మల్లాదిలో నేడు హనుమజ్జయంతి
అమరావతి: మండల పరిధిలోని మల్లాది ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమత్ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త భవిరిశెట్టి హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకుడు పరుచూరి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 40 అడుగుల అభయాంజనేయస్వామి వారికి విశ్వక్సేన ఆరాధన అనంతరం పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ధ్యానాంజనేయస్వామివారికి పంచామృత స్నపన, సహస్రనామాలతో తమలపాకులతో ఆకుపూజలు నిర్వహించి విశేషాలంకారంతో భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ చేస్తున్నట్టు తెలిపారు.
అమరావతిలో..
పుణ్యక్షేత్రమైన అమరావతిలో హనుమత్ జయంతి సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరాన వెలిసిన అభయాంజనేయస్వామి ఆలయంలో, మెయిన్‌రోడ్‌లోని కోదండ రామాలయంలోని అభయాంజనేయునికి ప్రత్యేక పూజలతో వాసవీ మహిళామండలి సభ్యులచే 108 సార్లు హనుమాన్‌చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఽఅర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు తెలిపారు.
మల్లాదిలో నేడు హనుమజ్జయంతి


