
చలివేంద్రాన్ని తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో తమ తండ్రి జ్ఞాపకార్ధం కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున తగులబెట్టారు. సేకరించిన వివరాల ప్రకారం గరికె బాలాజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులైన దుర్గారావు, సూరిబాబు, గోపిలు ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఉండవల్లి సెంటర్‌లోని తాడేపల్లి రోడ్‌లో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేశారు. అయితే ఈ చలివేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూర్తిగా తగలబడింది. ఘటనపై తాడేపల్లి పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.