్లేదుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరంం ఐనవోలు, శాఖమూరులోని ఎన్సీసీ, ఆర్వీఆర్ సంస్థల క్యాంపులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆమె వెంట ఏడీసీ అధికారులు టి.మోజేస్ కుమార్, డాక్టర్ కె.వి. గణేష్ బాబు, ఎస్ఈలు శ్రీనివాసరావు, నరసింహారావు, బి.శ్రీధర్, ఎస్.శ్రీధర్, టి.పద్మాకర్, రమేష్ తదితరులు ఉన్నారు. -
నల్లబర్లీ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
నరసరావుపేట: పొగాకు కొనుగోలు కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి నల్లబర్లీ పొగాకు సాగుచేసిన రైతులు నిలువునా మునిగిపోతున్నారని, ప్రభుత్వం సైతం వారి గోడు పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులతో ధర్నా నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నల్లబర్లీ పొగాకును కనీస మద్దతు ధర రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ధర కాస్త ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి రైతులను సంప్రదించి ఇతర పంటలు సాగు చేయొద్దని, నల్లబర్లీ సాగుచేస్తే మంచి ధర చెల్లిస్తామని నమ్మించారన్నారు. తీరా పంటచేతికి వచ్చాక కంపెనీలు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మోసాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో పొగాకు సాగుచేపట్టిన రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యాన పంటలపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు రూ. లక్ష ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెబుతున్న వ్యాఖ్యలు గారడీ మాటలను తలపిస్తున్నా యన్నారు. స్పందించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడు తూ దేశంలో వందేళ్ల చరిత్రలో పండించిన పొగాకులో 30శాతం మాత్రమే భారతదేశంలో వినియోగిస్తున్నారని 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే పొగాకును కంపెనీలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. పొగాకు కొనుగోలుకు ఇప్పటికై నా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈనెల చివరిలో రైతులను ఏకంచేసి ఛలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ , రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి కలెక్టరేట్ వద్ద ధర్నాలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతులు అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్‌పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్‌కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్‌లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్‌లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్‌ను వరల్డ్ ఫస్ట్‌క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్‌టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్‌ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్‌లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్‌పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్‌నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్‌నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్‌పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష
సాక్షి,పల్నాడు: మూడు హత్య కేసుల్లో నిందితుడైన తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2023 మే 5న నరసరావుపేటలో సలీమా అనే మహిళను తన్నీరు అంకమ్మరావు దారుణంగా హత్య చేశాడు.అయితే ఈ హత్యపై గురువారం నరసరావుపేట కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం,అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ప్రస్తుతం మరో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అంకమ్మరావు..నరసరావుపేటలో మూడు హత్యలు చేశాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. -
పవర్ లిఫ్టర్ షానూన్కు సత్కారం
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సహా నాలుగు పతకాలు సాధించిన మదిర షానూన్‌ను బుధవారం స్థానిక కేవీఐకే జిమ్‌లో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ హాజరయ్యారు. షానూన్‌ను సత్కరించారు. ఆమె విజయాలు క్రీడాలోకానికి స్ఫూర్తినిచ్చేవని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జిమ్ శిక్షకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి మాట్లాడుతూ తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ చదువుతూ, తెనాలి కేవీఐకే జిమ్‌లో సాధన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలను సాధించిన తర్వాత తొలిసారిగా ఆసియా స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో 47 కిలోల కేటగిరీలో పోటీ పడిందని తెలిపారు. రజత, మూడు కాంస్య పతకాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కేవీఐకే స్పోర్ట్స్ అకాడెమీకి తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించినట్టు తెలిపారు. అకాడమీ తరఫున కొమ్మినేని భార్గవ్‌కుమార్, కోచ్ పూసపాటి శివరామకిరణ్రాజు, ఇతర లిఫ్టర్లు షానూన్‌ను సత్కరించారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
యడ్లపాడు: పిడుగు పాటుకు మహిళ బుధవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతకు వెళ్లారు. సాయంత్రం సుమారు 5 గంటలకు ఉరుములు, మెరుపులు రావడంతో పొలం నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో సమీపాన పిడుగు పడిన భారీ శబ్ధం వినిపించడంతో వారిలో ముగ్గురు మహిళలు కింద పడిపోయారు. వారిలో షేక్ పర్వీన్(35) అనే మహిళ చెవుల నుంచి రక్తం కారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు. వీరిని యడ్లపాడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతురాలి భర్త షేక్ సైదావలి దివ్యాంగుడు. తాపీ పనులు చేస్తుండగా, వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. కెపాసిటీకి మించి ఇసుక రవాణా తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాతో అవస్థలు ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్‌తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. -
తెనాలిలో సదరం క్యాంప్ పునః ప్రారంభం
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువ పత్రాల పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్థో–100, ఈఎన్టీ–50, సెక్రాటిక్ విభాగాలకు చెందిన 50 మంది వికలాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. పాలిసెట్‌లో 97.07 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 30న జరిగిన పాలిసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 97.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలురను అధిగమించిన బాలికలు 97.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. ●గుంటూరు జిల్లాలో పాలిసెట్‌కు హాజరైన 4,129 మంది విద్యార్థుల్లో 4,008 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,587 మంది పరీక్ష రాయగా, 2,497 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ●బాలికలు 1,542 మంది హాజరు కాగా, 1,511 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ●అక్కల బిమల్ రాజేంద్ర 191వ ర్యాంకు, వేమా ప్రేమ్‌కుమార్ 285వ ర్యాంకు, కాకుమాను అన్యూన్య 326వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు. హోమ్స్‌ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్‌లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. శిశు గృహం, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూలులో పిల్లలకు అందుతున్న సదుపాయాలను తనిఖీ చేశారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్‌లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రెజిస్టర్స్ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరం గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. విద్యుత్ వినియోగించిన తరువాత వీలైనంత వరకు వాటిని పూర్తిగా ఆఫ్ చేసుకోవాలని, దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరగదని చెప్పారు. తరచూ విద్యుత్ వైర్లు, స్విచ్‌బోర్డులు తనిఖీ చేసుకోవాలని సూచించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ విధానంతో తిప్పలు
అమరావతి: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టైం స్లాట్ విధానంతో క్రయవిక్రయదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. స్లాట్ తీసుకున్నాక ఎన్ని పనులున్నా ఆ టైంకు వెళ్లాల్సిందే. కొంచెం ఆలస్యమైనా.. చిన్న పొరపాటు జరిగినా... అది రద్దు అవుతోంది. మరోమారు స్లాట్ తీసుకోక తప్పడం లేదు. అందుకోసం మరో రూ. 200 సమర్పించుకోవాలి. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్ చేసేవారు. నూతన విధానంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 39 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయొచ్చు. తాము అనుకున్న సమయం కాకుండా స్లాట్ దొరికినప్పుడే వ్యయప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు చేరుకోవాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ పనిమీద వచ్చిన వారు ఆ రోజు స్లాట్ దొరక్కపోతే మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.పల్నాడు జిల్లాలో అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రాజధాని అమరావతికి సమీపంలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ కార్యాలయం పరిధిలో మండలంలోని అమరావతి, ధరణికోట, దుడుగు, మల్లాది, లింగాపురం, నరుకుళ్ళపాడు, ఎండ్రాయి, కర్లపూడి, ఉంగుటూరు, పెదమద్దూరు, వైకుంఠ పురం, పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు, తాడికొండ మండలంలోని మోతడక, పాములపాడు గ్రామాలున్నాయి. ఇవన్నీ రైతులు ఎక్కువగా ఉన్న గ్రామాలు కావటంతో ఉదయం పూట వ్యవసాయం, లేక పాడి పనులు చూసుకుని రిజిస్ట్రేషన్ల కోసం మధ్యాహ్నం భోజనం చేసుకుని తీరుబడిగా వస్తుంటారు. ఎంత సమయమైనా వేచి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకుని వేళ్లేవారు. ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన టైమ్ స్లాట్ విధానంతో ఉదయం పూట టైమ్ స్లాట్లు పెద్దగా బుక్ కావటం లేదు. మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువ ఉండటంతో స్లాట్ దొరకడం లేదు. కొంతమంది రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రోజులో కేటాయించిన 39 రిజిస్ట్రేషన్లు పూర్తయి.. ఇంకా మిగిలి ఉన్న వారికి సాయంత్రం 5గంటల తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్లు అలా చేయటం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి టైమ్ స్లాట్ కొంత ఇబ్బందిగా మారింది. ఒక రోజు రిజిస్ట్రేషన్ కాకపోతే మరుసటి రోజు ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆన్లైన్ సైట్ పనిచేయకపోతే పడిగాపులు తప్పడం లేదు.గతంలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైం స్లాట్ విధానం 2020 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండేది. గత ప్రభుత్వ హయాంలో క్రయ విక్రయదారులే తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేలా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతనంగా టైం స్లాట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం మార్చి తీసుకొచ్చారు.రెండోసారి బుక్ చేసుకుంటే రూ.200రిజిస్ట్రేషన్ కోసం ఒకసారి టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా, లేక డాక్యుమెంట్లో ఏదైనా పొరపాట్లు జరిగినా స్లాట్ టైం ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాటు బుక్ చేసుకోవాలంటే అదనంగా రూ.200 కట్టాలి. ఇక మూడో సారి అయితే రూ. 500 చెల్లించాలి. ఫలితంగా క్రయ విక్రయదారులపై మరింత ఆర్థికభారం పడుతోంది.స్లాట్ బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యంస్లాట్ విధానం వచ్చిన తర్వాత ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒకటో రెండో స్లాట్లు బుక్ అవుతున్నాయి. మధ్యాహ్నం నుండి స్లాట్లు అధికంగా బుక్ చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజుకు మాకు ఇచ్చిన 39 స్లాట్లు పూర్తయితేనే 5 గంటల తర్వాత స్లాట్ బుకింగ్ లేని వాళ్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.– పి.వెంకటరెడ్డి, సబ్‌రిజిస్ట్రార్, అమరావతి -
నాటక సంస్థలకు జీవం పోసే యత్నం
