
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని అవ్వారి భావన్నారాయణ భవన్ సీపీఐ కార్యాలయంలో ఆదివారం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్స్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు టి.శేషయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు కార్మికులను సమాయత్తం చేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ కార్మికుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేజర్, మైనర్ బ్రాంచ్ కాల్వలకు పూడికలు తీయించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు. అనంతరం యుద్ధంలో వీర మరణం పొందిన మురళీనాయక్, పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీసం వెంకటేశ్వర్లు , సుబ్బారావు , సుబ్బయ్య, రసూల్‌ఖాన్, కె.నిరీక్షణరావు, టి.కృష్ణసూరి, పి.శాంతయ్య పాల్గొన్నారు.