
● జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ● మాచర్లలో పీజీఆర్‌ఎస్ న
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
మాచర్ల: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని వి.వి.ఎన్.గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 574 అర్జీలు అందాయి. ఎక్కువగా భూ సమస్యలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మాల ఏర్పాటు, మంచినీటి సమస్యలపై అర్జీలు వచ్చాయి. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్, కమిషనర్ వేణుబాబు, సాయిశంకర్, నాగార్జున సాగర్ కుడికాలువ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ అంజయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దుర్గారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పోలూరి నరసింహారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 513.00 అడుగుల వద్ద ఉంది. ఇది 136.8190 టీఎంసీలకు సమానం.

● జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ● మాచర్లలో పీజీఆర్‌ఎస్ న