
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు ని
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటకు చెందిన పలువురిని నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యా లయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూత్ వింగ్ అధ్యక్షుడిగా కోటపాటి శ్రీ మణింద్రరెడ్డి, మహిళా విభాగానికి బొబ్బిలి శ్రీలక్ష్మి, రైతు వి భాగానికి కొబ్బరి పూర్ణచంద్రరావు, బీసీ సెల్‌కు మర్రిపూడి రాంబాబు, ఎస్‌సీ సెల్‌కు కుక్కల పౌ లయ్య, ఎస్‌టీ సెల్‌కు మొగిలి ఆంజనేయులు, మై నార్టీ సెల్‌కు షేక్ సిలార్‌బాష, క్రిస్టియన్ మైనార్టీసెల్‌కు దార్లపాటి మేరి బ్లెస్సీనా, స్టూడెంట్ వింగ్‌కు యర్రంరెడ్డి విజయ మనోహరరెడ్డి, పంచాయతీరాజ్ వింగ్‌కు ముండ్రు హరినారాయణ, మున్సిపల్ వింగ్‌కు మాగులూరి రమణారెడ్డి, ఆర్‌టీఐ వింగ్‌కు జీనేపల్లి హనుమంతరావు నియమితులయ్యారు. అదేవిధంగా వలంటీర్ల వింగ్ అధ్యక్షుడిగా పోలుబోయిన మధు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా షేక్ ఖాదర్‌బాష, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మిట్టపల్లి శేఖర్, చేనేత వింగ్ అధ్యక్షుడిగా గుణదల శ్రీనివాసరావు, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడిగా షేక్ వలి, అంగన్‌వాడీ వింగ్ అధ్యక్షులుగా జొన్నలగడ్డ హెల్డా ఫ్లోరెన్స్, లీగల్‌సెల్ అధ్యక్షుడిగా వై.సీతారామిరెడ్డి, కల్చరల్ వింగ్ అధ్యక్షులుగా కంచర్ల విజయలక్ష్మి, సోషల్ మీడియా వింగ్‌కు బూదాల కల్యాణ్, ఐటీ వింగ్‌కు వీరంరెడ్డి నాగిరెడ్డి, దివ్యాంగుల విభాగానికి గంటా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ల వింగ్‌కు డాక్టర్ దొండేటి వసంతరాయ, పబ్లిసిటీ వింగ్‌కు గానుగపంట ఉత్తమరెడ్డి, బూత్ కమిటీ వింగ్‌కు పఠాన్ హిదాయిత్ ఖాన్, ఇంటలెక్చ్యువల్ ఫోరమ్ అధ్యక్షుడిగా పల్లెర్ల మల్లికార్జునరెడ్డి నియమితులయ్యారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగాల్లో
పలువురు జిల్లా నాయకుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో వివిధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ స్టేట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా సత్తెనపల్లికి చెందిన రాజారపు శివనాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా పెదకూరపాడుకు చెందిన షేక్ బాజి, రాష్ట్రపంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నరసరావుపేట రొంపిచర్ల మండలానికి చెందిన పడాల చక్రారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శిగా సత్తెనపల్లికి చెందిన పాలూరి రాజశేఖరరెడ్డి నియమితులయ్యారు.