
మద్యానికి యువకుడు బలి
నరసరావుపేట టౌన్: కూటమి మద్యం ఓ యువకుడిని బలి తీసుకుంది. మద్యం తాగిన యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి. చరణ్ సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన చీరాల కార్తిక్(27) ప్రస్తుతం బరంపేట విద్యుత్ శాఖ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం రాత్రి మృతి చెంది పడి ఉన్నాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ఆదివారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని తండ్రి చీరాల వెంకయ్యకు అప్పగించారు. మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు మద్యం తాగడం వల్లే మృతి చెందాడని సోమవారం ఽధ్రువీకరించారు.
మద్యం తాగిన యువకుడు చీరాల కార్తిక్
రెండు రోజుల కిందట ఎంపీడీఓ కార్యాలయంలో మృతి
మద్యం తాగడం వల్లే మృతి అంటూ ధ్రువీకరించిన వైద్యులు