చిలకలూరిపేట: కళల పరవళ్లు ఎగసిపడే పండుగ సమయం వచ్చేసింది! నాటక రంగానికి నిలయమైన చిలకలూరిపేట పట్టణం మళ్లీ కళాకారుల సందడితో కళకళలాడబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 9వ ఆహ్వాన నాటిక పోటీలు ఈ నెల 16, 17, 18వ తేదీల్లో వైభవంగా జరగబోతున్నాయి. చిలకలూరిపేట సీఆర్ క్లబ్ ఓపెన్ థియేటర్ ప్రేక్షకుల కోసం అందంగా సన్నద్ధమవుతోంది. ‘చిలక లూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి ప్రముఖ నాటక సమాజాలు, రచయితలు, సృజనాత్మక దర్శకులు, అభినయ నిపుణులు హాజరుకానున్నారు. వినోదంతోపాటు ఆలోచనలకు ఆహ్వానం పలికే కళారూపాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ పోటీలకు కళాపరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, సీఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి మక్కెన నరసింహారావు రథసారథులు కాగా.. ప్రముఖ రంగస్థల దర్శకుడు షేక్ షఫీ తదితరులు ఆయా నిర్వహణ పనుల్లో భాగస్వాములయ్యారు. ప్రదర్శనల వివరాలు ఇలా.. ●16న స్వర్గీయ మద్ది లక్ష్మయ్య కళా ప్రాంగణంలో సాయంత్రం 7 గంటలకు మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. 7.30 గంటలకు కంచర్ల సూర్య ప్రకాష్ రచనకు, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన కళాంజలి హైదరాబాద్ వారి ‘రైతే రాజు’ నాటిక ప్రదర్శించనున్నారు. ●8:30 గంటలకు సభా కార్యక్రమం, 8:45 గంటలకు మద్దుకూరి రవీంద్రబాబు రచించి దర్శకత్వం వహించిన మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్‌న్స్ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటిక ప్రదర్శన ఉంటుంది. 10 గంటలకు అక్కల తామేశ్వరయ్య రచనకు వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించిన యువభేరి ఆర్ట్స్ హైదరాబాద్ వారి ‘నా శత్రువు’ నాటిక ప్రదర్శిస్తారు. ●17వ తేదీన స్వర్గీయ ఇందుమల్లి రాజ్‌కుమార్ కళా ప్రాంగణంలో.. రాత్రి 7:30 గంటలకు ఆకురాతి భాస్కరచంద్ర రచనకు ఎస్ఎం బాషా దర్శకత్వం వహించిన మిత్ర క్రియేషన్స్ హైదరాబాదు వారి ‘ఇది రహదారి కాదు’ నాటిక ప్రదర్శితం కానుంది. 8:45 గంటలకు పరమాత్ముని శివరాం రచనకు రమేష్ మంచాల దర్శకత్వం వహించిన కళాభారతి కరీంనగర్ వారి ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన ఉంటుంది. 10 గంటలకు డేవిడ్‌రాజు రచించి దర్శకత్వం వహించిన భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి ‘దొందు దొందే’ నాటిక ప్రదర్శించనున్నారు. ●18న స్వర్గీయ నాగభైరు సుబ్బారావు కళాప్రాంగణంలో.. రాత్రి 7:45 గంటలకు కావూరి సత్యనారాయణ రచనకు ఏపూరి హరిబాబు దర్శకత్వ వహించిన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’ నాటిక ప్రదర్శిస్తారు. 8:45 గంటలకు అద్దేపల్లి భరత్ కుమార్ రచనకు ఎస్కే షఫీ దర్శకత్వం వహించిన ది అమేచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ వారి ’ఆలీతో సరదాగా’ నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం సభా కార్యక్రమం జరుగుతుంది. ●10:45 గంటలకు తాళాబత్తుని వెంకటేశ్వరరావు రచనకు అమృత లహరి దర్శకత్వం వహించిన అమృత లహరి ఆర్ట్స్ థియేటర్స్ వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ప్రదర్శితం అవుతుంది. ●11.50 గంటలకు శ్రీకృష్ణ మానసం నటులు గొట్టిపాటి కోటేశ్వరరావుచే ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. చిలకలూరిపేటలో మూడు రోజుల మహోత్సవం కళల పండుగకు ముస్తాబైన సీఆర్ క్లబ్ ఒకే వేదికపై నవరత్నల్లాంటి కళారూపాలు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కళాకారుల్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. కళల కాణాచి చిలకలూరిపేటలో ఎన్నో నాటక పరిషత్‌లు ఉన్నాయి. అవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం సాంస్కృతిక సంస్థలు ఉన్నప్పటికీ నాటక రంగ పరిషత్‌లు కొంతకాలంగా నిలిచిపోయాయి. వాటికి తిరిగి జీవాన్ని పోసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సమిష్టిగా నిర్వహిస్తున్న ఈ పోటీలు. – చెరుకూరి కాంతయ్య, పరిషత్ అధ్యక్షుడు -
నరసరావుపేటలో ‘సింగిల్’ బృందం సందడి
నరసరావుపేట ఈస్ట్: మండే వేసవిలో చల్లదనాన్ని అందించి హాయి గొలిపేలా సింగిల్ సినిమా ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని ఆ సినిమా హీరో శ్రీవిష్ణు తెలిపారు. సింగిల్ సినిమా విజయ యాత్రలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ పల్నాడుజిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సందడి చేసింది. సినిమాను ప్రదర్శిస్తున్న కాసు మాల్లోని గీతా మల్టీప్లెక్స్‌లో థియేటర్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా, దర్శకుడు కార్తీక్ రాజులు సందడి చేసారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సమేతంగా సినిమాను చూసేలా కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు కార్తీక్ రాజు ప్రేక్షకులకు అందించారని తెలిపారు. తనకు తాను తన జీవితాన్ని మలచుకునేలా, తనకు నచ్చిన రీతిలో జీవితంలో ఎదగాలని సూచించేలా సినిమా నిర్మించినట్టు తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా చేయటం, అది బ్లాక్‌బస్టర్ కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ, సింగిల్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుందన్నారు. హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో తాము నటించిన సింగిల్ విజయవంతం కావటం ఆనందంగా ఉందన్నారు. -
ఒంటికాలిపై సీహెచ్‌ఓల నిరసన
17వ రోజుకు చేరిన సమ్మె నరసరావుపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 17రోజులుగా సమ్మెచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓ) బుధవారం శిబిరంలో ఒంటికాలిపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో గత ఆరేళ్ల నుంచి సీహెచ్‌ఓలుగా పనిచేస్తున్న వారు జీతభత్యాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని కోరుతూ పట్టణంలోని స్టేషన్‌రోడ్డు గాంధీపార్కుకు ఎదురుగా సమ్మెచేస్తున్న విషయం విధితమే. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు అనుపమ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి ఏడాది ఐదుశాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన, ఆర్ధికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈనెల 24 నుంచి శాంతియుత నిరవధిక సమ్మె ద్వారా నిరసనలు కొనసాగిస్తామన్నారు. తమ అసోసియేషన్ నాయకులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు సాగర్, రాము, మస్తాన్, వినోద్, ఏఐటీయూసీ నాయకులు కాసా రాంబాబు, ఉప్పలపాటి రంగ్గయ్య, గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పాల్గొన్నారు. -
కమ్మ జన సేవా సమితిలో విద్యార్థినులకు ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఆశ్రయం పొందడానికి కమ్మ జన సేవా సమితిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. కుందుల రోడ్డులోని కమ్మ జన సేవా సమితిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రగతి పత్రాల్ని ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీతో పాటు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈనెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నామమాత్రంగా వసూలు చేస్తున్న ఫీజు నుంచి ప్రతి విద్యార్థినికి రూ.వెయ్యి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభ, పేదరికం, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల నడవడిక, వసతిగృహంలో క్రమశిక్షణతో మెలిగే విధానాన్ని గమనించి, పాలకవర్గం కమిటీ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు వార్షికోత్సవం రోజున ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.40 లక్షల ఉపకార వేతనాలు అందజేస్తామని వివరించారు. సంస్థ కార్యదర్శి చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దాదాపు 300 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికీ రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థినులకు దాతల సహకారంతో ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జేకేసీ కళాశాల రోడ్డులో రూ.50 కోట్ల వ్యయంతో రెండు వేల మంది విద్యార్థినులకు వసతి కల్పించే సామర్ధ్యంతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. సంస్థ కార్యాలయంతో పాటు కమ్మ జన సేవాసమితి.కామ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను ఈనెల 29లోపు సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 0863–2355471, 2260666 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. -
హెచ్ఐవీ మహిళలకు క్యాన్సర్ పరీక్షలు
నరసరావుపేట: స్థానిక ఏరియా వైద్యశాలలో హెచ్ఐవీతో జీవిస్తున్న మహిళలకు త్వరలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) విభాగంతో కలిసి ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ శాక్స్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.అంకినీడుప్రసాదు, డీడీ సీఎస్టీ డాక్టర్ చక్రవర్తి, పెప్ఫార్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాదు షేర్ ఇండియా అధికారులు డాక్టర్ జయకృష్ణ బుధవారం ఏరియా వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్, గైనకాలజీ విభాగ అధిపతులతో ఈ అంశంపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ చేయటం వలన హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి త్వరగా షుగర్, బీపీ, క్యాన్సర్ గుర్తించి ముందుగానే చికిత్స ప్రారంభించటం తద్వారా వారి జీవితకాలం పొడిగించే అవకాశం ఉన్నందున దీనికి కావాల్సిన సహాయసహకారాలు అందజేసేందుకు తాము సిద్ధమని హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ కె.ఏడుకొండలు, డాక్టర్ దయానిధి, గైనకాలజీ డాక్టర్ మంత్రూనాయక్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద పాల్గొన్నారు. ఏర్పాట్లపై నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఏపీ శాక్స్ అధికారుల సమీక్ష -
వైఎస్సార్ సీపీ పోరాటాలతోనే ఆర్ఓబీ పనులు
● సీఎం పేషీ నుంచి అక్షింతలతో కదిలిన కూటమి నేతలు ● అభివృద్ధి పనులపై ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతాం ● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిడుగురాళ్ల: ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ చేసిన పోరాటాలతోనే కూటమి ప్రభుత్వం దిగి వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులను మొదలు పెట్టిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జానపాడు–పిడుగురాళ్ల గ్రామాల మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మాణానికి 2022లోనే రూ. 52 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి మంజూరు చేయించటం జరిగిందన్నారు. అనంతరం టెండర్లు పిలిచి, ఆక్రమణలను తొలగించటం, విద్యుత్ దీపాలను కూడా తొలగించటం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఆ పనులు అంగుళం కూడా ముందుకు కదల్లేదన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు, మూడు నెలల నుంచి ఉద్యమం మొదలు పెట్టామని, హైకో ర్టులో సైతం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నామని తెలుసుకున్న సీఎం పేషీ అధికారులు స్థానిక టీడీపీ నేతలకు అక్షింతలు వేయడంతో ఈ నెల 15వ తేదీన మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పదిసార్లు శంకుస్థాపన చేసినా వైఎస్సార్ సీపీ ఎప్పుడు అడ్డుకోదని, మేం నాటిన విత్తనం వృక్షమవ్వాలి, ప్రజలకు ఫలాలు అందివ్వాలని ఆయన అన్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ రైల్వే బ్రిడ్జితో జానపాడు గ్రామ రూపురేఖలు కూడా మారతాయని, పిడుగురాళ్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందన్నారు. పనులు వేగవంతమవ్వాలని, వచ్చే సంవత్సరంన్నర, రెండు సంవత్సరాలలో పనులు పూర్తయ్యేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి మంచి పార్కు కావాలని.. చెరువు అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించామని, చెరువు ఆక్రమణలకు గురికాకూడదనే ఉద్దేశంతో చుట్టూ ప్రహరీ సైతం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇప్పుడు దానిని కూడా ముందుకు తీసుకొని వెళ్తామని కూటమి ప్రభుత్వం చెబుతుందని.. ఆ నిర్ణయాన్ని సైతం స్వాగతిస్తామన్నారు. ఈ పనులన్ని పూర్తి అయ్యేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. -
చారిత్రక కట్టడం..మరమ్మతులకు సిద్ధం
● 130 ఏళ్ల చరిత్ర కల్గిన నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ● కార్యాలయ స్వరూపం మారకుండా మరమ్మతులు ● సేవలకు ఆటంకం కలగకుండా సర్వే కార్యాలయం నుంచి రెవెన్యూ సిబ్బంది విధులు నరసరావుపేటటౌన్: బ్రిటిష్ హయాంలో నిర్మించబడి ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డీఓ కార్యాలయానికి అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్డీఓ కార్యాలయం కాలగమనంలో శిథిలావస్థకు చేరింది. బ్రిటిష్ పాలనా కాలంలో 1894–95 సంవత్సరాల్లో నిర్మితమైన ఈ భవనం, అప్పటినుంచి ప్రజలకు రెవెన్యూ సేవలందిస్తూ, అధికార యంత్రాంగానికి కీలక కేంద్రంగా నిలిచింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భవనం పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. ఎన్నో విలువైన రికార్డులు కార్యాలయంలో భద్రపరిచారు. సరైన రక్షణ చర్యలు లేక ఇప్పటికే కొన్ని రికార్డులు పాడయ్యాయి. ఈ క్రమంలో అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు. వర్షం వస్తే ఇబ్బంది.. వర్షాకాలంలో సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీవర్షం వస్తే వర్షపు నీరు కార్యాలయంలోకి చేరుతుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్లకు రక్షణ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. రెవెన్యూ సేవలకు అంతరాయం లేకుండా కొనసాగేందుకు, తాత్కాలికంగా సర్వే కార్యాలయం నుంచి సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నిత్యం వందలాది ప్రజల అవసరాలకు నిలయంగా మారుతుండటంతో, భవన మరమ్మతుల తర్వాత మరింత సమర్థవంతంగా సేవలు అందించనుంది. చరిత్రను కాపాడుతూ ఆధునిక పనులు చరిత్రకు చిహ్నంగా ఉన్న కార్యాలయ స్వరూపాన్ని ఏమాత్రం మార్చకుండా అధునాతన టెక్నాలజీతో మరమ్మతులు చేపడుతున్నాం. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డివిజినల్ సర్వే కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల పర్యవేక్షణలో త్వరతిగతిన మరమ్మతులు చేపట్టి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. – కె.మధులత, నరసరావుపేట ఆర్డీఓ -
పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!
