
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నకరికల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిమి బడే సాహెబ్ (69) పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. గ్రామశివారులో ఇటుక బట్టీల వద్ద రోడ్డు దాటుతుండగా చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆతనికి తీవ్రగాయాలు కాగా, నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.