తెలంగాణాలో పట్టుబడుతున్న లారీలు
ధాన్యం కొనడం లేదు...
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన ధాన్యాన్ని దళారులు లారీలలో నింపి తమకు అనుకూలంగా ఉన్న చెక్‌పోస్టుల ద్వారా ఎటువంటి బిల్లులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణాలోని పలు చెక్‌పోస్టులలో గడచిన 20 రోజులుగా భారీ సంఖ్యలో లారీలు పట్టుబడుతున్నాయి. నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం, మిర్యాలగూడ తదితర చెక్‌పోస్టులలో బిల్లులు లేని ఏపీ లారీలు దొరికాయి. నకిలీ రైతుల పేరుతో ధాన్యం అమ్మి బోనస్ పేరిట ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు తెలంగాణ సొమ్మును దోచకుంటున్నారని అక్కడి రైతులు వాపోతున్నారు.
నేను ఈ ఖరీఫ్‌లో ఏడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. తేమ, నాణ్యత పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు 75 కిలో బస్తా రూ.1,350కే అమ్ముకున్నాను. ప్రభుత్వ కొనుగోలు చేసి ఉంటే బస్తాకు రూ.400కి పైగా అఽధికంగా వచ్చేది.
– నల్లబోలు శివకృష్ణ,
గుత్తికొండ, పిడుగురాళ్ల మండలం


