పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ! | - | Sakshi
Sakshi News home page

పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!

May 15 2025 2:15 AM | Updated on May 15 2025 2:15 AM

పూలంగ

పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!

● రంగనాథుడికి అంగరంగ వైభవంగా పుష్పయాగం ● సొలస ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ

యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయం బుధవారం భక్తజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కై ంకర్యాల నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువజామునే రంగనాథస్వామికి ఎన్నోరకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజింత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకృష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్‌, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్‌, గ్రామపెద్దలు పర్యవేక్షించారు.

పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ! 1
1/1

పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement