బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి రామనామ సంకీర్తనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను ఆలయ పండితులు బొర్రా వెంకట అనంతచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రసన్నాంజనేయుని మాలధారులు వారి ఇళ్ల వద్ద నుంచి భజన కార్యక్రమాలతో గ్రామోత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని ఆలయం వద్దకు వచ్చి ఇరుముడులు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు.
వైభవంగా ప్రసన్నాంజనేయ జయంత్యుత్సవాలు