● రంగనాథుడికి అంగరంగ వైభవంగా పుష్పయాగం ● సొలస ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవయడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయం బుధవారం భక్తజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కై ంకర్యాల నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువజామునే రంగనాథస్వామికి ఎన్నోరకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజింత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకృష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామపెద్దలు పర్యవేక్షించారు. -
జిల్లా ప్రగతి పథంలో నడవాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లా 15 శాతం వృద్ధిరేటుతో ప్రగతి సాధించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర 20 సూత్రాల పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, నరసరావుపేట, మాచర్ల ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం సొసైటీ చైర్పర్సన్ మంజులారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో 50 వేల ఎకరాలున్న విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాలకు పెంచాలని ఆదేశించారు. ఒంగోలు జాతి గిత్తల వృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరాలకు తగినంత పాల ఉత్పత్తి పెంచాలని తెలిపారు. శ్రామికులకు రోజుకు రూ.300కి మించి వేతనాలు అందేలా ఉపాధి కల్పన, పశువులకు నీటి తొట్ల ఏర్పాటు, ఫారం పాండ్ల నిర్మాణం, కాల్వల మరమ్మతులు, అమృత్ సరోవర్ పనులలో లక్ష్యాలు చేరుకోవాలన్నారు. నీరు ఇవ్వకుండానే జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఇంటింటికీ ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పేదలకు మంజూరు చేసిన గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని పేర్కొన్నారు. పనులలో పురోగతి సాధించలేని గుత్తేదారులను తొలగించాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించి సైడ్ కాల్వలు విస్మరించడంపై నిలదీశారు. సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో పదివేల సాధారణ కనెక్షన్లు లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సర్వేలలో వివరాలు పక్కాగా సేకరించడం ద్వారా పథకాలకు అర్హులను గుర్తించొచ్చన్నారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఈ ఏడాది 28 కేసులు నమోదయ్యాయన్నారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగారావు, డీఆర్వో ఏకా మురళి తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగంపై దృష్టి సారించండి 20 సూత్రాల పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ -
వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
వినుకొండ : పొట్ట కూటి కోసం వస్తున్న కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డమీద పల్లె, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దారుపల్లి తాండకు చెందిన ఆరుగురు రైతు కూలీలు మంగళవారం బొప్పాయి తోటలో కాయ కోసేందుకు బొలెరో ట్రక్‌లో పల్నాడు జిల్లా ఈపూరు వస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి (45), పగడాల సుబ్బమ్మ (40) దంపతులు, దారుపల్లి తాండకు చెందిన జొన్నగిరి రామాంజి (35), జొన్నగిరి అంకమ్మ (28) దంపతులు మృతి చెందారు. లారీలో ఉన్న కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. పగడాల సుబ్బమ్మ, జొన్నగిరి అంకమ్మలు ఘటనా స్థలంలో మృతి చెందగా, రమణారెడ్డి, రామాంజిలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. వినుకొండ పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్, లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
రేపల్లె: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ సుచిత్ర చెప్పారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఉప్పుడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గ్రామీణులకు తెలియపరచాలన్నారు.. యువతికి 18 ,యువకునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. అలా చేస్తే రూ. లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతోపాటు ఐదు సంవత్సరాలు దాటిన వారిని పాఠశాలలకు పంపేలా బాధ్యత వహించాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పి. నాంచారమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నలకు కూటమి దగా
పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో రైతులు అధైర్యపడొద్దని ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. మనోధైర్యంతో మెలగాలని.. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ఉప్పుటూరు సాంబశివరావు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంకొల్లు మండలం దుద్దుకూరుకు చెందిన మరో రైతు బిల్లా శ్యాంసన్ కుటుంబాలను పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో కలసి నాగార్జున పరామర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తోందన్నారు. వీరన్నపాలేనికి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు బీసీ కులానికి చెందిన పేదవాడు అని.. కౌలుకు తీసుకున్న డబ్బులు కట్ట లేక, పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు రాష్ట్రంలో వ్యవ సాయాన్ని పండుగలా చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగ అనే ధోరణిలోని పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదలు వ్యవసాయం చేస్తూ.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఇక్కడకు వచ్చినా ఎలాంటి సహాయం అందలేదంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహనరెడ్డి రూ.2 వేల కోట్లు పొగాకు రైతుకిచ్చి ఆదుకున్నారన్నారు. రైతుల తరఫున పోరాడేందుకు మాజీ సీఎం జగన్ ఈ ప్రాంతానికి రావాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, మార్టూరు, కారంచేడు మండల కన్వీనర్ పఠాన్ కాలేషావలి, జువ్వా శివరాంప్రసాద్, గర్నెపూడి రవిచంద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం -
మూలస్థానేశ్వరుడికి ప్రత్యేక పూజలు
నాదెండ్ల: నాదెండ్లలో కొలువైయున్న పురాతన ఆలయమైన శ్రీ గంగాపార్వతీ సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయ రథోత్సవంలో భాగంగా చివరిరోజు మంగళవారం పవళింపు సేవ నిర్వహించారు. మూడు రోజుల పాటూ జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. సోమవారం రాత్రి దొంగలదోపు, మంగళవారం ఉదయం పవళింపు సేవ, సాయంత్రం ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ పూజారులు ఇర్లపాటి సాంబశివరావు, కాశీ విశ్వనాధశర్మ, వాసు, సురేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రాత్రి వరకూ గ్రామోత్సవం నిర్వహించారు. తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నల్లమోతు విజయసారధి, దేవదాయశాఖ ఈఓ జక్కా శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.కొండవీడును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలికేంద్రమంత్రిని కోరిన ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటియడ్లపాడు: గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన పల్నాడు జిల్లా యడ్లపాడులోని కొండవీడుకోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసినట్లు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న కొండవీడు ప్రాంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశమన్నారు. ఇలాంటి ప్రాంతం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కొండవీడు కోట సమగ్రాభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణే ధ్యేయంగా కొండవీడు కోటకు ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాచుర్యాన్ని కల్పించాలని కోరినట్లు తెలిపారు.ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు. ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం ఆమోదించబడిన అన్ని పాలక మండలలు, కమిటీలు ఏర్పడే వరకు అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్‌గా జోసఫ్ వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత జూనియర్ జడ్జి నేలటూరి జేసు రత్నకుమార్ కంట్రోలర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.ఉండవల్లి కొండపై మంటలుతాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని, లేదా ఈ వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో దిగువ భాగాన నివాసముంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 2 గంటలపాటు వ్యాపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందజేశారు. గతంలో ఇలాగే కొండలపై మంటలు చెలరేగాయని ఈ మంటల వల్ల కొండప్రాంతం తగలబడుతుందని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చట్ట వ్యతిరేకంగా పోలీసుల ప్రవర్తన
తాడికొండ: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తాడికొండ మండలం కంతేరు ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన, ఇతరులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో బాధితులను నియోజకవర్గ ఇన్చార్జి డైమండ్ బాబు, పలువురు ఇన్చార్జిలతో కలిసి రాంబాబు మంగళవారం కంతేరు గ్రామంలో పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కాకుండా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. భారతీయ మహిళ, ప్రజాప్రతినిధిగా ఉన్న కంతేరు వలపర్ల కల్పన, మహాలక్ష్మీ, కర్రి విజయభాస్కర్, నితిన్‌లను అక్రమంగా అర్ధరాత్రి 3.30 గంటలకు అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకమన్నారు. కోర్టులో మాత్రం ఉదయం అరెస్టు చేశామని చెప్పడం న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించడమే కాకుండా న్యాయస్థానానికి అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. చిన్న పిల్లల తగాదాకు రాజకీయ రంగు పులిమి ఎంపీటీసీని జైల్లో పెట్టడం దుర్మార్గం అన్నారు. బాధితులు దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై మాత్రం చర్యలు తీసుకోపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఈ విషయం కోర్టు వారికి తెలియజేయగా కోర్టు వారు మెమో జారీ చేశారని, జిల్లా ఎస్పీకి బాధితులను తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి రజినిని నెట్టివేసి ఆమె కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించారు. చివరకు ఆ కేసులో చిన్న నోటీసు ఇచ్చి పంపించారని అన్నారు. డీజీపీకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, హోంమంత్రికి చెప్పినా ఉపయోగం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను కలసి భరోసా ఇచ్చేందుకు వచ్చామని ధైర్యంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగుతుండటమే పాపమా! కూటమి నాయకులు భయపెట్టి బెదిరింపులకు గురిచేసినా వైఎస్సార్సీపీలో కొనసాగుతుండడమే పాపమా అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఇక్కడ కొట్టింది ఓసీలు అరెస్టు చేసింది ఎస్సీలను అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దీనిపై పార్టీ పోరాడి వారిని దోషులుగా నిలబెడతామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్) మాట్లాడుతూ తాము గ్రామీణ వాతావరణం గొడవలు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో తాపత్రయపడుతుంటే కులాల మధ్య చిచ్చుపెట్టే తీరును వైఎస్సార్ సీపీ ఖండిస్తుందని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీటీసీ బోడపాటి సుశీల, మాజీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి, బొమ్మిరెడ్డి అశోక్‌రెడ్డి, ఫిరంగిపురం మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, చుండు వెంకటరెడ్డి, బాకి వెంకటస్వామి, బోడపాటి ధర్మరాజు, గుంటి రఘువరన్, కొప్పుల శేషగిరిరావు, అరేపల్లి జోజి, బెజ్జం రాంబాబు, పుట్టి సుబ్బారావు, నేలపాటి నాగేంద్ర, కొయ్యగూర వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళను అర్ధరాత్రి అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకం వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
చలివేంద్రాన్ని తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో తమ తండ్రి జ్ఞాపకార్ధం కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున తగులబెట్టారు. సేకరించిన వివరాల ప్రకారం గరికె బాలాజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులైన దుర్గారావు, సూరిబాబు, గోపిలు ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఉండవల్లి సెంటర్లోని తాడేపల్లి రోడ్లో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేశారు. అయితే ఈ చలివేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూర్తిగా తగలబడింది. ఘటనపై తాడేపల్లి పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
వడదెబ్బతో వృద్ధుడు మృతి గుంటూరు రూరల్/తాడికొండ: రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బండారుపల్లి, నల్లపాడు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో రేపల్లే నుంచి చర్లపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వృద్ధుడు మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 65 నుంచి 70 సంవత్సరముల మధ్య ఉంటుందని, తెల్లజుట్టు, తెలుపు రంగు ఆఫ్ చేతుల చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడు కట్టుకుని ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు, నడికుడి గవర్నమెంట్ రైల్వే పోలీసువారిని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు నడికుడి రైల్వే పోలీసు స్టేషన్ ఎస్ఐ రోశయ్య 8309369916, 9949063960 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
