నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్‌లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో శంకరమఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
దేవాలయాల్లో
పోలీసుల తనిఖీలు
నరసరావుపేట: భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం భక్తుల భద్రత కాంక్షిస్తూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ లోకల్ పోలీసులు ఉదయం నుంచి నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వాటిలో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వివరాలు, భద్రత, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పని తీరు గురించి పూర్తిగా తనిఖీచేసి ఆలయ యాజమాన్యంకు తగిన సూచనలు చేశారు. అనుమానితులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిద్రకు వచ్చే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా అనుమానితులు ఉంటే అట్టి సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియపర్చాలని కోరారు. అనధికారికంగా ఏమైనా వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే తమకు తెలియపర్చాలని సూచించారు.
శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం
తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహు తి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.
మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం
దుగ్గిరాల:దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో ఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళ వా రం చండీహోమం నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు.
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం


