
హెచ్‌ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై కళాజాత బృందాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించి హెచ్‌ఐవీ బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. పది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జరుగనున్న కళాజాత బృందాల కార్యక్రమాలను గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులకు సైతం హెచ్‌ఐవీ గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పడంలో కళాజాత బృందాల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ డి.శ్యామ్‌సన్, జిల్లా సూపర్‌వైజర్ జ్యోతుల వీరాస్వామి, కొత్తపేట మహిళ మండలి, సిరి మహిళ సాధికారిత మండలి, మాధురి మహిళ సొసైటీ, లింక్ వర్కర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.