20న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు (77308 30949), సాయికిరణ్ (63001 50488), నంగనం తేజ (80742 60245) ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు. పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, పశు వైద్యాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అద్దంకి: మండలంలోని శింగరకొండ దేవస్థానం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. అతడి వయసు సుమారు 45 – 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ‘ఛలో డీపీటీఓ’ నరసరావుపేట: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే వన్ బార్ 2019 సర్క్యులర్‌ను అమలు చేయాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జిల్లాలో ఆరు డిపోలకు చెందిన అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు ‘ఛలో డీపీటీఓ’ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా కార్యదర్శి మురహరిరావు, జిల్లా అధ్యక్షుడు వసంతరావుల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఉద్యోగులు డిపో చుట్టూ రెండుసార్లు ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ ఆవరణలోని డీపీటీ జిల్లా కార్యాలయానికి ఎదురుగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సర్క్యులర్‌కు విరుద్దంగా చేసిన ఉద్యోగుల సస్పెన్షన్లు, తొలగింపులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్ల నుంచి చేపట్టని కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీలను భర్తీచేయాలని, ఎస్ఆర్బీసీ, డీఏ లాంటి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీ సంస్థకే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జోనల్ సెక్రటరీ లుక్సన్, నరసరావుపేట డిపో అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, కార్యదర్శి టీవీ రెడ్డి, జాయింట్ సెక్రటరీ షేక్ కమాల్బాషతో పాటు జిల్లాలోని ఆరు డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
కూలీల వలసలు నివారించాలి
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తూ పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. దీంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో ఎకరాలకొద్దీ ఉన్న రైతులు సైతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతోందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలస వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్‌కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి
వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, అధికారులు నరసరావుపేట: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేటరోడ్డు బైపాస్ జంక్షన్‌లోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈనెల 21వ తేదీన నిర్వహించే జాబ్‌మేళాను నియోజకవర్గంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. టెక్ మహీంద్ర, టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్, మాస్టర్ మైండ్స్, గోదావరి ఆంధ్ర కార్పొరేటివ్ బ్యాంక్, ఆపెక్స్ సొల్యూషన్స్, వి చేంజ్ సొల్యూషన్స్, అక్రో సాఫ్ట్ సొల్యుషన్స్, హెటిరో డ్రగ్స్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ.10వేలు నుంచి రూ.40వేలు వరకు ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ చదువుకున్న 18–45 ఏడాది మధ్య వయస్సుగల నిరుద్యోగులు వారి రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎం.వీరాంజనేయులు: 9160200652, జె.సురేష్: 9100566581, ఎ.రమ్య: 7702921219లను సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు పాల్గొన్నారు. నులకపేటలో కారు బీభత్సం పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలు తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న సోడా బండి, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన కారు యజమాని పరారవుతుండగా స్థానిక యువకులు వెంబడించి నులకపేట సెంటర్లో అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళతాను, దెబ్బతిన్న వాహనాలను బాగు చేయిస్తానని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పరిపాలన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు, జెడ్పీకి రావాల్సిన ఆదాయం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రేవుల వేలం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి రావాల్సిన బకాయిలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కల్యాణ మండపాలు, దుకాణాల నుంచి అద్దెలు, లీజు బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు జెడ్పీకి రావాల్సిన ఆదాయ వనరులు, బకాయిలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా ఇవ్వాల్సిన నివేదిక వివరాలను క్రమం తప్పకుండా పంపాలని సూచించారు. వార్షిక అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై పరిపాలనాధికారులు పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి, తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి శామ్యూల్‌పాల్, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం నమ్మదగ్గ విషయం కాదన్నారు. గత సంవత్సరం జారీ చేసిన గుర్తింపు కార్డులకు కాల పరిమితి ముగిసిందనీ, ఈ ఏడాది కొత్తగా కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంజుల రెడ్డి, పీవీ జగన్నాథం మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ మాట్లాడుతూ అప్పుల బాధతో చనిపోయిన కౌలురైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజకు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజయ్, కౌలురైతుల సంఘం నాయకులు బి.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.. జేసీకి వినతిపత్రం -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారుల దిన వారోత్సవాల్లో భాగంగా కల్తీలు, తూకాల్లో వ్యత్యాసాలపై వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టపరమైన అంశాలను వివరించారు. నరసరావుపేట, సత్తెనపల్లి ఇన్స్పెక్టర్లు సాయి శ్రీకర్, జాన్‌సైదా తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
వినుకొండ: లారీని ఢీకొట్టిన ఆటో.. నలుగురు మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎర్రగొండపాలెం నుంచి వినుకొండ వైపునకు కూలీలతో వెళ్తున్న ఆటో.. వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం ప్రమాద ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలి
నరసరావుపేట: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునవ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఓకు వినతిపత్రం సమర్పించారు. తొలుత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ 117 రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసి పాఠశాలలను పునవ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. అన్నీ మోడల్, ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు ఉపాధ్యాయులను, విద్యార్థుల సంఖ్య 120కి మించితే ఆరుగురు ఎస్జీటీలను, ఆ పైన ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీ చొప్పున కేటాయించాలని అన్నారు. అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించి వారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగించాని, తరగతిలో విద్యార్థులు 45 మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైస్కూలులో విద్యార్థుల సంఖ్య 300 దాటితే అదనపు పీడీ పోస్టు కేటాయించాలని కోరారు. బదిలీల జీఓ విడుదల చేసి వేసవి సెలవులలో ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఎస్.జి.టి.లకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలో సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియలు వేర్వేరుగా నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, సహఅధ్యక్షులు ఏ బాగేశ్వరిదేవి, జేవీడీ నాయక్, కోశాధికారి ఎం.రవిబాబు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, జిల్లా ఇన్చార్జి టీఎస్ఎన్ మల్లీశ్వరరావు, జిల్లా కార్యదర్శిలు ఉషాశౌరి రాణి, టి.వెంకట్, కె.తిరుపతిస్వామి, ఆర్.నాసర్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ధర్నా -
రెజ్లింగ్ జిల్లా జట్లకు క్రీడాకారుల ఎంపిక
అచ్చంపేట(క్రోసూరు): అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పల్నాడు జిల్లా ఆమ్యెచూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో సోమవారం రెజ్లింగ్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక చేసినట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భూషణం తెలిపారు. అండర్– 17 విభాగంలో బాలురు బి.అంజినాయక్(కారంపూడి,) కె.బుచ్చిబాబు (ఉప్పలపాడు), కె.గోపయ్య(అచ్చంపేట), ఎం.బాబు(గోరంట్ల), కేవీఎల్ చక్రధర్(వీపీ సౌత్), ఎం.వరప్రసాద్ (చిగురుపాడు), కె.నందకిషోర్(వైకుంఠపురం), కె.యోజన్(అచ్చంపేట), ఎన్.వెంకటేశ్ (88త్యాళ్లూరు), ఎన్. హనుమంతు వెంకటేశ్(ఉప్పలపాడు), వి.పృద్దీ (చౌటపాపాయపాలెం), వి.చరణ్ (ఫణిదం), డి.కుమార్‌బాబు(లగడపాడు) ఎం.రాజుకుమార్(ఉప్పలపాడు) ఎంపికయ్యారు. అదేవిధంగా బాలికల విభాగంలో వి.లాస్య(రెంటపాళ్ల), ఆర్.గాయత్రి (వీపీ సౌత్), ఆర్.అనూషా(అడిగొప్పల), డి.నేహశ్రీ(బ్రాహ్మణకోడూరు), అండర్– 23 విభాగంలో కె.లాలూనాయక్ (,రామాంజనేయపురం తండా), ఆర్.శ్రీహరి(అనంతవరం), కె.కిరణ్‌కుమార్(చల్లగరిక), బి.తేజ(కొచ్చర్ల), వై.మల్లికార్జున (లోయపల్లి), కె.బాలకోటేశ్వరరావు(పిడుగురాళ్ల), మహిళల విభాగంలో కె.ధణుక బాయి, (వీపీ సౌత్), జి.నితీషా (రెంటపాళ్ల) పికై నట్లు చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16,17,18 తేదీల్లో చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయిపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్టి.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. -
నూజెండ్ల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి
రైతులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ నరసరావుపేట: ప్రభుత్వం పేద రైతులకు ఇచ్చిన భూముల నుంచి వారిని బలవంతంగా ఖాళీ చేయించే నూజెండ్ల రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ భూములకు చెందిన రైతులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడులో సర్వేనెంబర్ 783, 784లలో గతంలో పేదలకు డీకే పట్టాలు, బీ ఫారం పట్టాలు పంపిణీ చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు అవి సాగుచేసుకుని వారు జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఈ భూములను మిలటరీ వాళ్లకు కేటాయించారని, వారికి భూమి చూపించడానికి మేము వచ్చామంటూ మీ దగ్గర కాగితాలు తహసీల్దార్‌కు చూపించాలని, వారికి పోను మిగతా భూమిలో ఖాళీ ఎక్కడుంటే అక్కడ మీకు కేటాయిస్తారని, భూమి తీసుకునే వాళ్లు మీకు పొక్లెయిన్‌తో బాగుచేసి ఇస్తారంటూ ముక్కెళ్లపాడు వీఆర్వో బాలకిషోర్ రైతులతో చెప్పారన్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని వదిలి ఎక్కడకు పోమని, ఇక్కడే ఉంటామని తెలియచేశారన్నారు. తహసీల్దార్, రైతులను బలవంతంగా రైతులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాము నూజెండ్ల రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన అర్జీపై ఆర్డీఓతో విచారణ చేయిస్తామని కలెక్టర్ కార్యాలయ ఏఓ హామీ ఇచ్చారన్నారు. రైతులు శివాజీ రామంజి, హనుమంతరావు, మారుతీరావు, అరుణ్ కుమార్, సుహాసిని, ప్రసన్న, భవాని, పీడీఎం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మస్తాన్‌వలి, జి.రామకృష్ణ, బీసీ నాయకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
● జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ● మాచర్లలో పీజీఆర్ఎస్ నిర్వహణ
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు మాచర్ల: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని వి.వి.ఎన్.గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 574 అర్జీలు అందాయి. ఎక్కువగా భూ సమస్యలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, విద్యుత్ ట్రాన్స్ఫార్మాల ఏర్పాటు, మంచినీటి సమస్యలపై అర్జీలు వచ్చాయి. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్, కమిషనర్ వేణుబాబు, సాయిశంకర్, నాగార్జున సాగర్ కుడికాలువ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ అంజయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దుర్గారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పోలూరి నరసింహారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 513.00 అడుగుల వద్ద ఉంది. ఇది 136.8190 టీఎంసీలకు సమానం. -
ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
అమరావతి: బుద్ధ జయంతి వేడుకలను ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పాత మ్యూజియంలోని మహా చైత్యం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ వావిలాల మాట్లాడుతూ 2569 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు నడయాడిన అమరావతి నగరం దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా కొనసాగిందన్నారు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర క్రతువులు అమరావతి నుంచే ప్రారంభించారని బౌద్ధ సాహిత్యకారుల నమ్మకమన్నారు. అందుకే ఇక్కడ బుద్ధుని అస్థికలతో కూడిన మహా చైత్యం అనే గొప్ప కట్టడాన్ని నిర్మించారన్నారు. తొలుత మహాస్థూపం వద్ద ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బౌద్ధమత ప్రార్థనలు నిర్వహించారు. నిమ్మా విజయసాగర్ బాబు, కోలా వెంకటేశ్వర రావు, యోగాశ్రమ నిర్వాహకులు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి, గిరి స్వామి, పలువురు బౌద్ధమతస్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 30 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షకు 93.34 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 87.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జూనియర్ ఇంటర్‌కు 3,132 మంది జనరల్ విద్యార్థులకుగాను 2,945మంది హాజరయ్యారు. 154 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 122మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 413 మంది నమోదు కాగా 364 మంది, ఒకేషనల్ విద్యార్థులు 70మందికి గాను 61 మంది హాజరయ్యారు. జిల్లా పరిధిలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి కె.సుచరిత తెలిపారు. ప్రత్యేక కలెక్టర్‌గా టీవీఎస్‌జీ కుమార్ నరసరావుపేట: పల్నాడు జిల్లా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(కేఆర్ఆర్సీ–కోనేరు రంగారావు కమిటీ)గా టీవీఎస్‌జీ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పోస్టులో ఆర్.కుముదినిసింగ్ పనిచేశారు. సమస్యలను వారంలో పరిష్కరిస్తాం కొల్లిపర(తెనాలి): తమకు అందిన ప్రతి సమస్యను వారంలో పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి 200 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా బియ్యం కార్డుల దరఖాస్తులే ఉన్నాయి. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా కోటి 46 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. నేడు ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల పరిపాలనాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల ప్రజా పరిషత్ పరిధిలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, మండల పరిపాలనాధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో హాజరు కావాలని సూచించారు. -
స్థలం కోసం కొడుకే వేధిస్తున్నాడు..
