
మహంకాళీ అమ్మ వారికి రూ.లక్ష విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసిఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానం అభివృద్ధికి పెదకాకానికి చెందిన కె.శ్రీహరిబాబు, నాగేశ్వరి దంపతులు లక్ష రూపాయలను విరాళంగా ఆదివారం అందజేశారు. దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు అమ్మవారి చిత్రపటం బహూకరించారు.
కోడి పందేలు వేస్తున్న
ఆరుగురి అరెస్టు
పర్చూరు(చినగంజాం): మండలంలోని నూతలపాడులో కోడి పందేలు వేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ మాల్యాద్రి అందించిన సమాచారం మేరకు.. నూతలపాడులోని వడ్డెర కాలనీలో చెరువు కట్ట మీద కోడి పందేలు వేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 5,100ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.