పిడుగుపాటుకు 11 జీవాలు మృతి
బొల్లాపల్లి: పిడుగుపాటుకు గురై గొర్రెలు, మేకలు మృతిచెందిన సంఘటన మండలంలోని గుమ్మనంపాడు గ్రామ పొలాల్లో శనివారం జరిగింది. గ్రామానికి ఆళ్లగండి చెరువు వీరనాయకులు గుడి వద్ద ఈదురుగాలులతో కూడిన వర్షంలో పిడుగు పడటంతో గొర్రెలు, మేకలు 11 మృత్యువాతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన గోపినాయక్, కె.నాగయ్యలతో పాటు మరికొందరు రైతులకు చెందిన 11 జీవాలు మృతిచెందాయి. వీటివిలువ సుమారు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితులు చెప్పారు. ఘటనా ప్రాంతాన్ని గుమ్మనంపాడు పశువైద్యుడు బి.సాల్మన్‌సింగ్ పరిశీలించి ఆయా జీవాల యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకే పల్లెనిద్ర
రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు
రేపల్లె: శాంతి, భద్రతల పరిరక్షణతోపాటు ప్రజలతో మమేకమై పనిచేసేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో ఎటువంటి సమస్యలు తలెత్తినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.
పిడుగుపాటుకు 11 జీవాలు మృతి