‘నేను బీఎస్ఎన్ఎల్లో పనిచేసి పదవీ విరమణ చేశా. నాకు పట్టణ షాలెంనగర్లోని వైఎస్సార్ బొమ్మ వద్ద సొంత స్థలం ఉంది. దానిని తనపేరుపై రాయాలంటూ రెండు నెలల నుంచి కొడుకు ప్రసాద్, మనుమడు దర్శన్ దౌర్జన్యం చేస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ఇంటి మీదకు వచ్చి నన్ను బెదిరించి స్థలం కాగితాలు బలవంతంగా లాక్కొని వెళ్లారు.’ వారిపై చర్య తీసుకోవాలని వేముల మోహనరావు ఎస్పీని వేడుకున్నారు... నరసరావుపేట: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 75 ఫిర్యాదులు ఎస్పీ స్వీకరించారు. ఎస్పీ అర్జీదారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి కృషి చేయాలని ఆదేశించారు. భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన డి.హరిశంకర్ అనే వ్యక్తి పల్నాడు కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆర్డీలు, చిట్టీలు వేస్తూ జనం దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. సుమారు పదిమంది బాధితుల వద్ద రూ.60 లక్షలు కట్టించుకుని వారికి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం బ్యాంకును వేరే వ్యక్తులకు అప్పగించారు. ప్రస్తుతం 60 లక్షల దాకా రావాల్సిన డబ్బుకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నారు. –సువర్ణలక్ష్మి, చిలకలూరిపేట పట్టణం రూ.60 లక్షలకు సమాధానం చెప్పట్లేదు భర్త చిత్రహింసలు పెడుతున్నాడు.. ఓ తండ్రి ఎస్పీకి ఫిర్యాదు పీజీఆర్ఎస్కు 75 ఫిర్యాదులు నాకు బతుకు తెరువు చూపించండి -
మద్యానికి యువకుడు బలి
నరసరావుపేట టౌన్: కూటమి మద్యం ఓ యువకుడిని బలి తీసుకుంది. మద్యం తాగిన యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి. చరణ్ సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన చీరాల కార్తిక్(27) ప్రస్తుతం బరంపేట విద్యుత్ శాఖ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం రాత్రి మృతి చెంది పడి ఉన్నాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ఆదివారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని తండ్రి చీరాల వెంకయ్యకు అప్పగించారు. మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు మద్యం తాగడం వల్లే మృతి చెందాడని సోమవారం ఽధ్రువీకరించారు. మద్యం తాగిన యువకుడు చీరాల కార్తిక్ రెండు రోజుల కిందట ఎంపీడీఓ కార్యాలయంలో మృతి మద్యం తాగడం వల్లే మృతి అంటూ ధ్రువీకరించిన వైద్యులు -
బంగారం ఆభరణాలు చోరీ
పిడుగురాళ్ల: బ్యాంక్ నుంచి బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్తుండగా ఆటోలో మాయమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ, పిడుగురాళ్ల పట్టణంలోని తమ్ముడు యడ్లవల్లి పుల్లారావు సహాయంలో పట్టణంలోని చైతన్య గోదావరి బ్యాంక్ లాకర్లో ఉన్న నగలను తీసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని చెన్నాయపాలెం వెళ్లే ఆటో వద్దకు వెళ్లారు. ఊరు వెళ్తుండగా వీరితో పాటు మరికొంత మంది ఆటో ఎక్కి బ్రాహ్మణపల్లి సమీపంలో దిగారు. వారు దిగి వెళ్లిన తరువాత బ్యాగ్ చెక్ చేసుకోగా నగలు కనిపించలేదు. దీంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగల బాక్స్‌లో నక్లెస్, లాకెట్, చంద్రహారం, లాకెట్, నానుతాడు, ఐదు వరసల ఉంగరాల చంద్రహారం మొత్తం 170 గ్రాములు ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలలో మట్టి తవ్వకాలు చేస్తే చర్యలు అమరావతి: మండల పరిధిలోని పెదమద్దూరు, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో రాజధాని నగర నిర్మాణం కోసం లాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ డానియేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామాలలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా గ్రామాల వీఆర్వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య గుంటూరు రూరల్: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆమె మృతదేహాన్ని పలు నాటకీయ పరిణామాల మధ్య అంబులెన్స్‌లో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలేనికి తరలించడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు మండల యనమదల గ్రామానికి చెందిన హేమలతకు 2020లో ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన మురళీతో కులాంతర వివాహం జరిగింది. హేమలత హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పెళ్లి అనంతరం కాపురాన్ని హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతానికి మార్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మురళి జులాయిగా తిరుగుతూ, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బులు కోసం నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. చేసేదిలేక హేమలత తన శక్తికి మించి రుణాలు చేసి అడిగిన మొత్తం సర్దుబాటు చేసేది. ఇటీవల భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. హేమలత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పకుండా భర్త ఆమె మృతదేహాన్ని నేరుగా అంబులెన్స్‌లో ఓబులనాయుడుపాలేనికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న హేమలత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీధర్ ఆదేశాల మేరకు ఎస్ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీరో ఎఫ్ఐర్ చేసి కేసును హైదరాబాద్ చందానగర్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విలువ సుమారు రూ.17 లక్షలు ఆటోలో వెళ్తుండగా మాయం -
పల్నాడు
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025భక్తిశ్రద్ధలతో చండీహోమం దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఘనంగా అంకమ్మతల్లి వార్షికోత్సవం పెదకూరపాడు: 75త్యాళ్లూరులో వైశాఖ పౌర్ణమి సందర్భంగా అంకమ్మతల్లి వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు పొంగళ్లు సమర్పించారు.వైభవంగా సీతారామ శాంతికల్యాణం రేపల్లె: రేపల్లె ఒకటో వార్డు ఎస్టీ కాలనీలోని సీతారామ మందిర వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. శాంతి కల్యాణం కనుల పండువగా జరిగింది. 7 -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
నరసరావుపేట రూరల్: జవాబుదారితనంతో బాలల హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి కోరారు. మండలంలోని జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, పమిడిపాడు, ఉప్పలపాడు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ సక్రమంగా అందుతుందా లేదా ఆరా తీశారు. నాదెండ్ల మండలం సాతులూరులోని గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. పద్మావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పౌష్టికాహరాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన బాధ్యత ఐసీడీఎస్‌పై ఉందని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సరైన సమయంలో పాలు, గుడ్డు అందించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బావులకు దగ్గరగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాల్యవివాహాలు మీ పరిసరాల్లో జరగకుండా సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు ఉమామహేశ్వరి, శాంతకుమారి పాల్గొన్నారు. -
సిండికేటై మమ్మల్ని బలి చేశారు
● గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన నల్లబర్లీ పొగాకు రైతులు ● కంపెనీలు లేదా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ యడ్లపాడు: యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబర్లీ పొగాకు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. నల్లమడ రైతుసంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు నేతృత్వంలో రైతు సంఘం నాయకుడు కల్లూరి రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలు రైతుసంఘాలు నాయకులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పొగాకు సాగు రైతులు సమష్టిగా పాల్గొని తమ గోడును అధికారులకు, వివిధ సంఘాల నాయకులకు వినిపించారు. రైతుసంఘం నాయకుడు నూతలపాటి కాళిదాసు మాట్లాడుతూ గతేడాది నల్లబర్లీ పొగాకును క్వింటాల్ రూ.18 వేల వరకు కొనుగోలు చేసిన కంపెనీలు, ఇప్పుడు అంతా సిండికేటై కేవలం రూ.4వేలు– రూ.5వేలకు ధరను దిగజార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పొగాకు రైతుల సమస్యను పరిష్కరించకుండా, కార్పొరేట్ సంస్థలకే మేలు జరిగేలా ప్రభుత్వం వ్యవహరించడంపై నిరసిస్తూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం నాయకులతో కలిసి రైతులు డీటీ అనురాధకు వినతి పత్రాన్ని అందించారు. -
రోగికి కేసు షీట్ ఇవ్వాల్సిందే..!
గుంటూరు మెడికల్: రోగికి కేసు షీటు ఇవ్వాల్సిందేనని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులోని గర్తపురి కన్జూమర్స్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం వైద్య వివరాలు, హాస్పిటల్స్ విధులపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి చేకూరి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన వివరాలు రోగికి తప్పనిసరిగా వైద్యాధికారులు తెలియజేయాలని తెలిపారు. రోగి మరణిస్తే అన్ని కారణాలు ఆ కేసులో తెలపాలని చెప్పారు. వైద్యులు ఏ మందులు ఎప్పుడు వాడారు..నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేసులో తేదీల వారీగా ఉండాలని, చికిత్స వివరాలు సమగ్రంగా ఉండాలని తెలిపారు. రోగి గానీ, అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో అందించాలని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపు, ఏ చట్టం ఇవ్వలేదని తెలిపారు. మొత్తం చికిత్స వివరాల ఫొటో కాపీలు హాస్పిటల్ వారు ఇవ్వాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ సభ్యుడు బీరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్ వారు రోగికి వైద్య వివరాలను నిరాకరించడమంటే తన బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యమవుతుందని తెలిపారు. న్యాయస్థానాలు కోరినప్పుడు తప్పనిసరిగా సంబంధిత రోగి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బేబీ సరోజిని మాట్లాడుతూ వైద్యులు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు, కేసు షీటును సాక్ష్యాధారంగా కోర్టులో ఉపయోగించవచ్చని తెలిపారు. మునిపల్లె కవిత మాట్లాడుతూ రోగులకు చికిత్స చేసిన వివరాలను అందించడంలో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. కేసు సీట్ బాధ్యత వైద్యులు, హాస్పిటల్ పైన ఉందని చాలా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు -
● వైభవంగా సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ● రంగనాథుడి కల్యాణం చూసి తరించిన భక్తులు
యడ్లపాడు: సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకుడు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో రంగనాధుడు, శ్రీదేవి, భూదేవి నవ వధువరులుగా సర్వాంగ శోభితంగా అలంకారకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. బాజాభజింత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, అశేష భక్తజనాల నడుమ శ్రీదేవి, భూదేవి కల్యాణ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కమనీయమైన ఆ కల్యాణ దృశ్యాలను దగ్గరగా చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. కల్యాణం అనంతరం దేవతామూర్తులు హమమత్, గరుడ వాహనాలపై అధిరోహించి పురవీధుల్లో విహరింపజేశారు. తమ ఇళ్ల ముందుకే వచ్చిన స్వామివారిని కన్నులారా దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. కొందరు ఆయా వాహన సేవల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వరకు రంగనాధుడిని స్మరిస్తూ భక్తులు తరించారు. కల్యాణ వైభోగమే..! -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
సత్తెనపల్లి: మార్కెట్లో వినియోగదారులకు విక్రయించే ప్రతి వస్తువుపై పక్కా సమాచారం ఉండాలని తూనికలు, కొలతలు శాఖ పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ నల్లబోతుల అల్లూరయ్య అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కల్యాణ మండపంలో తూనికలు, కొలతల శాఖ వారోత్సవాల్లో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారులకు విక్రయించే ప్రతి వస్తువుపై వస్తువు తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, ప్యాకింగ్ కంపెనీ పేరు, అడ్రస్సు, బార్కోడ్, కస్టమర్ కేర్ నంబర్.. ఇలా అన్ని విషయాలు స్పష్టంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా తూకాల్లో మోసాలు చేసినా, తప్పుడు చిరునామా కలిగిన వస్తువులను విక్రయించినా కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా బియ్యం విషయానికి వస్తే రిటైల్‌గా విక్రయించే రైస్ బ్యాగ్ 25 కిలోలు ఉండాలని, ఇది ప్రభుత్వ నిబంధన అన్నారు. కానీ కొంత మంది వ్యాపారులు 24 కిలోలు, మరికొందరు 23 కిలోల తూకంతో విక్రయాలు జరుపుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. హోల్‌సేల్‌గా విక్రయించే రైస్ బాగ్ 26 కిలోలు తూకం ఉండాలన్నారు. ఇన్స్పెక్టర్ షేక్ సైదా మాట్లాడుతూ వినియోగదారులను ఏ రకంగా మోసగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తూనికలు కొలతలు శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ అల్లూరయ్య -
త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన
నరసరావుపేట రూరల్: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సోమవారం రాత్రి లక్ష మల్లెపూల అర్చనను వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మల్లెపూలలో స్వామివారికి అర్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మహా ప్రదోష కాలంలో నిర్వహించిన అర్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మల్లెపూలతో స్వామివారిని అర్చించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావులు అర్చనలో పాల్గొన్నారు. ఉదయం స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
బ్లాక్ బర్లీ.. రైతులకు వర్రీ
