
మాటలకే పరిమితమైన ప్రభుత్వం
ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. హామీల అమలులో కనీస చర్యలు తీసుకోకపోవడమే పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు జరిపినా నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. పొగాకు సాగు చేసిన వారంతా సన్న, చిన్నకారు రైతులే. పెట్టుబడి రాని పరిస్థితి ఒకవైపు, కౌలు కట్టుకునే స్తోమత లేని దుస్థితి మరోవైపు వారిని వేధిస్తున్నాయి. కనీసం పంట దాచుకునేందుకు కూడా వారికి అవకాశం లేదు. ఈ దయనీయ పరిస్థితుల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోకుంటే అప్పుల బాధతో ఆత్మహత్యలే వారికి శరణ్యం. వారి ఆవేదన వెలిబుచ్చేందుకే ఆందోళనకు పిలుపునిచ్చాం.
– డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, నల్లమడ రైతు సంఘం నాయకుడు