
రెజ్లింగ్ జిల్లా జట్లకు క్రీడాకారుల ఎంపిక
అచ్చంపేట(క్రోసూరు): అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పల్నాడు జిల్లా ఆమ్యెచూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో సోమవారం రెజ్లింగ్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక చేసినట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భూషణం తెలిపారు. అండర్– 17 విభాగంలో బాలురు బి.అంజినాయక్(కారంపూడి,) కె.బుచ్చిబాబు (ఉప్పలపాడు), కె.గోపయ్య(అచ్చంపేట), ఎం.బాబు(గోరంట్ల), కేవీఎల్ చక్రధర్(వీపీ సౌత్), ఎం.వరప్రసాద్ (చిగురుపాడు), కె.నందకిషోర్(వైకుంఠపురం), కె.యోజన్(అచ్చంపేట), ఎన్.వెంకటేశ్ (88త్యాళ్లూరు), ఎన్. హనుమంతు వెంకటేశ్(ఉప్పలపాడు), వి.పృద్దీ (చౌటపాపాయపాలెం), వి.చరణ్ (ఫణిదం), డి.కుమార్‌బాబు(లగడపాడు) ఎం.రాజుకుమార్(ఉప్పలపాడు) ఎంపికయ్యారు. అదేవిధంగా బాలికల విభాగంలో వి.లాస్య(రెంటపాళ్ల), ఆర్.గాయత్రి (వీపీ సౌత్), ఆర్.అనూషా(అడిగొప్పల), డి.నేహశ్రీ(బ్రాహ్మణకోడూరు), అండర్– 23 విభాగంలో కె.లాలూనాయక్ (,రామాంజనేయపురం తండా), ఆర్.శ్రీహరి(అనంతవరం), కె.కిరణ్‌కుమార్(చల్లగరిక), బి.తేజ(కొచ్చర్ల), వై.మల్లికార్జున (లోయపల్లి), కె.బాలకోటేశ్వరరావు(పిడుగురాళ్ల), మహిళల విభాగంలో కె.ధణుక బాయి, (వీపీ సౌత్), జి.నితీషా (రెంటపాళ్ల) పికై నట్లు చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16,17,18 తేదీల్లో చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయిపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌టి.అరుణ్‌కుమార్ ప్రారంభించారు.