కూటమి పాలనలో మద్దతు ధర దక్కక కన్నీరు యడ్లపాడు: గతేడాది సిరులు పండించిన బ్లాక్ బర్లీ పొగాకు ఈ ఏడాది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదు. మార్కెట్ ధరలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తుపాను, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడి దిగుబడి సాధించినా ప్రయోజనం లేకుండాపోతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. గతేడాది పొగాకును పోటీ పడి కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయి. సీలింగ్, సిండికేట్ చేస్తూ కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కొందరు రైతులు పండించిన పొగాకును భద్రపరుచుకునేందుకు అవకాశం లేక పొలాల్లోనే ఉంచుకునే దుస్థితి నెలకొంది. మద్దతు ధర కొరవడటంతోపాటు కంపెనీలు, వ్యాపారులు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించడం లేదు. అధికారులు కూడా నాణ్యత పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో సాగు గత ఏడాది పొగాకు ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అప్పట్లో మొక్కకున్న చివరి ఆకు సైతం రైతులు విక్రయించారు. మార్కెట్లో మంచి ధర లభించడంతో ఒక్కో ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు మిగిలిన రైతులు కూడా ఉన్నారు. దీంతో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ ఏడాది అధిక మొత్తంలో రైతులు పొగాకు వైపు మొగ్గు చూపారు. బ్లాక్ బర్లీ ఈ ఏడాది నియోజకవర్గంలో సుమారు 5 వేల ఎకరాల్లో సాగైంది. పెట్టుబడి తక్కువే అయినా ఈ ఏడాది కూలీల ధరలు అమాంతంగా పెరగడంతో ఊహించని విధంగా రైతులపై అదనపు భారం పండింది. కొనే దిక్కు లేదు.. గతంతో పోలిస్తే సాగు ఖర్చు రెట్టింపు అయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగినా రైతులు వెనుకాడకుండా బోర్లు, బావుల కింద పంట సాగు చేశారు. గతేడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు, తెగుళ్లకు కొంతమేర దెబ్బతిన్నా తర్వాత తేరుకున్నారు. ఏటా ఒక్కో కూలీకి రోజుకు రూ.250 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.400కు చేరింది. ప్రారంభంలో క్వింటాకు రూ.18 వేలు ఇస్తామన్న కంపెనీలు దిగుబడి సాకు చూపి రూ.15,500కు తగ్గించేశాయి. అదైనా ఇస్తున్నారా అంటే.. పురుగు మందులు, ప్లాస్టిక్ అవశేషాలు లేకుండా ఆరిన ఆకుకు మాత్రమే ఆ ధర ఇస్తామంటూ సంస్థల ప్రతినిధులు సాకులు చెబుతున్నారు. ఇలా తేమ ఉందని, ఆకు విరిగిందని, నాణ్యత లేదంటూ రకరకాల కారణాలతో ధరను ఏకపక్షంగా తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ధరలు పరిశీలిస్తే అడుగు ఆకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు, నాణ్యత గల ఆకు క్వింటా రూ.8 వేల వరకు చొప్పున వ్యాపారులు కొంటున్నారు. తొలితీత ఆకుకు క్వింటా రూ.12 నుంచి రూ.13 వేల వరకు ధర లభిస్తోందని రైతులు వాపోతున్నారు. పొలాల్లోని పందిళ్లలో, పశువుల పాకల్లో పంటను భద్రపరుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కువకాలం ఇలానే ఉంటే నాణ్యత దెబ్బతిని మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతులు మద్దతు ధర కోరుతూ ఎక్కడికి వెళ్లినా నిరాశే మిగులుతోంది. అటు కూటమి ప్రభుత్వ పాలకులు... ఇటు అధికారులు కనీస దయ చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే అదనుగా దళారులు అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యతకే ప్రాధాన్యం అంటూ అధికారుల సాకులు సిండికేట్‌గా మారి క్వింటా రూ.8 వేలకే కొట్టేస్తున్న కంపెనీలు, వ్యాపారులు నల్ల బర్లీ సాగు చేసిన అన్నదాతలకు తప్పని తీవ్ర నష్టాలు సమస్య గుర్తించామంటూనే పరిష్కారం చూపని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూనేడు యడ్లపాడులో రైతుల ధర్నా గళం వినిపించేందుకుతమ గోడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో బర్లీ రైతులు సోమవారం ఉదయం 10 గంటలకు యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు నేతృత్వంలో జరిగే ఈ ధర్నాలో నియోజకవర్గంలోని పొగాకు రైతులందరూ పాల్గొననున్నారు. బర్లీ పొగాకును వెంటనే కంపెనీలు కొనుగోలు చేయాలని, వ్యవసాయ మంత్రి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా క్వింటా రూ.15 వేలకు తక్కువ కాకుండా ఇవ్వాలని, కంపెనీలు న్యాయమైన ధర ఇవ్వకపోతే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బర్లీ రకాన్ని పొగాకు బోర్డు పరిధిలోకి చేర్చాలనే డిమాండ్ ఊపందుకుంది. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందించనున్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
సత్తెనపల్లి: దేశంలో యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలిపితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి.. ఎలా కక్షలు తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూసి ఉండమని తెలిపారు. లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి, దాని చుట్టూ కక్ష తీర్చుకునే క్రమంలో ఓ వైపు జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కనుక కొన్నాళ్లపాటు ఆటలు చెల్లుతాయని, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఇవాళ కాకపోయినా రేపైనా నిజాలేంటో బయటపడతాయని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ప్రజలు మాత్రం క్షమించరన్నారు. మాజీ మంత్రి రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు దౌర్జన్యంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న పద్ధతిని కూడా పోలీసులు పాటించలేదని, ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో తప్పకుండా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. కంతేరులోనూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను వేకువజామున మూడు గంటల సమయంలో 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వెళ్లి అరెస్టు చేశారన్నారు.దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భార్గవ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కర్రి భాస్కర్, వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్త మహాలక్ష్మి, ఆమె కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తు న్నారని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నాయకులు రాజవరపు శివ నాగేశ్వరరావు, కళ్లం విజయభాస్కర్ రెడ్డి, చిలుకా జైపాల్, అచ్యుత శివప్రసాద్, లోకా మాధవ, బండి మల్లికార్జునరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సుభాని, షేక్ నాగూర్ బాషా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భారవ్‌రెడ్డి మాజీ మంత్రి రజినీని తోసివేయడం, శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక -
‘సమాజానికో బహిరంగ లేఖ’ ఆవిష్కరణ
బాపట్ల: భావితరాలకు బంగరు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు పేర్కొన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించడం ముఖ్య అంశం అంటూ సమాజానికో బహిరంగ లేఖ పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించాలని, వారిని సరైన మార్గంలో నడిపించడం అందరి బాధ్యతని సూచించారు. పిల్లల సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని తెలిపారు. పుస్తక పఠనం వైపు వారిని మళ్లించడం నేటి మన కర్తవ్యంగా భావించాలని ఆయన కోరారు. ‘మరో గ్రంథాలయ ఉద్యమ’ కార్యాచరణలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ’సమాజానికో బహిరంగ లేఖ’ కరదీపికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, చిత్రకారుడు గుడంశెట్టి వెంకటేశ్వర్లు, శాఖా గ్రంథాలయాధికారి ఏ. శివాజీగణేషన్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
17న స్టాండప్ కామెడీ షో పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 17న కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో ‘స్టాండ్ అప్ కామెడీ షో ‘ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి పి.రామచంద్రరాజు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతోపాటు మనదేశంలోని మెట్రో నగరాలకు పరిమితమైన ‘స్టాండ్ అప్ కామెడీ షో‘ను మొదటిసారిగా గుంటూరు నగరానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు. వేదికపై ప్రదర్శకుడు నిలబడి సమాజంలో ఉన్న వివిధ అంశాలను ఎత్తి చూపిస్తూ వ్యంగ్య, హాస్య భరితమైన తన హావభావాల ద్వారా ఆహుతులను నవ్విస్తూ ఆకట్టుకోవడమే స్టాండప్ కామెడీ షో అని తెలిపారు. నవరసాల్లో ఒకటైన హాస్యరస కళను ప్రదర్శించేందుకు యువతీ, యువకులకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. ఆసక్తితో కళాకారులుగా ఎదగాలనుకునే వారు భారతీయ విద్యాభవన్ కార్యాలయంతో పాటు 98854 21496, 83176 13187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రదర్శన తిలకించేందుకు ప్రవేశం ఉచితమని తెలిపారు. కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి కొల్లిపర: కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొల్లిపర పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన షేక్ బాజి(25)కి రెండేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కొల్లిపర కృష్ణానది తీరానికి వెళ్లాడు. ఇసుక క్వారీ సమీపంలో తన అన్నతో కలసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ పి.కోటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రికి మృతహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.30 అడుగుల వద్ద ఉంది. ఇది 137.3416 టీఎంసీలకు సమానం. -
ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లొస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం దగ్గర హైవే పక్కనున్న సేఫ్టీ రైలింగ్‌ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టిన కారు తప్పిన ప్రమాదం -
ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
బాపట్ల: శ్రీ భావన్నారాయణస్వామి రథోత్సవానికి తనను ఆహ్వానించక పోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని, ప్రతి విషయంలో శాస్త్రోక్తంగా ముందుకు పోయామని కోన వివరించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేవాలయం అభివృద్ధికి వేసిన కమిటీ లెక్కలు అప్పగించలేదంటూ కొంతమంది మాట్లాడుకోవడంలో అర్థం లేదని ఖండించారు. బాపట్లకే తలమానికై న శ్రీభావన్నారాయణస్వామి దేవాలయంలో స్వామి సహా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటే ఎవరకు పట్టించుకోలేదన్నారు. దేవాలయం అభివృద్ధికి ఎంతో కష్టించి పని చేశామని కోన చెప్పారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రముఖ న్యాయవాది కొల్లిమర్ల సత్యనారాయణను చైర్మన్‌గా, కొంతమందిని సభ్యులుగా ఉంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతి ఒక్క రూపాయికీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాతోనే నిర్వహణ చేశామని చెప్పారు. పాత రథంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనే ఉద్దేశంతో కొత్త దానికి తానే స్వయంగా దేవాదాయశాఖ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశాయించామని చెప్పారు.రథం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపాటు దాతల సహకారం కూడా తీసుకున్నామని తెలిపారు. దాతలుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రూ.22లక్షలు కూడా ఇచ్చారని వెల్లడించారు. స్తసపతితో పాటు దేవదాయశాఖ నుంచి ఇంజనీర్లు కూడా వచ్చి రథం నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్క కమిటీ నిర్వహణలోనే దేవాలయం, రథం నిర్మాణం జరిగిందని కోన చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, కమిటీ చైర్మన్ సత్యనారాయణ చనిపోవడంతో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో లెక్కలు చూపుతామని చెప్పారు.అక్కడేదో తప్పు జరిగిందంటూ సత్యప్రసాద్ అనే న్యాయవాది ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. లెక్కల్లో వివరాలు కావాలంటే తనను నేరుగా కలిసి అడిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆయన ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసమే లెక్కలు బయటకు చెప్పాలని పట్టుబడుతున్నారని రఘుపతి దుయ్యబట్టారు. ఆహ్వానం లేకపోయినా టెంకాయ కొడతా.. బాపట్లకు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో శ్రీ భావన్నారాయణస్వామి దేవాలయం ఉన్నత ప్రతిష్టకు కృషి చేశామని కోన పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడానికి తనకు ఏ ఆహ్వానం లేకపోయినా ఫర్వాలేదని తెలిపారు. అందరు టెంకాయలు కొట్టిన తరువాత చివరిగా వెళ్లి కొట్టి, మొక్కులు తీర్చుకుంటానని కోన చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జోగి రాజా, చింతల రాజశేఖర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి దేవాలయం అభివృద్ధి కోసం వేసిన కమిటీ కోరిన వివరాలు వెల్లడిస్తాం కమిటీ చైర్మన్ కొల్లిమర్ల మృతితో జాప్యం రథోత్సవానికి ఆహ్వానం లేకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.. -
మహిళలపైనా దౌర్జన్యాలు
రెడ్ బుక్ పేరుతో ● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. చివరికి దళిత, బీసీ మహిళలను సైతం అత్యంత దారుణంగా అవమానపరిచేలా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించటం సిగ్గు చేటన్నారు. శనివారం చిలకలూరిపేటలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, బీసీ మహిళ అయిన విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించి, ఆమైపె దౌర్జన్యం చేయడం చాలా బాధాకరమన్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏక వచనంతో ‘నీకు చెప్పేదేంటి, నీతో మాట్లాడేదేంటి?’ వంటి పదాలతో ఆమెను అవమానించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓ పోలీసు అధికారినన్న స్పృహ కూడా లేకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరించడం దారుణమన్నారు. చట్టపరమైన చర్యలు తప్పవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ వర్గాలకు చెందిన మహిళలను రాత్రీపగలు అనే తేడా లేకుండా అరెస్టులు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా కంతేరులో వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్రమంగా అరెస్టు చేశారని గుర్తుచేశారు. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించటం దారుణమన్నారు. బీసీ, దళిత మహిళల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు అధికార పార్టీ అండ చూసుకొని అక్రమ కేసులు పెట్టటం, మహిళల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసుల విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రతి అక్రమ కేసుపై భవిష్యత్తులో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నేడు మాచర్లలో పీజీఆర్ఎస్
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మాచర్ల పట్టణంలో సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు నెహ్రూనగర్‌లోని వీవీఎన్ గార్డెన్స్‌లో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఇలా నిర్వహించామని తెలిపారు. నరసరావుపేటలో పోలీస్ తనిఖీలు నరసరావుపేటటౌన్: పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, మాల్స్‌లో డాగ్ స్కాడ్‌తో తనికీలు నిర్వహించారు. వీటితో పాటు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వన్‌టౌన్ సీఐ ఎం. విజయ్‌చరణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వంశీకృష్ణ, అరుణ సిబ్బందితో రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. క్యాంటీన్లో డాగ్ స్కాడ్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు. సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ను ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శాంతిభద్రతలపై చర్చించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. పవర్ లిఫ్టింగ్లోషబీనాకు 4 స్వర్ణాలు మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున పాల్గొన్న షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. -
‘రెడ్ బుక్’ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ రెడ్ బుక్ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఉండాల్సిన హక్కులను కాలరాసి అక్రమ కేసులు, నిర్భంధాలతో ప్రతిపక్షాల గొంతును నొక్కుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా పల్నాడు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలను సైతం వడదలకుండా అధికార పార్టీ నేతల ఆదేశాలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. మరికొందరినైతే ఏ కేసు లేకపోయినా రోజుల తరబడి పోలీసు స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నామంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శనివారం మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్ సైతం అదే కోవ జరిగింది. నిరాధార ఆరోపణలతో టీడీపీకి అనుకూలంగా మారిన వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని విడదల రజిని చిలకలూరిపేట రూరల్ సీఐను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. ‘నీకెందుకు చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి, బీసీ మహిళా నేత అనే స్పృహ కూడా లేకుండా అమర్యాదగా వ్యవహరించాడు. ‘ఎక్కువ మాట్లాడితే నీపై కేసు పెట్టాల్సి ఉంటుందంటూ’ బెదిరింపు ధోరణికి దిగాడు. ఈ వ్యవహారం చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఓ మహిళా మాజీ మంత్రికి సైతం రక్షణ లేదని, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. రోజంతా కారులో తిప్పుతూనే... శ్రీకాంత్‌రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన తరువాత ఉదయం సమయంతో ఎఫ్ఐఆర్ కట్టినట్టు తెలుస్తోంది. అప్పటికే కేసు నమోదై ఉంటే విడదల రజిని ‘ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో’ చెప్పమన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూపేవారన్న వాదన వినిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి వాహనంలో రోజంతా తిప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు వర్తించే సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రిమాండ్ రిపోర్టులో తీవ్రతను పెంచి రిమాండ్‌కు పంపే కుట్ర పన్నినట్టు శ్రీకాంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే శ్రీకాంత్‌రెడ్డిపై చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పలు కేసులు నమోదు చేశారు. ఎలాగైనా బీసీ మహిళా నేత విడదల రజినిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి ఆమె వర్గంపై కేసులు పరంపర కొనసాగిస్తున్నారు. 65 ఏళ్ల పైబడిన ఆమె మామ విడదల లక్ష్మీనారాయణ, మరిది విడదల గోపి, పీఏలు రామకృష్ణ, ఫణి, సోషల్‌మీడియా యాక్టివిస్టులు రాకేష్ గాంధీ, రెడ్డిగారి అమ్మాయి సుధారాణి, పాలేటి కృష్టవేణి.. ఇలా అందర్ని అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మరోవైపు విడదల రజినిపై సైతం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న పల్నాడు పోలీసులు తప్పుడు ఫిర్యాదులతో జైలుపాలుచేసే కుట్ర అడిగితే ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ విషయంలోనూ అదే తీరు మాజీ మంత్రి అనే స్పృహ లేకుండారజినీతో సీఐ దురుసు ప్రవర్తన సీఐ సుబ్బనాయుడు తీరును ఖండిస్తున్న ప్రతిపక్షాలు, మహిళలు సీఐ తీరుపై మండిపాటు... మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ మహిళ అనే స్పృహ లేకుండా సీఐ దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఇప్పటికై నా ముగింపు పలకాలని, లేకపోతే ప్రజలలో వ్యతిరేకత మరింత పెరిగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఐ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేసి ఖండించారు. ప్రభుత్వం ఆ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. -
సాయం చేయబోయి మృత్యు ఒడికి రైతు
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు పెదకూరపాడు: తోటి రైతుకు సాయంగా వెళ్లి ప్రమాదానికి గురైన రైతు కథ విషాదంగా ముగిసింది. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని అచ్చంపేట నుంచి పెదకూరపాడు తీసుకొచ్చే క్రమంలో లగడపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాలైన పెదకూరపాడు వాసి గోరంట్ల బ్రహ్మయ్య (33)గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ‘‘మాతృ దినోత్సవం రోజే నా మాంగల్యం తీసుకెళ్లావా... దేవుడూ.. నీకు కనికరం లేదా ! మంచానికే పరిమితమైన అత్తామామలు, బిడ్డలను ఎలా సాకాలయ్యా !’’ అంటూ భార్య మల్లిక విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ‘‘సాయానికి వెళ్లి సామి దగ్గరకు వెళ్లావా నాన్నా !’’అంటూ కుమారుడు మణికంఠ, కుమారై సుక్షలు గుండెలు అవిసేలా విలపించారు. అందరితో కలవిడిగా తిరిగే బ్రహ్మయ్య మృతితో పెదకూరపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎల్లలు దాటిన ‘చల్లా’ వంటలు
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్ అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. ప్రత్యేక గుర్తింపు 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014–19 వరకు కాకినాడ, చైన్నెల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. లక్ష్మీనారాయణ వంటకాలు రుచుల రాజ్యంలో ఆయనదిప్రత్యేక స్థానం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకూ ప్రస్థానం ప్రత్యేకమైన రెసిపీల తయారీలో సృజన ఆధునిక నలభీమునిగా విశేష గుర్తింపు ‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదు నేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ఎస్జీటీలకే ఇవ్వాలి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని సత్తెనపల్లి: ఎస్జీటీలుగా పని చేస్తూ ఒక్క పదోన్నతి కూడా పొందని వారు 30 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రాథమిక పాఠశాలలకు వారిని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లను పీఎస్‌హెచ్‌ఎంగా నియమించడం వల్ల వారికి సబ్జెక్ట్ మీదే పట్టు ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాలంటే ఎస్జీటీలకే అనుభవం ఉందన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హతను బట్టి +2, హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి అందరిని భర్తీ చేయాలని కోరారు. వీటిల్లో ఎస్జీటీలను నియమించకూడదని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్జీటీలు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల్లో ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో ఒక ఎస్జీటీ బదిలీ కోసం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్నీ స్థానాలను ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది సమయంతో కూడుకున్న అంశమని, ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్జీటీలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. -
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాంధీ గురజాల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట సీఐ మాట్లాడిన మాటలు సరైనవి కావని ఖండించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఇబ్బందులు గురి చేస్తోందని ఆరోపించారు. సీఐ మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనీని కారులోంచి అక్రమంగా బలవంతంగా బయటకు నెట్టారని, ఆయనపై సీఎం, డెప్యూటీ సీఎంలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూటమి నాయకులు మానుకోవాలని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని కూటమి నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, జె. రమణ, నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగా, 120 రోల్ దాటిన ప్రతి పాఠశాలకు ఒక పీఎస్ హెచ్ఎం, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ స్కూల్స్ పర్యవేక్షణకు అర్బన్ ఎంఈవోను నియమించాలని విజ్ఞపి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి. జయప్రకాశ్, మగ్బుల్ బాషా, దుర్గాప్రసాద్, షేక్ మస్తాన్‌వలి, ఎం. శారద, తదితరులు పాల్గొన్నారు. -
మాటలకే పరిమితమైన ప్రభుత్వం
ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. హామీల అమలులో కనీస చర్యలు తీసుకోకపోవడమే పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు జరిపినా నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. పొగాకు సాగు చేసిన వారంతా సన్న, చిన్నకారు రైతులే. పెట్టుబడి రాని పరిస్థితి ఒకవైపు, కౌలు కట్టుకునే స్తోమత లేని దుస్థితి మరోవైపు వారిని వేధిస్తున్నాయి. కనీసం పంట దాచుకునేందుకు కూడా వారికి అవకాశం లేదు. ఈ దయనీయ పరిస్థితుల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోకుంటే అప్పుల బాధతో ఆత్మహత్యలే వారికి శరణ్యం. వారి ఆవేదన వెలిబుచ్చేందుకే ఆందోళనకు పిలుపునిచ్చాం. – డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, నల్లమడ రైతు సంఘం నాయకుడు -
అందరూ కలిసి దగా చేస్తున్నారు
కంపెనీలు పొగాకు కొనకపోగా, ప్రైవేటు వ్యాపారుల్ని కూడా రాకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం కచ్చితంగా కొనాలని చెబుతున్నా అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో కంపెనీలు సిండికేట్‌గా మారి నామమాత్రంగా ధర ఇస్తున్నాయి. గ్రామంలో 10 ఎకరాలు సాగు చేశా. ఎక్కువగా కౌలు ఉంది. అధికారులు మా పొగాకు బాగుందని కొంటామన్నారు. తీరా చెక్కుల్ని తొక్కిస్తే బాగోలేదంటూ సగం తీసేయాలన్నారు. దీంతో విక్రయించలేదు. ఇలా అధికారులే రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. క్వింటా రూ.15 వేలకు తగ్గితే పెట్టుబడి కాదు కదా... కౌలు, ఆకు తీసిన కూలీల డబ్బులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. – నూతలపాటి సుబ్బరామమూర్తి, పొగాకు రైతు, యడ్లపాడు -
ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సెర్చ్
నరసరావుపేట రూరల్: బయట వ్యక్తుల్ని కాలనీలోకి అనుమతించవద్దని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్కేటీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు, 100మంది సిబ్బంది పాల్గొన్నారు. మూడు గంటల పాటు కాలనీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారు, ఆటోతో పాటు 41 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. రాడ్లు, కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కాలనీలో వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిని గుర్తించి మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం.వి. చరన్, హైమారావు, పి.రామకృష్ణ, లోకనాథం పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని అవ్వారి భావన్నారాయణ భవన్ సీపీఐ కార్యాలయంలో ఆదివారం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్స్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు టి.శేషయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు కార్మికులను సమాయత్తం చేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ కార్మికుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేజర్, మైనర్ బ్రాంచ్ కాల్వలకు పూడికలు తీయించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు. అనంతరం యుద్ధంలో వీర మరణం పొందిన మురళీనాయక్, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీసం వెంకటేశ్వర్లు , సుబ్బారావు , సుబ్బయ్య, రసూల్‌ఖాన్, కె.నిరీక్షణరావు, టి.కృష్ణసూరి, పి.శాంతయ్య పాల్గొన్నారు. -
మహంకాళీ అమ్మ వారికి రూ.లక్ష విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసిఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానం అభివృద్ధికి పెదకాకానికి చెందిన కె.శ్రీహరిబాబు, నాగేశ్వరి దంపతులు లక్ష రూపాయలను విరాళంగా ఆదివారం అందజేశారు. దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు అమ్మవారి చిత్రపటం బహూకరించారు. కోడి పందేలు వేస్తున్న ఆరుగురి అరెస్టు పర్చూరు(చినగంజాం): మండలంలోని నూతలపాడులో కోడి పందేలు వేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ మాల్యాద్రి అందించిన సమాచారం మేరకు.. నూతలపాడులోని వడ్డెర కాలనీలో చెరువు కట్ట మీద కోడి పందేలు వేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 5,100ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
త్వరితగతిన శిక్షలు పడేలా చూడండి
నరసరావుపేట: న్యాయస్థానాల్లో హత్య, హత్యాయత్నం, ఎన్డీపీఎస్, పోక్సో, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కోర్టు కానిస్టేబుళ్లు సమర్ధవంతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్ళతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలోని అన్నీ పోలీస్స్టేషన్లకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన సాక్ష్యాధారాలను సమర్పించి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేసుల్లోని నిందితులు, రౌడీషీటర్ల హాజరు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్ల జారీపై శ్రద్ధ వహించి, వాటి అమలును వేగవంతం చేయాలన్నారు. నిందితుల జాడ తెలియని పక్షంలో ష్యూరిటీలను కోర్టుకు హాజరు పరచి తద్వారా జరగవలసిన ప్రక్రియను చేపట్టాలన్నారు. గత నెలలో ఆయా న్యాయస్థానాల్లో పలు కేసులకు సంబంధించి వచ్చిన తీర్పులు, నిందితులకు పడిన శిక్షలపై హర్షం వ్యక్తం చేశారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, డీసీఆర్బీ సీఐ ఎం.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. కోర్టు కానిస్టేబుళ్ల సమావేశంలో జిల్లా ఎస్పీ -
నృసింహునికి లక్ష పుష్పార్చన
మంగళగిరి టౌన్ : స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన భక్తుల సమక్షంలో కనులవిందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గులాబి, చేమంతి, బంతి, మల్లెలు, తులసీ దళాలతో పుష్పార్చన గావించారు. రాత్రి చతుర్వేద పారాయణ నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
తెల్లారిన బతుకులు
పర్చూరు(చినగంజాం): రాత్రి వేళ పనిచేస్తే అధిక కూలి వస్తుందని ఆశించారు...కానీ ఆ రాత్రే వారికి చివరి రాత్రి అవుతుందని అనుకోలేదు...లారీ రూపంలో ఎదురు వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను కబళించింది. గ్రానైట్ పలకల లోడుతో వెళుతున్న లారీపై కూర్చున్న ముగ్గురు కూలీలు వాటి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగింది. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరులో గ్రానైట్ పలకల లోడుతో శనివారం వేకువజామున ఓ లారీ గుంటూరు బయలుదేరింది. గుంటూరు వెళ్లెందుకు డ్రైవర్ మస్తాన్‌వలి లారీని పర్చూరు వైపు మళ్లించాడు. తిమ్మరాజుపాలెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి సడెన్ బ్రేక్ వేయడంతో లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. లారీపై కూర్చొని ఉన్న ముగ్గురు కూలీలు గ్రానైట్ పలకల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను (25), తాళ్లూరి ప్రభుదాసు (43), పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన తమ్మలూరి సురేంద్ర బాబు(28)గా గుర్తించారు. డ్రైవర్ మస్తాన్‌వలి, క్లీనర్ రమేష్‌లు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, పర్చూరు ఎస్ఐ మాల్యాద్రి హుటాహుటిన తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రానైట్ పలకలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. రెవెన్యూ అధికారులు సునీత, యార్లగడ్డ శ్రీనివాసరావు, విజయ్ ఆధ్వర్యంలో శవ పంచనామాల అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దృష్టి సారించారు. అధిక గ్రానైట్ లోడే ప్రమాదానికి కారణం? లారీలో అధిక గ్రానైట్ పలకల లోడు వేయడం ప్రమాదానికి కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. సామర్థ్యానికి మించి గ్రానైట్ పలకల లోడు లారీలో ఉన్నట్లుగా సమాచారం. రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో లారీ బోల్తా కొట్టిందని భావిస్తున్నారు. పర్చూరు వైపు లారీ ఎందుకు మళ్లింది? మార్టూరులో గ్రానైట్ పలకలను లోడు చేసుకున్న లారీ నేరుగా గుంటూరు వెళ్లాల్సి ఉండగా పర్చూరు వైపు ఎందుకు మళ్లించారనే దానిపై అనుమానం వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ లోడుకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయా? లేవా? అనే అనుమానాలను పలువురు వ్యక్త పరుస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం పోలీసుల విచారణ అనంతరం బయటకు వచ్చే అవకాశం ఉంది. ముగ్గురూ బంధువులే.. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురూ బంధువులే. పాలపర్తి శ్రీను, మృతుడు సురేంద్రబాబులు బావమరుదులు. సురేంద్రబాబు భార్య రాణి స్వయనా శ్రీను అక్క. శ్రీను, ప్రభుదాసు సమీప బంధువులే. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ ఇలా సమీప బంధువులు కావడం గమనార్హం. మృతులంతా పేదలే.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు క్రాస్ చేస్తూ అదుపుతప్పి బోల్తాపడ్డ గ్రానైట్ లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలు ప్రమాదంలో మృతి చెందిన వారంతా మార్టూరు, నూతలపాడు ఎస్సీ కాలనీకి చెందిన పేద కుటుంబాల వారు. రాత్రి వేళ గ్రానైట్ లోడు చేసేందుకు వెళితే అధిక కూలి గిట్టుబాటు అవుతుందని ఆశించి వెళ్లిన వారే. కాగా మార్టూరులో గ్రానైట్ లోడు ఎక్కించడం మరలా గుంటూరు వెళ్లి లోడును దించి రావడం వరకు వారే స్వయంగా ఉంటారు. రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందడంతో ఆయా గ్రామాల కాలనీల్లో తీవ్ర విషాదం నెలకొంది. కూలి కోసం వెళ్లి మృత్యుఒడిలోకి జారుకోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మార్టూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన తాళ్లూరి ప్రభుదాసు ముగ్గురు ఆడపిల్లల తండ్రి. అతడి భార్య మరియమ్మ కాగా, కుటుంబ బాధ్యత అంతా ప్రభుదాసుపైనే ఉంది. కూలి పనిచేసి సంపాదిస్తేనే వారి కుటుంబం గడిచేది. కానీ ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పాలపర్తి శ్రీను అదే కాలనీకి చెందిన వాడు కాగా అవివాహితుడు. అతని తండ్రి పేరయ్యతో కలిసి ఉంటున్నాడు. పర్చూరు మండలం నూతలపాడు ఎస్సీ కాలనీకి చెందిన తమ్మలూరి సురేంద్రబాబు తల్లిదండ్రులు చంద్రం, మేరీలు కాగా భార్య రాణి. ఆమె కూడా కూలి పనులకు వెళ్లి వస్తుంటుంది. వీరికి ఇద్దరు మగపిల్లలు కాగా వీరిద్దరు కూలి పనులకు వెళ్లి తీసుకొచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. -
‘ఓడు’ పోయిన మట్టి బతుకులు
తెనాలి: గుంటూరు జిల్లాలో పది గ్రామాల్లో 350 పైగా కుటుంబాలు వంశపారంపర్యంగా వస్తున్న మట్టి పాత్రల తయారీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. శలపాడు, గరువుపాలెం, కొలకలూరు, కావూరు, చింతాయపాలెం, మంగళగిరి, శృంగారపురం, తుమ్మలపాలెం, కొండవీడు, కోటప్పకొండ పరిసరాల్లో ఈ కుటుంబాలున్నాయి. పెళ్లిరోజున గరిక పాత్ర నుంచి పేదవాడి ఫ్రిజ్‌లుగా పిలుచుకునే కుండలు, కూజాలు, వంటపాత్రలు, పూలుకుండీలు, ప్రమిదెల సహా రకరకాల అవసరాల కోసం వాడే పాత్రల తయారీలో సిద్ధహస్తులు. ఏడాదిలో వేసవి కాలం మాత్రమే మట్టి పాత్రలకు గిరాకీ ఉంటుందని తెలిసిందే. మనిషి జీవితంలో ప్రవేశించిన ఆధునికత వీరి వృత్తికి కష్టకాలం తీసుకొచ్చి ంది. వేసవిలో అకాల వర్షాలు సంభవిస్తే వారి కష్టమంతా నీటిపాలవుతుంది. అన్నింటినీ భరిస్తూ కొనసాగిస్తున్న వారసత్వ చేతివృత్తిలో కళాత్మకత అబ్బురపరుస్తుంది. దొరకని మట్టి వృత్తికి ప్రధానమైన మట్టి లభ్యత సమస్యగా మారింది. ట్రక్కు రూ.5 వేలు పెట్టినా అనువైనది దొరకడం కష్టంగా ఉంది. వడ్లమూడి క్వారీ ఆపడంతో వీరికి నాణ్యమైన మట్టి కోసం పలుచోట్ల వెతుకులాట తప్పనిసరైంది. టన్ను పుల్లలు రూ.5 వేలు, పొలం పొట్టు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.20 వేల వ్యయంతో ఏటా సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులోపు అవసరమైనవి సమకూర్చుకుంటారు. ముందుగా మట్టిని ఎండబెట్టి, నలగ్గొట్టి, గాబులో పోసి వడపోసిన మట్టిని పాత్రల తయారీకి వినియోగిస్తారు. ఈ పనిలో ఇంటావిడ శ్రమిస్తే, మట్టిని అందమైన పాత్రలుగా మలచే పనిని ఇంటాయన చేస్తుంటారు. ఇరుగుపొరుగు సాయంతో ఆము ఏర్పాటు పదిహను, ఇరవై రోజులు మట్టి పాత్రలు చేశాక వాటిని ఎండలో ఆరబెడతారు. తర్వాత ఒకరోజు ఇరుగుపొరుగు సాయంతో ఆము పెట్టుకుంటారు. సాయంత్రం పూట ఏడెనిమిది మంది కలిసి రెండు గంటలసేపు శ్రమిస్తే గాని ఆము తయారుకాదు. పగిలిన కుండలను చుట్టూ పేర్చుకుని, వాటిపైన ఆరబెట్టిన కుండలను భద్రంగా అమర్చుకుంటూ, అయిదారు వరుసలతో అన్నింటినీ సర్దుతారు. పగిలిన కుండపెంకులతో పైన కప్పును రూపుదిద్దుతారు. దిగువన కట్టెపుల్లలు, పొలం పొట్టు, ఊక ఏర్పాటు చేస్తారు. కాల్చిన పిడకలను చుట్టూ ఖాళీల్లో సర్దుతారు. ఆ పిడకలు రగులుకొని, ఊక, పొలం పొట్టుతో సహా కట్టెపుల్లలను మండించి, లోపలున్న మట్టిపాత్రలను ఎర్రగా కాలుస్తాయి. ఉదయాని కల్లా ‘రెడీ టు సేల్’ మట్టి పాత్రల తయారీలో సంప్రదాయ విధానాలకు మృణ్మయ కళాకారులు కూడా ఆధునిక సాంకేతికతను అందుకున్నారు. పాత్రల తయారీ కోసం ముందుగా మట్టిని కలిపి పాకంగా చేయాలి. గతంలో ఇందుకోసం గంటన్నరపాటు కాళ్లతో తొక్కేవారు. ఇప్పుడు పది నిముషాల్లోనే విద్యుత్ మిషను మట్టి పాకాన్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు చక్రంలాంటి సారైపె మట్టి ముద్ద తిరుగుతుంటే చేతితో అందమైన రూపంలో కుండను చేస్తారు. మధ్యమధ్యలో కర్రతో సారెను తిప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సారెను కర్రతో తిప్పే విధానానికి స్వస్తి పలికారు. విద్యుత్ మోటారుతో అవసరమైనంతసేపు తిరుగుతూనే వుంటోంది. దీనితో పాత్రల తయారీకి సమయం తగ్గింది. ప్రమిదెల తయారీకి సెరామిక్ బ్లాంకెట్ వాడుతున్నారు. కుండలకు తగ్గిన గిరాకీ ఎంత కళాత్మకంగా మట్టి పాత్రలు చేసినా మార్కెటింగ్‌లో నష్టపోతున్నామనే భావన వీరిలో ఉంది. అదేమంటే వినియోగదారులు ‘మట్టి కుండేగా’ అనేస్తున్నారని వృత్తిదారులు వాపోతున్నారు. మట్టి కుండ తయారీకి సగటున రూ.70–80 ఖర్చయితే, వీరి నుంచి రూ.120 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో అదే కుండను రూ.250లకు అమ్ముతున్నారు. తయారీదారుకు రూ.50 లోపు మిగిలితే మధ్య వ్యాపారికి రూ.100 పైగా లభిస్తోంది. ఫ్రిజ్‌ల కారణంగా కుండలకు గిరాకీ తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూలింగ్ క్యాన్లు వీరి వృత్తికి చేటుతెస్తున్నాయి. వేసవిలో విస్తృతంగా నడిచే చలివేంద్రాల్లో గతంలో కుండల స్థానంలో ఇప్పుడు కూలింగ్ వాటర్ క్యాన్లు వెలుస్తున్నాయి. ఈ క్యాన్ల నీటికన్నా కుండల నీరే శ్రేష్టమని తెలిసినా, అవే వాడుతున్నారు. కడుపు నింపని చేతివృత్తి మృణ్మయ కళాకారుల జీవితం.. శ్రమకు దక్కని ఫలం మట్టికుండల చల్లదనం వెనుక శ్రామికుల స్వేదం కష్టాలను భరిస్తూ సంప్రదాయ చేతివృత్తిని కొనసాగిస్తున్న శాలివాహనులు మట్టి పరిమళం వారికి జీవనశ్వాస... మట్టితో ముడిపడిన జీవితాలవి...తోటి మనుషులను నమ్మినా లేకున్నా మట్టిని ప్రేమిస్తారు. చేతివృత్తుల్లో ఒకటైన మట్టి పాత్రల తయారీలో ‘కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా’ అనుకుంటూ మమేకమైన దృశ్యం అక్కడ గోచరిస్తుంది. ఇంటిల్లిపాదికీ అది నిత్యం శ్రమైక జీవన సమరమే. వారు చిందించే స్వేదం నుంచే మట్టి కుండ రూపుదిద్దుకుని, అందులోని నీటి చల్లదనం దాహార్తులను సేదదీరుస్తుంది. మట్టికి అందమైన ఆకృతినివ్వగల ఆ మృణ్మయ కళాకారులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. -
సాయానికి వెళ్లి.. చావు బతుకుల్లోకి..
పెదకూరపాడు: సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదానికి గురై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మండలంలోని లగడపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు గ్రామానికి చెందిన గుంటూరు నాగేశ్వరరావుకు చెందిన ద్విచక్ర వాహనం గత ఏడాది పెదకూరపాడులో చోరీకి గురైంది. ఈ విషయమై పెదకూరపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బైక్‌లు చోరీలకు పాల్పడుతున్న పలు వురిని గత నెల 19వ తేదీన అచ్చంపేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొరికిన వాహనాల్లో నాగేశ్వరరావు వాహనం సైతం ఉండటంతో రికవరీకి శనివారం పెదకూరపాడు పోలీసుస్టేషన్ పీఎస్ హోంగార్డు గుజ్జర్లపూడి రాజేష్‌ఖన్నాతో కలసి నాగేశ్వరరావు వెళ్లాడు. ఆయనకు సహాయంగా పెదకూరపాడుకు చెందిన బత్తుల బ్రహ్మం తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వారు అచ్చంపేట వెళ్లి రికవరీ చేసిన వాహనం రిపేరులో ఉండడంతో దాన్ని వెంట తీసుకెళ్లిన వాహనానికి తాడు కట్టి ఒక వాహనంపై నాగేశ్వరరావు, హోంగార్డులు.. రికవరీ అయిన వాహనంపై గోరంట్ల బ్రహ్మం ఎక్కి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో పెదకూరపాడు మండలం లగడపాడు వద్ద ట్రాక్టర్ ఎదురు రావడంతో అదుపు తప్పి ముగ్గురు రోడ్డు పక్కనున్న కందకంలో పడ్డారు. వారిపై రెండు బైకులు పడ్డాయి. ఘటనలో బ్రహ్మం తలకు తీవ్రగాయాలయ్యాయి. పెదకూరపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం,గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. హోంగార్డు రాజేష్‌ఖన్నా కు కుడి కాలికి గాయమైంది. ఆయన్ను సత్తెనపల్లి వైద్యశాలకు తరలించారు. వాహన సొంతదారుడు నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి. చోరీ కేసులో బైక్ రికవరీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం సహాయంగా వచ్చిన వ్యక్తికి తీవ్రగాయాలు.. హోంగార్డుకు గాయాలు -
పిడుగుపాటుకు 11 జీవాలు మృతి
బొల్లాపల్లి: పిడుగుపాటుకు గురై గొర్రెలు, మేకలు మృతిచెందిన సంఘటన మండలంలోని గుమ్మనంపాడు గ్రామ పొలాల్లో శనివారం జరిగింది. గ్రామానికి ఆళ్లగండి చెరువు వీరనాయకులు గుడి వద్ద ఈదురుగాలులతో కూడిన వర్షంలో పిడుగు పడటంతో గొర్రెలు, మేకలు 11 మృత్యువాతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన గోపినాయక్, కె.నాగయ్యలతో పాటు మరికొందరు రైతులకు చెందిన 11 జీవాలు మృతిచెందాయి. వీటివిలువ సుమారు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితులు చెప్పారు. ఘటనా ప్రాంతాన్ని గుమ్మనంపాడు పశువైద్యుడు బి.సాల్మన్సింగ్ పరిశీలించి ఆయా జీవాల యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకే పల్లెనిద్ర రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు రేపల్లె: శాంతి, భద్రతల పరిరక్షణతోపాటు ప్రజలతో మమేకమై పనిచేసేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో ఎటువంటి సమస్యలు తలెత్తినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.